Read more!

మీరు సింగిల్సా.. జర లుక్కేయండి ఇటువైపు..

షాదీ మాటే వద్దు గురూ.. సోలో బ్రతుకే సో.. బెటరూ.. అని ఎంతోమంది సింగిల్స్ పాడుకుంటూ ఉంటారు. ప్రేమలోనూ.. రిలేషన్షిప్ లోనూ.. ఎంతో విసిగిపోయి విరక్తి చెందితే తప్ప ఎవరూ అంత పెద్ద నిర్ణయం తీసుకోరు. నిన్నటికి నిన్న వాలెంటైన్స్ డే వెల్లువలా సాగింది. ఎక్కడ చూసినా హృదయం గుర్తులూ.. ప్రేమ పక్షులు, గులాబీలు, గిఫ్టులు, చాక్లెట్లు ఓయబ్బో ఈ ప్రపంచం మొత్తం మీద ఈ వాలెంటైన్స్ డే బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది. అయితే వాలెంటైన్స్ డే అనేది జంటలకే కానీ సింగిల్స్ కి కాదు కదా.. సింగిల్స్ పాపం ఒక్కరే ఒంటరి పడవ ప్రయాణం చేసుకుంటూ ఉంటారు. 


ఈ ప్రపంచం మనసు చాలా దొడ్డది. ఒంటరితనానికి భరోసా ఇస్తుంది. అందులో భారగమే సింగిల్ డే.. 


సింగిల్స్ డే నా… ఇదోటి ఉందా?? అని అనుకుంటున్నారా?? అవునండీ బాబు సింగిల్స్ డే ఉంది. అది అక్షరాలా ఒంటరిగా ఉన్న వాళ్లకోసమే. సింగిల్స్ అవేర్‌నెస్ డే ఫిబ్రవరి 15న జరుపుకుంటారు. కాబట్టి మీరు ఒంటరిగా ఉండి, వాలెంటైన్స్ డేతో పూర్తిగా సంబంధం లేకుండా ఉండేవారు అయితే. ఇదిగో ఈ సింగిల్ డే మీకోసమే..

 వాస్తవానికి, వాలెంటైన్స్ డే రోజు తమకు ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా ఉన్నవాళ్లకోసం ఈ సింగిల్ అవేర్‌నెస్ డే ఏర్పాటు చేయబడింది. అయితే ఇందులో చాలా ముఖ్య ఉద్దేశాలే ఉన్నాయి. అవేంటంటే..


నిజమైన ప్రేమ..


నిజమైన ప్రేమ ఏంటో తెలుసా?? తమను తాము ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ. ఇతరులను ప్రేమించడం నిజమైన ప్రేమ కాదా అని ప్రశ్న వస్తోందేమో.. కానీ తమ మీద తమకు బాధ్యత, ఇష్టం, ప్రేమ లేకుండా ఇతరుల మీద మాత్రమే దాన్ని చూపించినప్పుడు మనిషుల్లో ఖాళితనం ఏర్పడుతుంది. ఎదుటి మనిషి దూరం వెళ్లిపోయినప్పుడు ఆ ఒంటరితనం అంతా నరకంలా అనిపిస్తుంది. అదే తమను తాము ప్రేమించుకుంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా తమను తాము ప్రేమించుకోవడానికి ఒంటరితనమే మంచి మార్గం.


ఒంటరితం సమస్య కానే కాదు. తమకోసం తాము హాయిగా సమయాన్ని విచ్చించుకునే ఒక మంచి అవకాశం అది. పైకి బంధాలు బాగా కనిపిస్తాయి ప్రపంచం వ్యాప్తంగా.. కానీ ఒంటరిగా ఉన్నవారి శాతం ఎక్కువగానే ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ వంటి దేశాల్లో సింగిల్ పర్సెంటేజ్ జనాభాలో సగం ఉన్నట్టు సర్వేలు వెల్లడించాయి. 


ఈరోజు ప్రత్యేకత..


ఒంటరితనం మానసికంగా మనిషిని బలపరిచినా.. అది మరో విదంగా మనిషిని నిరాశకు కూడా లోను చేస్తుంది. అలాంటివారికి ధైర్యం చెప్పడం, జీవితం మీద ఆశ కల్పించడం, అందమైన భవిష్యత్తును చూపించి వారిని ముందుకు నడిపించడం ఈరోజు ప్రత్యేకతలో భాగం. కనీసం ఎప్పుడూ వారితో ఉండకపోయినా మాటలతో ఉత్తేజపరచడం చేయొచ్చు. ఒకరిని ఒకరు కలుసుకుని బహుమతులు ఇచ్చుకోవడం, ధైర్యం చెప్పుకోవడం, వినూత్నంగా సమయాన్ని గడపడం చేయొచ్చు.


ఏది ఏమైనా.. ఈ సింగిల్స్ డే సింగిల్ గా ఉండేవాళ్లకు  సపోర్ట్ గా నిలుస్తుంది.


                                    ◆నిశ్శబ్ద.