ఆలోచనా దినోత్సవం ఆడబిడ్డల అస్త్రం!
posted on Feb 22, 2023 @ 9:30AM
అప్పుడెప్పుడో అభిషేక్ బచ్చన్ ఐడియా సిమ్ యాడ్ లో one idea can change your life అని చెప్పాడు. ఆ సిమ్ యాడ్ గురించి ఏమో కానీ.. ఒక్క ఆలోచన అయితే జీవితాన్ని మారుస్తుందని దృఢంగా చెప్పవచ్చు. ఒక్క ఆలోచనతో, ఒక్క నిర్ణయంతో తమ జీవితాలలో గొప్ప మార్పులు సాధించుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆలోచనల పరంపర ఎందుకంటే.. అన్నిటికీ ఓ దినోత్సవాన్ని పెట్టేసిన ప్రపంచ అభివృద్ధికి పాటు పడినవారు ఈ ఆలోచనలకు కూడా ఒక రోజును కేటాయించారు. అది కూడా ఊరికే ఆలోచించడం కాదు. బాలికలు, మహిళలు వారి సమస్యల గురించి ఆలోచించడం, పరిష్కార దిశగా ప్రపంచాన్ని నడిపించడం ఇందులో ముఖ్య ఉద్దేశ్యం.
అసలు ఏమిటి ఈ ఆలోచనా దినోత్సవ ముఖ్య ఉద్దేశం:-
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 150కి పైగా దేశాల్లోని 10 మిలియన్ల బాలికలు నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మహిళలు అందరూ తమ మధ్య ఒకానొక సోదరీబంధం, స్నేహ బంధంతో మహిళా సాధికారతకు అడుగులు వేయడం జరుగుతుంది. ఇదే అంశాన్ని ఈ ఆలోచనా దినోత్సవం గుర్తించి మహిళా సాధికారతను మనఃపూర్వకంగా గౌరవిస్తుంది. ప్రపంచ ఆలోచనా దినోత్సవం మహిళాల గౌరవాన్ని నొక్కి చెప్పే ముఖ్యమైన దినం.
ప్రపంచ ఆలోచనా దినోత్సవం ప్రాముఖ్యత:-
ప్రపంచ ఆలోచనా దినోత్సవం రోజు మహిళలు బాలికలకు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి, వారికి సంబంధించిన అంశాలను చర్చించడానికి వాటికి ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించడానికి ఒక పెద్ద వేదికగా మారుతుంది.
దీని చరిత్ర ఏంటంటే..
ప్రపంచ ఆలోచనా దినోత్సవం ఆవశ్యకతను 1926లో నాల్గవ మహిళా స్కౌట్ అంతర్జాతీయ సదస్సులో ప్రస్తావించారు. ఫిబ్రవరి 22ని థింకింగ్ డేగా అంకితం చేసేందుకు సదస్సు అంగీకరించింది. బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికాను స్థాపించిన లార్డ్ బాడెన్-పావెల్. ఈయన భార్య ఈ సంస్థ యొక్క మొదటి గ్లోబల్ హెడ్ గైడ్. వీరిద్దరూ ఫిబ్రవరి 22న జన్మించారు.
ఆరు సంవత్సరాల తరువాత, 1932లో పోలాండ్‌లోని బుజ్‌లో జరిగిన 7వ ప్రపంచ సదస్సులో వారి పుట్టిన రోజు సందర్భంగా బహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు. దీనివల్ల బాలికల ఆలోచనా దినోత్సవానికి అదొక గొప్ప విరాళం లాగా మారింది. ఈవిధంగా థింకింగ్ డే కు రూపకల్పన జరిగింది.
ఈ ఏడాది ఆలోచనా అంశం ఏమిటంటే..
'మన ప్రపంచం, మన శాంతియుత భవిష్యత్తు' అనే నినాదం ఈ సంవత్సరం ఆలోచనా దినోత్సవ అంశం. ఈ వ్యవస్థ నుండి మనం ఏమి అర్థం చేసుకోగలమో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలకు మరింత సురక్షితమైన మరియు ప్రశాంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రకృతితో మనం ఎలా సహకరించవచ్చో ఇది విశ్లేషిస్తుంది.
ఆలోచన అనేది రేపటిని మరింత ఆశాజనకంగా ఉండేలా చేస్తుంది కాబట్టి ఆలోచన మీ ఆయుధం కావాలి.
◆నిశ్శబ్ద.