Read more!

మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే మీ భార్యకు విసుగుతెప్పిస్తాయి..!

వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఉండి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్నగొడవలు జరుగుతుంటూనే ఆ సంసారం సాఫీగా ముందుకు సాగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న గొడవలే భాగస్వాముల మధ్య బంధానికి బీటలు వారేలా చేస్తుంది.  అందుకే తమ రిలేషన్ షిప్ లో సంతోషాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలిద్దరూ సమాన ప్రయత్నాలు చేయాలి. ఎవరైనా తన బాధ్యత నుండి తప్పుకుంటే ఆ బంధం ఖచ్చితంగా మధ్యలోనే చెడిపోతుంది.

పురుషుల చెడు అలవాట్లు:

తమ బంధాన్ని నిలబెట్టుకోవల్సిన బాధత్య భార్యభర్తలు ఇద్దరిపై ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు వారి మధ్య బంధాన్ని బలహీనపరుస్తాయి. దీంతో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. పురుషుల చెడు అలవాట్లతో ఎప్పటికీ మంచి భర్తగా నిరూపించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలి. అవేంటో చూద్దాం.

భార్య మాటలు పట్టించుకోకపోవడం:

ప్రతి బంధానికి పునాది బలమైన కమ్యూనికేషన్. మీ సంబంధం ఎలా ఉంటుంది అనేది మీరు ఒకరితో ఒకరు ఎంతగా మాట్లాడుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకరి మాటలను ఒకరు ఎంతవరకు అర్థం చేసుకుంటారనేదే ముఖ్యం. కానీ వివాహ సంబంధాలలో కమ్యూనికేషన్ చాలా అరుదు. చాలా మంది భార్యలు తమ భర్తలు తాము చెప్పినా వినడం లేదని వాపోతున్నారు. మీ భర్త మీ కోసం సమయం కేటాయించనప్పుడు, సంబంధంలో చీలికలు వస్తాయనడంలో సందేహం లేదు.

భార్యను గౌరవించకపోవడం:

చాలా మంది భర్తలు తమ భర్యాలను ఇతరుల ముందు చులకనగా  చేసి మాట్లాడుతుంటారు.ఇలా చేయడం సరికాదు. మీ భార్యను దూషించే పదాలు ఉపయోగించడం ఆమెను అవమానిస్తుంది.ఇతరుల ముందు ఆమెను దూషించడం సరికాదు. మీరు ఇలాగే ప్రవర్తించడం కొనసాగిస్తే, మీరు మీ భాగస్వామిని గౌరవించడం లేదని అర్థం చేసుకోండి. మీ సంబంధంలో ప్రేమ, నమ్మకాన్ని కొనసాగించడానికి, మీ భాగస్వామిని గౌరవించడం నేర్చుకోండి.

మీ భార్యతో ప్రేమగా ఉండండి:

భార్యాభర్తలు కారుకు రెండు చక్రాలు. ఇద్దరికీ ఒకరికొకరు కావాలి. ఇద్దరూ ఒకరినొకరు లేకుండా జీవించడం కష్టం. కానీ భర్తలు పని ఒత్తిడి వల్ల లేదా వారితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల భార్యలపై కోపం తెప్పించడం చాలా తప్పు.మీ భార్య మీ కోసం రోజంతా ఎదురుచూస్తుందని తెలుసుకోండి. అటువంటి పరిస్థితిలో, వారితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి.