సాధకులే విజెలవుతారు.. విజయం ఎలా చేకూరుతుంది?

ఈ ప్రపంచంలో ఎంతో మంది కలలు కనే పదం విజయం. ఈ పదాన్ని పలకడం ఎంత సులభమో.. ఆ విజయాన్ని సాధించడం అంత కష్టం. కేవలం కష్టం మాత్రమే కాదు.. వ్యక్తిలో కృషి, పట్టుదల, తెలివితేటలు, ఆత్మస్తైర్యం, పోటీపడే తత్వం, విషయం పట్ల అవగాహన ఇవన్నీ ఉండాలి విజయం సాధించాలంటే.. అందుకే విజయానికి కొందరు మాత్రమే అర్హులు అవుతున్నారు.  ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన world achievers day ని జరుపుకుంటారు. ఆయా రంగాలలో కృషి చేసి విజయాలు సాధించినందుకు వారిని గుర్తుచేసుకోవడం ఈ అచీవర్స్ డే ని జరుపుకుంటారు.   జనాదరణ పొందినవారినో.. కేవలం ప్రముఖులు, ప్రభావవంతమైన వారినో  గౌరవించే రోజు కాదు ఇది.  ప్రతి వర్గంలో.. ప్రతి వ్యక్తిని గుర్తించే దినం. వ్యక్తి స్తాయితో సంబంధం లేకుండా.. ప్రతిభ కలిగిన అందరినీ గుర్తించాలని చెప్పడమే ఈ రోజు ఉద్దేశం. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, పౌర సేవకులు ఇలా ప్రతి ఒక్కరూ వారి స్థాయికి కాకుండా వారి కృషికి అనుగుణంగా గౌరవించబడతారు, గుర్తుచేసుకోబడతారు.  వారి తెలివితేటలు, ధైర్యం, నిస్వార్థత, సృజనాత్మకత ద్వారా  ప్రపంచాన్ని మరింత మెరుగ్గా  మార్చడానికి కృషి చేశారు. అలాగే దేశాల ప్రగతిని ఇనుమడింపజేస్తూ  తెలివితేటలతో ఎదుగుతున్న  అత్యుత్తమ విద్యార్థులు కూడా ఈ సందర్భంగా గౌరవానికి అర్హులే.. ఈ రోజున ఎవరైనా సరే..  వారి వయస్సు, లింగం, సామాజిక స్థితి, విద్యా స్థాయి లేదా జాతితో సంబంధం లేకుండా..  జీవితంలోని ఏ రంగంలోనైనా ఏదైనా వినూత్నమైన లేదా ప్రత్యేకమైన ఘనత సాధించిన వారికి పతకం, సర్టిఫికేట్, బహుమతి లేదా ఏదైనా ఇతర అవార్డును అందజేయడం జరుగుతుంది. తద్వారా వారు మరింత కృషి చేసేదిశగా గొప్ప ప్రోత్సాహం అందించినట్టు అవుతుంది.  ఈ అచీవర్స్ డే సందర్భంగా.. పిల్లలకు వివిధ రంగాలలో కృషి చేసిన గొప్పవారి గురించి పరిచయం చేయడం, పిల్లల్లో ప్రతిభ పెంచుకోవాలనే తపనను క్రమంగా పెంచడం. లక్ష్య సాధనకై పిల్లలను నడిపించడం చేయవచ్చు.  విజయం ఎలా చేకూరుతుంది?? ఈ ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలు చేసి, గొప్పగా ఎదిగిన వ్యక్తులు విజయాన్ని అక్కున చేర్చుకోవడానికి వెనుక ఎంత కృషి చేసారు?? వారి కష్టాలు, సమస్యలు, సవాళ్లు, త్యాగాలు ఇలా ఎన్నో విషయాలను పిల్లలకు వివరించడం ద్వారా పిల్లలో విజేతలు లక్షణాలు పెంపొందించవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు.. నేటి ప్రతిభావంతులు రేపటి విజేతలు అవుతారు. కాబట్టి పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని వ్యక్తుల చేతుల్లోనే ఉంది.                               ◆నిశ్శబ్ద.

ఉపవాసాల మాసం.. రంజాన్ మాసం..

అటు తెలుగువారి ఉగాది పండుగ అయిపోగానే.. ఇటు ఇస్లాం మతస్థుల పవిత్రమాసం ప్రారంభమవుతుంది. ముస్లిం మస్తస్తులకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ మాసం.  ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన రంజాన్, ఉపవాసాలతో పవిత్ర మాసంగా భాసిల్లుతుంది.  ఈ సంవత్సరం ఇది మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకు నడుస్తుంది. అల్లా ఇస్లాం మతానికి అయిదు ముఖ్యవిషయాలు తెలిపాడు.  అవి.. షహదా, సలాత్, జకాత్, స్వామ్ మరియు హజ్. స్వామ్ (ఉపవాసం) అనేది రంజాన్‌లో పాటించేది. ఈ పేరు అరబిక్ మూలం 'అర్-రామద్' నుండి వచ్చింది, దీని అర్థం మండే వేడి. రంజాన్ ప్రారంభ, ముగింపు తేదీలు ప్రతి ఏటా మారుతూ ఉంటాయి.  ఎందుకంటే చంద్రుని గమనాన్ని బట్టి వీరి సమయం ఉంటుంది. వివిధ దేశాలలో వేర్వేరు ప్రారంభ ముగింపు తేదీలు ఉంటాయి. ఇస్లామిక్ సంవత్సరం గ్రెగోరియన్ సంవత్సరం కంటే తక్కువగా ఉంటుంది అందువల్ల రంజాన్ ప్రతి సంవత్సరం 10-12 రోజుల ముందుగా ప్రారంభమవుతుంది, ఇది 33 సంవత్సరాల చక్రంలో ప్రతి సీజన్‌లో వస్తుంది. రంజాన్ చాలా ప్రత్యేకమైన ఆశీర్వాద రాత్రి. దేవదూత జిబ్రీల్ ప్రవక్త ముహమ్మద్‌కు మొదటిసారిగా ఖురాన్‌ను వెల్లడించాడు. అదే లైలతుల్ ఖద్ర్.  ఈ రాత్రి రంజాన్ చివరి పది రాత్రులలో ఉంటుంది. ప్రతి రంజాన్‌లో పదిలో నిర్దిష్ట రాత్రి మారుతుంది. అల్లాహ్ ఇలా అంటాడు..  "ఆ దేవుడి  ఆజ్ఞ దొరికిన రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది" అని.   ఇక ఈ రంజాన్ నెలలో ఉపవాసం, మసీదులో ప్రార్థనలు,  ఖురాన్ పఠించే సమయం. చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  రంజాన్ సందర్భంగా, అల్లా పాపాలను క్షమిస్తాడు. తప్పులు చేసిన వారిని ప్రతి రాత్రి నరకాగ్ని నుండి విడిపిస్తాడు. ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు.  సూర్యాస్తమయ ప్రార్థన తర్వాత వారి ఉపవాసాన్ని విరమించుకోవడానికి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో వారి ఇళ్లలో లేదా మసీదులలో సమావేశమవుతారు. ఈ భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం ప్రారంభానికి ముందు తెల్లవారుజామున జరిగే భోజనాన్ని సుహూర్ అంటారు. కాబట్టి, ఉపవాసం సుహూర్ నుండి ఇఫ్తార్ వరకు విస్తరించి ఉంటుంది. రంజాన్ తర్వాత ఈద్ అల్-ఫితర్ వస్తుంది. ఇది ఉపవాసం ముగింపును సూచిస్తుంది. ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది, ఈ సమయంలో ముస్లింలు ఆనందంగా ఉంటారు. సంతోషాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ఈ నెలలోనే దానధర్మాలు చేస్తారు. బీదలకు సహాయం చేస్తారు. ఈద్ ప్రత్యేక ప్రార్థన ఉంటుంది.  ఇకపోతే ఉపవాసం చేయలేని వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారు బీదలకు సహాయం చేయడం, ఉపవాసం ఉండే ఇతరులకు ఇఫ్తార్ విషయంలో సహాయం చేయడం లాంటివి చేయొచ్చు. వీలైనంత వరకు పేదవారికి చేసే సహాయం ఎంతో ప్రముఖ్యతగా ఉంటుంది రంజాన్ మాసంలో. రంజాన్ మాసం గురించి కొన్ని ముఖ్య విషయాలు.. *క్రీ.శ570లో  ప్రవక్త ముహమ్మద్ జన్మించారు. క్రీ.శ 610 లో  ఖురాన్ మొట్టమొదట దేవదూత జిబ్రీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్‌కు వినిపించారు. ఇలా ఖురాన్ అవతరించింది. క్రీ.శ622లో  చంద్ర ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభబమయ్యింది. క్రీ.శ622లో  ప్రవక్త ముహమ్మద్ హింస నుండి తప్పించుకోవడానికి మక్కా నుండి మదీనాకు వలస పూర్తి చేశాడు. క్రీ.శ624 అల్లా రంజాన్‌లో ఉపవాసాన్ని విధిగా పాటించాలని సూచించాడు. ఖురాన్ అవతరించిన ఈ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు ముస్లిం సోదరులు. ఖురాన్ ను ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథంగా భావిస్తారు. అందుకే ఈ నెలకు అంత ప్రాముఖ్యత.                                         ◆నిశ్శబ్ద.

ప్రకృతిలో త్రిగుణాలు ఎలా ఉంటాయి?

ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో అంటే కదలనివి (పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు), కదలకుండా కదిలేవి (చెట్లు, మొక్కలు, వృక్షములు), కదిలేవి (నాలుగు కాళ్ల, రెండు కాళ్ల జంతువులు, మనుషులు), మూడు గుణములు అంటే సత్వ రజో తమోగుణములు ఉన్నాయి అని తెలుసుకున్నాము. ఉదాహరణకు, పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు, ఇవి కదలవు. వీటిలో తమోగుణము 98 శాతం ఉంటే రజోగుణము 1 శాతం సత్వగుణం 1 శాతం ఉంటుంది. రెండవ రకం వృక్షములు, చెట్లు, మొక్కలు, అవి కదలవు కానీ నీటిని పీల్చుకుంటాయి, శ్వాసిస్తాయి. వాటి ఆకులు వివిధగుణములు కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు అయితే తన దగ్గరకు వచ్చిన జంతువులను తనలోకి లాక్కుంటాయి. కొన్ని తాకితే ముడుచుకుంటాయి. కొన్ని స్పందిస్తాయి. మొక్కలు పుట్టడం, పెరగడం, పెద్దవి కావడం మన కళ్లముందే జరుగుతుంది. కాని కదలలేవు. వీటిలో తమోగుణము 50శాతము, రజోగుణము 45 శాతము, సత్వగుణము 5 శాతం ఉంటుంది. ఇంక జీవజాతులు, రెండు కాళ్ల మనుషులు, నాలుగు ఇంకా అనేక కాళ్లతో నడిచే జంతువులు, వీరిలో వారి వారి ప్రవృత్తులను బట్టి మూడు గుణాల నిష్పత్తి మారుతూ ఉంటుంది. జంతువులలో వాటి స్వభావాన్ని బట్టి గుణాలు ఒకేసారి మారతాయి.  కాని మానవుడికి వయసు పెరిగే కొద్దీ పరిసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, వారి వారి గుణాలు మారుతుంటాయి. కొంతమంది సాత్వికులు అవుతారు, మరి కొంత మంది రజోగుణ ప్రధానులు అవుతారు. మరి కొంత మంది తమోగుణ ప్రధానులు అవుతారు. అది ఎలాగంటే. ఈ మూడు గుణములు పైన చెప్పబడిన వాటిలో ఒకే విధంగా, ఒకే మోతాదులో ఉండవు. హెచ్చుతగ్గులుగా ఉంటాయి. సత్వగుణము మోతాదు ఎక్కువగా ఉంటే, అది మిగిలిన రజో, తమోగుణములను అణగదొక్కుతుంది. తాను మాత్రమే ప్రధానంగా ప్రకటితమౌతుంది. అదే రజోగుణము ఎక్కువగా ఉంటే అది సత్త్వ, తమోగుణములను అణగదొక్కి తాను మాత్రమే ఎక్కువగా ప్రకటితమౌతుంది. అలాగే తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అది సత్వ, రజోగుణములను అణగదొక్కుతుంది. ఈ విధంగా ఒక్కొక్క పదార్థములో ఒక్కో గుణము ఎక్కువగా ఉంటుంది. కొందరిలో రెండుగుణాలు ఎక్కువ ఒక గుణము తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ మూడు గుణములు వివిధములైన పాళ్లలో బంధనములను కలుగజేస్తుంటాయి. అంతే కాదు. ప్రతిరోజూ ప్రకృతిలో కూడా ఈ గుణాలు మారుతుంటాయి. సాధారణంగా మానవులలో ఉదయం 4 నుండి 8 వరకు సత్వగుణము ప్రధానంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలోనే స్నానం, సంధ్య, హెూమం, పూజ చేయాలని చెప్పారు. ఎండ ఎక్కేకొద్దీ రజోగుణము ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో ఎవరెవరికి నిర్దేశింపబడిన కర్మలు వారు చేయాలి. సూర్యుడు అస్తమించగానే, తమోగుణము ప్రధానంగా ఉంటుంది. కాబట్టి నిద్రపోవాలని చెప్పారు. (కాని మనం ఏం చేస్తున్నాము! ధన సంపాదన కొరకు, రాత్రిళ్లు పని చేస్తూ, పగలు కునికిపాట్లు పడుతున్నాము. లేక విలాసాలతో రాత్రి 1 గంటదాకా క్లబ్బులు పబ్బులలో గడుపుతూ నిశాచరులము అవుతూ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. కాబట్టి వివేకి అయినవాడు ఏ గుణమునకు బంధితుడు కాకూడదు. అన్నీ సమానంగా, పరిమితంగా అనుభవించాలి. దేనికీ అడిక్ట్ కాకూడదు. అతి, విపరీతధోరణి పనికిరాదు. శాస్త్రఅధ్యయనం చేయాలి. ఇష్టదైవాన్ని ఉపాసించాలి. ధ్యానం చేయాలి. జీవనానికి ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం ధర్మబద్దంగా, న్యాయబద్ధంగా, శ్రద్ధతో చేయాలి. అవసరము ఉన్నంత వరకే సంపాదించాలి. జీవితం ఆనందంగా గడపాలి. అంతేకానీ ఏదో ఒక గుణమునకు కట్టుబడి పోకూడదు.  ◆ వెంకటేష్ పువ్వాడ.

సంతోషానికి సిగ్నేచర్ ఈరోజే..

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. వారి మాట నీటిమూట కాదు. ప్రపంచ దేశాలే సంతోషం మనిషి హక్కు అని నినదిస్తున్నాయి. సంతోషంగా ఉండటానికి దనికులుగానే పుట్టక్కర్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ప్రస్తుతకాలంలో కనీస నిత్యావసరాలు తీరాలన్నా ధనం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డబ్బు లేకుండా సంతోషం అనివార్యమైన విషయం. ఇకపోతే సంతోషం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి ప్రాథమిక హక్కు. దాన్ని సాధించుకోవడం మనిషి కర్తవ్యం అయితే.. ప్రజలకు సంతోషాన్ని అందించడం ఆయా దేశాల కర్తవ్యం. ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉండాలని, ఆ సంతోషం పెంపుదలకు ఎన్నో నిర్ణయాలు, మరెన్నో ప్రణాళికలు అమలుచేయాలని నిర్ణయించారు. సంతోషమైన ప్రపంచం కోసం ఒక రోజును వరల్డ్ హ్యాపీనెస్ డే గా ప్రకటించి జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 20 వ తేదీన ఈ సంతోషకరమైన దినోత్సవం జరుపుకోబడుతుంది. ఐక్యరాజ్యసమితి 160 దేశాలకు చెందిన వ్యక్తులతో యాక్షన్ ఫర్ హ్యాపీనెస్ అనే గ్రూప్ లాభాపేక్షలేకుండా చేసిన పనికి ధన్యవాదాలు తెలుపుతూ  అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని అంతిమ లక్ష్యం ఏమిటంటే, పురోగతి అనేది దిగువ స్థాయిలను పెంచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం మాత్రమే కాదు, ప్రజల శ్రేయస్సు, మనుషుల ఆనందం కూడా ఉండాలి. అప్పుడే అది సంతోషం అని పిలవబడుతుంది. 2011లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇది ఆర్థిక అవకాశాలకు సమానమైన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని ప్రాథమిక మానవ లక్ష్యంగా చేసింది.  రెండు సంవత్సరాల తరువాత, 2013లో, ఐక్యరాజ్యసమితిలోని  మొత్తం 193 సభ్య దేశాలు ప్రపంచంలోని మొదటి అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకున్నాయి మరియు అప్పటి నుండి అది పెరుగుతూనే ఉంది. ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ సంతోష దినోత్సవ వేడుక నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవ లక్ష్యాల ప్రకారం.. సంతోషం మనిషి నవ్వు ద్వారా.. చర్యల ద్వారా వ్యక్తమయ్యేది కాట్రమే కాదు.. సంతోషమంటే వ్యక్తి జీవితంలో అభివృద్ధి. ఆ అభివృద్ధి వ్యక్తి జీవితాన్ని పెరుగుపరచాలి. ఇలా ఉన్నపుడే సాధారణ పౌరులు కూసా సంతోషంగా ఉండగలుగుతారు. ఇకపోతే వ్యక్తి జీవితంలో తృప్తిగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి. తృప్తి ఉన్నచోట సంతోషం నీటి ఊటలా బయటకొస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈ సంతోషం మరింత మెరుగు పడాలని ఆశిద్దాం.                                     ◆నిశ్శబ్ద.

కాలుష్యపు దెబ్బకు రీసైక్లింగ్ మందు...

ప్రతి సంవత్సరం, భూమి బిలియన్ల టన్నుల సహజ వనరులను ఇస్తోంది. ఇలా ఆలోచిస్తే మనం ఎంతో అదృష్టవంతులం. కానీ ఈ సహజవనరుల గురించి ఆలోచించాల్సింది మరొకటి ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ సహజవనరుల అన్నీ భవిష్యత్తులో ఏదో ఒకప్పుడు అయిపోతాయి. ఇలా సహజ వనరులు అయిపోవడానికి కారణం.. కేవలం మనం సహజవనరులను ఇష్టానుసారం వాడెయ్యడమే కాదు. ఆ సహజవనరుల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తూ.. వాటిని ప్రకృతికి నష్టం కలిగిస్తున్నాం.  అందుకే మనం ఈ ప్రకృతిలో కలిపేసే వస్తువుల  గురించి మరోసారి ఆలోచించాలి - వృధా కాకుండ చూడాలి. గత పదేళ్ల కాలం గమనిస్తే..  రికార్డు స్థాయిలో అత్యంత వేడిగా ఉంది. ఇప్పుడు అసమానమైన వాతావరణ మార్పులు, ఊహించని ప్రళయాలు  ఎదుర్కొంటున్నాము. మనం గణనీయమైన, వేగవంతమైన మార్పులు చేయకుంటే, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, మంచుగడ్డలు కరగడం, వివిధ దేశాలు, ప్రాంతాలు అంతమయ్యే దశకు చేరుకోవడం, అడవులు తగ్గిపోవడం వంటివి చాలా దారుణంగా తయారవుతాయి.   ప్రపంచంలో పెరుగుతున్న పేదరికం, ప్రాంతాల  వలసలు, ఉద్యోగ నష్టాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కనుమారుగైపోతూ.. కరువు కారణంగా ప్రపంచమంతా దారిద్య్రం ఏర్పడుతుంది. మానవాళిని ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి శాశ్వతమైన మార్పులు చేసుకోవాలి. దీనికోసం ఐక్యరాజ్యసమితి గ్లోబల్ రీసైక్లింగ్ డే ని ప్రతి సంవత్సరం మార్చి 18 వ తేదీన జరుకునేలా ప్రకటించింది. 2030 నాటికల్లా.. కొన్ని లక్ష్యాలను ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా నిర్ణయించింది.  గ్లోబల్ గ్రీన్ ఎజెండాకు మద్దతుగా అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలు ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం మనం ఇప్పటికే చూస్తున్నాము. రీసైక్లింగ్ అనేది వృత్తాకార ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం, ఇది మన సహజ వనరులను రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం 'సెవెన్త్ రిసోర్స్' (పునర్వినియోగపరచదగినవి) CO2 ఉద్గారాలలో 700 మిలియన్ టన్నులకు పైగా ఆదా చేస్తుంది. ఇది 2030 నాటికి 1 బిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేయబడింది. మన భవిష్యత్తును కాపాడటానికి మనుషుల్లో ఉన్న స్పృహ రీసైక్లింగ్ ప్రక్రియలో ముందు వరుసలో ఉంటుంది. అంటే.. భావితరాలకు మనం సహజవనరులను అందించాలనే స్పృహ మనతో ఈ ప్రకృతి సంరక్షణ పనులు చేయిస్తుంది. మన విలువైన ప్రాథమిక వనరులను సంరక్షించడం, మన భూ గ్రహ భవిష్యత్తును సురక్షితం చేయడంలో రీసైక్లింగ్ ప్రాముఖ్యతను చాలా ఉంటుంది. ఈ  ప్రాముఖ్యతను గుర్తించడంలోనే ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకోబడుతుంది.  అందుకోసమే.. 2018లో గ్లోబల్ రీసైక్లింగ్ డే సృష్టించబడింది. ప్రపంచం ఏకతాటిపైకి వచ్చి భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలకు తగిన ఆలోచనలు, ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పడం గ్లోబల్ రీసైక్లింగ్ డే రోజు చేసే పని.   గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్దేశించబడిన గ్లోబల్ రీసైక్లింగ్ డే లక్ష్యం రెండు రెట్లు: రీసైక్లింగ్ అనేది గ్లోబల్ సమస్య కాకూడదని, ఇది చాలా ముఖ్యమైనదని  చెబుతారు. ఈ రీసైక్లింగ్‌కు ఒక సాధారణ, ఉమ్మడి విధానం తక్షణం అవసరమని ప్రపంచానికి తెలిసేలా చెప్పడం. మన చుట్టూ ఉన్న వస్తువుల విషయానికి వస్తే, వనరులను వృధా చేయకూడదని ఈ భూమ్మీద ఉన్న అందరూ ప్రజలకు తెలియజేయడం.   అవార్డులు రివార్డులు ఉన్నాయి దీనికి.. గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ రంజిత్ బాక్సీ ఇలా వ్యాఖ్యానించారు. “కరోనా కాలంలో  రీసైక్లింగ్ హీరోలు చేసిన విశిష్ట సహకారానికి మేము వారిని గుర్తించాలనుకుంటున్నాము. గత 12 నెలల్లో రీసైక్లింగ్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న వ్యక్తులు, సంఘాలు, వ్యాపారాల నుండి నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి. వారి ప్రయత్నాలు మన ప్రపంచం యొక్క పచ్చని భవిష్యత్తుకు దోహదపడతాయి. రీసైక్లింగ్ అనేది వాతావరణ మార్పు చక్రంలో అంతర్భాగం. ప్రపంచ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో, రక్షించడంలో సహాయపడుతుంది. రీసైక్లింగ్ 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల CO 2 ఉద్గారాలను ఆదా చేస్తుందని అంచనా వేయబడింది . ఈ అవార్డు కింద 1000 అమెరికన్ డాలర్లు బహుమానంగా ఇస్తారు. కలుషితమైపోతున్న ఈ ప్రపంచాన్ని కాపాడుకోవడం మన చేస్తుల్లోనే ఉంది. మన చుట్టూ ఉన్న వనరులను దీర్ఘకాలంగా, పొదుపుగా ఉపయోగించుకోవాలి. అలా చేస్తే మన వంతు ప్రయత్నంలో మనం సఫలమే..                                   ◆నిశ్శబ్ద.

శాస్త్రవేత్తలు  ప్రపంచ ఆయువుకు ఊపిరితిత్తులు..

  ఈ ప్రపంచంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలను వాటి వెనుక కారణాలను కనిపెట్టేవారు శాస్త్రవేత్తలు.  శాస్త్రవేత్తలు లేకుంటే ఈ ప్రపంచం ఒక జంతుచర్యల కేంద్రంగా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శాస్త్రవేత్తలు ప్రపంచ ఆయువుకు ఊపిరితిత్తుల లాంటి వాళ్ళు. అలాంటి శాస్త్రవేత్తలను గుర్తుచేసుకుంటూ, వారి కృషిని గుర్తిస్తూ ప్రతి ఏడూ శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా మార్చి 14వ తేదీన ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పుట్టినరోజు సందర్భంగా శాస్త్రవేత్తల దినోత్సవం జరుపుకుంటారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుట్టినరోజుతో పాటుగా మార్చి 14న సెలబ్రేట్ సైంటిస్ట్స్ డే జరుపుకుంటారు. ఈ రోజున, మేము గతం మరియు వర్తమానం నుండి శాస్త్రీయ సహకారాన్ని గమనించాము. మన జీవితాలను సులభతరం చేయడంలో శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు మనకంటే ఎక్కువ తెలుసు.  ప్రాణాలను కాపాడటానికి, పర్యావరణాన్ని రక్షించడానికి, వ్యాధులను నయం చేయడానికి, మనకి దూరంగా ఉన్న గ్రహాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల ఆలోచనలు, పరిశోధనలు, వారి కృషి తోడ్పడుతుంది.  చాలా మంది అరిస్టాటిల్‌ను మొదటి శాస్త్రవేత్తగా భావిస్తారు. ఈయన క్రీ.పూ నాల్గవ శతాబ్దంలో  పరిశీలనలు, తర్కానికి మార్గదర్శకత్వం వహించాడు, అరిస్టాటిల్ పని, ఈయన తత్వశాస్త్రం మధ్య యుగాలలో పాశ్చాత్య సమాజాన్ని ప్రభావితం చేశాయి, రాబోయే వేల సంవత్సరాల్లో శాస్త్రీయ అధ్యయనానికి తగిన ఆలోచనలను రూపొందించాయి. ఈయన తరువాత ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలను కనుగొన్నాడు. గణితంలో కొత్త రూపమైన కాలిక్యులస్‌ను కనుగొన్నాడు. కానీ న్యూటన్ ఒక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందలేదు.  పరిణామ సిద్ధాంతం  గురించి మనకు తెలిసేలా చేసిన చార్లెస్ డార్విన్ ఘనత పొందాడు, అయితే న్యూటన్ లాగా, ఈయన తన ఆలోచనలను ప్రజల ముందు బహిర్గతం చేయడంలో వెనుకాడాడు. డార్విన్ తన ప్రారంభ పరిశీలనలను  20 సంవత్సరాల తర్వాత అంటే..  1859 వరకు తన పరిశోధనల సమాహారమైన  "ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్" ను ప్రచురించలేదు. సహజ విజ్ఞాన రంగంలో విస్తృత పరిశోధనలు చేయడం ద్వారా శాస్త్రవేత్తగా తన ఖ్యాతిని పెంపొందించుకోవడానికి అతను అన్ని  సంవత్సరాలు కష్టపడ్డాడు. సముద్ర జీవులపై ఆయన చేసిన కొన్ని అధ్యయనాలు నేటికీ అనేక సంస్థలలో  బోధించబడుతున్నాయి. 1930ల వరకు పరిణామంపై డార్విన్ కనుగొన్న విషయాలను శాస్త్రీయ సమాజం విస్తృతంగా అంగీకరించలేదు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, నిస్సందేహంగా ఆధునిక కాలంలో అత్యంత ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు కానీ తిరస్కరించబడ్డాడు. తిరస్కరించారనే నిరాశతో ఆ మార్గాన్ని వదులుకుని ఉంటే.. మనం సాపేక్షత సిద్ధాంతం, ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం, క్వాంటం మెకానిక్స్ గురించి ఎప్పటికీ నేర్చుకోలేకపోయేవాళ్ళం. సైంటిస్ట్ డే సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు.. 1628 సర్క్యులేషన్ సిద్ధాంతం బ్రిటీష్ వైద్యుడు విలియం హార్వే గుండె శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేస్తుందని ప్రతిపాదించాడు, రక్త ప్రసరణ వ్యవస్థకు కాలేయం ఇంజిన్ అనే దీర్ఘకాల నమ్మకాన్ని వివాదాస్పదం చేసింది. 1844 లో మొదటి టెలిగ్రాఫ్ సందేశం మే 24న శామ్యూల్ మోర్స్ వాషింగ్టన్ DC నుండి బాల్టిమోర్‌కి మొదటి టెలిగ్రాఫ్ సందేశాన్ని పంపాడు, అందులో ఉన్న సారాంశం "దేవుడు ఏమి చేసాడు?" 1869 లో DNA యొక్క ఆవిష్కరణ ఫ్రెడరిక్ మీషెర్, స్విస్ రసాయన శాస్త్రవేత్త, DNA అణువును గుర్తించారు. 1905 - 1915 సాపేక్ష సిద్ధాంతం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రచురించాడు. 1969 చంద్రునిపై మొదటి మనిషి అపోలో 11 మొదటిసారిగా చంద్రునిపైకి మనిషిని తీసుకువెళ్లింది.                                ◆నిశ్శబ్ద.

కలల కాన్వాసు మనమే గీసుకుందాం!

కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అని అంటారు అబ్దుల్ కలాం. ఈయన మన భారతీయులకు గొప్ప ప్రేరణ. ఎక్కడో పేద కుటుంబంలో జన్మించి, దీపం వెలుగులో చదువుకుని, అంతరిక్షానికి రాకెట్లను పంపే విజ్ఞానాన్ని ఒడిసి పట్టి శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అంటే.. కలలను సాకారం చేసుకోమని ఈయన ఇచ్చిన ఆలోచన ఎంత గొప్పదో చర్చించుకోవడానికి. అలాగే ఈ ఆలోచనకు మరొక రూపమా అన్నట్టుండే మరొక విషయాన్ని, ప్రపంచానికి అంతగా తెలియని వ్యక్తిని గురించి మాట్లాడుకోవడానికి. NAtional dream day… కలలను కనడం వాటిని నిజం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ గొప్పతనం వెనుక మనిషి కృషి, పట్టుదల, అవిరామ సాధన ఎంతో ఉంటుంది. కలలను గూర్చి కథలుగా మాత్రమే చెప్పుకునే కాలం కాదు జీవితాలను కథలు కథలుగా, స్ఫూర్తి మంత్రాలుగా చెప్పుకునే కాలమిది. మనిషి గొప్పగా ఎదగడానికి అడ్డుకునేది ఏదీ ఈ ప్రపంచంలో లేదు.. ఉన్న అడ్డంకల్లా మనకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని మొదటే మనం అభిప్రాయపడటం. బిడ్డ పుట్టాక ఏడుపు నుండి నవ్వుతూ ఉండటానికి సమయం పడుతుంది. పిల్లవాడికి పండ్లు మొలిచేటప్పుడు ధవడలు చెప్పలేనంత నొప్పిని అనుభూతి చెందుతాయి. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మోకాళ్ళు గీరుకుపోయి నొప్పి పెడతాయి. అవన్నీ సమస్య అనుకుంటే ఎవరూ నడక నేర్వలేరు కదా… అలాగే మనిషి దశలు మారేకొద్ది సమస్యలు కూడా విభిన్న రూపాలు దాలుస్తాయి. సమస్యలను చూసుకుని ఆగిపోయే వారు జీవితంలో గొప్ప స్థానానికి వెళ్లలేరు.  అందుకే కలలను కనమని ప్రోత్సహించే రోజు ఒకటుంది. ప్రతి ఏటా మార్చి 11న జరుపుకునే జాతీయ కలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ  రోజున మన జీవితంలో జరగవులే అనే ఆలోచనతో వదిలిపెట్టేసిన  మీ కలలను తిరిగి వేటాడటం మొదలుపెట్టండి. యువకుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే.. కావాల్సిందల్లా సంకల్ప బలమే.. "ది మిలీనియం మ్యాన్," రాబర్ట్ ముల్లర్ చేత ప్రేరణ పొంది ఈ కలల దినోత్సవం ఏర్పడింది.   ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజున దీన్ని జరుపుకుంటారు. డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ పిల్లల కలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది.  ఇది అన్ని వయసుల వారికి స్ఫూర్తినిచ్చినప్పటికీ, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.  ఎవరు రాబర్ట్ ముల్లర్.. మన దేశానికి కలాం తెలుసు..  ఈ ప్రపంచానికి ముల్లర్ తెలుసు. చాలామందికి తెలియని విస్తృతమైన ప్రపంచం ఇది. రాబర్ట్  ముల్లర్ ఒక శరణార్థి, జైలు శిక్ష తప్పించుకునే భయానక పరిస్థితులను అనుభవించాడు.  ఫ్రెంచ్ ప్రతిఘటనలో సభ్యుడు కూడా అయ్యాడు. అతను 25 సంవత్సరాల వయస్సులో ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌గా చేరాడు, అక్కడ తన జీవితంలోని తరువాతి 40 సంవత్సరాలను అంకితం చేశాడు. అనేక అవార్డులు, నామినేషన్లు ఈయన సొంతమయ్యాయి. 14 పుస్తకాలు వేలకొద్దీ రచనలు తరువాత, 1986లో కోస్టా రికాలో  పదవీ విరమణ చేసాడు, అక్కడ అతను ఐక్యరాజ్యసమితి యొక్క యూనివర్శిటీ ఫర్ పీస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు, దీన్ని స్థాపించడంలో సహాయం చేశాడు. బెంచ్ ఆఫ్ డ్రీమ్స్ డ్రీమ్ బెంచ్ డైరీని కూడా రూపొందించాడు.  ఇలా ఒక శరణార్థిగా ఉన్న వ్యక్తి తన జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. రాబర్ట్ ముల్లర్ గూర్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే.. 1923 "ది మిలీనియం మ్యాన్" రాబర్ట్ ముల్లర్ మార్చి 11న బెల్జియంలో జన్మించాడు. 1948 ముల్లర్ ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌గా చేరాడు. 1987 మీ కలల కోసం ఒక బెంచ్ సృష్టించాలని.. ముల్లర్ డెస్ బెర్గోఫర్ మరియు గెర్రీ స్క్వార్ట్జ్ సహాయంతో బెంచ్ ఆఫ్ డ్రీమ్స్‌ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. 1995 జాతీయ కలల దినోత్సవాన్ని డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ రూపొందించింది. పెద్దకలలు కనడం వాటిని నిజం చేసుకోవడం ప్రతి మనిషికి అవసరం.                                     ◆నిశ్శబ్ద.

కిడ్నీల మీద కాస్త కనికరం చూపండి!

కిడ్నీలు మన శరీరంలో ముఖ్య అవయవాలు. ఇవి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అయితే మనం రోజూ వారీ జీవితంలో చేస్తున్న కొన్ని తప్పులు మూత్రపిండాల పనితీరుకు అడ్డంకి అవుతున్నాయి. చాలా తొందరగా పాడైపోతున్నాయి. ఎంతో చిన్న వయసులో మూత్రపిండాల సమస్యలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచిస్తే.. కిడ్నీల విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. పైగా ఈ కిడ్నీ సమస్యలు మన చెప్పుచేతల్లో నుండి జారిపోయేవరకు బయటపడవు.   ప్రతి సంవత్సరం మార్చి 9వ తేదీని ప్రపంచం కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరూ కిడ్నీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారవిహారాలు తెలుసుకుంటే..  నీళ్లు.. కిడ్నీ ఆరోగ్యానికి మంచినీరు మొదటి ఔషధం. ప్రతిరోజు శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకోవడం ద్వారా కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. శరీరం హైడ్రేట్ గా ఉంటే కిడ్నీలు సేఫ్ గా ఉంటాయి. మంచినీరు తగినంత తీసుకుంటే.. కిడ్నీలు వ్యర్థాలను వడపోయడం తేలిక అవుతుంది.  ఆహారం.. ట్యూనా, సాల్మన్ లేదా ట్రౌట్ వంటి చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను సులువుగా పొందవచ్చు. క్యాబేజీలో పొటాషియం మరియు సోడియం రెండూ తక్కువగా ఉంటాయి, అయితే ఫైబర్, విటమిన్ C మరియు K సమృద్ధిగా ఉంటాయి. క్యాప్సికం గా పిలుచుకునే బెల్ పెప్పర్ లో విటమిన్ B6, B9, C మరియు K,  విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో మంచి  ఫైబర్ ఉంటుంది. ఇందులో  యాంటీఆక్సిడెంట్లను కూడా బాగుంటాయి. ముదురు ఆకుకూరలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు వీటి నుండి బాగా అందుతాయి. మన దగ్గర ఎప్పుడూ ఉండే గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ వెల్లుల్లి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే నిర్దిష్ట సమ్మేళనం ఉంటుంది. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాలి ఫ్లవర్, బ్రోకలి కిడ్నీ ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుతాయి. అలవాట్లు.. ద్రవ పదార్థాల దగ్గరి నుండి, ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలి. శీతల పానీయాలు, ఆల్కహాల్, ఎక్కువ పవర్ ఉన్న మందులు, కఠినమైన ఆహార పదార్థాలు దూరం పెట్టాలి. ఫైబర్, విటమిన్ సి, తాజా ఆకుకూరలు, కూరగాయలు, ముల్లంగి, తీసుకోవడం. శారీరక వ్యాయామం. యోగా సాధన పాటించాలి. అవయవదానం.. ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలు ఫేస్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. కొందరు కిడ్నీ దాతలు లేక మరణిస్తున్నారు. ఇలాంటి వారి కోసం అవయవదానం చెయ్యాలి. మరణం తరువాత, ఊహించిఅని మరణాలు సంభవించినప్పుడు కుటుంబ సభ్యులు కూడా అవయవ దానానికి  మద్దతు ఇవ్వాలి.   సంవత్సరానికి ఒకసారి అయినా వైద్యుడిని సంప్రదించి కిడ్నీల ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీ ఆరోగ్యం పదిలం.                                        ◆నిశ్శబ్ద.

ముత్యమంత పంటికి ముచ్చటైన సేవకులు!

ఎదుటి వారిని మనవైపు తొందరగా ఆకర్షించాలంటే మన మాటతీతుతో పాటు మంచి చిరునవ్వు కూడా ముఖ్యం. అంతర్గత అందం మనసుతో వచ్చేది అయినప్పుడు అది కేవలం ప్రవర్తనలో, ఇతరులతో కలిసి చేసే పనులను బట్టి ఇతరులకు అర్థమవుతుంది. కానీ కొన్ని బహిర్గతమయ్యే విషయాలు కూడా మనుషులలో ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అలాంటి వాటిలో ఒకటి తీరైన పలువరుస. తెల్లగా మెరిసిపోయే దంతాలు, దానిమ్మ పలువరుస కలిగిన దంతాలు ఎంతో గొప్ప ఆకర్షణను తెచ్చిపెడతాయి. అయితే దురదృష్ట వశాత్తు నేటి కాలంలో చాలామంది దంత సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముప్పయ్యేళ్లు నిండకనే గట్టి పదార్థాలు తినాలంటే సంకోచించే స్థితిలో ఉన్నారు. అయితే వీరందరికీ ఉత్తమ పరిష్కారాలు ఇచ్చి దంత సంరక్షణకు దారి చూపేవారు దంత వైద్యులు. సాధారణ డాక్టర్లతో పోలిస్తే దంత వైద్యులు కాస్త తక్కువ గుర్తింపు పొందారని చెప్పవచ్చు.  ఇప్పటి కాలంలో ఎంతోమంది దంత సంబంధ సమస్యలతో బాధపడినా దంత వైద్యులను సంప్రదించేవారు తక్కువే.. సమస్య మరీ తీవ్రమైతే తప్ప దంతవైద్యుల దగ్గరకు వెళ్లరు చాలామంది. కానీ ప్రతి సంవత్సరం మార్చి 6 వ తేదీన జాతీయ దంతవైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. దంతాలు చిగుర్ల సమస్యలు, పుచ్చిన పళ్ళు, పంటి నొప్పి, పంటి మీద గారా, చిగుర్ల వాపు, చిగుర్లు రక్తం కారడం, బలహీనంగా ఉండటం. చల్లని, వేడి పదార్థాలు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉండటం. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఓడిన పళ్ళ స్థానంలో కొత్త పళ్ళు కట్టడం, పళ్ళ సెట్టు వంటివి అమర్చి ఎంతోమందికి తిరిగి తమకు తాము ఆహార పదార్థాలు నమిలి తినేలా దోహదం చేస్తారు. ఇంకా చెప్పాలంటే.. దంత ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యానికి మూలంగా ఉంటుంది. శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే అది పళ్ళమీద, గొర్ల మీద, చర్మ, జుట్టు వంటి బాహ్య మూలకల మీద సులువుగా గుర్తించవచ్చు.  ఇంత ప్రాముఖ్యత కలిగిన దంతాలకు డెంటిస్ట్ ల తోడ్పాటు ఎంతో అవసరం. ఈ డెంటిస్ట్ డే సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే. క్రీ.పూ 5000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు ఉండేవారు. వీరు దంతాలలో పురుగుల వల్ల దంత క్షయం, కావిటీస్ వస్తాయని నమ్మేవారు.  2600 bc లో పురాతన ఈజిప్టుకు చెందిన హెసీ-రా తొలి దంత వైద్యులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1530లో ఆర్ట్జ్నీ బుచ్లీన్ దంత ఆరోగ్యంపై మొదటి పుస్తకం రాసారు. అందులో  అన్ని రకాల వ్యాధులు మరియు దంతాల బలహీనతలకు సంబంధించిన విషయాలుంటాయి. దీన్ని "లిటిల్ మెడిసినల్ బుక్" అంటారు. 1990 నుండి దంతవైద్యం పెరుగుతూ వచ్చింది. దంతాలకు సంబంధించిన సేవలు పలు చోట్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.  దంత సంరక్షణకు ఏమి చెయ్యాలి?? దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా నిపుణులైన దంతవైద్యులు ప్రతి ఒక్కరూ పాటించదగిన దంత సంరక్షణ జాగ్రత్తలు, పాటించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. దంత సంరక్షణకు మొదటి మార్గం శుభ్రంగా పళ్ళు తోముకోవడం. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం వల్ల దంత శుభ్రతను మైంటైన్ చేయవచ్చు. ప్రతి 6నెలలకు ఒకసారి దంతవైద్యుడ్ని సంప్రదించి పళ్ళ స్థితిగతులు, వాటి బల, బలహీనతలు వెతికి తీసుకోవలసిన జాగ్రత్తలు అడిగి తెలుసుకోవాలి. మీకు దంత సమస్య ఏమైనా ఉండి, వైద్యుల ద్వెస్రా అవి పరిష్కరమయి ఉంటే.. మరచిపోకుండా ఆ వైద్యులకు కృతజ్ఞతలు తెలపండి.  దంతాలు బాగుంటే.. దంతాలు బాగుంటే మనిషిలో చెప్పలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. కల్గేట్ యాడ్ లో ఆరోగ్యవంతమైన దంతాలు మొత్తం శరీరానికి ఆత్మవిశ్వాసాన్ని,  ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు దంతాలు బాగుంటే ఎలాంటి చింతా ఉండదు. అయితే ఈ దంత సంరక్షణ కులం పళ్ళు బాగా తొముకోవాలి.  ఇతరుల ముందు నవ్వడానికి, మాట్లాడటానికి తడబడేవారు, ఇబ్బందిగా ఫీలయ్యే వారు  దంతవైద్యుని సహకారంతో వారి పరిస్థితిని అధిగమించగలుగుతారు. దంతాలకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిది. దంత వైద్యుడి సలహాలు పాటించడం మరీ మంచిది. ఇలా దంత సంరక్షణ నుండి, దంతాల ప్రాధాన్యత వరకు అన్నీ తెలుసుకుని పాటించాలి.                                  ◆నిశ్శబ్ద.

అన్ ప్లగ్గింగ్ డే.. సెల్ ఫోన్లు, టీవీలూ ఆపేయండి!

ప్రపంచం చాలా పెద్దది అనుకుంటాం కళ్ళతో చూసినప్పుడు. కానీ అదే ప్రపంచం చాలా చిన్నగా కనిపిస్తుంది మొబైల్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు. అయితే ఈ బయటి ప్రపంచం సంగతి పక్కన పెడితే ప్రతి మనిషికి తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో తల్లిదండ్రులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్యా, భర్త, పిల్లలు ఇలా ఎన్నో ప్రధాన పాత్రలు పోషించేవారు ఉంటారు. కానీ ఆ అనుబంధాల ప్రపంచం కాస్తా చేతిలో ఉన్న టెక్నాలజీ వల్ల మసకబారిపోతోంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి చేతిలో తప్పకుండా ఓ మొబైల్ ఉంటుంది. ఇంట్లో ఉన్న సమయంలో ఆ మొబైల్ ఏ వారి ప్రపంచం. అందులో సినిమాలు, యూట్యూబ్, ఇతరులతో చాటింగ్, ఇంకా ఎన్నో వైరల్ విషయాలు చూస్తూ కాలాన్ని కరిగించేస్తారు. ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగం ముఖ్యం కదా అని చెబుతారు. స్నేహితులతో వెళ్ళినప్పుడు.. ఫ్రెండ్స్ తో కొంచెం సేపు కూడా సరదాగా ఎంజాయ్ చేయకూడదా అంటారు. మరి కుటుంబం గురించో… ఎప్పుడైనా ఆలోచన చేస్తారా కుటుంబం గురించి. కొందరు తెలివిమీరిన ఫిలాసఫర్ లు కుటుంబం మనల్ని అర్థం చేసుకోకుంటే ఎలా.. అని ఎదుటివారి నోటిని మూసేస్తారు. ఇప్పటి కాలంలో కుటుంబ ప్రాధాన్యత తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కుటుంబంతో సంబంధాలు మెరుగ్గా ఉంచుకోవడానికి అన్ ప్లగ్గింగ్ డే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చ్ మూడవ తేదీన ఈ అన్ ప్లగ్గింగ్ డే జరుపుకోవడం ఉంటుంది. ప్రతి వ్యక్తికి కుటుంబం ఎంతో అవసరం. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు ఆరోగ్యంగా ఉంటే వారి జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఏం చెయ్యాలి? అన్ ప్లగ్గింగ్ డే రోజు మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్, టీవీ లు, సిస్టం లు అన్నిటినీ ఆఫ్ చేసేయ్యాలి. ఈ ఒక్కరోజు అయినా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా హాయిగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీతో మాట్లాడాలని అనుకుని, మీ బిజీ షెడ్యూల్ చూస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న మీ తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడవచ్చు. మీ ఉరుకులు పరుగుల రోజులో మీకోసం అన్నిటినీ ఓపికగా సమకూర్చుతున్న మీ జీవిత భాగస్వామితో ఏకాంత సమయాన్ని గడపవచ్చు. ఉద్యోగానికి ఉదయం వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకోవడం ద్వారా మీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు సమయాన్ని కేటాయిస్తూ వారితో సరదాగా గడపవచ్చు. ఇలా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు మాత్రమే కాకుండా మీకున్న ఆత్మీయులు, మీరు కలవలేకపోయిన స్నేహితులను కలుసుకుని వారితో సమయాన్ని మనసారా గడపడం ద్వారా మీ మధ్యన బంధాలు బలపడతాయి. ఎంన్ సమయాన్ని చాలా సునాయాసంగా కిల్ చేసే సామాజిక మద్యమానికి కామా పెట్టడం ద్వారా ఈరోజును మీదైన దినంగా మీకు నచ్చినట్టుగా మలచుకోవచ్చు. కాబట్టి జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అండ్ స్విచ్ ఆన్ యువర్ హార్ట్.                                    ◆నిశ్శబ్ద.  

నేషనల్ ప్రోటీన్ డే.. ప్రోటీన్ కు దారి ఇలా!

ఆహారమే అమృతం అంటారు. మనం తీసుకునే ఆహారమే మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది కీలకం. ప్రోటీన్ శరీరానికి  అవసరమైన స్థూల పోషకం, ఇది కణజాలాలను నిర్మించడంలో మరియు మరమ్మత్తు చేయడంలో, హార్మోన్లను నియంత్రించడంలో మరియు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం అయినప్పటికీ మనం తీసుకునే ప్రోటీన్ లు ఆరోగ్యకరంగా, సమర్థమంతమైన శక్తిని అందించ గలిగేగా ఉండాలి. అలాంటి ప్రోటీన్ ను తీసుకోవడం ముఖ్యం.  చాలా మంది తమ ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడానికి కష్టపడతారు, ప్రోటీన్స్ సరిపడిన మోతాదులో శరీరానికి అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.   జాతీయ ప్రోటీన్ దినోత్సవం సందర్భంగా  దినచర్యలో మరింత అధిక-నాణ్యత గల ప్రోటీన్‌ను చేర్చుకోవడంపై అవగాహన కల్పించడానికి ఆహారం ఎంపిక, మోతాదు వంటివి తెలుసుకుంటే..   లీన్ ప్రోటిన్:   టర్కీ కోడి చేపలు మరియు చిక్కుళ్ళు వంటి వాటిలో ఆరోగ్యకరమైన ప్రోటీన్ లు ఉంటాయి. వీటిలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇనుము, జింక్ మరియు విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.  మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు:  గింజలు, విత్తనాలు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు శాఖాహారులకు మంచి ఆప్షన్. వీటిలో గొప్ప పోషకాలు ఉంటాయి.  వాటితో పాటు ఫైబర్  కూడా ఎక్కువగా ఉంటుంది.  గుడ్లు వెరీ గుడ్డు.. :  గుడ్లు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం, అలాగే విటమిన్ D, విటమిన్ B12 కూడా ఉంటుంది.   గిలకొట్టిన, గట్టిగా ఉడకబెట్టిన లేదా ఆమ్లెట్‌ల వంటి వివిధ మార్గాల్లో గుడ్లను  ఆహారంలో చేర్చుకోవచ్చు.    ప్రోటీన్ పౌడర్‌:  ఇప్పట్లో ప్రోటీన్ పౌడర్ లు బోలెడు. ఈ ప్రోటీన్ పౌడర్లు  ప్రొటీన్‌లను ఆహారంలో జోడించడానికి అనుకూలమైన మార్గం, కానీ అధిక-నాణ్యత కలిగిన,  కనిష్టంగా ప్రాసెస్ చేయబడిన బ్రాండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం.  అలాగే ప్రోటీన్ పౌడర్‌లలో చక్కెరలను, అందులో జోడించిన ఇతర పదార్థాలను  గుర్తుంచుకోండి. సమతుల్య భోజనం:  భోజనాన్ని ప్లాన్ చేసేటప్పుడు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం లక్ష్యంగా పెట్టుకోవాలి.  ఇది మీరు ఎంత ప్రోటీన్ పొందుతున్నారని నిర్ధారించుకోవడంలో సహాయపడటమే కాకుండా  సంతృప్తిని పొందేలా చేయడంలో సహాయపడుతుంది.  స్నాక్ స్మార్ట్: స్నాక్స్ కొన్ని అదనపు ప్రొటీన్‌లను చొప్పించడానికి గొప్ప అవకాశం.  కొన్ని ఆరోగ్యకరమైన ప్రోటీన్-ప్యాక్డ్ స్నాక్ ఎంపికలలో గ్ పెరుగు, చీజ్,  కూరగాయలతో తయారుచేసే పదార్థాలు మంచి స్నాక్స్ లిస్ట్.  గమనిక ముఖ్యం:  ప్రోటీన్ ముఖ్యమైనది అయితే, దానిని అతిగా తీసుకోకపోవడం కూడా ముఖ్యమే.  ప్రతి భోజనానికి ఇంత మోతాదు ప్రోటీన్ తీసుకోవాలని గుర్తుపెట్టుకుంటే శరీరానికి సరిపడినంత తీసుకోవచ్చు.   హైడ్రేటెడ్‌గా ఉండాలి:  తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి, ప్రోటీన్ వంటి పోషకాలను శోషించడంతో సహా మొత్తం ఆరోగ్యానికి తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం.  రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోండి మీ ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్ మూలాలను చేర్చడం మొత్తం శరీర ఆరోగ్యానికి అవసరం.  లీన్ ప్రోటీన్ మూలాలను ఎంచుకోవడం, మొక్కల ఆధారిత ప్రోటీన్లను కలుపుకోవడం,  భోజనాన్ని సమతుల్యం చేయడం ద్వారా శరీర అవసరాలకు తగినంత ప్రోటీన్ లభిస్తుంది.                                             ◆నిశ్శబ్ద.

ఆలోచనా దినోత్సవం ఆడబిడ్డల అస్త్రం!

అప్పుడెప్పుడో అభిషేక్ బచ్చన్ ఐడియా సిమ్ యాడ్ లో one idea can change your life అని చెప్పాడు. ఆ సిమ్ యాడ్ గురించి ఏమో కానీ.. ఒక్క ఆలోచన అయితే జీవితాన్ని మారుస్తుందని దృఢంగా చెప్పవచ్చు. ఒక్క ఆలోచనతో, ఒక్క నిర్ణయంతో తమ జీవితాలలో గొప్ప మార్పులు సాధించుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆలోచనల పరంపర ఎందుకంటే.. అన్నిటికీ ఓ దినోత్సవాన్ని పెట్టేసిన ప్రపంచ అభివృద్ధికి పాటు పడినవారు ఈ ఆలోచనలకు కూడా ఒక రోజును కేటాయించారు. అది కూడా ఊరికే ఆలోచించడం కాదు. బాలికలు, మహిళలు వారి సమస్యల గురించి ఆలోచించడం, పరిష్కార దిశగా ప్రపంచాన్ని నడిపించడం ఇందులో ముఖ్య ఉద్దేశ్యం. అసలు ఏమిటి ఈ ఆలోచనా దినోత్సవ ముఖ్య ఉద్దేశం:- ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని జరుపుకుంటారు.  150కి పైగా దేశాల్లోని 10 మిలియన్ల బాలికలు  నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మహిళలు అందరూ తమ మధ్య ఒకానొక సోదరీబంధం, స్నేహ బంధంతో మహిళా సాధికారతకు అడుగులు వేయడం జరుగుతుంది. ఇదే అంశాన్ని ఈ ఆలోచనా దినోత్సవం గుర్తించి మహిళా సాధికారతను మనఃపూర్వకంగా గౌరవిస్తుంది.  ప్రపంచ ఆలోచనా దినోత్సవం మహిళాల గౌరవాన్ని నొక్కి చెప్పే ముఖ్యమైన దినం.     ప్రపంచ ఆలోచనా దినోత్సవం ప్రాముఖ్యత:-  ప్రపంచ ఆలోచనా దినోత్సవం రోజు మహిళలు బాలికలకు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి, వారికి సంబంధించిన అంశాలను చర్చించడానికి వాటికి ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించడానికి ఒక పెద్ద వేదికగా మారుతుంది.   దీని చరిత్ర ఏంటంటే.. ప్రపంచ ఆలోచనా దినోత్సవం ఆవశ్యకతను 1926లో నాల్గవ మహిళా స్కౌట్ అంతర్జాతీయ సదస్సులో ప్రస్తావించారు.  ఫిబ్రవరి 22ని థింకింగ్ డేగా అంకితం చేసేందుకు సదస్సు అంగీకరించింది.  బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికాను స్థాపించిన లార్డ్ బాడెన్-పావెల్. ఈయన భార్య ఈ  సంస్థ యొక్క మొదటి గ్లోబల్ హెడ్ గైడ్‌. వీరిద్దరూ ఫిబ్రవరి 22న జన్మించారు.  ఆరు సంవత్సరాల తరువాత, 1932లో పోలాండ్‌లోని బుజ్‌లో జరిగిన 7వ ప్రపంచ సదస్సులో వారి పుట్టిన రోజు సందర్భంగా  బహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు. దీనివల్ల బాలికల ఆలోచనా దినోత్సవానికి అదొక గొప్ప విరాళం లాగా మారింది. ఈవిధంగా థింకింగ్ డే కు రూపకల్పన జరిగింది.   ఈ ఏడాది ఆలోచనా అంశం ఏమిటంటే.. 'మన ప్రపంచం, మన శాంతియుత భవిష్యత్తు' అనే నినాదం ఈ సంవత్సరం ఆలోచనా దినోత్సవ అంశం. ఈ వ్యవస్థ నుండి మనం ఏమి అర్థం చేసుకోగలమో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలకు మరింత సురక్షితమైన మరియు ప్రశాంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రకృతితో మనం ఎలా సహకరించవచ్చో ఇది విశ్లేషిస్తుంది. ఆలోచన అనేది రేపటిని మరింత ఆశాజనకంగా ఉండేలా చేస్తుంది కాబట్టి ఆలోచన మీ ఆయుధం కావాలి.                                     ◆నిశ్శబ్ద.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం... భాషను కాపాడుకోవాలిప్పుడు..

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం…అనగానే... తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం.. తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా… దేశమాత స్వేచ్చకోరి తిరుగుబాటు చేయరా.. నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట… అబ్బా . ఎన్నెన్ని మంచి పాటలు కదా… మాతృభాషా దినోత్సవమంటే సభలూ సమావేశాలు పెట్టేసి.. పాటలు, ఉపన్యాసాలు దంచి కొట్టేసి.. హమ్మయ్య మనం తెలుగు భాష కోసం పాటుపడుతున్నాం అనుకుని సభల్లో బాగా మెక్కి ఇంటికెళ్లిపోవడం. ఆ తరువాత ఎక్కడ చూసినా ఇంగ్లీషులో మాట్లాడుతూ, ఇంగ్లీషులో మునిగి తేలుతూ.. తమ పిల్లలను అచ్చంగా ఇంగ్లీషు భాషలోనే పెంచుతూ తెలుగుకు మంగళం పాడేస్తుంటారు. ఇదేనా తెలుగు భాషకు పాటు పడటం.  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఒక దేశానికి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించినది. అసలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసా.. 1947 లో భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ భౌగోళికంగా రెండు భాగాలుగా ఏర్పడింది. వాటిలో  ఒకటి తూర్పు పాకిస్తాన్ కాగా  రెండవది పశ్చిమ పాకిస్తాన్. తూర్పు పాకిస్తాన్ ను ప్రస్తుతం బంగ్లాదేశ్ అంటున్నాం. రెండవ భాగం  పాకిస్తాన్ గా ఉంది. అయితే అప్పటికి రెండు భాగాలలో భాష, సంస్కృతి వేరువేరుగా ఉండేది. భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం తమ జాతీయ భాషగా ఉర్ధూను ప్రకటించింది. ఇది బంగ్లా ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. తూర్పు పాకిస్తాన్ లో ఎక్కువ శాతం ప్రజలు బంగ్లా మాట్లాడతారు. అందుకే వారికి పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం నచ్చలేదు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయభాషగా ఉండాలని డిమాండ్ చేశారు.  తూర్పు బంగ్లా ప్రజలు అదే విషయాన్ని పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. నిరసన చేపట్టారు. దీన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ఇంకా అనేక నిబంధనలు విధించింది. దానికి వ్యతిరేకంగా డాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. 1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దీనికి నిరసనగా పాకిస్తాన్ లీగ్ అదే రోజు పార్లమెంటర్ పార్టీకి రాజీనామా చేశారు. 1956 లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది. ఇలా ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద భాషలు అన్నిటినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే..  మనకు అవసరం కోసం, పై చదువుల కోసం ఎన్ని భాషలు అవసరమైన అవన్నీ అక్కరకు మాత్రమే.. మాతృభాష అనేది తప్పక ప్రతిఒక్కరి జీవితంలో ఉండాలి. మాతృ అనే పదంలోనే అది అమ్మ భాష అనే అర్థం ఉంది. మాతృ భాషను వదులుకుంటే అమ్మను కాలదాన్నినట్టే.. కాబట్టి పరభాషను గౌరవించాలి, ఆదరించాలి, మన భాషను ప్రేమించాలి, పోషించాలి, ఎప్పటికీ నిలుపుకోవాలి.. అంతేకానీ ఒకరోజు ముచ్చటగా ముగించకూడదు. ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. ఇందులోనే ఈ జాతిలోనూ.. ఈ భూమిలోనూ మన తెలుగు భాష ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలి.                                      ◆నిశ్శబ్ద.

మరాఠా యోధుడు జయంతి!!

భారతదేశ చరిత్రలో ఎంతో మంది వీరులు ఉన్నారు. వారిలో  ధైర్యసాహసాలు, వీరత్వం, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వారిని కూడా కాచివడపోస్తే అందులో ఖచ్చితంగా నిలబడగలిగేవాడు శివాజీ. విశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, పేరు చెబితేనే శత్రువుల గుండెలు దడదడలాడేలా భారత  చరిత్రలో ఓ గొప్ప యోధుడిగా, ఛత్రపతి బిరుదాంకితుడిగా నిలిచిపోయిన శివాజీ రావ్ భోంస్లే పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షానాజీ, జిజియాబాయి దంపతులకు ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరంలో జన్మించాడు. బాల్యపు చిగురులు!! శివాజీ తండ్రి షానాజీ బీజాపూర్ సుల్తానుల వద్ద జాగీర్దారుగా పనిచేసేవాడు. ఇతడు నిజాం రాజులను ఓడించి సంపాదించుకున్న రాజ్యాన్ని మొఘలులు ఆదిల్షాతో కలసి షానాజీని ఓడించారు. అప్పుడు ఆదిల్షా మరియు షానాజీ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడి నుండి నేటి బెంగుళూరు ప్రాంతానికి జాగీరుగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జిజియాబాయిని, శివాజీని అక్కడే వదిలి వెళ్ళాడు షానాజీ. తండ్రి షానాజీ, తల్లి జిజియాబాయి ఇద్దరూ మరాఠా సామ్రాజ్య స్థాపన కోసం చేసిన ప్రయత్నాలను చిన్నతనంలో చూసిన శివాజీ, తండ్రి బెంగుళూరు వెళ్లిపోగానే తల్లిదగ్గర రామాయణ, భారతాలు, పురాణాలు, వాటిలోని నీతి, యుద్ధ విషయాలు, స్త్రీపట్ల గౌరవంగా ఉండటం, పరమతాలను గౌరవించడం, ఎవ్వరికీ చెడు తలపెట్టకుండా మంచితనంతో ఉండటం వంటి విషయాలను చక్కగా తెలుసుకున్నాడు. రామాయణ, భారత, హిందూ దర్మాల ప్రత్యేకతను, వాటిలో విశిష్టతను తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే ద్యేయంగా మనసులో పెట్టుకున్నాడు. యోధుడిగా అడుగులు!! తల్లి చెప్పిన మంచి మాటలు, పురాణాలలో దాగిన నీతి, తండ్రికి ఎదురైన అనుభవాలు ఇవన్నీ శివాజీకి చిన్నతనంలోనే గొప్ప ఆలోచనలను, మరాఠా సామ్రాజ్య స్థాపన అనే లక్ష్యాన్ని మనసులో నాటాయి. మొఘలులు భారతదేశం మీద పడి హిందూ మతాన్ని నీరుగారుస్తున్న దశలో శివాజీ వాళ్ళను ఎంతో నేర్పుగా ఎదుర్కొని హిందూధర్మాన్ని కాపాడిన వ్యక్తిగా, శక్తిగా నిలిచిపోయాడు. భైరాంఖాన్ పర్యవేక్షణలో ఎంతో గొప్పగా పదునుదేరిన శివాజీ తన 17 సంవత్సరాల ప్రాయం నుండి యుద్ధాలు చేయాడం మొదలుపెట్టి సుల్తానుల కోటలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసి ఓర్వలేని ఆ సుల్తానులు శివాజీ తండ్రిని అకారణంగా బంధించినప్పుడు శివాజీ, శంబాజీ ఇద్దరూ కలిసి ఆ సుల్తాల మీద యుద్ధం చేసి తండ్రిని సురక్షితంగా విడిపించుకున్నారు. ఆ తరువాత సుల్తానులను, మొఘలులను వరుసగా జయిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించుకోసాగాడు. యుద్ధ నైపుణ్యం!! శివాజీకి తన తండ్రి నుండి లభించింది కేవలం రెండువేల మంది సైనికులు అయితే దాన్ని పదివేల సమర్త్యానికి పెంచుకోవడంలో ఎంతో గొప్ప నైపుణ్యం ఉంది. అలాగే యుద్దానికి వ్యూహాలు రచించడంలో కూడా శివాజీ గొప్ప దిట్ట. ఇతను అనుసరించే వ్యూహాలు నాటి కాలానికి అసలు పరిచయం లేనివి. వీటిలో ముఖ్యంగా ప్రపంచానికి అప్పటివరకు పరిచయం లేని గెరిల్లా పోరాటం శత్రువులను ఎంఘో భయానికి గురుచేసేది.  రాశి కన్నా వాశి మిన్న అనే మాట శివాజీ సైన్యానికి సరిపోతుంది.  తన సైన్యాన్ని ఎంతో  నైపుణ్యంతో ఉత్తమంగా ఉంచుకునేవాడు శివాజీ. ఈయన దగ్గర ఎంతో ఉత్తమమైన సైనికులు ఉండేవారు. అలాగే సమర్థమవంతమైన సైన్యాధిపతి తానాజీ శివాజీ బలగంలోని వాడే.  పరమతాన్ని అధరించినవాడు!! హిందూవ్యతిరేక రాజ్యాలు, రాజుల మీద యుద్ధం చేసినా ముస్లిం మతస్థులను ఎవరినీ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టని మనస్తత్వం శివాజీది. ఈయన ఎన్నో మసీదులను కట్టించాడు. తన దగ్గర పనిచేసేవాళ్లలోనే ఎంతోమంది ముస్లింలను ఉంచుకున్నాడు. బీజాపూర్ సుల్తానులను ఓడించడానికి ఔరంగజేబుకు సహాయపడ్డాడు, తన కూతురును కూడా హిందూమతం స్వీకరించిన ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసాడు. ఇంకా ఈయన సైనికులలో కూడా ముస్లింలు చాలామంది ఉండేవాళ్ళు.  రాజులను ఓడిస్తే ఆ రాజుల భార్యలను, వారి కుటుంబంలో ఆడవాళ్లను కూడా తెచ్చుకునేవారు కొంతమంది. అయితే ఒకసారి ఒక ముస్లిం రాజు ఓడిపోయినప్పుడు అతడి కొడలును శివాజీ ముందు నిలబెడితే "మా అమ్మ మీలా అందంగా ఉంటే, నేను కూడా అందంగా ఉండేవాడినేమో"అని చెప్పి ఆ మహిళను తల్లితో పోల్చి, ఆమెను ఎంతో గౌరవంగా తిరిగి వెనక్కు పంపేసాడు శివాజీ. ఇది ఆయనలో ఉన్న వ్యక్తిత్వ విలువకు ఒక మచ్చుతునక మాత్రమే. చివరిలో!! సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు యుద్ధాలు చేసి భారతీయ రాజులకు అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచిన ఛత్రపతి శివాజీ తన యాభై మూడు సంవత్సరాల వయసులో మూడు వారాల పాటు విపరీతమైన జ్వరంతో బాధపడి దాన్నుండి కొలుకోలేక తుదిశ్వాస విడిచాడు. ఈయన ఆ కాలానికే పటిష్టమైన నిఘా వ్యవస్థ, నౌకాదళ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తీరు ఇప్పటి విశ్లేషకులను కూడా అబ్భురపరుస్తూనే ఉంది. ఈయన శౌర్య ప్రతాపాలు దేశాన్ని చైతన్యం వైపు నడిపిస్తూనే ఉంటాయి. ◆ వెంకటేష్ పువ్వాడ  

ప్రపంచాన్ని పునీతం చేసే దయాగుణం!

ఈ ప్రపంచంలో ఎన్నో మనస్తత్వాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కొ గుణం మనకు అనుభవంలోకి వస్తుంది. అయితేయాన్ని గుణాలలోకి దయ చాలా గొప్పదని అంటారు. శత్రువులను కూడా క్షమించి తనవారిలా మార్చుకునే లక్షణాన్ని దయ మనుషుల్లో పెంపొందిస్తుంది.  దయ గురించి సుమతీ శతక కర్త ఇలా చెబుతాడు.. తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము, తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ!! దయ మనిషికి చుట్టంలాగా ఉంటే అది మనిషి జీవితాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. ఇప్పుడు ఈ దయ గురించి ఎందుకంత చర్చ అనే అనుమానం అందరికీ వస్తుంది. అయితే.. మనిషిలో దయా గుణం పెంపొందడానికి, దయా గుణం ఇతరుల పట్ల చూపించవలసిన ఆవశ్యకత గురించి చర్చించడానికి ఒకరోజు కేటాయించారు. అదే "National Rondom Acts Of Kindness Day".. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన "నేషనల్ రాండం యాక్ట్స్ ఆఫ్ కైండ్ నెస్ డే" జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో ఈ దినోత్సవాలను జరుపుకోవడం కంటే ముందే భారతీయ ధర్మంలో జాలి, కరుణ, దయ మొదలైన గుణాలను పెంపొందించుకోవాలని నీతి కథల నుండి పురాణ కథల వరకు అన్నింటిలో భాగం చేసి చెప్పారు. బుద్ధుడు అన్నాడు దయ, కరుణ మనుషుల్లో ఉండాలని, అవి అహింసను రూపుమాపే గొప్ప ఆయుధాలు అవుతాయి. అడుగు అడుగులో..పలుకు పలుకులో చిన్నతనం నుండి పిల్లలకు నీతి కథలు, నీతి వాక్యాలు, దయ, కరుణ వంటి గుణాలు నూరిపోస్తూ పెంచుతాం. అయితే ఈ జాలి, కరుణ, దయ అనేవి కేవలం మాటల్లో చెప్పుకునేవి కాదు. చేతల్లో చూపించాల్సినవి.  మనం ఒకరి పట్ల దయతో, ప్రేమతో ప్రవర్తిస్తే.. ఇతరులు ఇంకొకరి పట్ల అదే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఈ ప్రపంచంలో మనిషి తనకు ఏ అనుభూతి ఎదురైతే అదే ప్రపంచంలో ఉందని గట్టిగా విశ్వసిస్తాడు. హింసకు గురయ్యే మనిషి ప్రపంచమంతా హింసే.. ప్రతి వ్యక్తి ఇతరులను హింసకు గురిచేస్తూ ఉంటారని అనుకుంటారు. అదే ఒక వ్యక్తికి దయాపూరిత అనుభవం ఎదురైతే ఆ మనిషి ఈ ప్రపంచంలో మంచితనం, మంచి మనుషులు, మంచి గుణాలు ఉన్నాయని నమ్ముతాడు. తాను కూడా ఇతరుల పట్ల దయ చూపించడం చేస్తాడు.  ఇలా ఇతరుల పట్ల దయ చూపించడం అనేది ఓ మంచి గుణాన్ని తమ నుండి తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి వ్యాప్తం చేస్తుంది. కష్టాల్లో ఉన్నవారిని, ప్రకృతీ విలయాల కారణంగా అనాథలుగా మారిన వారిని, ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్న వారిని, వృద్ధులను జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలలో చిక్కుకుపోయి ఉంటారు వాళ్ళందరినీ కూడా సగటు మనిషిగా ఆదుకోవచ్చు. జంతువులు, మనుషులు, మొక్కలు, ఈ ప్రపంచాన్ని ఆవరించి ఉన్న సకల జీవరాశులు కూడా దాయా గుణానికి చలిస్తాయి. కాబట్టి దయ అనేది మనిషిని ఉన్నతంగా మారుస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి దయను అందించండి.. ఈ ప్రపంచాన్ని ఒకానొక దయాపూరిత గుణంతో నింపండి.                                  ◆నిశ్శబ్ద.

భారతదేశానికి సినిమా రుచి చూపించిన ఘనుడు  దాదాసాహెబ్!

కాంతార ఫేమ్ రిషబ్ శెట్టికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఎక్కడ చూసినా ఈ వార్తే… అయితే ఫిబ్రవరి 16న దాదాసాహెబ్ ఫాల్కే మరణించారు. ఈయన వర్ధంతిని స్మరించుకుంటూ ప్రతిభావంతులకు ఈ అవార్డ్ అందజేస్తారు. ఈ సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే గురించి సినిమా వైపు ఆయన ప్రయాణం గురించి తెలుసుకుంటే.. దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే.  అతను బ్రిటీష్ ఇండియాలోని త్రయంబక్‌లో (ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో) ఏప్రిల్ 30, 1870న జన్మించాడు.  ఆయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని పిలుస్తారు.  ఈయన సృజనాత్మక కళలపై గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు.  1944 ఫిబ్రవరి 16న మహారాష్ట్రలోని నాసిక్‌లో మరణించాడు.  దాదాసాహెబ్ ఫాల్కే జీవితం, కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూస్తే.. దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ ప్రజలకు సినిమా అనుభవాన్ని, అందులో అందాన్ని పరిచయం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినోద పరిశ్రమ అయిన సినిమా పరిశ్రమను అభివృద్ధి చేశారు.  భారతదేశ మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర (1913) రూపొందించాడు.   భారతదేశం గొప్పగా చెప్పుకునే  సినిమా నిర్మాత, దర్శకుడు, సినిమా రచయిత, కథకుడు, సెట్ డిజైనర్, డ్రెస్ డిజైనర్, ఎడిటర్, డిస్ట్రిబ్యూటర్ మొదలైనవన్నీ ఈయనే.  అందుకే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్" ఈయన  పేరు మీద ప్రారంభించబడింది, ఇది 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్' భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిభ కనబరిచిన వారికి అందించబడుతుంది.   దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 1969లో సమకాలీన భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలను స్మరించుకునే ఉద్దేశంతో స్థాపించబడింది.  భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కూడిన కమిటీ ఫాల్కే అవార్డు విజేతను ఎంపిక చేస్తుంది.  ఇది సినిమా రంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం.  సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా ఏటా జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో దీనిని అందజేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే 30 ఏప్రిల్, 1870 న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సమీపంలోని త్రయంబకేశ్వర్ పట్టణంలో జన్మించారు.  ఈయన  తన ప్రాథమిక విద్యను 1885లో ముంబయిలోని సర్ J.J స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో పూర్తి చేశాడు. 1890లో అతను డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ గురించి అధ్యయనం చేయడానికి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లాడు. గోద్రాలో (గుజరాత్), దాదాసాహెబ్ ఫాల్కే ఫోటోగ్రాఫర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు, అయితే ప్లేగు వ్యాధి కారణంగా ఈయన మొదటి భార్య, బిడ్డ మరణించిన తర్వాత ఫోటోగ్రఫీ పనిని విడిచిపెట్టాడు.  ఆ తర్వాత కొత్త టెక్నాలజీలను తెలుసుకునేందుకు జర్మనీ వెళ్లాడు. పాఠశాల సమయం నుండే ఈయన  మ్యాజిక్‌పై  ఆసక్తిని పెంచుకున్నాడు.  ఆ సమయంలో అతను వివిధ రకాల స్పెషల్ ఎఫెక్ట్‌లను కూడా ప్రయోగించాడు.  జర్మనీలో అతను కార్ల్ హెర్ట్జ్ అనే ఒక మాంత్రికుడిని కలుసుకున్నాడు, అతనితో కలిసి పనిచేశాడు.  కొంతకాలం తర్వాత అతను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లో డ్రాఫ్ట్స్‌మ్యాన్‌గా పనిచేసే అవకాశాన్ని పొందాడు. అయితే ఆసక్తి లేకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి మళ్లీ మహారాష్ట్రకు వచ్చాడు.  అక్కడ, అతను ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాన్ని ప్రారంభించాడు.  ముంబైలోని ‘అమెరికా-ఇండియా థియేటర్’లో ఫెర్డినాండ్ జెక్కా రూపొందించిన మూకీ చలన చిత్రం "ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్" చూసినప్పుడు అతని జీవితం మలుపు తిరిగింది. "రాజా హరిశ్చంద్ర"ని పూర్తి నిడివి చలనచిత్రంగా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు.  ప్రధాన పాత్ర కోసం అందమైన నటీనటుల కోసం అనేక ప్రకటనలు ఇచ్చాడు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు.  చివరకు దాదాసాహెబ్ కుటుంబం మొత్తం రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని రూపొందించడంలో పాలుపంచుకున్నారు.  ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, రచయిత, కెమెరామెన్ మొదలైనవారు దాదాసాహెబ్ ఒక్కరే. నటీనటుల దుస్తులు, పోస్టర్లు, సినిమా నిర్మాణాన్ని అతని భార్య నిర్వహించింది.  అతను హరిశ్చంద్రుని పాత్రను పోషించాడు. అతని 7 సంవత్సరాల కుమారుడు భాల్చంద్ర ఫాల్కే ఈ చిత్రంలో హరిశ్చంద్ర కొడుకుగా ప్రధాన పాత్ర పోషించాడు.  అలాగే, ఆ ​​సమయంలో ఏ మహిళ కూడా ఈ చిత్రంలో నటించడానికి సిద్ధంగా లేకపోవడంతో తారామతి ప్రధాన పాత్ర కోసం ఒక వ్యక్తిని ఎంపిక చేశారు.  ఈ చిత్రం మొదటిసారిగా 3 మే, 1913న ముంబైలోని కరోనేషన్ సినిమాలో బహిరంగంగా ప్రదర్శించబడింది. దాదాసాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్ర సినిమా మొత్తాన్ని తీయడానికి 15 వేల రూపాయలు వెచ్చించాడు.  1971లో ఈయన గౌరవార్థం ఈయన ముఖంతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను ఇండియా పోస్ట్ విడుదల చేసింది. సమకాలీన భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అందించిన సహకారాన్ని స్మరించుకునేందుకు 1969లో ఈ అవార్డును స్థాపించారు.  ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే ప్రదానం చేయబడింది.  1969లో, భారతీయ సినిమా ప్రథమ మహిళ దేవికా రాణి ఈ అవార్డు మొదటి గ్రహీత.  ఈ అవార్డులో శాలువా, రూ.  10 లక్షల రూ౹౹,  ఒక బంగారు కమలం ఉంటాయి.. దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ దాదాసాహెబ్ ఫాల్కే పేరిట మూడు అవార్డులను అందిస్తుంది. ఫాల్కే రత్న అవార్డు, ఫాల్కే కల్పతరు అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డులు. 1932లో, దాదాసాహెబ్ ఫాల్కే చివరి మూకీ చిత్రం 'సేతుబంధన్' విడుదలైంది. తర్వాత అది డబ్బింగ్‌తో విడుదలైంది.  ఈయన  1936-37 సమయంలో తన చివరి చిత్రం 'గంగావతరన్'ని నిర్మించాడు.  తన జీవితకాలంలో 95 సినిమాలు, 26 షార్ట్ ఫిల్మ్‌లు చేసాడు. ఫిబ్రవరి 16, 1944 న నాసిక్‌లో మరణించాడు.  చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సహకారం విశేషమైనది, ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.                                          ◆నిశ్శబ్ద.

మీరు సింగిల్సా.. జర లుక్కేయండి ఇటువైపు..

షాదీ మాటే వద్దు గురూ.. సోలో బ్రతుకే సో.. బెటరూ.. అని ఎంతోమంది సింగిల్స్ పాడుకుంటూ ఉంటారు. ప్రేమలోనూ.. రిలేషన్షిప్ లోనూ.. ఎంతో విసిగిపోయి విరక్తి చెందితే తప్ప ఎవరూ అంత పెద్ద నిర్ణయం తీసుకోరు. నిన్నటికి నిన్న వాలెంటైన్స్ డే వెల్లువలా సాగింది. ఎక్కడ చూసినా హృదయం గుర్తులూ.. ప్రేమ పక్షులు, గులాబీలు, గిఫ్టులు, చాక్లెట్లు ఓయబ్బో ఈ ప్రపంచం మొత్తం మీద ఈ వాలెంటైన్స్ డే బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది. అయితే వాలెంటైన్స్ డే అనేది జంటలకే కానీ సింగిల్స్ కి కాదు కదా.. సింగిల్స్ పాపం ఒక్కరే ఒంటరి పడవ ప్రయాణం చేసుకుంటూ ఉంటారు.  ఈ ప్రపంచం మనసు చాలా దొడ్డది. ఒంటరితనానికి భరోసా ఇస్తుంది. అందులో భారగమే సింగిల్ డే..  సింగిల్స్ డే నా… ఇదోటి ఉందా?? అని అనుకుంటున్నారా?? అవునండీ బాబు సింగిల్స్ డే ఉంది. అది అక్షరాలా ఒంటరిగా ఉన్న వాళ్లకోసమే. సింగిల్స్ అవేర్‌నెస్ డే ఫిబ్రవరి 15న జరుపుకుంటారు. కాబట్టి మీరు ఒంటరిగా ఉండి, వాలెంటైన్స్ డేతో పూర్తిగా సంబంధం లేకుండా ఉండేవారు అయితే. ఇదిగో ఈ సింగిల్ డే మీకోసమే..  వాస్తవానికి, వాలెంటైన్స్ డే రోజు తమకు ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా ఉన్నవాళ్లకోసం ఈ సింగిల్ అవేర్‌నెస్ డే ఏర్పాటు చేయబడింది. అయితే ఇందులో చాలా ముఖ్య ఉద్దేశాలే ఉన్నాయి. అవేంటంటే.. నిజమైన ప్రేమ.. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా?? తమను తాము ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ. ఇతరులను ప్రేమించడం నిజమైన ప్రేమ కాదా అని ప్రశ్న వస్తోందేమో.. కానీ తమ మీద తమకు బాధ్యత, ఇష్టం, ప్రేమ లేకుండా ఇతరుల మీద మాత్రమే దాన్ని చూపించినప్పుడు మనిషుల్లో ఖాళితనం ఏర్పడుతుంది. ఎదుటి మనిషి దూరం వెళ్లిపోయినప్పుడు ఆ ఒంటరితనం అంతా నరకంలా అనిపిస్తుంది. అదే తమను తాము ప్రేమించుకుంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా తమను తాము ప్రేమించుకోవడానికి ఒంటరితనమే మంచి మార్గం. ఒంటరితం సమస్య కానే కాదు. తమకోసం తాము హాయిగా సమయాన్ని విచ్చించుకునే ఒక మంచి అవకాశం అది. పైకి బంధాలు బాగా కనిపిస్తాయి ప్రపంచం వ్యాప్తంగా.. కానీ ఒంటరిగా ఉన్నవారి శాతం ఎక్కువగానే ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ వంటి దేశాల్లో సింగిల్ పర్సెంటేజ్ జనాభాలో సగం ఉన్నట్టు సర్వేలు వెల్లడించాయి.  ఈరోజు ప్రత్యేకత.. ఒంటరితనం మానసికంగా మనిషిని బలపరిచినా.. అది మరో విదంగా మనిషిని నిరాశకు కూడా లోను చేస్తుంది. అలాంటివారికి ధైర్యం చెప్పడం, జీవితం మీద ఆశ కల్పించడం, అందమైన భవిష్యత్తును చూపించి వారిని ముందుకు నడిపించడం ఈరోజు ప్రత్యేకతలో భాగం. కనీసం ఎప్పుడూ వారితో ఉండకపోయినా మాటలతో ఉత్తేజపరచడం చేయొచ్చు. ఒకరిని ఒకరు కలుసుకుని బహుమతులు ఇచ్చుకోవడం, ధైర్యం చెప్పుకోవడం, వినూత్నంగా సమయాన్ని గడపడం చేయొచ్చు. ఏది ఏమైనా.. ఈ సింగిల్స్ డే సింగిల్ గా ఉండేవాళ్లకు  సపోర్ట్ గా నిలుస్తుంది.                                     ◆నిశ్శబ్ద.  

పనితో ప్రేమలో పడండి

  మీరు ఎప్పుడన్నా మీ పనితో ప్రేమలో పడ్డారా ? లేదంటే వెంటనే ఆ పనిలో వుండండి. ఎందుకంటే రోజు సంతోషంగా ఉండాలంటే మీరు చేసే పనితో ప్రేమలో పడండి అంటున్నారు పరిశోధకులు . నిజానికి  చాలామందికి ఈ సీక్రెట్ తెలీక   జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు అంటున్నారు వారు . అదేదో బరువు మోస్తున్నట్టు  జీవితాన్ని ఎంతో కష్టం గా లాక్కు వెళుతుంటారు . అదేమంటే చేసే పని నచ్చితే కదా ! దానిని ఎంజాయ్ చేసేది అంటారు. అయితే  చేసే పని మీకు నచ్చినా నచ్చకపోయినా ముందుగా దానిని వందశాతం ప్రేమించటం మొదలు పెట్టండి.  అప్పుడు అది భారంగా అనిపించదు. అదెలా సాద్యం అంటే, చేసేపని మీద పూర్తిగా మనసుపెట్టి నప్పుడు, ఆ పని పూర్తి అయ్యేసరికి మనకి తెలియకుండానే ఒక సంతృప్తి కలుగుతుంది.      సో... మనం చేసే పనిమీద ద్రుష్టి పెట్టాం కాని , అది మనకు నచ్చినదా , కాదా అన్న విషయం మీద కాదు కాబట్టి , ఆ క్షణం లో నిజంగా ఒక పనిని సమర్దవంతం గా పూర్తి చేసినప్పుడు కలిగే ఆనందాన్ని రుచి చూస్తాం. ఈ సూత్రం  చిన్న పని నుంచి పెద్ద పని దాకా అన్నిటికి వర్తిస్తుంది. చేసే పని ఏది అయినా సరే దానిని మనస్పూర్తిగా , శ్రద్దగా చేయటం అనే చిన్న అలవాటు ఒక్కటి చాలు మనకి కొండంత సంతోషాన్ని ఇవ్వటానికి.     చేసే పని నచ్చనప్పుడు అసహనం, కోపం కలుగుతాయి . అవి ఒకదాని నుంచి ఒకదానికి పాకి పోయి, రోజుని, ఒకో సారి  మొత్తం  జీవితాన్ని నిందిస్తూ  గడిపేస్తాం. దాని వల్ల నచ్చిన పనులని కూడా ఆనందం గా చేయలేము. ఇది ఒక చైన్ లా మొత్తం జీవితాన్ని చుట్టబెట్టేస్తుంది. దాంతో సెల్ఫ్ పిటి లోకి వెళ్ళిపోయి మన జీవితం ఇలా కావటానికి కారణం అంటూ చుట్టుపక్కల వాళ్ళని నిందించటం మొదలు పెడతాం . దానివలన అనుబంధాల మద్య పొరపచ్చాలు వస్తాయి. మళ్ళి దాని నుంచి బాధ .. నైరాశ్యం ..పుట్టుకొచ్చి మనసుని అల్లకల్లోలం చేస్తాయి.    వింటుంటే ...నిజమా ? అన్న అనుమానం కలుగుతుంది కాని ఒక్కసారి మీలోపలకి మీరు ప్రయాణించి, మీ కోపానికి, అసహనానికి కారణాలని వెదకటం మొదలు పెట్టండి. మీరు చేసే పనిని మీరు ప్రేమించకపోవటమే కారణం అని తెలుస్తుంది. అంటున్నారు పరిశోధకులు. కొన్ని ఏళ్ల పాటు, వందల మందిపై వీరు జరిపిన పరిశోధనలలో బయట పడ్డ నిజం అది.   అందుకే చేసే ప్రతి పనితో ప్రేమలో పడదాం. అసలే జీవితం ఉన్నదే చిన్నది. అందులో సగం జీవితం పనిని చూసి విసుక్కోవటం తోనే సరిపోతే ఇక ఉన్న జీవితాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశమే రాదేమో? కష్టంగా ఉన్నవాటిని ఇష్టంగా మార్చుకుంటే జీవితం ఎప్పుడు మూడు నవ్వులు ఆరు విజయాలతో కళకళలాడుతుంది. మరి మీ పనితో మీరు ప్రేమలో పడ టానికి సిద్దమేగా ?  - కళ్యాణి

ప్రేమకు నిర్వచనాలు ఏవి?

ప్రేమ అనగానే అందరికీ ఎక్కడలేని హుషారు పుడుతుంది. జీవితంలో తోడుగా అన్ని రకాల ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒక తోడు అనేది ప్రేమికుడు లేదా ప్రేమికురాలి ద్వారా దొరుకుతుంది. అయితే ప్రేమ అనే రెండు అక్షరాలకు నిజమైన అర్థం నిజం, నిజాయితీ, నమ్మకం, ధైర్యం, విజయం. ఈ అయిదు ప్రేమకు నిజమైన అర్థాలు...! ఈనాటి సమాజంలో వున్న యువకుల ఆలోచనలు ఎక్కువగా ప్రేమవైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రేమ అంటే వాళ్ళ దృష్టిలో కళ్ళలో కళ్లు పెట్టుకుని చూసుకుని నవ్వుకోవడం, సైగలు చేసుకోవడం, ప్రేమికుడు లేదా ప్రియురాలి కోసం ఏమైనా కొనివ్వడం సినిమాలకు తీసుకెళ్ళడం, ప్రియురాలు ఏదైనా అడిగితే ప్రేమికుడు ప్రియురాలు కోసం తన తాహతుకు మించకపోయినా ప్రియురాలు అడిగినదాని కోసం తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేయడం ప్రియురాలి కోరికలు తీర్చడం వంటివి చేస్తున్నారు. చివరికి తల్లి దండ్రులకు అప్పుల బాధను మిగిల్చి, వాళ్ళు వారి సరదాలను కోరికలను తీర్చుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఇది ప్రేమికురాలికి న్యాయం చేయడమా, లేక తల్లిదండ్రులకు న్యాయం చేయడమా మీరే ఆలోచించండి.  నిజమైన ప్రేమికుడు లేక ప్రియురాలుకు ముందు ప్రేమ పట్ల మంచి అవగాహన వుండాలి. ప్రేమను ఆరాధించాలి, అలాగే తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి. వయసులో ఉన్నవారు ప్రేమించడం సహజం. ప్రేమించడం తప్పేమీ కాదు. ప్రేమికులు ఇద్దరు మీకు ఉన్నదాంట్లో మీ కుటుంబానికి తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలి. మీరు మీ ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులను అప్పుల బాధకు గురి చేయకూడదు. ప్రేమికుడికి, ప్రేమికురాలు ఇవ్వవలసిన నిజమైన ఆనందం, ప్రేమికుడికి తల్లి దండ్రుల దగ్గర మంచిగౌరవం వుండేలా సమాజంలో మంచి గుర్తింపు ఉండేలా చేయడం. ఇది నిజమైన ప్రేమికురాలు ప్రేమికుడికి ఇచ్చే నిజమైన ఆనందం. ప్రేమ మోజులో పడిపోయి మీరు అనవసరపు ఖర్చు చేయకూడదు. అలాగే అబ్బాయిలు అమ్మాయిల విషయంలో  ఒక పరిధిలో ఉండాలి. చాలామంది ప్రేమ అనగానే ఇక మొత్తం ఒకరికొకరు ఏకమైపోవాలి అనుకుంటారు. శారీరకంగా కలవడానికి ఒత్తిడి చేస్తుంటారు. దానివల్ల జీవితాలు పెద్ద సమస్యల్లో చిక్కుకుంటాయి. ప్రేమంటే మనుషుల్ని అర్థం చేసుకుని ఆరాధించి తరువాత ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం. అంతే తప్ప ముందే అన్ని అయిపోవాలని లేకపోతే ప్రేమ లేదు అని మాటలు చెప్పడం కాదు.  మీరు ఒకవేళ ప్రేమ మోజులో పడితే నిజాయితీగా వుండి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకొని ఒక సరైన లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యంపై నమ్మకాన్ని పెంచుకోవాలి. అలా నమ్మకం ఏర్పడితే జీవితంలో భవిష్యత్తు గొప్పగా ఉంటుందనే ధీమా వస్తుంది.  ఏర్పరుచుకున్న ఆ లక్ష్యంలో ఏవైన సమస్యలు వస్తే కృంగిపోకుండా ధైర్యంగా వుండాలి. ఆ సమస్యను ఇద్దరు ధైర్యంతో పరిష్కరించుకోవాలి. ఇద్దరూ నిర్ణయంలోనూ, సమస్యలొనూ, పరిష్కారంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఎంత ఇబ్బందులు అయినా అధిగమించగలుగుతారు.  ఇలా లక్ష్యాన్ని ఏర్పరుచుకొని విజయాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి మీ ప్రేమకు తల్లిదండ్రుల నుండి సమాజం నుండి మంచి గుర్తింపు వుండేలా చేసుకోవాలి. మీ ప్రేమను ఇతర ప్రేమికులు ఆదర్శంగా తీసుకునేలా మీరు గొప్పగా ఉండాలి అనుకోవాలి. ఇద్దరి మధ్యన ప్రేమ స్నేహభావంగా వుండాలి. ఇది మాత్రమే కాదు ప్రేమకు కావలసింది ఓర్పు, సహనం, ఇవి రెండూ కూడా చాలా అవసరం. అదే విషయాన్ని ఆలోచించాలి.  ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులకు కడుపు కోతను కన్నీటిని మిగిల్చి పారిపోయి పెళ్ళి చేసుకోవడం న్యాయమా? లేక మీ ప్రేమకు మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని మీ ప్రేమ పట్ల మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు కలిగేటట్లుగా వ్యవహరించడం న్యాయమా? ప్రేమకు నిర్వచనాలను ఎవరికి వారు ఇచ్చుకుంటూ నిజమైన నిర్వచనాన్ని నవ్వులపాలు చేయకూడదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.                                           ◆నిశ్శబ్ద.