దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ సూత్రధారి మృతి

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) మరణించాడు. చర్లపల్లి జైలులో వున్న మక్బూల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి నెల క్రితం గుండె ఆపరేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మూత్రపిండాలు కూడా విఫలం కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు పేలుళ్ళలో మక్బూల్ హస్తం వున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ కేసులో మక్బూల్‌కి ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. ఆరు నెలల క్రితం మక్బూల్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారంట్ మీద హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. 21 ఫిబ్రవరి, 2013న దిల్‌సుఖ్‌నగర్‌లో రద్దీగా వుండే ప్రాంతంలో మక్బూల్ బాంబులు పేల్చాడు. ఆ పేలుళ్ళలో 17 మంది మరణించారు.

నితి ఆయోగ్ ముందు పోలవరం.. బాబు అజెండా ఇదే!

పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే భరించాలి. అలా భరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవలి తన బడ్జెట్ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు కూడా. పోలవరం పూర్తికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అయితే పోలవరం కు ఈ బడ్జెట్ లో కేటాయింపు ఎంత అన్నది ఆమె అంకెల్లో చెప్పలేదు. దీంతో పోలవరం పూర్తి అవ్వడానికి ఎంత కావాలి. ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో పలు సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.  ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరంలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులెత్తించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, సమయం వంటి అంశాలపై శనివారం(జులై27) జరిగే నీతి అయోగ్ సమావేశంలోనే చర్చకు తీసుకురావాలని నిర్ణయించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, పోలవరం ఎత్తు అంశాలపై నీతి అయోగ్ సమావేశంలో లేవనెత్తి పోలవరం విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకోవాలని బావిస్తున్నారు. పోలవరం ఎత్తుపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను వీటో చేయడానికి నీతి అయోగ్ సమావేశమే సరైన వేదికగా భావిస్తున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తుతగ్గించే ప్రశక్తే లేదన్న స్టాండ్ కు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త డయాఫ్రం వాల్ కు బదులుగా రింగ్ ఫెన్సింగ్ నిర్మాణం అంటూ తొలుత విదేశీ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చినా, తరువాత సవరించి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమే శరణ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా ఎటువంటి ద్వైదీ భావం లేకుండా కొత్త డయాఫ్రం వాల్ నిర్దుష్ట కాలపరిమితిలో నిర్మించే విషయంలో కూడా నీతి అయోగ్ సమావేశంలో ఒక స్పష్టత  వచ్చేలా చంద్రబాబు చర్చించనున్నారు.   

నేటి నుంచే ప్యారిస్ ఒలింపిక్స్!

ఫ్యాషన్‌కి పుట్టిల్లు అయిన ప్యారిస్ నగరంలో నేటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. విశ్వక్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్యారిస్ నగరం సిద్ధమైంది. కరోనా మహమ్మారి ముప్పు తొలగిన తర్వాత నిర్వహిస్తున్న మెగా ఈవెంట్‌ ఇది. క్రీడా ప్రపంచానికి చిరకాలం గుర్తుండి పోయే విధంగా అత్యంత వైభవంగా ఆరంభ వేడుకలను నదిలో నిర్వహించాలని ఫ్రెంచ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లతో ఒలింపిక్స్ వేడుకలు జరగనున్నాయి. దాదాపు 45 వేల మంది రక్షణ బలగాలను వినియోగించనున్నారు. ఫ్రాన్స్‌ దేశం ఒలింపిక్స్.కిఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. తొలిసారి 1900 సంవత్సరంలో, రెండోసారిగా 1924లోజరిగాయి. ఇప్పుడు సరిగ్గా వందేళ్ళ తర్వాత ఫ్రాన్స్ ఒలింపిక్స్ నిర్వహిస్తోంది. అమెరికా (4సార్లు), బ్రిటన్‌ (3సార్లు) తర్వాత అత్యధికంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న దేశంగా ఫ్రాన్స్‌ రికార్డులకెక్కనుంది. మొత్తమ్మీద 206 దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు  ఈ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

జగన్ సరికొత్త కానుక ‘కాస్కారం’!

గిట్టనివాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే జగన్‌ని ‘నత్తి పకోడీ’ అంటూ వుంటారుగానీ, నిజానికి ఆయన ఒక గొప్ప భాషా శాస్త్రవేత్త. ఆయన ఎప్పటికప్పుడు కొత్తకొత్త పదాలను తెలుగు భాషకు, తెలుగు జాతికి అందిస్తూ వుంటారు. ఆ విధంగా ‘జగన్ తెలుగు నిఘంటువు’లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త తెలుగు పదాలు చేరుతూ, తెలుగు భాషను సుసంపన్నం చేస్తూ వుంటాయి. తాజాగా, శుక్రవారం నాడు ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఎవరూ కెమెరాలతో రావద్దు, చేతులు ఊపుకుంటూ రండి, మేం ఇచ్చే ఫుటేజ్ తీసుకెళ్ళండని ముందే ‘హెచ్చరిక’ జారీ చేశారు. సరే, ఆ విషయం అలా వుంచితే, ఈ ప్రెస్‌మీట్లో జగన్ మరో కొత్త పదాన్ని తెలుగు భాషకి అందించారు. ఆ పదం ఏమిటంటే, ‘కాస్కారం’. జగన్ మాట్లాడుతూ ‘కాస్కారం’ అన్నప్పుడు, అక్కడ వున్న జర్నలిస్టులకు అర్థంకాక జుట్టు పీక్కున్నంత పని చేశారు. ఆలోచించగా, ఆలోచించగా అర్థమైంది ఏమిటంటే, జగన్ ‘తాత్సారం’ అనే మాటని ‘కాస్కారం’ అని అందంగా పలికారన్నమాట.. అసలు పదాన్ని మరోరకంగా మలిచారన్నమాట అని జర్నలిస్టులకు అర్థమైంది. 

శాంతి భర్త ఆందోళన.. నన్ను చంపేస్తారట!

గిరిజన మహిళ అయిన తన భార్య శాంతిని ట్రాప్ చేసి, విజయసాయిరెడ్డి చట్ట వ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ శాంతి భర్త మదన్‌మోహన్ రాజీలేని పోరాటం చేస్తున్నారు. తన భార్యతో సంబంధం పెట్టుకుని, అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని శాంతి భర్త మణిపాటి మదన్‌మోహన్, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లకు వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి నాలుగు పేజీల లేఖను పంపారు. ఆ లేఖలో... ‘‘అగ్రకులానికి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ మాజీ న్యాయవాది సుభాష్‌రెడ్డి తమ అధికారం, ధన, కండ బలాన్ని ఉపయోగించి నా భార్య శాంతిని లోబరుచుకున్నారు. ఆమెతో సంబంధం పెట్టుకుని చట్టవ్యతిరేకంగా బిడ్డను కన్నారు. ఈ విధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్.కి చెందిన వ్యక్తిగా నాకున్న హక్కులను హరించారు. నా వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా నా హక్కులను హరించినందుకు వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వేధింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నా భార్యకు పుట్టిన మగబిడ్డకు తండ్రెవరో తేల్చాలి. ఈ అక్రమ సంబంధం గురించి నేను మీడియాకి బహిర్గతం చేసిన తర్వాత కొందరు వ్యక్తులు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. తనకు సన్నిహితంగా వున్న పెద్దల పేర్లను బహిర్గతం చేశానన్న కోపంతో నా భార్య శాంతి కూడా నన్ను బెదిరిస్తూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరిస్తోంది. ఆమెకు ఒకవైపు అసాంఘిక శక్తులు, మరోవైపు బ్యూరోక్రాట్లతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. ప్రస్తుతం విజయసాయిరెడ్డి, పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి, నా భార్య శాంతి.. ముగ్గురూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం వుంటున్నారు. అందువల్ల వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులకున ఆదేశించాలని కోరుతున్నాను’’ అని మదన్ మోహన్ పేర్కొన్నారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మదన్‌మోహన్, ఎస్సీ, ఎస్టీ, బహుజన సంఘాల ప్రతినిధులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఏపీ మద్యం స్కామ్‌లో బీజేపీ జీవీఎల్ పాత్ర!

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాత్ర వున్నట్టు తెలుస్తోంది. జగన్ పార్టీలోని ఒక మాజీ ఎంపీతో కలసి జీవీఎల్ నరసింహారావు మద్యం స్కామ్‌కి పాల్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావు బ్యాంకు లావాదేవీల మీద సీఐడీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సుమారు 40 కోట్ల రూపాయలు జీవీఎల్ నరసింహారావు ఖాతాలో చేరినట్టు సమాచారం. జీవీఎల్ నరసింహారావుకు వైఎస్సార్సీపీతో సీక్రెట్ సంబంధాలు వున్నాయి. అందుకే గత ఎన్నికలలో బీజేపీ నుంచి ఆయన టిక్కెట్ ఆశించినప్పటికీ పార్టీ నాయకత్వం ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.  ఆంధ్రప్రదేశ్ బీజేపీ తులసి వనంలో గంజాయి మొక్కతో పోల్చదగ్గ నాయకుడిగా జీవీఎల్ నరసింహారావును భావిస్తారు. 2014లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన సమయంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు మధ్య అంతరం పెరగడానికి జీవీఎల్ నరసింహారావు వ్యవహారశైలే ప్రధాన కారణంగా చెబుతూ వుంటారు. వైసీపీతో రహస్య సంబంధాల కారణంగానే జీవీఎల్ అప్పట్లో అలా వ్యవహరించి వుంటారన్న అనుమానాలు కూడా వున్నాయి. మొత్తమ్మీద జీవీఎల్ నరసింహారావు మీద బీజేపీ నాయకత్వానికి నమ్మకం పోవడం వల్లే ఆయన్నీ దూరం పెడుతూ వస్తోంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో కూడా ఈయన పాత్ర వుందని తెలుస్తున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

వైసీపీలో మొదలైన రాజీనామాల పర్వం!?

అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ నేతలు, శ్రేణులలో జగన్ నాయకత్వంపై విశ్వాసం సడలుతోంది. ఓటమిని హుందాగా అంగీకరించడం పోయి.. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టీ పట్టగానే ఆ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందంటూ హస్తినకు వెళ్లి మరీ ధర్నా చేసి రావడాన్ని ఆ పార్టీలోనే మెజారిటీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఒకరి వెంట ఒకరుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తూ రాజీనామాల బాట పట్టారు. గత వారం రోజులుగా ప్రతి రోజూ ఎవరో ఒక నేత వైసీపీకి రాజీనామా చేసిన వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా పార్టీకి దూరం అవుతున్నారు. పార్టీ అధినేత జగన్ తీరు పట్ల అసంతృప్తితోనే పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి మరీ రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఘోర పరాజయానికి కారణమైన అంశాలపై సమీక్ష చేయడం, ఆత్మవిమర్శ చేసుకోవడం, తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజా విశ్వాసం పొందాలన్న ఉద్దేశం లేశమాత్రంగానైనా జగన్ లో కనిపించకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనౌతున్నారు. ఆ కారణంగానే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పార్టీని ముందుండి నడిపించాల్సిన జగన్  పార్టీని, పార్టీ నేతలను, క్యాడర్ ను పట్టించుకోకుండా, ఓట మికి కారణాలపై సమీక్ష నిర్వహించకుండా, అధికారంలో ఉండగా ఎంతో గొప్పగా పాలించాం, అయినా జనం తిరస్కరించారంటూ ప్రజలను నిందిచడం పట్ల పార్టీ నేతలు,   శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్నిబాహాటంగా ప్రకటిస్తూనే రాజీనామాలు చేస్తున్నారు.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఇద్దరు కీలక నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్,  జిల్లా కోశాధికారి, ఏలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మంచెం మైబాబు రాజీనామా చేశారు. ఈ ఇద్దరు నేతలు   వైసీపీలో కీలకంగా పనిచేశారు. ముఖ్యమైన ఇద్దరు నేతలు పార్టీని వీడటంతో వీరితో పాటు వీళ్ల అనుచరులు సైతం వైసీపీకి దూరం అయ్యారు.  మరికొందరు సీనియర్లు సైతం జిల్లాలో వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పార్టీ విధి, విధానాలు నచ్చకపోవడంతోనే శ్రీనివాస్, మైబాబు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతల రాజీనామా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.   వాస్తవానికి ఇంకా చాలామంది నాయకులు వైసీపీని వదిలి ఇతర పార్టీల్లో చేరాలనే అభిప్రాయంతో ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో  గత్యంతరం లేక ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఒక్కసారి కూటమి పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ దాదాపు ఖాళీ అయిపోతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  నుంచి సిగ్నల్ వస్తే మాత్రం వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జగన్ హయాంలో విధ్వంసం.. ఆర్థిక శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం!

వైసీపీ హయాంలో  జరిగిన విధ్వంసంపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆ వరుసలో శుక్రవారం (జులై 26) ఏడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్నారు. అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం ఈ శ్వేల పత్రాన్ని విడుదల చేస్తారు. ఇంత వరకూ అమరావతి, పోలవరం, శాంతి భద్రతలు, మద్యం కుంభకోణం, సహజవనరులు, గనులు,  విద్యుత్ రంగంపై ఇప్పటికే ఆరు శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అత్యంత కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.  వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు సందర్బాలలో గణాంకాలతో సహా వివరించిన సంగతి తెలిసిందే. జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్థిక శాఖలో చోటుచేసుకున్న అవకతవకలు, అప్పులు, ఇతర అక్రమాలపై లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణచయించిన చంద్రబాబు  ప్రభుత్వం  2019-24 మధ్య లక్షా 41 వేల 588 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93 వేల కోట్లు సీఎఫ్​ఎమ్​ఎస్​లోకి అప్​లోడ్ చేయలేదనీ, అలాగే  48 కోట్ల మేర బిల్లులు అప్​లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదనీ గుర్తించింది. నీటిపారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్​లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19 వేల 324 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు, ఆర్థిక శాఖ నుంచి 19 వేల 549 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నట్లు అధికారులు ఇప్పటికే చంద్రబాబుకు నివేదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14 వేల కోట్లకు పైగా బకాయిలు, మున్సిపల్ శాఖలో 7 వేల 700 కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు శాసనసభలో ఆర్థికశాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.  ఈ శ్వేత పత్రం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్ విధ్వంసాన్ని చంద్రబాబు కళ్లకు కట్టనున్నారు. 

చంద్ర‌బాబు సూప‌ర్ ఫార్ములా.. కూట‌మి పార్టీల‌ నేత‌ల్లో జోష్‌!

ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ ప‌ద‌వుల‌పై కూట‌మి పార్టీల నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేత‌లు, ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి భంగ‌ప‌డిన నేత‌లు నామినేటెడ్ ప‌ద‌వుల్లో త‌మ‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే, కూట‌మిలో మూడు పార్టీలు ఉండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గాల వారిగా నామినేటెడ్ ప‌ద‌వుల కేటాయింపు అంశంపై ఆ పార్టీల‌ నేత‌ల్లో ఇన్నాళ్లు ఆందోళ‌న నెల‌కొంది. ముఖ్యంగా జ‌న‌సేన‌, తెలుగుదేశం నేత‌ల మ‌ధ్య ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నామినేటెడ్ ప‌దవుల విష‌యంలో తీవ్ర పోటీ నెల‌కొంది. ఈ క్ర‌మంలో నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డం ఖాయ‌మ‌ని, వారి మ‌ధ్య విబేధాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌చ్చ‌ని వైసీపీ అధిష్ఠానం ఆశలు పెట్టుకుంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఏఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌, తెలుగుదేశం నేత‌ల మ‌ధ్య నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో  భిన్నాభిప్రాయాలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌నే అంశంపై ఓ డేటా సైతం వైసీపీ పెద్ద‌లు సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే, వారి ఆశ‌ల‌పై నీళ్లు చల్లే విధంగా  చంద్ర‌బాబు నాయుడు సూప‌ర్ ఫార్ములా రూపొందించారు. ఏపీలో  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి దాదాపు 50 రోజులు కావ‌స్తోంది. అధికారంలోకి వ‌చ్చిన రోజునుంచి సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో అభివృద్ధిపై మంత్రులు దృష్టి సారించారు. వేగంగా అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. దీంతో ఐదేళ్లు వైసీపీ అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు కూట‌మిలోని పార్టీల నేత‌లు నామినేటెడ్ ప‌దువుల‌పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన కొందరు ఇప్పటికీ నామినేటెడ్‌ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్ప‌టికే  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్‌ పోస్టులు, ఆలయాలు, ట్రస్టు బోర్డు పాలకవర్గాలపై దృష్టి పెట్టింది. మరో వైపు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులపైనా ఆరా తీస్తోంది. అయితే, నామినేటెడ్ ప‌ద‌వుల్లో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని  కూటమిలోని మూడు పార్టీల నేత‌లూ ఆయా పార్టీల‌ అధిష్ఠానాల‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్ర‌మంలో నామినేటెడ్ ప‌దువుల భ‌ర్తీ విషయంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఓ ఫార్ములాను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్ములాను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. చంద్ర‌బాబు నిర్ణ‌యానికి కూట‌మిలోని బీజేపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు సైతం ఆమోదం తెల‌ప‌డంతో మూడు పార్టీల్లోని ద్వితీయ స్థాయి నేత‌ల్లో జోష్ నెల‌కొంది.  సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు నాయుడు కూట‌మి పార్టీల్లోని నేత‌ల మ‌ధ్య ఎలాంటి బేధాభిప్రాయాలూ త‌లెత్త‌కుండా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. పార్టీల బ‌లాబ‌లాల‌ను బేరీజు వేసుకొని ప్ర‌భుత్వంలో అంద‌రికీ త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రావ‌డానికి మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేశార‌ని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌బోయే నామినేటెడ్ ప‌దువుల్లో అన్ని పార్టీల నేత‌ల‌కూ అవ‌కాశం క‌ల్పించేలా చంద్ర‌బాబు ఓ ఫార్ములాను తయారు చేశారు. దీని ప్రకారం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల 60 శాతం నామినేటెడ్ పదవులు టీడీపీ నేత‌ల‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిసింది. మిగిలిన 40 శాతంలో 30శాతం జనసేన నేతలకు, బీజేపీకి 10 శాతం పదవులు కట్టబెడతారని తెలుస్తోంది. అదే విధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60 శాతం జనసేన పార్టీ నేత‌ల‌కు, 30శాతం టీడీపీ, 10 శాతం బీజేపీ నేతలకు నామినేటెడ్ ప‌ద‌వుల్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణయించారని సమాచారం. ఇదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి  50శాతం.. మిగిలిన 50శాతం పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరో సగం పంచుకోవాలని నిర్ణయించినట్లు కూట‌మి నేత‌లు పేర్కొంటున్నారు. చంద్ర‌బాబు తాజా నిర్ణ‌యంతో మూడు పార్టీల నేత‌ల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  రాష్ట్రంలో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి. వీటిల్లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి వుంది. వీటిల్లో ఏ పార్టీ నేత‌ల‌కు ఎక్కువ అవ‌కాశాలు ద‌క్కుతాయ‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మ‌న్ ప‌ద‌వి తెలుగుదేశం పార్టీ నేత‌ ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. మిగిలిన ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల్లో ఏర్పాటు కాబోయే పాల‌క వ‌ర్గాల్లో మూడు పార్టీల్లోని నేత‌ల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స‌మావేశాలు పూర్త‌యిన త‌రువాత నామినేటెడ్ ప‌ద‌వులపై చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, బీజేపీ నేత‌లు దృష్టిసారించ‌నున్నారు. తొలి విడ‌త‌లో 10 నుంచి 15శాతం నామినేటెడ్ ప‌దువుల‌ను భ‌ర్తీ చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ మూడు పార్టీల నేత‌ల్లో నెల‌కొంది. మొత్తానికి నామినేటెడ్ ప‌దవుల పంప‌కాల విష‌యంలో చంద్ర‌బాబు ఫార్ములా ప‌ట్ల మూడు పార్టీల నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

త‌ప్పుమీద త‌ప్పు.. పుంగనూరు పుడింగికి జైలే దిక్కు!?

ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోబోతుందా?  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చ‌వి చూసిన వైసీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌బోతుందా?  అంటే రాజకీయవర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.  వైసీపీలో కీల‌క నేత‌ అయిన  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వి కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  రామ‌చంద్రారెడ్డి చేసిన త‌ప్పులు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని తెలుతుండటంతో  హైకోర్టు ఆయ‌న‌పై అనర్హత వేటువేసే అవ‌కాశాలు  ఉన్నాయని అంటున్నారు. ఇటీవ‌ల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థులు కేవ‌లం 11 మంది మాత్ర‌మే విజ‌యం సాధించారు. వారిలో జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మిన‌హా మిగిలిన వారంతా దాదాపు కొత్త‌ వారే. దీంతో అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు.   తాజాగా పుంగ‌నూరు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వి పోయే ప్ర‌మాదం ఏర్ప‌డ‌టంతో వైసీపీ శ్రేణుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఇంత‌కీ పెద్దిరెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వి పోయే ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డింది?  ఆయనపై  హైకోర్టులో పిటిష‌న్ ఎవ‌రు దాఖ‌లు చేశారు? మదనపల్లె రికార్డుల దహనం కేసుకు.. పెద్దిరెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వి పోయే ప‌రిస్థితి ఏర్ప‌డ‌టానికి కార‌ణం ఏమిటి?  అనే విష‌యాల‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెలకొంది. మంచి చెడులతో పని లేకుండా దేనికైనా తెగించే పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ సెగ  మొదలైంది.  పెద్దిరెడ్డి పాపాల  పుట్టలు అన్నీ పగ‌ల‌బోతున్నాయ‌ని తెలుగుదేశం కూటమి నేత‌లు అంటున్నారు. మొత్తానికి రెండు కేసుల్లో పెద్దిరెడ్డి కటకటాల పాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.  వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద‌ మొత్తంలో దోపిడీకి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పెద్దిరెడ్డి దోపిడీలు  ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు  పెద్దిరెడ్డి త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో చూప‌ని ఆస్తులు చాలా ఉన్నాయ‌ని, వాటి వివ‌రాల‌తో కూడిన ప‌క్కా ఆధారాల‌తో  బీసీవై పార్టీ అధినేత బోడె రామ‌చంద్ర యాదవ్ హైకోర్టులో పిటిష‌న్ వేశాడు. ఆ పిటిష‌న్ పై హైకోర్టులో  విచార‌ణ జ‌రిగింది. ఇరు ప‌క్షాల న్యాయ‌వాదులు స‌హా, పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల అధికారి కూడా కోర్టుకు వ‌చ్చారు. పెద్దిరెడ్డి అన‌ర్హుడిగా మారితే త‌ర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి, ఇంప్లీడ్ చేయండని హైకోర్టు ఆదేశించింది.   ఈ కేసులో  ఇది కీలక పరిణామంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు..  గ‌తంలోనూ పెద్దిరెడ్డిపై ఇలాంటి కేసు న‌మోదైంది.  2014 ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పెద్దిరెడ్డి భార్య తన కంపెనీలో డైరెక్టరుగా వున్నా కూడా హౌస్ వైఫ్ అని చూపించారు. ఎన్నిక‌ల త‌రువాత పెద్దిరెడ్డిని అనర్హుడుగా ప్రకటించమని అప్పటి పుంగునూరు తెలుగుదేశం  అభ్యర్థి వెంకటరమణరాజు కోర్టుకు వెళ్లాడు. అది సుప్రీం కోర్టు వరకు చేరింది. అప్పట్లో సుప్రీం కోర్టు తీర్పు రిజర్వుచేసింది.   పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వైసీపీ  హ‌యాంలో మంత్రి హోదాలో కీల‌క వ్య‌క్తిగా చ‌లామ‌ణి అయ్యారు. ఆ స‌మయంలో వీలైన‌న్ని ప్ర‌భుత్వ భూముల‌ను త‌న భార్య‌, ఇత‌ర బినామీల పేర్ల‌పై న‌మోదు చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయన భూ దందాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌స్తున్నాయి. వాటిల్లో 142 ఆస్తుల‌ను పెద్దిరెడ్డి ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో చూపించ‌లేద‌ని రామ‌చంద్ర యాదవ్ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ఈ కేసు విచార‌ణ కీల‌క ద‌శ‌లో ఉంది. పెద్దిరెడ్డిని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించేందుకు అన్ని సాక్షాల‌ను సేక‌రించిన త‌రువాతే రామ‌చంద్ర యాద‌వ్ పిటిష‌న్ వేశారు. ఈ కేసులో పెద్దిరెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎమ్మెల్యే ప‌ద‌వికి అన‌ర్హుడిగా వేటుకు గురికావ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఈ కేసుని పూర్తిగా పరిశీలిస్తే.. దీనిలో పేర్కొన్న 142 అక్రమాస్తుల వివరాలు మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఉన్నాయి. కోర్టు విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఎన్నికల అధికారికూడా కోర్టుకి వెళ్లి సమాధానం చెప్ప‌డం కేసు  తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తున్నది. అందుకే ఈ పిటిషన్ దాఖలైనప్పటి నుండి తప్పించుకోవడానికి పెద్దిరెడ్డి, ఆయ‌న వ‌ర్గం అన్నిర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మదనపల్లె సబ్ కలక్టరేట్ లోని రికార్డులను తగలబెట్టార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.  అన్న‌మ‌య్య జిల్లా స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌య ప్ర‌మాద ఘ‌ట‌న కేసులో విచార‌ణ వేగంగా కొన‌సాగుతోంది. ఈ ప్ర‌మాదంలో మొత్తం 2,400 రికార్డులు కాలిపోయిన‌ట్లు, 700 రికార్డులు స‌గం వ‌ర‌కు కాలిపోయిన‌ట్లు అధికారులు గుర్తించారు. స‌గం కాలిపోయిన రికార్డుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న 37మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో పెద్దిరెడ్డి అనుచ‌రుడు మాధ‌వ్ రెడ్డి ప‌రారీలో ఉండ‌టంతో అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ కావ‌డంతో డీజీపీతో స‌హా ఉన్న‌తాధికారులు రంగంలోకిదిగి ఘ‌ట‌న‌కు సంబం ధించిన పూర్తి ఆధారాల‌ను సేక‌రిస్తున్నారు. ఈ కేసులో పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చుబిస్తోంది. రికార్డుల ద‌గ్దం కేసులో అన్నివేళ్లూ పెద్దిరెడ్డి అనుచ‌రుల వైపే చూపుతుండ‌టంతో పెద్దిరెడ్డికి ఉచ్చుబిగుసుకోవ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక‌వైపు హైకోర్టులో ఎన్నిక‌ల అఫిడ‌విట్ పై విచార‌ణ‌.. మ‌రోవైపు రికార్డుల ద‌గ్దం కేసు. ఈ రెండు కేసుల్లోనూ పెద్దిరెడ్డి ఇరుక్కోవ‌టం ఖాయ‌మ‌ని, ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు  ప్ర‌మాదంలో ప‌డే ప‌రిస్థితి రాబోతుంద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. అయితే, ఈ కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు పెద్దిరెడ్డి వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న ప్రచారం కూడా ఉంది. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

వారాంతం సమీపిస్తుండటంతో తిరుమలలో రద్దీ ఒక్క సారిగా పెరిగింది. గురువారం (జులై 25) వరకూ సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ శుక్రవారం  (జులై 26) నుంచి ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం (జులై 26) ఉదయం స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి, క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులకు దాదాపు 5 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. శని, ఆది (జులై 27, 28) వారాలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఇక గురువారం (జులై 25) శ్రీవారిని మొత్తం 61 వేల699 మంది దర్శించుకున్నారు. వారిలో  25 వేల 82 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చింది.  

తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం (జులై 26) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 24 గంటలలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత మూడు రోజులుగా వాతావరణం మేఘావృతమై చిరుజల్లులు, అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ భారీ వర్షం ముప్పు పొంచి ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, అప్రపమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. విపత్తు నిర్వహణా దళాలను అప్రమత్తం చేసింది.  

సీఎం రమేష్ దందాగిరి.. జనసేన ఎమ్మెల్యేల దాదాగిరి!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) చింతకుంట మునుస్వామి రమేష్, ఆయనే సీఎం రమేష్‌గా ప్రసిద్ధి. జూన్ 2019కి ముందు వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అక్టోబర్ 2018లో సీఎం రమేష్‌కి చెందిన కంపెనీ, ‘రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆఫీసులపై నాటి కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ టాక్స్, ఎన్‌ఫోర్స్‌.మెంట్ డైరక్టరేట్ (ఈడీ)లతో దాడి చేయించింది. వందకోట్ల రూపాయల అంతుచిక్కని ట్రాన్సాక్షన్స్ కనుగొన్నట్టు అప్పట్లో కేంద్ర ఏజెన్సీలు ప్రకటించాయి. సరిగ్గా దాడులు జరిగిన ఆరు నెలలు తిరక్కముందే సీఎం రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2023లో కీలకమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకి ముందు 45 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లు భారతీయ జనతా పార్టీకి చందాగా సమర్పించారు సీఎం రమేష్.  ‘ది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్స్ ఎఫైర్స్’ (సీసీఈఏ) హిమాచల్‌ప్రదేశ్‌లో 2,614 కోట్ల విలువ చేసే సున్నీ డ్యామ్ హైడ్రో ప్రాజెక్టుని అప్రూవ్ చేసింది. అప్రూవ్ అయిన తర్వాత కేవలం పది రోజుల్లో సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అంతేకాదు, ఇదే ప్రాజెక్టులో కోట్ల ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో 11 వందల కోట్ల కాంట్రాక్ట్ సీఎం రమేష్‌కి దక్కింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్‌గా సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ రమేష్ కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్టు కూడా సీఎం రమేష్ కంపెనీయే దక్కించుకోవడం విశేషం. ఇదంతా గతం. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పొత్తుల్లో బీజేపీ తరఫున అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీచేసి విజయం సాధించారు. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి దగ్గర భారత నౌకాదళం నావెల్ ఆల్ట్రనేటివ్ ఆపరేషన్స్ బేస్ (ఎన్ఏఓబీ) ప్రాజెక్టును ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం రాంబిల్లి వద్ద భారత నౌకాదళానికి భారీగా భూమిని కేటాయించింది. న్యూక్లియర్ సబ్‌మెరైన్ బేస్ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. వైజాగ్ నగరానికి దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ రాంబిల్లి నావెల్ బేస్ 1600 హెక్టార్లలో విస్తరించి వుంది. ఈ స్థావరం బంగాళాఖాతంలోకి సులభంగా చేరుకోవడానికి సముద్ర గర్భంలో లోతైన టన్నెల్, అందుకు వీలుగా పెద్దపెద్ద భారీ రాళ్ళతో కొంతమేరకు సముద్రాన్ని పూడ్చటం, లోతు చేయడం ద్వారా ప్రత్యేకమైన సముద్ర, భూగర్భ స్టోరేజ్ సౌకర్యాలు మొదలగు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎల్ అండ్ టీ, మరో సంస్థ ఈ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఇక్కడకి సీఎం రమేష్ ఎంటరై ఆ సంస్థలను తప్పుకోండి అంటూ బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిగతా పనులు తన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది అని హుకుం జారీ చేశారని సమాచారం. ‘తెలుగువన్’ సీఎం రమేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆయన ‘తెలుగువన్’కి అందుబాటులోకి రాలేదు.  బాధ్యతాయుతమైన ప్రజాసేవలో ఉన్నత పదవులు ప్రజలు కట్టబెడితే, రాజకీయ నాయకుల తీరు పూర్తి వ్యాపార ధోరణిలో తప్ప మరోలా కనిపించడం లేదు. పూర్వం ధనికులు రాజకీయాల్లోకి వస్తే తమ సర్వస్వం ప్రజాసేవకే ధారపోసేవారు. నేడు రాజకీయమంటే వ్యాపారం. కేవలం ధనార్జనగా మార్చేశారు.  టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారు. జనసేన ఎమ్మెల్యేలు తప్పుచేస్తే ‘జనసేనాని’ పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారు. మరి, రాష్ట్రంలో బీజేపీ నాయకులు తప్పు చేస్తే ఎవరు చర్యలు తీసుకుంటారు? సీఎం రమేష్ తప్పు చేస్తే ఎవరు మందలిస్తారు? బీజేపీ పార్టీ చీఫ్ పురందేశ్వరి మందలిస్తారా? లేదా ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, కేంద్ర మంత్రి అయిన శ్రీనివాస వర్మ మందలిస్తారా? ఏనుగంత బలమున్న సీఎం రమేష్‌ని ఆ పార్టీలో ఎవరు ప్రశ్నించగలరు?  అనకాపల్లి జిల్లా యలమంచిలికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తీరుపట్ల కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి పేరిట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలు జరుగుతున్నాయని, పారిశ్రామికవేత్తలందర్నీ వాటాలకోసం బెదిరింపులకు దిగుతున్నారని, ఇది ఏమాత్రం సహించరానిదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో యలమంచిలి నియోజకవర్గ కేంద్రం పరిధిలోని అచ్యుతాపురం కేంద్రంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలు పలువురు, విజయకుమార్ వైఖరి ఇలాగే కొనసాగితే తాము పారిశ్రామిక యూనిట్లను మూసివేయడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇంతకుముందు ప్రస్తావించిన రాంబిల్లి నావికాదళం ప్రాజెక్టు కాంట్రాక్టర్లను కూడా ఈయనగారు బెదిరించినట్టు ఫిర్యాదులు అందాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తీవ్రంగానే మందలించారని తెలిసింది. పెందుర్తి నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలిసింది.  పెందుర్తి నియోజకవర్గంలోని ఫార్మా పార్కులో వందలాదిమంది పారిశ్రామికవేత్తలు వున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పేరిట తమకు బెదిరింపులు, వేధింపులు వస్తున్నాయంటూ కొందరు ఇప్పటికే అటు తెలుగుదేశం అధిష్ఠానానికి, ఇటు జనసేన అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. వీటిని దృష్టిలో వుంచుకుని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వైఖరిని సహించేది లేదని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకని, శాసనసభ్యులు అందరితో ఆయన మాట్లాడినప్పుడు, రౌడీయిజం చేస్తే సహించేది లేదని, అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా నేను సిద్ధమని ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారని తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి గూండా పార్టీని ఎదిరించి వచ్చినవాడినని... బెదిరింపులు, దౌర్జన్యాల్లాంటి పనులు చేస్తే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రజాస్వామ్య విధానాలను అపహాస్యం చేసినా, రౌడీయిజం చేసినా మీరు ఎంతటి వారయినా, మీరు పార్టీకి ఎంత విధేయులైనా వదులుకోవడానికి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారని తెలిసింది. అప్పుడే కొంతమంది శాసనసభ్యులు పాదాభివందనాలు చేయించుకుంటూ వుండటం, కార్యకర్తలు, ప్రజల పట్ల తలబిరుసుగా వ్యవహరిస్తూ వుండటం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. శాసనసభ్యులుగా గెలిచిన వారికి సభ్యత, సంస్కారాలు నేర్పాల్సిన అవసరం లేదని, మర్యాదగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నానని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. 

విజయసాయిరెడ్డికి రాజ్యసభలో వార్నింగ్!

వైసీపీ పక్షవాతం వచ్చి, మూలన పడి, అంతిమ ఘడియల్లో వుంది. అలాంటి వైసీపీకి వెన్నెముక లాంటి విజయసాయి రెడ్డి మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో రకరకాల చెత్త వాగుతారన్న సంగతి అందరికీ తెలిసిందే. పరమ పవిత్రమైన రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు చేస ప్రయత్నం చేయబోగా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో వున్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఉన్నత స్థానంలో వున్న చంద్రబాబు గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు అని ఆయన వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి తన ధోరణిలోనే చెప్పుకుంటూ వెళ్ళడంతో హరివంశ్ సీరియస్ అయ్యారు. మీరు చేస్తున్న  ఆరోపణలు కరెక్ట్ కాదు.. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మీరు నాకు సాయంత్రం లోపు అందజేయాలి.. లేకపోతే మీరు చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలి అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. 

ఆంధ్రా ఎస్కోబార్ మిస్టర్ జగన్!

జగన్ ఢిల్లీ వెళ్ళి ఎంత మొత్తుకున్నా అరణ్య రోదనే అయిపోయింది. ఆయన గోలని నేషనల్ మీడియా ఎంతమాత్రం పట్టించుకోలేదు. అయితే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల  చేశారు. జగన్ రాక్షస పరిపాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు యథేచ్ఛగా జరిగాయని చెప్పారు. జగన్ ఆంధ్రా ఎస్కోబార్ లాంటివాడు అన్నారు. అంతే, నేషనల్ మీడియా ఈ పాయింట్‌ని అంది పుచ్చుకుంది. జగన్‌ని అంతర్జాతీయ డ్రగ్స్ క్రిమినల్ పాబ్లో ఎస్కోబార్‌తో పోలుస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది.  ఏ నేషనల్ ఛానల్‌లో చూసినా జగన్... ఎస్కోబార్.. ఇవే కథనాలు ప్రసారం అవుతున్నాయి. 

‘నీట్’ రివైజ్డ్ రిజల్ట్స్ విడుదల!

‘నీట్’ తుది ఫలితాలను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం నాడు విడుదల చేసింది. మరోసారి నీట్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రివైజ్డ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో 4.2 లక్షల మంది విద్యార్థులు 5 మార్కులను కోల్పోయారు. దీంతో టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్య 61 నుంచి 17కి తగ్గింది.  ఫిజిక్స్ విభాగంలోని ఆటమిక్ థియరీకి సంబంధించి 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు వున్నాయని, దేన్ని ఎంపిక చేసినా మార్కులిచ్చారని ఆరోపిస్తూ ఒక విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక అందించాలని ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ఈ క్రమంలోనే సంబంధిత ప్రశ్నకు రెండు సమాధానాలు లేవని, ఒక్క సమాధానం మాత్రమే వుందని సదరు ప్రశ్నకు ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానమని నిపుణుల కమిటీ కోర్టుకు నివేదించింది. దీంతో ఆప్షన్ 4ను ఎంచుకున్న వారికే మార్కులను ఇవ్వాలని ధర్మాసనం పరీక్ష నిర్వాహకులను ఆదేశించింది. దాంతో నీట్ రివైజ్డ్ ఫలితాలను విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడింది. తాజా ఫలితాలలో సుమారు 4 లక్షల 20 వేల మంది విద్యార్థులు 5 మార్కులు కోల్పోయారు. సదరు ప్రశ్నకు రావలసిన 4 మార్కులతోపాటు తప్పు సమాధానం రాసినందుకు 1 మార్కు చొప్పున  మొత్తం 5 మార్కులు కోల్పోవాల్సి వచ్చింది. నీట్’లో 720 మార్కులకు గాను 720 మార్కులు సాధించిన 61 మందిలో ఈ ప్రశ్నకు తప్పు సమాధానం రాసిన వారు 44 మంది వున్నారు. దాంతో వారి స్కోరు కూడా మారిపోవడంతో మొదటి ర్యాంకు సాధించిన వారి సంఖ్య 17కి తగ్గింది.

వేరీజ్ రోజా!?

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఇటీవలి కాలంలో ఎక్కడా వినిపించలేదు.. కనిపించలేదు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నిత్యం మీడియా ముందకు వచ్చి విపక్ష నేతలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న రోజా.. వైసీపీ ఓటమి, నగరిలో స్వయంగా తన పరాజయం తరువాత సైలెంటైపోయారు. ఓటమి తరువాత ఒకటి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడానని మమ అనిపించినా ఆ తరువాత మాత్రం ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మధ్యలో తమిళనాడులోని ఓ దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో సెల్ఫీ వీడియో విషయంలో ఆమె చేసిన ఓవరేక్షన్ వికటించింది.  వరుసగా రెండు సార్లు నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రోజా.. జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా కూడా పని చేశారు. మంత్రి కావడానికి ముందు జబర్దస్త గా నిత్యం టీవీలో కనిపిస్తూ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు బాగానే చేశారు. ఆ టీవీ షోలోనే పలు సందర్భాలతో తన సినీ హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా తనకు వచ్చిన గుర్తింపు కంటే జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పుకున్నారు. అటువంటి రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జబర్దస్త్ షోకు దూరమైనా, ప్రతిపక్ష పార్టీల నేతలపై తన దురుసు మాటలు, అనుచిత విమర్శల ద్వారా నిత్యం ప్రజలలో ఉన్నారు. అదే ఎన్నికలలో తన విజయానికి బాటలు వేస్తుందని భ్రమించారు. సరే ఎన్నికలలో వైసీపీని జనం ఓడించారు. నగరిలో రోజాను ఛీ కొట్టారు. పోలింగ్ జరిగిన రోజునే  తన ఓటమిని అంగీకరించేసి, సొంత పార్టీ వాళ్లే తనకు వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణలు గుప్పించిన రోజా ఆ తరువాత అంటే ఫలితాలు వెల్లడి అయిన తరువాత.. మంచి చేసి కూడా ఓడిపోయాం అంటూ ముక్తాయించారు.   సరే అదంతా పక్కన పెడితే కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులపై కానీ, తమ పార్టీ అధినేత రాష్ట్రంలో వైసీపీ వాళ్లపై అధికార పక్షం దాడులు, హత్యలకు పాల్పడుతోందంటూ ఊరూవాడా ఏకమయ్యేలా గగ్గొలు పెడుతున్నా రోజా నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాకపోవడం ఏమిటని వైసీపీ వర్గాలే  ఆశ్చర్యపోతున్నాయి. మరో వైపు పరిశీలకులు ఆమె ఏపీ రాజకీయాలకు దూరం జరిగి తమిళనాడుకు షిఫ్ట్ అయిపోయేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. తన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇటు తెలుగు, అటు తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టే చాన్స్ రోజా పోగొట్టుకున్నారని, ఇప్పుడు భవిష్యత్ అగమ్యగోచరంగా మారి మౌనముద్ర వహించారని అంటున్నారు. అయితే రోజా సైలెంటైపోవడంపై నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.   

ఆ ముప్పియ్యారు పేర్లేంటి జగ్గూ?

దొంగలముఠా నాయకుడు జగ్గు తన దొంగల ముఠాకి చెందిన ముప్పియ్యారు మందిని అధికార పార్టీ వాళ్ళు చంపేశారని అంటూ చెవి కోసిన మేకలాగా లబోదిబో అంటున్నాడు. వంక దొరకనమ్మ డొంకని పట్టుకుని ఏడ్చిందన్నట్టు నీ వ్యవహారం వుంది. నీ దరిద్రపు బుద్ధి, నువ్వు, నీ నీచ నికృష్ట బ్యాచ్ చేసిన దారుణాల కారణంగానే నువ్వు ఈరోజు సర్వనాశనం అయిపోయావు. అయినప్పటికీ నీకు బుద్ధి రాలేదు. నోటికొచ్చిన వాగుడు వాడుతూ, ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తూ... నీ బుద్ధి, కుక్కతోక సేమ్ టు సేమ్ అని ప్రూవ్ చేసుకుంటున్నావ్. నీ పరువు స్టేట్ లెవల్లో తీసుకుని సరిపెట్టుకోకుండా, సెంట్రల్ లెవల్లో కూడా తీసుకున్నావ్. నోరు తెరిస్తే చాలు.. ముప్పియ్యారు.. ముప్పియ్యారు.. అంటావే తప్ప, ఆ ముప్పియ్యారు పేర్లేంటో చెప్పవయ్యా బాబూ అంటే ‘టాపిక్ డైవర్ట్ చేయొద్దు’ అంటూ నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్. ఆ ముప్పియ్యారు మంది పేర్లేంటో చెప్పు నాయనా, విచారణ జరిపిస్తామని అధికార పార్టీ వాళ్ళు అంటుంటే చప్పుడు చేయవేంటి? మొత్తం చనిపోయినవాళ్ళు నలుగురు. వాళ్ళలో ముగ్గురు అధికారపార్టీ వాళ్ళు, ఒకరు నీ పార్టీ వాళ్ళు అని అధికారికంగా కూడా చెబుతున్నారు కదా? నువ్వు అన్నట్టుగా ముప్పియ్యారే కరెక్టు అయినప్పుడు ఆ పేర్లేంటో చెప్పు జగ్గూ!  ప్రూవ్ చేసుకునే సత్తా లేనప్పుడు ఈ చెత్త వాగుడు అంతా వాగడం ఎందుకు? నీ లోపల బుద్ధి, సిగ్గు, మానం, అభిమానం, గౌరవం లాంటివేవైనా మిగిలి వుంటే, ముప్పియ్యారు.. ముప్పియ్యారు అని మొత్తుకోవడం కాకుండా, ఆ ముప్పియ్యారు మంది పేర్లు ఇవ్వు. వాళ్ళు నీ పార్టీలో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారో చూపించు. అప్పుడు అరువు ముప్పియ్యారు.. ముప్పియ్యారు... అని. ఇలా చేయలేకపోతే చప్పుడు చేయకుండా కూర్చో!

తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి 10వేల కోట్లు!

తెలంగాణ వార్షిక బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేశారు. తెలంగాణ ఆర్థిక మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల రూపాయలతో  రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన భట్టి.. తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ మహానగరం అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంత భారీగా హైదరాబాద్ నగరానికి కేటాయింపులు జరపడం ఇదే మొదటి సారి. విశ్వనగరంగా మారుస్తున్నాం అంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ హైదరాబాద్ కు బడ్జెట్ లో  ఈ స్థాయి కేటాయింపులు జరిగిన దాఖలాలు లేవు. ఈ పది వేల కోట్ల రూపాయలలో 3,065 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల కల్పనకు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక సదుపాయల కల్పనకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మోట్రోవాటర్ వర్క్స్ కు   3,385 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక హైడ్రా కు 200 కోట్ల రూపాయలు, మెట్రో రైలు ను విమానాశ్రయం వరకూ విస్తరించేందుకు  100  కోట్ల రూపాయలు కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రెండు వందల కోట్ల రూపాయలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు.  అలాగే మెట్రోరైల్ విస్తరణకు 500, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు.  అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రిక లాంటి ముసీ సుందరీకరణ ప్రాజెక్టుకు 1500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు.