మనసుకు ఏకాగ్రత ఎందుకు ముఖ్యమంటే..!

మనిషి మనస్సు అనేక రకాల శక్తుల కోశాగారం. సాధారణంగా మన మనస్సుకుండే అపారమైన శక్తిని మనం అంచనా వెయ్యలేం. ఎందుకంటే మామూలుగా మనస్సు చంచలమైనది. నిలకడ లేనిది. మన మనస్సు ఏకాగ్రమైనప్పుడు దానికున్న శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. విజ్ఞాన రంగంలోని ప్రతీ పరిశోధనా మనస్సును ఏకాగ్రపరిచి చేసిన కృషికి ఫలితమే! అందుకే జీవితంలో ఏ రంగంలోనైనా సాఫల్యం పొందాలంటే ముందుగా మనస్సును ఏకాగ్రం చేయాలి. మనం మనస్సును ఏకాగ్రపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రారంభంలో ఇంకా చంచలమైపోయినట్లు కనిపిస్తుంది. దానితో భయపడిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాం. అయితే మనస్సు స్వభావమే అది. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు మనస్సు యొక్క అసలైన స్వరూపం అవగతమవుతుంది. మన ఆలోచనల నిరంతర ప్రవాహమే మనస్సు.  పై నుంచి కిందకు ప్రవహిస్తున్న నీటి ధారను ఊహించండి. పై నుంచి చూస్తే దాని వేగం గురించి మనకు తెలియదు. కానీ ఆ ధారను మనం దేనితోనైనా ఆపడానికి ప్రయత్నిస్తే దాని వేగం గురించి మనకు తెలుస్తుంది. కట్టలు తెగిపోయినప్పుడు తెలుస్తుంది ఆ నీటి ప్రవాహానికి ఎంత తీవ్రత ఉందో.  అలాగే మన మనస్సును  ఏకాగ్రం చేసుకోవడం కూడా. ఈ ప్రయత్నంలో మనస్సు మొదట ఇంకాస్త విచలితమవుతుంది. ఆ సమయంలో "ఇంతకు మునుపు మనస్సు ఇంత చంచలంగా లేదు" అనుకుంటాం. ఒక సరోవరంలోని నీరు నిర్మలంగా, స్వచ్ఛంగా కనిపిస్తుంది. అయితే దాని అడుగున అంతా బురద ఉంటుంది. ఒక చిన్న రాయి నీటిలోకి విసిరితే చాలు, నీరు నెమ్మదిగా బురద రంగులోకి మారుతుంది. మనం ఆ సరోవరంలోని బురదను పైకి తీసి సరోవరాన్ని శుభ్రం చేద్దామనుకుంటే  బురద తీస్తున్న కొద్దీ ఆ నీరు బురద రంగులోకి మారుతుంది. అప్పుడు ఇంతకు ముందే నీరు బాగుండేది, సరస్సులో నీరు ఇంత బురదగా ఉండేది కాదు అనిపిస్తుంది. బురద తీయడం మానేస్తే మళ్ళీ నీరు నిర్మలం అయిపోతుంది. బురద అడుగుకు చేరిపోతుంది. అయితే ఈ నిర్మలత్వం శాశ్వతం కాదు. మళ్ళీ చిన్న రాయి దానిలో వెయ్యగానే బురద మళ్ళీ పైకి వస్తుంది. నీరు కుళ్ళు అయినా ఫరవాలేదనుకొని, అడుగున ఉన్న బురద అంతా తీసేస్తే ఒక రోజు అందులో ఉన్న బురద అంతా పోతుంది. అప్పుడు నీరు శాశ్వతంగా శుభ్రమవుతుంది. అడుగున బురద లేదు కనుక, అప్పుడు అందులో రాయి కాదు కదా, ఏనుగు దిగినా కూడా నీళ్ళు స్వచ్ఛంగానే ఉంటాయి. మన మనస్సు కూడా ఒక సరస్సు లాంటిదే. దాని అడుగు జన్మ జన్మల చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. పై నుంచి నిర్మలంగా ఉన్నట్లుంటుంది. కానీ ఒక చిన్న సంఘటన, చిన్న ఆలోచన, లేక చిన్న మాట, మన మనస్సులో ఉన్న కుళ్ళును బయట పెడుతుంది. జపధ్యానాల లాంటి సాధనలతో మనస్సులో పేరుకున్న కుళ్ళును పోగొడదామని ప్రయత్నించి నప్పుడు సరోవరంలో నీటి లాగే మనస్సు చాలా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో మన మనస్సులో విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే దానికి భయపడి మన ప్రయత్నం మానకూడదు. మనం సరి అయిన మార్గంలో వెళుతున్నామనే నమ్మకంతో ఉండాలి. సరోవరం లాంటి మనస్సు శుభ్రపడుతున్నదనుకోవాలి. మన ప్రయత్నం మానకుండా ఇంకా తీవ్రంగా కృషి చెయ్యాలి. అలా క్రమక్రమంగా మన మనస్సు మునుపటి కన్నా చాలా బాగా అయింది అని మనకే తెలుస్తుంది. అప్పుడు అలాంటి నిర్మలమైన మనస్సును సులువుగా ఏకాగ్రం చేసుకోగలం. ఎక్స్రేలు ఏ విధంగా ధాతు పొరల్ని ఛేదించి వెళ్ళగలవో అలాగే ఏకాగ్రత గల మనస్సు ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఛేదించగలదు. ఏకాగ్రచిత్తం గల వ్యక్తి ఏ విషయం గురించి ఆలోచించినా తక్షణమే దాని సమాధానం కూడా కనుక్కోగలడు. అలా ఏకాగ్రమైన మనస్సు గల వ్యక్తి ఏ రంగంలో అయినా తన అస్తిత్వాన్ని నిరూపించుకోగలడు.                                     *నిశ్శబ్ద.  

 సత్యం పలకడం వల్ల వ్యక్తి కూడా గొప్పవాడు అవుతాడు.. ఇదే ఉదాహరణ!

నిజం మనిషిని గొప్పవాడని చేస్తుంది అంటారు. దానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణ. వెయ్యేళ్ళ కిందట జరిగిన ఘటన ఇది! ఆఫ్ఘనిస్తాన్లోని ఓ కుగ్రామం... పశువుల కాపరి అయిన ఓ కుర్రాడు గోధూళివేళ గోవుల్ని పల్లెకు తోలుకెళుతున్న సందర్భం... హఠాత్తుగా మందలోని గోవు మాటలు విని పించాయి. "పచ్చిక బయళ్ళలో పశువులను మేపుతూ ఏం చేస్తున్నావిక్కడ? భగవంతుడు నిన్ను సృష్టించింది ఇందుకు కాదు" అంది ఆవు. ఒక్కసారిగా ఆ బాలుడు భయంతో ఇంటికి పరుగెత్తి, ఏం చేయాలో తెలియక, ఇంటి పైకెక్కేశాడు. అప్పుడతడికి దూరంగా హజ్ యాత్ర ముగించుకొని అరాఫత్ పర్వతశ్రేణుల నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బృందం కనిపించింది. ఏదో స్ఫురించినట్లుగా ఆ బాలుడు, తల్లి వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు. "నేను పశువులు కాయను. బాగ్దాద్ వెళ్ళి చదువుకుంటాను" అని మనస్సులోని మాటను బయటపెట్టాడు. ఇది దైవాజ్ఞగా భావించిన ఆ మాతృమూర్తి బాలుణ్ణి బాగ్దాద్ పంపడానికి సిద్ధమైంది. నలభై బంగారు నాణాల్ని అతడి కోటు లోపల భద్రంగా కుట్టి పెట్టింది. కన్నకొడుకుకు కడసారి వీడ్కోలు చెబుతూ, "బాబూ! ఈ క్షణాన నీపై నాకున్న మమకారాన్ని ఆ భగవంతుడి కోసం నాలోనే అణుచుకుంటున్నాను. ఆ విధాత తుది తీర్పునిచ్చేదాకా తిరిగి మనం ఒకరినొకరం చూసుకోగలగడం అసాధ్యం. కానీ ఈ అమ్మ చెప్పే ఒక్కమాట మాత్రం ఎప్పుడూ మరచిపోవద్దు. ఎప్పుడూ నీలో సత్యమే స్ఫురించాలి, సత్యమే మాట్లాడాలి,  నీ జీవితం సంకటస్థితిలో పడినా సరే సత్యమనే మార్గంలోనే పయనించాలి" అని ఆ తల్లి చెప్పింది. అలా ఆ తల్లి ఆశీస్సులతో ఆ బాలుడు యాత్రికుల బృందంతో బాగ్దాద్ దారి పట్టాడు. ఆ బృందం కనుమల గుండా సాగిపోతుండగా, కొందరు దోపిడీ దొంగలు గుఱ్ఱాల మీద వారిని చుట్టు ముట్టి, కొల్లగొట్టడం మొదలుపెట్టారు. మొదట్లో దొంగలు ఆ బాలుడిపై దృష్టి పెట్టలేదు. చివరకు ఓ దొంగ 'ఏయ్! నీ దగ్గర డబ్బూ దస్కం ఉందా! అది కూడా ఇచ్చేయ్' అంటూ ఆ బాలుడిని బెదిరించాడు. ఆ బాలుడు ఎంతో నిబ్బరంగా 'మా అమ్మ నా కోటు లోపల కుట్టి పెట్టిన నలభై బంగారు నాణాలున్నాయి తీసుకోండి' అన్నాడు. ఆ బాలుడు తమతో పరిహాసం ఆడుతున్నాడనుకొని దొంగలు వెళ్ళిపోయారు. అప్పుడు మరొక దొంగ అటుగా వచ్చి, అదే విధంగా బాలుడిని ప్రశ్నించాడు. ఆ బాలుడు అతడికీ అదే సమాధానం చెప్పాడు. ఆ దొంగ కూడా ఆ బాలుడు చెప్పే మాటలు పట్టించు కోకుండా వెళ్ళి పోయాడు. చివరకు దొంగలంతా కలసి ఆ బాలుణ్ణి తమ ముఠానాయకుడి దగ్గరకు తీసుకెళ్ళి, "ఈ బాలుడు బిచ్చగాడిలా కనబడుతున్నాడు. కానీ, తన దగ్గర నలభై బంగారునాణాలున్నాయని చెప్పుకుంటున్నాడు" అంటూ ముందుకు తోశారు. ఆ ముఠానాయకుడు మరోసారి అదే ప్రశ్న వేశాడు.. కానీ ఆ బాలుడి సమాధానంలో మార్పు లేదు. అప్పుడు ఆ నాయకుడు ఆ పిల్లవాడి కోటును కత్తిరించి చూశాడు. బాలుడు చెప్పినట్లే నలభై బంగారు నాణాలు ఉన్నాయి. దాంతో, ఒక్కసారిగా ఆ దొంగల నాయకుడు, ఇతర దొంగలు నిశ్చేష్టులైపోయారు. అన్ని నాణాలు దగ్గర పెట్టుకొని, ఆ రహస్యాన్ని ఎందుకు చెప్పావని దొంగల నాయకుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆ బాలుడు ఎంతో నిర్మలంగా "ప్రాణం పోయినా సరే, నిజమే చెబుతానని మా అమ్మకు మాట ఇచ్చాను. కేవలం ఈ నలభై బంగారు నాణాల కోసం మా అమ్మకిచ్చిన మాట తప్పడం నాకిష్టం లేదు. అందుకనే నిజం చెప్పాను" అన్నాడు. ఆ మాటలు వింటూనే ఆ దొంగలు ఏడవడం మొదలుపెట్టారు. "నువ్వెంత మంచివాడివి! మీ అమ్మ ఎంత మహోన్నతురాలు! నువ్వు మీ అమ్మ మాటకు కట్టుబడ్డావు.  కానీ మేము మా తల్లితండ్రుల మాటల్ని ఉల్లంఘిస్తూ వస్తున్నాం. దుష్టులుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇంతవరకూ మేము సాగించిన అకృత్యాలకు పశ్చాత్తాప పడుతున్నాం. ఇక నుంచి నీవే మా నాయకుడివి" అంటూ ఆ బాలుడి పాదాలపై పడిపోయారు. సచ్ఛీలురిగా మారిపోయారు. కఠిన హృదయాలను కరిగించే సత్య సంధత తొణికిసలాడిన ఆ బాలుడు తదనంతర కాలంలో సాధువుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దాడు. అతడే  షేక్ అబ్దుల్ ఖాదర్ అల్ జిలానీ అనే మహనీయ సాధువు.                                              *నిశ్శబ్ద.

పొరపాటున కూడా ఈ ముగ్గురిని నమ్మకండి..ఎందుకంటే!

ఆచార్య చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, ప్రసిద్ధ పండితుడు. మౌర్య సామ్రాజ్యానికి సమకాలీనుడైన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆయన విధానాలు నేటికీ సంబంధించినవి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ వ్యక్తి అయినా నైతికతను అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో విజయం సాధించవచ్చు. నీతి శాస్త్రంలో ముగ్గురిని నమ్మవద్దని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. మీరు కూడా మీ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే, పొరపాటున కూడా ఈ ముగ్గురిని నమ్మకండి. ఈ వ్యక్తులను విశ్వసించడం జీవితంలో అన్ని సమయాలలో ద్రోహానికి దారితీస్తుంది. చెడు స్నేహం: ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్నేహం కూడా ఆలోచనాత్మకంగా చేయాలి. ముఖ్యంగా, చెడు సమయాల్లో సహాయం చేయని, క్లిష్ట పరిస్థితుల్లో సాకులు చెప్పే వ్యక్తికి దూరంగా ఉండాలి. దుఃఖంలో అబద్ధాలు చెప్పే స్నేహితుడిని పొరపాటున కూడా నమ్మకూడదు. ఇలాంటి స్నేహితుల వల్ల జీవితంలో ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు. ద్రోహి: ఆచార్య చాణక్యుడు చెపుతున్నాడు ద్రోహి... ఎప్పుడూ యజమాని మంచిని కోరుకోడు. అలాంటి వ్యక్తులు ద్రోహులు. ఎప్పుడూ తమ సంక్షేమం గురించే ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ల యజమాని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాంటివారిని అస్సలు నమ్మకూడదు అంటాడు చాణక్యుడు. సంస్కారం లేని భార్య: ఆచార్య చాణక్యుడు ఆజ్ఞలను పాటించే అమ్మాయిని వివాహం చేసుకుంటే , మరణానంతరం స్వర్గం వంటి సుఖం లభిస్తుందని చెప్పారు . అదే సమయంలో, విధేయత, సంస్కారవంతమైన భార్య దొరకకపోతే, ఆ వ్యక్తి జీవితం నరకంలా మారుతుంది. అలాంటి స్త్రీ తన భర్త లేదా కుటుంబ సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించదు. దుష్ట భార్యను పొరపాటున కూడా నమ్మకూడదు. చెడ్డ భార్యను నమ్మి పొరపాటు చేస్తే దాని పర్యవసానాలను ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కావున చెడు స్నేహం, ద్రోహులకు,దుష్ట భార్యలకు దూరంగా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నారు.

భజన చేసేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే..!

 దేవాలయాలలో కానీ, ఇళ్లలో కానీ, సత్సంగాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ దేవుళ్ల భజన చేస్తన్నప్పుడు, కీర్తనలు ఆలపిస్తున్నప్పుడు భక్తులు ఆనంద పారవశ్యం అవుతూ చప్పట్లు కొడుతుంటారు. అసలు ఇలా చప్పట్లు కొట్టే ఆచారం ఎప్పుడు ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే.. మతపర ప్రాముఖ్యత.. గ్రంధాల ప్రకారం చప్పట్లు కొడుతూ భజన లేదా కీర్తనలు చేయడం, హరినామాన్ని జపించడం వల్ల పాపాలు తొలగిపోతాయని అంటారు. చెట్టు కింద నిలబడి చప్పట్లు కొట్టగానే చెట్టు పైనున్న పక్షులన్నీ ఎలాగైతే ఎగిరిపోతాయో.. అదేవిధంగా  చప్పట్లు కొట్టడం, హరినామాన్ని జపించడం వల్ల  మనిషిలో ఉన్న భౌతిక విషయాల మీద వ్యామోహాలు ఎగిరిపోతాయట. సాధారణంగా గుడిలో గంట కొట్టి దేవుడికి తమ ఉనికిని తెలియజేయడం అని  ఒక నమ్మకం. అయితే అదే విధంగా చప్పట్లతో కూడిన భజన దేవుడి దృష్టి భక్తుల వైపు మళ్లేలా చేస్తుందని నమ్ముతారు. భజన, కీర్తన లేదా హారతి సమయంలో చప్పట్లు కొట్టడం ద్వారా భక్తులు తమ బాధలను చెప్పుకోవడానికి దేవుణ్ణి పిలుస్తారని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల భగవంతుని దృష్టి భక్తుల వైపు మళ్లుతుంది. భజన-కీర్తన లేదా ఆరతి సమయంలో చప్పట్లు కొట్టడం ప్రతికూలతను తొలగిస్తుంది.  మనస్సుకు శాంతిని కూడా ఇస్తుంది.  మనిషి స్పృహలో ఉండగలుగుతాడు. వ్యక్తి  దృష్టి భగవంతునిపై కేంద్రీకృతమై ఉంటుంది. పురాణాలు ఏం చెతున్నాయి.. పురాణాల ప్రకారం  హిరణ్యకశ్యపుని తనయుడు అయిన ప్రహ్లదుడు సంగీత వాయిద్యాలు వాయిస్తూ విష్ణునామ స్మరణ చేస్తన్నాడు.    ఇది హిరణ్యకశ్యపుడికి మింగుడు పడలేదు.  ప్రహ్లదుడిని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా  హరణ్యకశ్యపుడు నెగ్గలేదు. తను ఓడిపోయాననే  కోపంలో హిరణ్యకశ్యపుడు  ప్రహ్లదుని  వాయిద్య పరికరాలు అన్నీ ధ్వంసం చేసాడు. కానీ ప్రహ్లదుడు మాత్రం తన హారినామ స్మరణ మానలేదు. తన చేతులనే వాయిద్య పరికరాలుగా మార్చి చప్పట్లు కొడుతూ హరినామస్మరణ చేయడం మొదలు ప ెట్టాడు. ఇదే తాళం అనే లయను సృష్టించింది. అప్పటి నుండి భజనలలోనూ, కీర్తనలలోనూ తాళం వేయడం, తప్పట్లు కొట్టడం సంప్రదాయంగా మారిందని చెబుతున్నారు. శాస్త్రీయ కారణాలు.. మన అరచేతుల్లో చాలా ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. చప్పట్లు కొట్టేటప్పుడు అరచేతుల ఆక్యుప్రెషర్ పాయింట్లపై ఒత్తిడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది శరీరంలోని అనేక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.  కాబట్టి చప్పట్లు కొట్టడం ఒక అద్భుతమైన వ్యాయామం. ఇది శరీరంలో  నిష్క్రియాత్మకతను తొలగిస్తుంది.  శరీర  కార్యకలాపాలను పెంచుతుంది. రక్త ప్రసరణలో అడ్డంకులు తొలగిపోయి అవయవాలు సక్రమంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. రక్త శుద్ధి పెరిగి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు నయమవుతాయి. అందువల్ల, పూజ,  కీర్తన సమయంలో లయబద్ధంగా  శక్తితో చప్పట్లు కొట్టడం వల్ల  వ్యాధులను తరిమికొట్టడం కూడా సులువు. ఇది ఏకాగ్రతను,  ధ్యానం చేయడాన్ని కూడా  సులభతరం చేస్తుంది.                                     *నిశ్శబ్ద. 

ఈ నాలుగు కారణాల వల్ల పిల్లల్లో పుట్టుకతో లోపాలు వస్తాయి!

మహిళల జీవితంలో గర్భం అనేది అపురూపమయిన దశ. ఈ సమయంలో మహిళలు తమ ఆరోగ్యం పట్ల, తమ కడుపులో పెరుగుతున్న బిడ్డ  ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఏ చిన్న అజాగ్రత్త అయినా కడుపులో బిడ్డకు లోపాలు రావడానికి కారణం అవుతుంది.  పిల్లలలో ఈ పుట్టుకతో వచ్చే లోపాల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరిని జాతీయ జనన లోపాల నివారణ మాసంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పిల్లల్లో పుట్టుకతో వచ్చే రుగ్మతలు, దానికి సంబంధించిన కొన్ని పర్యావరణ కారకాల గురించి వివరంగా తెలుసుకుంటే.. అసలు పుట్టుకతో వచ్చే లోపాలు అంటే ఏంటి? కడుపులో పిల్లల పెరుగుదల లేదా అభివృద్ధిలో కొన్ని అసాధారణతలు నెలకొంటాయి. పుట్టుకతో వచ్చే లోపాలు దాదాపు 6% గర్భాలలో సంభవిస్తాయి.  తరచుగా గర్భధారణ సమయంలో గుర్తించబడతాయి.  డెలివరీ తర్వాత మొదటి ఒకటి లేదా రెండు సంవత్సరాలలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలాంటి రుగ్మతలతో ప్రతి సంవత్సరం 8 మిలియన్ల పిల్లలు పుడుతున్నారు. పిల్లలలో పుట్టుకతో వచ్చే అనేక రకాల లోపాలు ఉన్నాయి, వీటిలో పుట్టుకతో వచ్చే గుండె లోపాలు చాలా సాధారణమైనవి.  గుండెలో రంధ్రం లేదా గుండె నిర్మాణంలో లోపం.  పెదవి చీలిక,  అంగిలి చీలిక మొదలైనవి ఉంటాయి. ఇది కాకుండా డౌన్ సిండ్రోమ్ లేదా పిల్లల ఎముకల పెరుగుదలలో  లోపం. డౌన్ సిండ్రోమ్ కారణంగా తక్కువ ఎత్తు మొదలైన కొన్ని జన్యుపరమైన పరిస్థితులు సాధారణ పుట్టుకతో వచ్చే లోపాలుగా గమనించవచ్చు. సుమారు 30% గర్భాలలో ఈ పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం తెలుసు.   70% గర్భాలలో పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం స్పష్టంగా తెలియదని  వైద్యులు చెబుతున్నారు.  ఈ లోపాలకు ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. జన్యు లోపం.. జన్యుపరమైన లోపం అంటే తల్లిదండ్రుల క్రోమోజోమ్‌లలో లోపం లేదా  ఏర్పడిన పిండంలోని క్రోమోజోమ్‌లలో ఏదైనా లోపం. ఇది డౌన్ సిండ్రోమ్ , అడ్వర్స్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్‌కు కారణమవుతుంది, ఇది గర్భధారణ సమయంలో గుర్తించబడుతుంది. ఔషదాల దుష్ప్రభావం..  మహిళలు గర్భధారణ సమయంలో ఏదైనా ట్రీట్మెంట్ లో భాగంగా  మందులు తీసుకుంటుంటే, ఆ ఔషధం  దుష్ప్రభావాలు కూడా పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తాయి. గర్భధారణ సమస్యలు.. గర్భిణీ స్త్రీకి అధిక జ్వరం,  ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా శిశువు గర్భాశయంలో ద్రవం లేకపోవడం వంటి గర్భధారణ సమస్యలు కూడా పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తాయి. పర్యావరణ కారకాలు.. మద్యం, ధూమపానం, ఏదైనా రసాయనం లేదా కాలుష్యానికి గురికావడం వంటి పర్యావరణ కారకాలు కొన్నిసార్లు పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తాయి.                                                  *నిశ్శబ్ద.

మనిషికి డబ్బుకి మధ్య జరుగుతున్నది ఇదే!

మానవజీవితానికి డబ్బు కూడా ఓ అవసరం అయిపోయింది ఈ కాలంలో. డబ్బు లేకపోతే ఎన్నో అవసరాలు దూరంగానే ఆగిపోతాయి. అందుకే మనుషులు డబ్బు సంపాదన పట్ల ఆసక్తిగా ఉంటారు. అయితే కొందరు మంచి మార్గంలోనూ, మరికొందరు చెడు మార్గంలోనూ సంపాదిస్తారు. కొందరు అవసరమైనంత మాత్రమే సంపాదించుకుంటు ఉంటారు. కానీ ఎక్కువ భాగం మంది అవసరానికి మించి డబ్బు సంపాదనే పరమావధిగా భావించి అదే మార్గంలో వెళుతుంటారు. ఓసారి కొందరు సాధువులు తీర్థయాత్రలకు బయలుదేరారు. వారందరి దగ్గరా కంబళ్ళున్నాయి. ఒక సాధువు దగ్గర మాత్రం కంబళి లేదు. ఇంతలో పొంగి ప్రవహిస్తున్న నది వారి దారికి అడ్డం వచ్చింది. నది దాటే ఆలోచన చేస్తూండగా, నదిలో కొట్టుకుపోతున్న కంబళి ఒకటి సాధువు కంటపడింది. అంతే, ఎవరెంత వారించినా వినకుండా ఆ సాధువు నదిలో దూకాడు, ఆ ప్రవాహంలో కష్టపడి ఆ కంబళిని పట్టుకున్నాడు. కానీ నీటిలో కొట్టుకుపోతున్నాడు. మిగిలినవారు అతడిని పిలిచారు. కంబళిని వదిలి ఒడ్డుకి వచ్చేయమన్నారు. కానీ ఆ సాధువు వదలినా కంబళి అతడిని వదలటం లేదు. ఎందుకంటే, అది కంబళి కాదు, ఎలుగుబంటి. ప్రస్తుతం సమాజం మొత్తం కంబళి అనుకుని ఎలుగు బారిన పడుతోంది. ఉన్నదాంతో సంతృప్తి లేక సుళ్ళు తిరిగే ప్రవాహంలో పడి, కంబళి అనుకొని భల్లూకపు పట్టుకు చిక్కుతుంది. మనమంతా ఈ భ్రమ ప్రలోభంలో పడి ఉన్నవారమే. ప్రస్తుతం, డబ్బు సంపాదన కంబళిలా మనపై భల్లూకపు పట్టు బిగించింది. ఇది ఒక తరం నుంచి మరో తరానికి మరింతగా బిగుస్తూవస్తోంది. ఈ పట్టులో పెరిగి పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. తల్లిదండ్రులవుతున్నారు. ఇదే పట్టును తమ సంతానానికి అందజేస్తున్నారు. వారు పెరిగి పెద్దవారై తమ సంతానానికి వారసత్వంగా ఈ భల్లూకపు పట్టును అందిస్తున్నారు. అనగనగా ఓ వ్యక్తి. అతనికి ఎదురుగా చేయి చాస్తే అందేంత దూరంలో రంగుల డబ్బు వల కనిపించింది. చేయి సాచి అందుకోబోయాడు. అది కాస్త ముందుకు జరిగింది. దాన్ని అందుకోవాలని దాని వెంట పరుగెత్తాడు. అదీ అంతే వేగంగా ముందుకు జరిగింది. అతను మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా దాని కోసం పరిగెడుతూనే ఉన్నాడు. అలా జీవితమంతా అందని డబ్బు వల వెంట పరుగెడుతూ గడిపాడు. చివరికి విసుగొచ్చి ఒకచోట ఆగిపోయాడు. అప్పుడే వెనక్కి తిరిగి చూశాడు. డబ్బుల వల ఎలాగూ అందలేదు, కానీ వెనుతిరిగి చూస్తే కనిపించింది చేజారిపోయిన జీవితం. అంటే, ఎంతకూ అందని, అందినా సంతృప్తినివ్వని 'డబ్బు' వెంట పడటం వల్ల మనం అమూల్యమైనది, కరిగిపోతే తిరిగి రానిది అయిన జీవితాన్ని విస్మరిస్తున్నామన్నమాట.  అయితే విచిత్రంగా వ్యక్తికి ఈ గ్రహింపు వచ్చేసరికి జీవితం చేజారిపోయి ఉంటుంది. తాను గ్రహించిన ఈ సత్యం తన సంతానానికి వివరించాలనుకుంటే, వినే ఓపిక వారికి ఉండదు. ఎందుకంటే, వారూ ఈ రంగుల వలలో చిక్కుకున్నవారే! ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో, వాణిజ్యం అగ్రతాంబూలం అందుకుంటున్న సమాజంలో ప్రతి మనిషీ ఒక డబ్బు మూటగా భావింపబడుతున్నాడు. ప్రతీ వ్యక్తి ప్రపంచపు బజారులో ఒక శాల్తీ గా మాత్రమే పరిగణింపబడుతున్నాడు. తెలిసో తెలియకో, మన ప్రమేయం లేకుండా మనమంతా ఈ విపణిలో శాల్తీలమౌతున్నాం. మన తరువాత తరాలనూ శాల్తీలుగానే పెంచుతున్నాం. ఇదీ నేటిసమాజంలో మనిషి నిర్వాకం.                                         ◆నిశ్శబ్ద.

ఎన్ని అవమానాలు ఎదురైనా..ఈ పనులు పూర్తి చేయండి..విజయం మిమ్మల్ని వరిస్తుంది..!

మన జీవితంలో విజయం సాధించాలనే ఆశయం ఉంటే... కొన్ని విషయాల పట్ల మనం సిగ్గుపడకూడదు. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం.ఎన్ని అవమానాలు ఎదురైనా..తట్టుకుని ముందుకు సాగుతే  విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన చెప్పిన అక్షర సత్యాలు,  విధానాలు నేటికీ ఆచరణీయంగా ఉన్నాయి. చాణక్య నీతిపై ఆచార్య చాణక్యుడి అనుభవం, ఆలోచనలు జీవితానికి ఒక పాఠం వంటిది. జీవితంలో విజయం సాధించడానికి చాణక్య నీతి మనకు సహాయం చేస్తుంది. వాటిని పాటిస్తే జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తామని చెప్పవచ్చు.చాణక్యుడి ప్రకారం మనం కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. - మనం ఆహారం విషయంలో ఏ కారణం చేతనూ సిగ్గుపడకూడదు. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు తినడానికి ముందు వెనుకకు చూడకూడదు. ఇది మీ కడుపు నింపదు. - డబ్బు సంపాదనతోనే మనం బ్రతకగలం. కాబట్టి మనం న్యాయంగా డబ్బు సంపాదించడానికి ఏ కారణం చేతనైనా వెనుకాడకూడదు. సిగ్గుపడితే కష్టాల పాలవుతాం. - కొన్నిసార్లు ఇతరులకు డబ్బు అప్పుగా ఇస్తాం. ఇచ్చిన అప్పును అడిగేందుకు నామూషిగా ఫీల్ అవుతుంటాం.  అయితే సిగ్గుతో డబ్బు అడగకూడదని చాణక్యుడు చెప్పాడు. -పాఠం నేర్చుకోవడానికి, అంటే విద్యను పొందడానికి మనం ఎప్పుడూ సిగ్గుపడకూడదు. మనం ఎంత నేర్చుకున్నా పూర్తి కాలేదని ఎప్పుడూ రాయకూడదు.  

రోగనిరోధక శక్తిని పెంచే ఈ నాలుగు పదార్థాలను ఫ్రిజ్ లో అస్సలు ఉంచకూడదు..!

ఆరోగ్యానికి ఆహార పదార్థాలే మూలం. శరీరానికి శక్తిని ఇచ్చేవి, రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని  దృఢంగా  ఉంచేవి ఆహారాలే.  ప్రతి ఇంటి వంటిట్లో ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడే కొన్ని పదార్థాలు ఉంటాయి. వైద్య పరంగా కూడా ఇవి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వీటిని ఎక్కువ ఉపయోగిస్తుంటారు. వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ ఆరోగ్యానికి అంత గొప్ప ప్రయోజనాలు చేకూర్చే ఆ పదార్థాలేంటో.. వాటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కలిగే  నష్టం ఏంటో పూర్తీగా తెలుసుకుంటే.. అల్లం.. అల్లం గొప్ప ఔషద గుణాలు కలిగి ఉంటుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో వికారం వంటి సమస్యలు ఏవి వచ్చినా అల్లాన్ని తీసుకోమని చెబుతుంటారు. చాలా ఇళ్లలో అల్లాన్ని పెద్ద మొత్తం తెచ్చుకుని ఫ్రిజ్ లో ఉంచి వారాల కొద్దీ ఉపయోగిస్తుంటారు. అయితే అల్లాన్ని ఇలా ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదట. అల్లాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దాని మీద అచ్చు పెరుగుతుంది.  సరిగ్గా గమనిస్తే ఇది అల్లం పొట్టు తీసినప్పుడు పై భాగం డార్క్ కలర్ లోనూ లోపల అల్లం సాధారణ రంగులోనూ ఉంటుంది. దీన్ని విషపూరితమైన పదార్థంగా భావిస్తారు. ఇది మూత్రపిండాలు, కాలేయం వైఫల్యం కావడానికి కారణం అవుతుంది. కాబట్టి అల్లాన్ని ఫ్రిజ్ లో ఉంచకపోవడం మంచిది. దీన్ని గదిలో సాధారణ ఉష్టోగ్రత వద్ద ఉంచాలి. అన్నం.. అన్నం మిగిలిపోతే కొందరు ఫ్రిజ్ లో పెడుతుంటారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి రైస్ ఆధారిత ఆహారాలు మిగిలిపోతే పడేయలేక ఫ్రిజ్ లో ఉంచుకుని తింటుంటారు. కానీ అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచితే అది విషపూరితమైన పొరను ఏర్పరచుకుంటుంది. ఇది ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా అన్నం ఆధారిత ఆహారాలు ఏవైనా వండిన తరువాత 24 గంటల కంటే ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచకూడదు. వెల్లుల్లి.. రోగనిరోధక శక్తిని పెంచే ఔషదంగా వెల్లుల్లిని పరిగణిస్తారు. అల్లంతో పాటు వెల్లుల్లిని ఉపయోగించడం చాలా కామన్ అయిపోయింది. చాలామంది కూరల్లో అల్లం వెల్లుల్లి వినియోగం కోసం రెండింటిని కలిపి పేస్ట్ చేసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ పొట్టు తీయని వెల్లుల్లిని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకోవాలి. కూరల్లో వినియోగించే ముందు కాస్త సమయం పట్టినా అప్పటికప్పుడు పేస్ట్ చేసుకుని వాడటం మంచిది. వెల్లుల్లిని ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయాలి. ఉల్లిపాయలు.. ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టేవాళ్లు అయితే ఉండరు. కానీ కొన్నిసార్లు కొందరు తెలిసో తెలియకో పెట్టేస్తుంటారు. ఉల్లిపాయలను తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఫ్రిజ్ లో ఉల్లిపాయలను ఉంచితే వాటిలో ఉన్న పిండి పదార్థాలు చక్కెరలుగా మారతాయి. పైపెచ్చు చాలా సులువుగా బూజు పడతాయి.  సగం తరిగిన ఉల్లిపాయలను, ఉల్లి ముక్కలను ఫ్రిజ్ లో ఉంచేవారు ఈ అలవాటు మానుకోవాలి.  అంతేకాదు.. ఉల్లిపాయలను సాధారణ ఉష్ణోగ్రత వద్ద అయినా సరే.. కవర్లలోనూ, బ్యాగులలోనూ, బంగాళాదుంపలతో కలిపి ఉంచకూడదు.                                     *నిశ్శబ్ద. 

పోరాటం ఎంత పెద్దదైతే.. విజయం అంత పెద్దగా ఉంటుందని చెప్పిన ధీరోదాత్తుడు..!

స్వామి వివేకానంద  జనవరి 12వ తేదీన జన్మించారు. ప్రతి సంవత్సరం వివేకానందుని  జయంతినే జాతీయ యువజన దినోత్సవంగా కూడా  జరుపుకుంటారు. భారతదేశాన్ని, భారతదేశంలో ఆధ్యాత్మికతను, హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ధీరోదాత్తుడు ఆయన. భారతదేశ యువతను ఉత్తేజపరితే ఉవ్వెత్తు తరంగం ఆయన ఉపన్యాసాలు. ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ యువతకు వివేకానందుని వాక్యాలు, ఆయన జీవితం గొప్ప స్పూర్తిగా నిలుస్తోంది.  స్వామి వివేకానంద  1863 జనవరి 12న కోల్‌కతాలో జన్మించారు. ఈయన తండ్రి కలకత్తా హైకోర్టులో న్యాయవాది. ఈయన తల్లి మతపరమైన అభిప్రాయాలు కలిగిన మహిళ. వివేకానందుని  చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్. నరేంద్రనాథ్ చాలా చిన్న వయస్సులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించారు.  ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించిన తరువాత,  స్వామి వివేకానంద అని పిలువబడ్డాడు. స్వామి వివేకానంద యువతకు సరైన మార్గనిర్దేశం చేయడానికి ఎన్నో విజయ సూత్రాలను  అందించారు. భారతదేశ జనాభాలో దాదాపు 50 శాతం మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. దేశ భవిష్యత్తు వారి భుజాలపై ఉంది. ఈ విషయాన్ని తన కాలానికే గమనించి దేశ భవిష్యత్తు యువత భుజాలమీదే ఉందని, యువత కొత్త శక్తిలా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకే  ఇప్పటికీ  ఎంతోమంది యువత తమ జీవితంలో  ఆయన నుండి ప్రేరణ పొందుతూ ఉన్నారు.  చికాగోలో ప్రపంచ మతాల సభలో స్వామి వివేకానంద చేసిన ఉపన్యాసం యావత్ ప్రపంచం భారతదేశం వైపు దృష్టిసారించేలా చేసింది. స్వామి వివేకానంద 1897లో  రామకృష్ణ మిషన్ ను స్థాపించారు. కర్మ యోగం, గురు బోధన మొదలైనవి దీని ఆదర్శాలు.  1863లో జన్మించిన స్వామి వివేకానంద కేవలం 39 సంవత్సరాల వయసులో మరణించారు. ఈయన మరణం సంభవించినప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉన్నారు. ధ్యానం, ఆధ్యాత్మికతను ఈయన ఎంతగానో ప్రోత్సహించారు. స్వామి వివేకానంద దేశానికి రగిలించిన స్పూర్తి ఆయన దేశ గొప్పదానాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన తీరుకు  1984లో  భారత ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవమైన జనవరి 12ను యవజన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి.                                                *నిశ్శబ్ద. 

లోపముందని కుంగిపోతున్నరా? ఒక్కసారి ఇది చదవండి! 

మహాభారతంలో ఉన్న ఓ చిన్న పాత్ర అనూరుడు. పుట్టుకతోనే రెండు కాళ్ళూ లేనివాడు. అయితేనేం... ప్రత్యక్ష భగవానుడయిన, లోకానికి వెలుగులు విరజిమ్మే సూర్యుడికి రథసారథిగా ఎదిగినవాడు  అనూరుడు. అంగవైకల్యం బాహ్య శరీరానికే కానీ ఆత్మశక్తికి కాదని నిరూపించిన ధీశాలి అనూరుడు. ఆత్మస్థైర్యం ఉంటే, సంకల్పబలం ఉంటే, మనశ్శక్తిని నమ్ముకొంటే కన్ను, కాలు, చేయి... ఇలా ఏ అవయవం లేకపోయినా జీవితంలో అత్యున్నత స్థితిని చేరుకోవచ్చని చెప్పే కథే అనూరుడి వృత్తాంతం. మనందరం మనలో ఏదో ఒక లోపాన్ని చూసుకొని బాధపడుతూంటాం. ఉద్యోగం లేదని ఒకరు, పెళ్ళికాలేదని ఒకరు, సొంత ఇల్లు లేదని మరొకరు, పదో తరగతి తప్పామని ఇంకొకరు, జ్వరం వచ్చిందని వేరొకరు, డబ్బులు లేవని మరొకరు, అందం లేదని ఇంకొకరు... ఇలా ఏదో ఒక లోపం చూసుకొని కన్నీరవుతాం. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు... ఎవరి కష్టం వారికి మహా ప్రళయంలా, పెనుతుపానులా, యమగండంలా తోస్తుంది. అది సహజం కూడా! అయితే ఇవన్నీ మనం అనుకొంటున్నట్లు నిజంగా లోపాలేనా? ఉద్యోగం, డబ్బు, పదవి, అధికారం, హోదా… ఇవన్నీ నిజంగానే మనిషికి సంతోషాన్ని, విశ్వాసాన్ని ఇస్తాయా? పైపైన చూస్తే నిజమే అనిపిస్తుంది. లౌకిక ప్రపంచంలో భౌతికంగా సుఖంగా ఉండేందుకు ఇవన్నీ అవసరమైతే అవ్వొచ్చేమోగానీ నిజానికి మనిషిని నిలబెట్టేది, మనిషిని అడుగు ముందుకు వేయించేది, మున్ముందుకు నడిపించేది, పెనునిద్దుర వదిలించేది, సమస్య వచ్చినా కన్నీరు కార్చకుండా నిలబెట్టేది, కష్టం వచ్చినా కుంగిపోకుండా కాపాడేది, పాతాళంలోకి పడిపోయినా... తిరిగి పైకి ఎగబాకి... ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహింప చేసేది మాత్రం ఖచ్చితంగా ధనమో, ఉద్యోగమో, అధికారమో మాత్రం కాదు. మరి ఏమిటి? ఆత్మ విశ్వాసం,  మానసికబలం. సందేహంలేదు నిజానికి మనకు మనమే ఓ ఆయుధ భాండాగారం. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువ వుంది.. ఇంతకు మించిన సైన్యమేది? ఆశ మనకు అస్త్రం. శ్వాస మనకు శస్త్రం. ఇంతకన్న ఏం కావాలి? మనకు మనమే... మన శరీరమే మనకు... మన ప్రాణమే మనకు... మన అవయవాలే మనకు... ఆయుధాలు. విచిత్రం ఏమిటంటే... ఖడ్గానికి స్వయంగా యుద్ధంలో పాల్గొనడం తెలీదు. ఖడ్గచాలనం చేసే సైనికుడిదే, వీరుడిదే ఆ నైపుణ్యమంతా! కత్తి తిప్పడం తెలియకుంటే ఎంత గొప్ప ఖడ్గం అయినా శత్రువును ఓడించలేదు. అదే విధంగా మన శరీరం, మన అవయవాలు బాగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆత్మశక్తి లేనప్పుడు, మనపై మనకు విశ్వాసం లేనప్పుడు, సంకల్పబలం లేనప్పుడు, గుండెలోతుల్లో భయం ఉన్నప్పుడు... అవయవాలన్నీ కుదురుగా, అందంగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అంటే... అవయవ శక్తి కన్న బాహ్యబలం కన్న మించినది ఆత్మబలం, మనోబలం.                                           *నిశ్శబ్ద.

తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడితే ఏం జరుగుతుంది…ఈ తప్పులు చేయకండి..!

పిల్లలను పెంచడం అనేది ఒక కళ.  తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో పిల్లలను పెంచాల్సి ఉంటుంది.  తమ బిజీ బతుకుల్లో పడి పిల్లలను పట్టించుకోకపోతే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.  పిల్లలను పెంచే సమయంలో మీరు చాలా ఓపికతో ఉండాలి ఒక్కోసారి మనం చేసే తప్పులు వారి భవిష్యత్తును పాడుచేస్తాయి.  సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో  కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇవి వారిపై  చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి.  తల్లిదండ్రులు  పిల్లల విషయంలో  ఒక్కోసారి  తాము చాలా జాగ్రత్తగా ఉన్నామని భావించి  వారిపై ఒత్తిడి పెంచుతూ ఉంటారు ఇలాంటి పొరపాటున వల్ల పిల్లల మానసిక  ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.  తల్లిదండ్రులు చేసే కొన్ని పనులు పిల్లలను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి అలాంటి పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం బిడ్డను వేరొకరితో పోల్చడం: తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడం తరచుగా కనిపిస్తుంది. అయితే అలా చేయడం తప్పు. ఎవరైనా తప్పు చేస్తే, తల్లిదండ్రులు ఇతర పిల్లలతో పోల్చి, 'నువ్వు ఈ తప్పు చేశావు' అంటారు కానీ అన్నయ్య ఇలా చేయడు. పిల్లవాడిని ఏ విధంగానైనా పోల్చడం చెడ్డది. ఇది పిల్లల మానసిక స్థితిని పాడు చేస్తుంది. తప్పు చేసినప్పుడు తిట్టడం: పిల్లలు ఒక పని నేర్చుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, పిల్లలు చేసిన తప్పును వారికి వివరించాలి. పిల్లల చేసే తప్పులను  వాళ్లకు అర్థమయ్యేలా కాకుండా, తిడితే మాత్రం అది వారి విశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఏదైనా తప్పుకు పిల్లవాడిని బాధ్యులను చేస్తే, అది వారి మానసిక స్థితిని పాడు చేస్తుంది.  తల్లిదండ్రులు గొడవ పడటం: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో చిన్న పిల్లవాడు ఉంటే, తల్లిదండ్రులు గొడవ చేయడం చూసి అతని మానసిక స్థితి చెడిపోవచ్చు. తల్లిదండ్రుల మధ్య గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు పదే పదే తగాదాలు చూసినట్లయితే, అది అతని మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్నేహితుల ముందు ఎగతాళి చేయడం: చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలతో సరదాగా గడుపుతారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎగతాళి చేస్తుంటారు. అయితే, పొరపాటున కూడా వారి స్నేహితుల ముందు పిల్లవాడిని ఎగతాళి చేయకూడదు. ఇది పిల్లల మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇతర పిల్లల ముందు తన పిల్లల గురించి చెడుగా మాట్లాడకూడదు.

కష్టకాలంలో చాణక్యుడు చెప్పిన ఈ సూక్తిని గుర్తు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.!

చాణక్య నీతి ఒక వ్యక్తికి జీవితంలో తప్పొఒప్పుల  గురించి వివరిస్తుంది. చాణక్య నీతిని తెలుసుకున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ మోసపోడు. జీవితంలో ఎల్లప్పుడూ విజయ శిఖరాలను అధిరోహిస్తాడు.ఆచార్య చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని గొప్ప పండితుడు, గురువు. చాణక్యుడు నీతి పుస్తకాన్ని రాశాడు, దీనిని చాణక్య నీతి అని పిలుస్తారు. ఒక వ్యక్తి చాణక్యుడి సూత్రాలను పాటిస్తే, అతని జీవితంలో విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు. ఆ సూక్తులు ఏంటో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కష్ట సమయాల్లో గొప్ప సవాళ్లు, పరిమిత అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి చేసిన పొరపాటు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ బాధ్యత: చాణక్యుడు ప్రకారం, ప్రతి వ్యక్తి యొక్క మొదటి కర్తవ్యం సంక్షోభ సమయంలో తన కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం. తద్వారా కష్టాల నుంచి తేలికగా బయటపడవచ్చు. కాబట్టి, మీరు మీ కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఆరోగ్యం ఒక వ్యక్తి యొక్క గొప్ప ఆస్తి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అందువల్ల, మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. డబ్బు ఆదా చేసుకోండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం , ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సంక్షోభ సమయంలో డబ్బును ఆదా చేయాలి. అటువంటి సమయంలో ఒక వ్యక్తికి తగినంత డబ్బు ఉంటే, మీరు పెద్ద సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. ఆపద సమయంలో మనిషికి డబ్బు నిజమైన తోడు. డబ్బు లేకుంటే కష్టాల నుంచి బయటపడేందుకు కష్టపడాల్సి వస్తుంది.

భారతీయులకు స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవీ..!

భారతదేశ యువతకు ఆధ్యాత్మికతను, స్వాతంత్ర్య పోరాట పటిమను, దేశభక్తిని సమపాళ్లలో రగిలించిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన భారతదేశాన్ని, భారతీయులను గూర్చి ఇలా చెప్పారు.. వివేకి స్వాతంత్ర్యాన్ని కోరుతాడు. ఇంద్రియ సుఖాలన్నీ నిస్సారాలని అతడు గుర్తిస్తాడు. సుఖదుఃఖాలకు అంతు లేదని తెలుసుకొంటాడు. ఎందరో ధనికులు క్రొత్త క్రొత్త సుఖాలు కావాలని ఆత్రపడుతున్నారు? ఉన్న సుఖాలన్నీ పాతబడి పోయాయి. కాబట్టి వారికి క్రొత్తరకమైన సుఖాలు కావాలి. క్షణకాలం పాటు పొందే తృప్తి కోసం వారెన్నెన్ని పిచ్చి వస్తువులను కొనుగోలు చేస్తున్నారో? ఆ తృప్తి కలిగిన వెంటనే దానికి విపరీత ఫలం కూడా ఎలా కలుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు.   ప్రజలలో అధిక సంఖ్యలో  గొఱ్ఱెల మంద లాంటివారు ఉన్నారు. ముందుపోతున్న గొఱ్ఱె గోతిలో పడితే, వెనుక వస్తున్న గొఱ్ఱెల కూడా ఆ గోతిలోకే దూకుతాయి. అదేవిధంగా సంఘంలోని ఒక పెద్ద, ఏ పని చేస్తాడో ఆ పనినే తక్కిన వారంతా గుడ్డిగా చేస్తారు. తాము ఏం చేస్తున్నదీ వారు ఆలోచించరు. ప్రాపంచిక విషయాలు అసారాలని గుర్తించడం ప్రారంభించగానే, తాను మాయ చేతి ఆటబొమ్మగా గానీ, మాయాకర్షణలకు లోబడి గానీ ఉండకూడదన్న భావం మనిషికి కలుగుతుంది. దయతో నాలుగు మాటలు చెప్పగానే, మానవుడు నవ్వడం ప్రారంభిస్తాడు. కటువైన మాటలు నాలుగు చెవిన పడగానే ఏడవడం మొదలు పెడతారు. పేరుకూ, ప్రతిష్టకూ బానిస అవుతారు. ఈ బానిసతనానికి లోపల యథార్థమైన మనిషి  పూడుకొనిపోయి ఉంటాడు.  ఈ బానిసతనాన్ని గుర్తించినప్పుడు స్వాతంత్ర్యం కావాలన్న తీవ్రమైన కోరిక కలుగుతుంది.  నిప్పు కణికను నెత్తి మీద పెట్టినప్పుడు దాన్ని తోసివేయడానికి మనిషెంత అల్లాడిపోతాడో..  మాయకు తాను బానిసగా ఉన్నానని నిజం తెలుసుకొన్నవాడు కూడా బంధ విముక్తుడు కావడానికి అంతగా ఆత్రపడతాడు. ముముక్షత్వం పొందాలన్న కోరికను మనుషులు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అన్ని విషయాలలో  వివేకంగా ఉండటం. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది తాత్కాలికమో ఆలోచించడం. దేవుడొక్కడే నిజం, ఆయనే శాశ్వతం.. మిగిలినదంతా క్షణభంగురమే! అంతా నశించి పోతుంది. మనుషులు  మరణిస్తారు. పశువులు, భూములు అంతరిస్తాయి. సూర్యచంద్రులు, నక్షత్రాలు, ప్రతి వస్తువు. అనుక్షణం మారిపోతూ ఉంటుంది. ఈరోజు పర్వతాలుగా ఉన్నవి  నిన్న సముద్రాలుగా ఉన్నాయి. మళ్ళీ అవి రేపు సముద్రాలవుతాయి. సమస్త విశ్వం మార్పుల కుప్ప, కానీ ఏనాటికీ మార్పు చెందని వాడొకడున్నాడు. అతడే భగవంతుడు! మనం ఆయనను ఎంతగా సమీపిస్తే, మన మీది మాయ ప్రభావమంత తగ్గిపోతుంది. మనం ఆయనను సమీపించినప్పుడు, ఆయనతో కూడా నిలిచినప్పుడు మాయను జయిస్తాం. ఈ దృశ్యమాన ప్రకృతి మన అధీనమవుతుంది. మనపై దాని ప్రభావం ఉండదు. ఇదీ వివేకానందుడు భారతీయులకు చెప్పిన మాట.                                 *నిశ్శబ్ద.

మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే మీ భార్యకు విసుగుతెప్పిస్తాయి..!

వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఉండి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్నగొడవలు జరుగుతుంటూనే ఆ సంసారం సాఫీగా ముందుకు సాగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న గొడవలే భాగస్వాముల మధ్య బంధానికి బీటలు వారేలా చేస్తుంది.  అందుకే తమ రిలేషన్ షిప్ లో సంతోషాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలిద్దరూ సమాన ప్రయత్నాలు చేయాలి. ఎవరైనా తన బాధ్యత నుండి తప్పుకుంటే ఆ బంధం ఖచ్చితంగా మధ్యలోనే చెడిపోతుంది. పురుషుల చెడు అలవాట్లు: తమ బంధాన్ని నిలబెట్టుకోవల్సిన బాధత్య భార్యభర్తలు ఇద్దరిపై ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు వారి మధ్య బంధాన్ని బలహీనపరుస్తాయి. దీంతో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. పురుషుల చెడు అలవాట్లతో ఎప్పటికీ మంచి భర్తగా నిరూపించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలి. అవేంటో చూద్దాం. భార్య మాటలు పట్టించుకోకపోవడం: ప్రతి బంధానికి పునాది బలమైన కమ్యూనికేషన్. మీ సంబంధం ఎలా ఉంటుంది అనేది మీరు ఒకరితో ఒకరు ఎంతగా మాట్లాడుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకరి మాటలను ఒకరు ఎంతవరకు అర్థం చేసుకుంటారనేదే ముఖ్యం. కానీ వివాహ సంబంధాలలో కమ్యూనికేషన్ చాలా అరుదు. చాలా మంది భార్యలు తమ భర్తలు తాము చెప్పినా వినడం లేదని వాపోతున్నారు. మీ భర్త మీ కోసం సమయం కేటాయించనప్పుడు, సంబంధంలో చీలికలు వస్తాయనడంలో సందేహం లేదు. భార్యను గౌరవించకపోవడం: చాలా మంది భర్తలు తమ భర్యాలను ఇతరుల ముందు చులకనగా  చేసి మాట్లాడుతుంటారు.ఇలా చేయడం సరికాదు. మీ భార్యను దూషించే పదాలు ఉపయోగించడం ఆమెను అవమానిస్తుంది.ఇతరుల ముందు ఆమెను దూషించడం సరికాదు. మీరు ఇలాగే ప్రవర్తించడం కొనసాగిస్తే, మీరు మీ భాగస్వామిని గౌరవించడం లేదని అర్థం చేసుకోండి. మీ సంబంధంలో ప్రేమ, నమ్మకాన్ని కొనసాగించడానికి, మీ భాగస్వామిని గౌరవించడం నేర్చుకోండి. మీ భార్యతో ప్రేమగా ఉండండి: భార్యాభర్తలు కారుకు రెండు చక్రాలు. ఇద్దరికీ ఒకరికొకరు కావాలి. ఇద్దరూ ఒకరినొకరు లేకుండా జీవించడం కష్టం. కానీ భర్తలు పని ఒత్తిడి వల్ల లేదా వారితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల భార్యలపై కోపం తెప్పించడం చాలా తప్పు.మీ భార్య మీ కోసం రోజంతా ఎదురుచూస్తుందని తెలుసుకోండి. అటువంటి పరిస్థితిలో, వారితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి.

కష్టసమయంలో కూడా నవ్వుతూ ఉండాలంటే ఇలా చేయండి!

మనిషి జీవితానికి, కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే   రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిలాగా.. మనిషి జీవితంలో కూడా  సంతోషం, పోరాటం, కష్టం, దుఃఖం అన్నీ ఉంటాయి. వీటి నుండి విజయం, అపజయం అనే చీకటి, వెలుగులు దోబూచులాడతాయి. అయితే చాలా మందికి రెండింటిని ఒక్కటిగా తీసుకోవడం రాదు.  కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోవడం, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోవడం చేస్తారు.  విజయం సాధించినప్పుడు, అనుకున్నవి జరిగినప్పుడు సంతోషపడతారు. అయితే కష్టం  వచ్చినా, సమస్యలు ఎదురైనా నవ్వుతూ ఉండాలంటే మాత్రం ఈ కింద చెప్పుకున్న పనులు పాటించాలి. చాలామంది సంతోషాన్ని బయటి నుండి వెతుకుతారు. అయితే సంతోషం అనేది అంతర్గతమైనది.  ఆనందం అనేది కేవలం పరిస్థితులు లేదా వ్యక్తి ద్వారా సృష్టించబడదని అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే దీన్ని కొన్ని పనులు చేయడం ద్వారా అనుభూతి చెందవచ్చు. శారీరక శ్రమ.. శారీరక శ్రమ సహజంగానే మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే కనీసం 10 నిమిషాల వ్యాయామం చేయాలి. ఇందులో  ఫాస్ట్ వాకింగ్, జంపింగ్ జాక్స్, స్ట్రెచింగ్ వంటివి  చేర్చవచ్చు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ ఏడు గంటలు నిద్రపోవాలి. ముఖ్యంగా  చాలా ఆందోళనగా ఉన్నప్పుడు సరైన నిద్ర చాలా అవసరం. ప్రకృతికి దగ్గరగా.. గందరగోళంగా ఉన్న మనస్సును శాంతపరచడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం పచ్చని వాతావరణంలో నడవడం. దీని కోసం  అడవులకు  వెళ్లవలసిన అవసరం లేదు. పార్క్ లు, తోటలలో  నడవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు  మనసుకు విశ్రాంతినిస్తుంది. ఇది సంతోషాన్ని పెంచుతుంది.  ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకుని నవ్వాలి.. ఎంత  కష్టమైన సమయాలు ఉన్నా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని  నవ్వడానికి ప్రయత్నించాలి.   ఇది చాలా అద్భుతమైన ట్రిక్.  దీన్ని అలవాటు చేసుకుంటే ఎంత క్లిష్టం పరిస్థితులలో ఉన్నా కూడా ఒత్తిడి, ఆందోళనకు గురి చేయనివ్వదు. ఆలోచన.. కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని గుర్తుచేసుకుని  నిరంతరం ఆలోచించే బదులు దాని పరిష్కారం లేదా దాని ప్రభావం తగ్గించడం దిశగా  ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల మొదట మీరు డిప్రెషన్ నుండి  మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు.   రెండవది పరిస్థితిని మెరుగైన మార్గంలో ఎదుర్కోవడానికి మీ మనస్సు సిద్ధమవుతుంది.                                 *నిశ్శబ్ద.      

కుటుంబం సంతోషంగా ఉండాలంటే.. మీరిద్దరూ ఇలాగే ఉండాలి!

మీరు కొన్ని జంటలను చూస్తే, వారు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఎలా అనే ప్రశ్న మనలో తలెత్తుతుంది. మీ  వైవాహిక జీవితంలో ఇంత సంతోషంగా ఎలా  ఉన్నారు అని అడిగేవారూ ఉన్నారు. కానీ సంతోషకరమైన జంట అది పెద్ద విషయం కాదని మీకు చెప్పగలదు. ఎందుకంటే ప్రతి బంధంలోనూ గొడవలు ఉంటాయి. ఆ గొడవలను ఎలా పరిష్కరించుకున్నామన్నదే ముఖ్యం. కొంతమంది జంటలు తరచుగా గొడవ పడుతుంటారు. కానీ ఆ సమస్యకు పరిష్కారం వెతకడంతో మాత్రం విఫలమవుతుంటారు. తప్పులు, ఒప్పులు అనేవి జీవితంలో సర్వసాధారణం. వాటిని పరిష్కరించుకుంటూ..ఒకరిపై ఒకరు గౌరవం, నమ్మకం, ప్రేమతో ముందుకు సాగుతుంటే ఆ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడే జంటలు..ఈ చిన్న చిన్న విషయాలను సరిదిద్దుకుంటే సంతోషంగా ఉంటారు. అవేంటో చూద్దామా? వారు నిజంగా సంతోషంగా ఉన్నారా? కొంతమంది జంటలు పబ్లిక్‌గా చేతులు పట్టుకోవడం, పార్టీలో కౌగిలించుకోవడం వంటివి చూస్తే.. ఇది కేవలం షోలా అనిపించవచ్చు.కానీ సంతోషకరమైన జంట ఎప్పుడూ కలిసి ఉండకపోయినా, వారు సన్నిహితంగా ఉన్నారనే భావనను పొందుతారు. వాగ్వాదం జరిగినా సరిహద్దు దాటరు: గీతను ఎక్కడ గీయాలి..ఎప్పుడు దాటకూడదో సంతోషంగా ఉండే  జంటకు ఖచ్చితంగా తెలుసు.ఎంత వాగ్వాదం జరిగినా సరిహద్దు దాటరు. ఇక్కడ ఒకరు నిశ్శబ్దానికి లొంగిపోతారు. మరొకరు చర్చను అలా వదిలివేస్తారు. మనస్పూర్తిగా మాట్లాడటం: ఒకరి భావాలకు..ఒకరు విలువనివ్వాలి. కొన్నిసార్లు మీరు దానిని ఒకరిపై విధించాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని మాటలు సానుకూలంగా మాట్లాడితే, అది మీ ప్రియమైనవారి పట్ల మీకు అనుభూతిని కలిగిస్తుంది.నిద్రపోయే ముందు, మీరు మీ భాగస్వామికి కొన్ని సానుకూల పదాలు చెప్పాలి. ఇది సానుకూల గమనికతో రోజును ముగించి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది మొత్తం మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.ఆ రోజు జరిగిన ఆలోచనలన్నింటినీ మరచిపోయి సమస్యలను, చింతలను పడకగదికి దూరంగా ఉంచండి. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి. మీ భావాలను వ్యక్తపరిచేటప్పుడు నిజాయితీగా, గంభీరంగా ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్తలు: భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటే డబ్బు వెచ్చించి ప్లాన్ చేసుకుంటారు. తమ సంపాదనకు, పొదుపుకు ఎంత స్వేచ్ఛ ఉందో తెలిసిపోతుంది.చాలా బంధాలు డబ్బు కారణంగా విడిపోతాయి . కానీ సంతోషంగా వివాహం చేసుకున్న జంట దీని కోసం సరిగ్గా ప్లాన్ చేస్తారు. గోప్యతకు గౌరవం: మీరు ఎల్లప్పుడూ మీ భాగస్వామి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలి. ప్రతీది భూతద్ధంలో పెట్టిచూడకూడదు. మీ భాగస్వామికి కూడా గోప్యత ఉంటుంది. దానికి మీరు గౌరవించాలి.  వారు ఒంటరిగా లేదా స్నేహితులతో వెళ్ళవచ్చు. వీటన్నింటినీ గౌరవించాలి. ఓపిక: ఎవరి సంసారంలోనైనా తుఫాన్ ను లాంటి సమస్యలు వచ్చిపోతుంటాయి. వాటన్నింటిని ప్రశాంతంగా ఆలోచించి ఓపికతో పరిష్కరించుకోవాలి. ఇలాంటి  చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకుంటూ మీ వైవాహిక జీవితం, సంతోషంగా ఉంటుంది.

మీరు రోజూ నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నారా..ఐతే  ఇది మీ కోసమే ?

తలనొప్పి వచ్చినా, శరీరంలో నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. చాలా మంది తలనొప్పి వస్తే డిస్ప్రిన్, ఒళ్లు నొప్పులకు  కాంబిఫ్లామ్ వంటి మందులు తీసుకుంటారు. ఈ ఔషధాల ప్రభావం త్వరగా కనిపిస్తుంది.  కొన్ని నిమిషాల్లోనే ఉపశమనం కూడా లభిస్తుంది. కొంతమంది  నొప్పి తగ్గే వరకు వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మందులను తీసుకుంటారు.కొన్నిసార్లు రోజులో  చాలా సార్లు తీసుకుంటారు. ఇలా చేస్తే తొందరగా తగ్గిపోతుందనేది వారి అభిప్రాయం. అయితే  ఇలా నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో  వైద్యులు కింది విధంగా తెలిపారు. నొప్పి నివారణ మందులు వాడటం తప్పనిసరి అయితే ఎటువంటి సలహా లేకుండా రోజుకు చాలా సార్లు తీసుకోవడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ తో సేఫ్ అనేదేమీ లేదని అంటున్నారు. ప్రతి పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ తో వస్తుంది.  ఎటువంటి సలహా లేకుండా మందులు తీసుకోవడం తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది.   రోజుకు ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం నొప్పికి ఎక్కువగా ఉపయోగించే ఔషధం పారాసెటమాల్. నొప్పులు వస్తే పారాసెటమాల్ వాడాలని పిల్లలకు కూడా తెలుసు. 8 గంటల వ్యవధిలో 500 ఎంజీ మాత్రలు రోజుకు 3-4 రోజులు  తీసుకోవచ్చని అది కూడా వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.  3-4 రోజుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. సమస్య తెలియకుండా తీసుకోకూడదు.. శరీరంలో ఉన్న సమస్య ఏంటో తెలియకుండా నొప్పి నివారణ మందులు తీసుకోవడం హానికరం. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు ప్రతి మందుకూ సానుకూల ప్రభావాలే కాదు వ్యతిరేక ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా చాలామందిలో మెడిసిన్ రియాక్షన్ కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి దీనివల్ల ప్రాణాలమీదకు రావచ్చు కూడా.                                        *నిశ్శబ్ద

ప్రేమ, ఆకర్షణ.. రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం ఎలాగంటే..!

ప్రేమ,  ఆకర్షణ రెండు వేర్వేరు విషయాలు కాదు.  ప్రేమను,  ఆకర్షణను సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రేమ అనేది  మొదట ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణతోనే మొదలవుతుందని అర్థమవుతుంది.  ఇది ఒకే దారిలో రెండు స్టాపింగ్ పాయింట్స్ లాంటిది. ఈ దారిలో వెళ్లే   కొందరు వ్యక్తులు ప్రేమను చేరుకుంటే, కొందరు తమ సంబంధాన్ని కేవలం ఆకర్షణకే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఆకర్షణ నుండి ప్రేమకు వెళ్ళడం సులభం కాదు. అందుకే రెండింటి మధ్య  తేడాను గుర్తించాలి.  ఎవరైనా.. ఎవరినైనా ప్రేమిస్తున్నట్టైతే ప్రేమలో ఉన్నారా లేదా ఆకర్షణలో ఉన్నారా అనే విషయం తరచి చూసుకోవడం ముఖ్యం. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే.. ఇతర విషయాల ప్రాధాన్యత.. ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు వీలైనంత ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు.  తన భాగస్వామిని కలిసిన ప్రతిసారీ తను మొదటి సారి కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీలవుతారు. కానీ సంబంధం కేవలం ఆకర్షణపై మాత్రమే ఆధారపడి ఉన్నప్పుడు కలిసి సమయాన్ని గడపడానికి కాస్త పరధ్యానం చూపిస్తారు.   భవిష్యత్తు విషయాలు.. ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నవారు  తమ భవిష్యత్తును మరొకరితో గడపాలని అనుకుంటారు. ఎప్పుడూ కలిసి ఉండేందుకు,  కలిసి తమ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు.   దాని కోసం కష్టపడతారు. కానీ ఆకర్షణలో ఉన్నవారు ఎప్పుడూ భవిష్యత్తు ప్రణాళికలు వేయరు. వారు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ అలాంటి సందర్భం తీసుకుని వస్తే.. ఇప్పుడే అవన్నీ అవసరమా అంటూ సిల్లీగా వాటిని కొట్టేపడేస్తారు.  సరళంగా చెప్పాలంటే వారి భవిష్యత్తులో మీకు చోటు ఉండదు. శారీరక సంబంధం.. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక సంబంధం  అవసరాన్ని కలిగి ఉండదు. దీనిలో వ్యక్తులు ఒకరికొకరు మానసికంగా దగ్గరగా ఉంటారు. అయితే శారీరక సంబంధమే ఆకర్షణకు కేంద్ర బిందువు. ఒక  వ్యక్తి తన భాగస్వామి ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా,   ఏమి కావాలో కూడా తెలుసుకోకుండా కేవలం వారి అవసరం కోసం మాత్రమే శారీరక సంబంధం గురించి మాట్లాడుతున్నట్టైతై వారు మీతో ఎక్కువ కాలం ఉండరు అనేది నిజం. వ్యక్తిగత జీవితం గురించి రహస్యాలు.. ప్రేమలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి ముందు అద్దంలా మారతాడు. అతని తప్పులు, లోపాలు  లక్షణాలు, ఏదీ దాచరు. కానీ ఆకర్షణలో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయానికి అందరమైన కథలు అల్లి మభ్యపెడతారు.                                         *నిశ్శబ్ద.

తల్లిదండ్రులు పొరపాటున కూడా ఈ విషయాలు మగపిల్లలతో చెప్పకూడదట..!

పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పెద్ద సవాల్. లింగ సమానత్వం అనే మాటను ఎంత సీరియస్ గా తీసుకున్నా సరే.. ఆడపిల్లలను, మగపిల్లలను పెంచే విధానంలో ఎంతో కొంత తేడా ఉండనే ఉంటుంది. ముఖ్యంగా జెండర్ కారణంగా తల్లిదండ్రులు మగపిల్లలకు కొన్ని విషయాలు చెబుతుంటారు. తల్లిదండ్రులు మంచి కోసమని చెప్పే ఆ విషయాలు  పిల్లల భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. పిల్లల వ్యక్తిత్వాన్ని ఊహించని విధంగా మార్చేస్తాయి. తల్లిదండ్రులు మగపిల్లలకు చెప్పకూడని విషయాలేంటో తెలుసుకుంటే.. మగపిల్లాడు ఏడవకూడదని చెప్పొద్దు.. అబ్బాయిలు ఏడవకూడదని, ఏడవడం తప్పు అని చాలా మంది తల్లిదండ్రులు తమ కొడుకులకు చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. ఎప్పుడైనా మగపిల్లాడు ఏడుస్తుంటే అదేంటి అలా ఏడుస్తున్నావు ఆడపిల్లలాగా అని ఎగతాళి కూడా చేస్తారు.  కానీ నిజమేంటంటే ఈ విషయం మగపిల్లలకు అస్సలు చెప్పకూడాదు. ఇవి పిల్లల మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనితో పిల్లలు తన ఆలోచనలను, భావోద్వేగాలను  తమలోనే ఉంచుకోవడం మొదలుపెడతారు. మగపిల్లలను వెక్కిరిచకూడదు.. పిల్లలు ఎదిగేకొద్ది వారి వ్యక్తిత్వం కూడా మెరుగవుతూ వస్తుంది. తల్లిదండ్రులు అయినంతమాత్రాన మగపిల్లలు పెద్దవారు అయినా సరే వారిని  ఏదైనా అనేయవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులు మానుకోవాలి. ఓ వయసుకు వచ్చాక మగపిల్లలు ఇంట్లో ఉంటే చాలామంది తల్లిదండ్రులు ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఇంకెన్నాళ్లు ఇంట్లోనే కూర్చుని తింటావు అని అంటూ ఉంటారు. కానీ ఈ మాటలు  మగపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అనుమానించకూడదు.. చాలామంది తల్లిదండ్రులకు కొడుకుల మీద అనుమానం ఉంటుంది. దీనికి కారణం మగపిల్లల స్నేహాలు, పరిచయాల లిస్ట్ పెద్దది. అవసరాల కోసం మగపిల్లలు తల్లిదండ్రులతో అబద్దాలు కూడా చెబుతారని అనుకుంటారు. పొరపాటున ఇంట్లో ఏదైనా వస్తువు మిస్ అయినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఎదురైనా వెంటనే కొడుకునే అంటూ ఉంటారు. ఇది మగపిల్లల దృష్టిలో తల్లిదండ్రును చెడ్డగా మారుస్తుంది. పోలికలు పెట్టకూడదు.. మగపిల్లలు చదువు, ఉద్యోగంలో ఏమాత్రం సెటిల్ కాకపోయినా వారిమీద పోలికల యుద్దం చాలా దారుణంగా ఉంటుంది. కేవలం కొడుకులు అనే కాదు, కూతుర్లను కూడా ఈ విషయాలలో పోల్చి చూస్తారు. వాడు ఎంత బాగా చదువుతాడో, ఎంత మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడో, మీకు తల్లిదండ్రులంటే భయం గౌరవం లేదు.. వాళ్లు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో.. ఇలాంటి మాటలు తరచుగా అంటూ ఉంటారు. కానీ ఇవి అస్సలు అనకూడదు.  తల్లిదండ్రుల మీద పిల్లలకు ద్వేషం పెరగడానికి కారణమవుతుంది.                                             *నిశ్శబ్ద.