Read more!

ముత్యమంత పంటికి ముచ్చటైన సేవకులు!

ఎదుటి వారిని మనవైపు తొందరగా ఆకర్షించాలంటే మన మాటతీతుతో పాటు మంచి చిరునవ్వు కూడా ముఖ్యం. అంతర్గత అందం మనసుతో వచ్చేది అయినప్పుడు అది కేవలం ప్రవర్తనలో, ఇతరులతో కలిసి చేసే పనులను బట్టి ఇతరులకు అర్థమవుతుంది. కానీ కొన్ని బహిర్గతమయ్యే విషయాలు కూడా మనుషులలో ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అలాంటి వాటిలో ఒకటి తీరైన పలువరుస. తెల్లగా మెరిసిపోయే దంతాలు, దానిమ్మ పలువరుస కలిగిన దంతాలు ఎంతో గొప్ప ఆకర్షణను తెచ్చిపెడతాయి. అయితే దురదృష్ట వశాత్తు నేటి కాలంలో చాలామంది దంత సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముప్పయ్యేళ్లు నిండకనే గట్టి పదార్థాలు తినాలంటే సంకోచించే స్థితిలో ఉన్నారు. అయితే వీరందరికీ ఉత్తమ పరిష్కారాలు ఇచ్చి దంత సంరక్షణకు దారి చూపేవారు దంత వైద్యులు. సాధారణ డాక్టర్లతో పోలిస్తే దంత వైద్యులు కాస్త తక్కువ గుర్తింపు పొందారని చెప్పవచ్చు. 

ఇప్పటి కాలంలో ఎంతోమంది దంత సంబంధ సమస్యలతో బాధపడినా దంత వైద్యులను సంప్రదించేవారు తక్కువే.. సమస్య మరీ తీవ్రమైతే తప్ప దంతవైద్యుల దగ్గరకు వెళ్లరు చాలామంది. కానీ ప్రతి సంవత్సరం మార్చి 6 వ తేదీన జాతీయ దంతవైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. దంతాలు చిగుర్ల సమస్యలు, పుచ్చిన పళ్ళు, పంటి నొప్పి, పంటి మీద గారా, చిగుర్ల వాపు, చిగుర్లు రక్తం కారడం, బలహీనంగా ఉండటం. చల్లని, వేడి పదార్థాలు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉండటం. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఓడిన పళ్ళ స్థానంలో కొత్త పళ్ళు కట్టడం, పళ్ళ సెట్టు వంటివి అమర్చి ఎంతోమందికి తిరిగి తమకు తాము ఆహార పదార్థాలు నమిలి తినేలా దోహదం చేస్తారు.

ఇంకా చెప్పాలంటే.. దంత ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యానికి మూలంగా ఉంటుంది. శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే అది పళ్ళమీద, గొర్ల మీద, చర్మ, జుట్టు వంటి బాహ్య మూలకల మీద సులువుగా గుర్తించవచ్చు.  ఇంత ప్రాముఖ్యత కలిగిన దంతాలకు డెంటిస్ట్ ల తోడ్పాటు ఎంతో అవసరం. ఈ డెంటిస్ట్ డే సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే.

క్రీ.పూ 5000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు ఉండేవారు. వీరు దంతాలలో పురుగుల వల్ల దంత క్షయం, కావిటీస్ వస్తాయని నమ్మేవారు. 

2600 bc లో పురాతన ఈజిప్టుకు చెందిన హెసీ-రా తొలి దంత వైద్యులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు.

1530లో ఆర్ట్జ్నీ బుచ్లీన్ దంత ఆరోగ్యంపై మొదటి పుస్తకం రాసారు. అందులో  అన్ని రకాల వ్యాధులు మరియు దంతాల బలహీనతలకు సంబంధించిన విషయాలుంటాయి. దీన్ని "లిటిల్ మెడిసినల్ బుక్" అంటారు.

1990 నుండి దంతవైద్యం పెరుగుతూ వచ్చింది. దంతాలకు సంబంధించిన సేవలు పలు చోట్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 

దంత సంరక్షణకు ఏమి చెయ్యాలి??

దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా నిపుణులైన దంతవైద్యులు ప్రతి ఒక్కరూ పాటించదగిన దంత సంరక్షణ జాగ్రత్తలు, పాటించాల్సిన జాగ్రత్తలు తెలిపారు.

దంత సంరక్షణకు మొదటి మార్గం శుభ్రంగా పళ్ళు తోముకోవడం. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం వల్ల దంత శుభ్రతను మైంటైన్ చేయవచ్చు.

ప్రతి 6నెలలకు ఒకసారి దంతవైద్యుడ్ని సంప్రదించి పళ్ళ స్థితిగతులు, వాటి బల, బలహీనతలు వెతికి తీసుకోవలసిన జాగ్రత్తలు అడిగి తెలుసుకోవాలి.

మీకు దంత సమస్య ఏమైనా ఉండి, వైద్యుల ద్వెస్రా అవి పరిష్కరమయి ఉంటే.. మరచిపోకుండా ఆ వైద్యులకు కృతజ్ఞతలు తెలపండి. 

దంతాలు బాగుంటే..

దంతాలు బాగుంటే మనిషిలో చెప్పలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. కల్గేట్ యాడ్ లో ఆరోగ్యవంతమైన దంతాలు మొత్తం శరీరానికి ఆత్మవిశ్వాసాన్ని,  ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు దంతాలు బాగుంటే ఎలాంటి చింతా ఉండదు. అయితే ఈ దంత సంరక్షణ కులం పళ్ళు బాగా తొముకోవాలి. 

ఇతరుల ముందు నవ్వడానికి, మాట్లాడటానికి తడబడేవారు, ఇబ్బందిగా ఫీలయ్యే వారు  దంతవైద్యుని సహకారంతో వారి పరిస్థితిని అధిగమించగలుగుతారు. దంతాలకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిది. దంత వైద్యుడి సలహాలు పాటించడం మరీ మంచిది. ఇలా దంత సంరక్షణ నుండి, దంతాల ప్రాధాన్యత వరకు అన్నీ తెలుసుకుని పాటించాలి.

                                 ◆నిశ్శబ్ద.