బడ్జెట్ లో కీలక అంశాలు ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తరువాత లోక్ సభ బుధవారానికి వాయిదా పడింది. కాగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో  కీలక అంశాలు ఇలా ఉన్నాయి.  *కేంద్ర బడ్జెట్‌ ప రూ.48.21 లక్షల కోట్లు *మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు *పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు *ద్రవ్యలోటు 4.9 శాతంగా (అంచనా) *అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు(అంచనా)  *మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను ధరలు తగ్గుదల * చేపలు, తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గుదల * బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గుదల * తక్కువ ధరకు మందులు * ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు  నెలవారీ భత్యం రూ. 5,000  *అస్సాంలో వరద నియంత్రణ కార్యకలాపాలకు, బీహార్‌లోని కోసికి   ఆర్థిక సహాయం * ఇంధన భద్రత, పరివర్తన కోసం కొత్త పాలసీ * పీఎం ఆవాస్ యోజన-అర్బన్ 2.0 కింద రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడితో కోటి కుటుంబాలకు ఇళ్లు  పట్టణాల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ పథకం అమలు  * బీహార్‌కు   ప్రత్యేక నిధులను కేటాయించింది.  * కాశీ విశ్వనాథుడి తరహాలో విష్ణుపాద దేవాలయం, మహాబోధి ఆలయాలను అభివృద్ధి   * మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు * పారిశ్రమలలో పనిచేసే కార్మికుల కోసం రెంటల్ సిస్టమ్‌లో డార్మిటరీ వసతి సౌకర్యం * ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకారం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ * బీహార్‌లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయింపు * పీపీపీ పద్ధతిలో బీహార్ అబివృద్ధికి ఆర్థిక సహాయం * బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు * 5 రాష్ట్రాల్లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ * బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం *ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలు ఏర్పాటు *బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు * దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం * గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు * ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-వోచర్లను అందజేయడం ద్వారా మొత్తం రుణంపైమూడు శాతం వడ్డీ రాయితీ. * అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం * రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు *రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం *గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి

ఆదాయపు పన్ను విధానంలో మార్పులు!

ఆదాయపు పన్ను విధానంలో కొత్త మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. కొత్త పన్ను విధానం ప్రకారం, సున్నా నుంచి 3 లక్షల వరకు ఆదాయం వున్న వారికి ‘సున్నా’ పన్ను వుంటుంది. మూడు లక్షల నుంచి 7 లక్షల వరకు ఆదాయం వున్నవారు 5 శాతం పన్ను చెల్లించాల్సి వుంటుంది. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం వున్నవారు 10 శాతం పన్ను చెల్లించాలి. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం వున్నవారు 15 శాతం పన్ను చెల్లించాలి. 12 నుంచి 15 లక్షల వరక ఆదాయం వున్నవారు 20 శాతం పన్ను చెల్లించాలి. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వున్నవారు 30 శాతం పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో 17,500 రూపాయల పన్ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు.

బిహార్ మీద కేంద్రం వరాల జల్లు!

కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తెలుగుదేశం పార్టీ, బిహార్‌కి చెందిన జేడీయు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మనుగడలో వుండటానికి ఈ రెండు పార్టీలు కీలకంగా వున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్‌ మీద కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. బిహార్‌లో జాతీయ రహదారులకు 20 వేల కోట్లు కేటాయించారు. బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్‌కి  ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నారు. వరదల కారణంగా ప్రతి యేటా నష్టపోతున్న బిహార్‌కి ఊరట కలిగించే విధంగా వరద నివారణ, సాగు కార్యక్రమాలకు 11 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. బిహార్‌లో వరదలకు కారణం అవుతున్న పై రాష్ట్రాలు అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌లకు కూడా వరద నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించారు. బిహార్‌లో ఆధ్యాత్మిక టూరిజాన్ని పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. కాశీ తరహాలో బుద్ధ గయని అభివృద్ధి చేయనున్నారు. బిహార్‌లోని రాజ్‌గిరి జైన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికకు రూపకల్పన చేయనున్నారు. టూరిజం కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. 

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు లభించిన హామీలివే!

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో  ఏపీకి అందించిన వరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పూర్తికి అధిక నిధులు,  రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామికాభివృద్ధికి  హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి. అలాగేవిశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం,  కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి,  విశాఖ - చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు, నీరు, విద్యుత్, రైల్వే, రోడ్ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు,   విభజన చట్టంలో ఉన్న హామీల అమలు,  పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్ట్

నిర్మలమ్మ పద్దులో ఏపీకి వరాలు

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ఏపీకి సముచిత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ప్రకటించిన ఆమె అవసరాన్ని మట్టి మరిన్ని అదనపు నిధులు ఇస్తామని తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.   అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి పూర్తి సహకారం, సహాయం అందిస్తామన్నారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరం పూర్తికి అవసరమైన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆహార భద్రత విషయంలో పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైనదని ఆమె అన్నారు.  ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయంతో పాటు, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు అందజేస్తామన్నారు. అలాగే వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. వీటితో పాటు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనకబడిన ప్రాంతాలకు నిధులను కేటాయించామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

నిర్మలమ్మ బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు

దాదాపు ఏడేళ్ల తరువాత దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి అన్న విషయాన్ని కేంద్రం గ్రహించినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (జులై 23) లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించారు.  అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం సత్వర పూర్తికి నిధులు కేటాయించారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం కింద నిధులు కేటాయించారు. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని విస్పష్ట ప్రకటన చేశారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం వింటుంటే.. చంద్రబాబు హస్తిన పర్యటన ఫలప్రదం అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.  

వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో రైతులు, యువత కోసం భారీ కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. ఉత్పాదకత, వాతావరణాన్ని తట్టుకునే 9 రకాల వంగడాలను పెంచడంపై దృష్టి సారించేలా వ్యవసాయ పరిశోధన జరుగుతుందన్నారు.  వాతావరణాన్ని తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ పరిశోధన సెటప్‌ను సమగ్రంగా సమీక్షించాలన్నారు. ఈ నిధితో వ్యవసాయం, సంబంధిత రంగాలకు పథకాలు రూపొందించనున్నారు. ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యతలలో ఒకటి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి. దీని కింద మొదటిసారి ఉద్యోగార్ధులకు భారీ సహాయం అందనుంది. మొదటిసారిగా ఫార్మల్ రంగంలో ఉద్యోగం ప్రారంభించే వారికి ఒక నెల జీతం  నగదు బదిలీ ద్వారా మూడు విడతలుగా విడుదల చేస్తారు. దీని గరిష్ట మొత్తం రూ.15 వేలు. ఈపీఎఫ్ లో నమోదు చేసుకున్న వ్యక్తులు ఈ సహాయం పొందేందుకు అర్హత. ఆ అర్హత పరిమితి నెలకు రూ. 1 లక్ష .  దీనివల్ల 2.10 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలుగుతుంది.  

కోటి మందికి ఉద్యోగాలు... గ్రామాల మీద శ్రద్ధ...

దేశవ్యాప్తంగా వున్న 5 వందల పెద్ద కంపెనీలలో కోటి మంది యువకులకు ఉద్యోగాలు కల్పించనున్నట్టు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 12 విస్తృత స్తాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాల్లో  పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం కూడా జరుపుతామన్నారు. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహాలో ఇళ్ళ నిర్మాణం జరుపుతామని చెప్పారు. అలాగే తాజా బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 2.66 లక్షల కోట్లను కేటాయించారు. ముద్ర రుణాల పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు 10 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు నిధులు

విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో విశాఖ చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటయించారు. అలాగే  విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటంచారు. ఇందులో భాగంగా  రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు అంతుతాయి. పట్టణ గృహ నిర్మాణం కోసం కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ 2.2 కోట్ల రూపాయలు, రూరల్ డెవలప్ మెంట్ కు 2.66 లక్షల కోట్లు కేటాయించారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకూ పెద్ద పీట వేశారు. బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు  రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం. 

పోలవరం పూర్తికి పెద్ద పీట

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్  తన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతి అభిృద్ధికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. అలాగే పోలవరం సత్వర పూర్తికి అగ్ర ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  ఇక విద్యార్థులకు దేశీయ విద్యాసంస్థలలో ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల వరకూ రుణాలు అందిస్తామన్నారు. అలాగే నిరుద్యోగుల కోసం ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు అనుసంధాన ప్రోత్సాహకాలు అందించనున్నట్లు చెప్పారు.   

నిరుద్యోగుల కోసం మూడు పథకాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెడుతూ నిరుద్యోగుల కోసం మూడు పథకాలను ప్రకటించారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు వుంటాయని ఆమె తెలిపారు. ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా ఈ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. సంఘటిత రంగంలో ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల జీతం మూడు వాయిదాలలో అదనంగా చెల్లిస్తామని చెప్పారు. నెలకు లక్ష లోపు జీతం వున్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులని, వారికి గరిష్టంగా 15 వేల వరకు చెల్లిస్తామని వెల్లడించారు. ఈ పథకాల వల్ల 210 లక్షల మంది యువతకు మేలు చేకూరుతుందని అన్నారు.

కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ముగ్గురు హైదరాబాదీల మృత్యువాత 

కార్బన్ మోనాక్సైడ్  అత్యంత హానికరం .ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌తో బంధిస్తుంది, ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే రక్తం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది . ఇది శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్  ప్రభావం వల్ల  అలసట, తలనొప్పి, గందరగోళం,  తల తిరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి మరణించవచ్చు. సరిగ్గా ఇవే లక్షణాలతో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.  హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని జెక్ కాలనీలో ఆదివారం ఓ అపార్ట్‌మెంట్ బాత్రూంలో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనలో మిస్టరీ వీడింది. సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకింగ్ సొల్యూషన్స్ సంస్థలో బిజినెస్ హెడ్‌గా పనిచేస్తున్న ఆర్. వెంకటేశ్ (59), ఆయన భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) ఇక్కడి ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఆదివారం వీరు ముగ్గురు బాత్రూములో విగతజీవులుగా కనిపించారు. వీరిలో హరికృష్ణ మానసిక స్థితి సరిగా లేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరి మృతి విషయంలో మిస్టరీ వీడింది. విషవాయువు అయిన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే వారు మృతి చెంది ఉంటారని వైద్యుల ప్రాథమిక నిర్థారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. గీజర్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడంతో ముగ్గురూ స్పృహతప్పి, ఆపై క్షణాల్లోనే మరణించినట్టు నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి!

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. అంతుకు ముందు ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అనంతరం పార్లమెంటుకు చేరుకున్నారు. కేబినెట్ నిర్మలమ్మ పద్దును ఆమోదించింది. అనంతరం లోక్ సభ ప్రారంభం అయ్యింది. వెంటనే నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. ఉపాథి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వంగడాలు, వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం అన్న అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజాశీర్వాదంతో మూడో సారి అధికారంలోకి వచ్చామన్న ఆమె అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.  

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ హాజరు.. ట్విస్టేంటి?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అంతుకు ముందు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించడంతో.. ఈ సమావేశాలు వాడి వేడిగా సాగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఎన్నికలలో  బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు.  రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా దూరంగానే ఉన్నారు.   ప్రతిపక్ష నేతగా సభకు హాజరు కావడం ఇష్టం లేకే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్న ప్రచారం జరిగింది.  గత కొంతకాలంగా ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం కావడంతో   కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు అయ్యే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషించారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరైతే బీఆర్ఎస్ ప్రతిష్ఠ మరింత మసకబారుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలు,  శ్రేణుల్లో వ్యక్తం కావడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.   కేసీఆర్  అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  తెలంగాణ ఆవిర్భావం తరువాత   కేసీఆర్  ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావడం ఇదే తొలి సారి.   ఇలా ఉండగా  బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమకు విడిగా సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారు. వీరి ప్రజెన్స్ సహజంగానే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతుంది. గతంలో తాను అధికారంలో ఉండగా కేసీఆర్ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆయన విమర్శలు చేసే అవకాశం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా వారి సమాధానం ఉంటుందన్నది తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీలో తాము విడిగా కూర్చేనేందుకు తగిన సీటింగ ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పది మంది ఎమ్మెల్యేలూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు.   

తెలిసీ అడుగేసినావే... ఎడారంటి ఆశల వెనుక!

బంగారం లాంటి జీవితాన్ని చేతులారా మట్టిపాలు చేసుకున్న మహిళ జీవితం ఇది. గుజరాత్ కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్‌కుమార్ ఆ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య పేరు సూర్య జై. చీకూచింతా లేని కుటుంబం. కానీ, ఆమె బుర్రలో పుట్టిన పురుగు ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సూర్య జైకి సంవత్సరం క్రితం తమిళనాడుకు చెందిన ఒక గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆమె అతనితో కలసి వెళ్ళిపోయింది. ఎడారంటి ఆశల వైపు ఆమె వేసిన అడుగులు ఆమెని అధఃపాతాళానికి తీసుకెళ్ళాయి. ఆమె, ఆ గ్యాంగ్‌స్టర్ కలసి జులై 11న తమిళనాడులో ఒక బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ బాలుడి అదృష్టం బాగుండి పోలీసులు రంగప్రవేశం చేసి కాపాడారు. అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు వెతుకుతున్నారు. పోలీసు కేసులో ఇరుక్కోవడంతో సంవత్సరం తర్వాత సూర్య జైకి ఐఏఎస్ భర్త గుర్తొచ్చాడు. వెంటనే గుజరాత్‌కి ప్రయాణమైంది. డైరెక్ట్.గా ఇంటికి వెళ్ళింది. ఐఏఎస్ రంజిత్ కుమార్ అప్పటికే సూర్య జైతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను ఇంట్లో లేని సమయంలో సూర్య జై వచ్చినట్టయితే లోపలకి రానివ్వద్దని పనివాళ్ళకి అప్పటికే చెప్పాడు. దాంతో పనివాళ్ళు ఆమెని ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో ఆమె ఇంటి ముందే విషం తాగి, అంబులెన్స్ కోసం ఫోన్ చేసింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సూర్య జై మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా ఐఏఎస్ రంజిత్ కుమార్ నిరాకరించినట్టు సమాచారం.