జగన్ హస్తిన ధర్నా అట్టర్ ఫ్లాప్

జగన్ హస్తిన ధర్నా ఘోరంగా విఫలమైంది. ఎంత ప్రయత్నించినా ఆయన ధర్నాకు జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్  పెద్దగా లేదు. ఎంతో కష్టపడి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల పార్టీల నేతలను ధర్నాకు తీసుకురాగలిగినా.. వారెవరూ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న మాట పొరపాటున కూడా నోటి వెంట రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఏదో మొహమాటానికి వచ్చినట్లుగా వచ్చి ధర్నాలో కూర్చుని వెళ్లిపోయినట్లుగా వారి తీరు కనిపించింది.  ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ జగన్ హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అదే ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ ధర్నా కంటే ఆయన నిరసనకే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.  అయితే పరిశీలకులు మాత్రం జగన్ ధర్నా ఒక సాకు మాత్రమేననీ, ఆయన హస్తిన టూర్ అసలు ఉద్దేశం వేరే ఉందని అంటున్నారు. అఖిలేష్ ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లాలన్నది ఒక ప్లాన్ కాగా, ఎలాగో అలా బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ సాధించి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం కాకుండా చూసుకోవాలన్నది మరో ప్లాన్ అని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు అఖిలేష్ ను అతి కష్టమ్మీద ధర్నాకు తీసుకువచ్చారని అంటున్నారు. ఆయన ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానంతో టచ్ లోకి వెళ్లాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. పనిలో పనిగా బీజేపీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కూడా కోరానని చెబుతున్నారు. ఆ కారణంగానే హస్తినలో ధర్నా అయిపోయినా జగన్ ఇంకా అక్కడే మకాం వేశారని చెబుతున్నారు.  ఇది పక్కన పెడితే ధర్నా ముందూ, తరువాత కూడా మీడియాతో మాట్లాడిన జగన్ ఆవు కథ చెప్పడానికే పరిమితమయ్యారు.  జాతీయ మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి అస్సలు ఇష్ట పడలేదు.  తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారం చేపట్టిన అనంతరం జరిగిన హింసాకాండలో మరణించిన వారి పేర్లు చెప్పమన్న మీడియా ప్రశ్నకు ఇక్కడ ఫొటో ఎగ్జిబిషన్ చూడండి, టాపిక్ ను డైవర్ట్ చేయకండి అంటూ అసహనం చేశారు. జగన్ మీడియాతో మాట్లాడిన రెండు సార్లూ కూడా స్వోత్కర్ష్, పర నిందకే ప్రాధాన్యత ఇచ్చారు. తన హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉందనీ, ఎక్కడా కక్ష సాధింపు ధోరణి, హింసాకాండా లేదనీ చెప్పుకుని తన భుజాలను తానే చరిచేసుకున్నారు. అదే  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నిండా 45 రోజులు కూడా కాకుండానే రాష్ట్రం అగ్ని గుండంలా మారిందనీ, రాజకీయ హింస ప్రజ్వరిల్లిందనీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయనీ గగ్గోలు పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జగన్ ధోరణితో వైసీపీ నేతలే నివ్వెర పోయారు. జగన్ తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మదనపల్లె కేసు.. నిప్పులాంటి నిజాలు!

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయ దహనం కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది.  ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. పైల్స్ దహనమైన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం కేసు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.గత ఆదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కొందరు దుండగులు ఆదివారం తగులబెట్టారు. ఈ ఘటనలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, దస్త్రాలు కాలిపోయాయి. అంతకుముందు కొన్ని నిమిషాల ముందు వరకు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తో పాటు పలువురు సిబ్బంది అక్కడే ఉన్నారు.  ఈ ఘటనపై పోలీసులు దర్యాఫ్తు జరిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేసే ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు 37 మంది సిబ్బందిని, పూర్వ ఆర్డీవో మురళిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఎవరెవరికి ఫోన్ చేశారు... ఎందుకు చేశారు? అనే కోణంలో విచారిస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వానలే వానలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వచ్చే మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ముసురు పట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా పలు జిల్లాల్లో వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. అయితే గురువారం జులై 25) నుంచి  మూడు రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  గురు, శుక్రవారాల్లో (జులై 25, 36) ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.   ఇక తెలంగాణకూ భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం (జులై 25) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

జగన్ ధర్నాకు అఖిలేష్ హాజరు వెనుక కేసీఆర్!?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత రాష్ట్రంలో పార్టీ ఉనికి కోసం చెమటోడుస్తూ కూడా తన మిత్రుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తన వంతు సహకారం అందిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇటు తెలంగాణలో కేసీఆర్.. అటు ఆంధ్రలో జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో స్వప్రయోజనాల పరిరక్షణ కోసం పరస్పరం ఏ విధంగా సహకరించుకున్నారో తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం కోసం కేసీఆర్ చేయగలిగినంతా చేశారు. తెలంగాణ నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చంద్రబాబుకు ఎటువంటి సహకారం అందకుండా తన వంతు సహాయాన్ని జగన్ కు అందించారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ వెటకారపు వ్యాఖ్యలూ చేశారు. ఏపీలో   ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో విఫలమై, తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో కూడా కేసీఆర్ తన సహకారాన్ని కొనసాగించారు. అలాగే జగన్ కూడా గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  సాగర్ వద్ద హంగామాతో కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఎన్నికలలో లబ్ధి చేకూర్చడానికి జగన్ విఫలయత్నం చేశారు. సరే ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై కేసఆర్ విపక్ష నేత పాత్రకు పరిమితమయ్యారు. అది వేరే సంగతి. తెలంగాణలో బీఆర్ఎస్ పరాజయం అయినా కేసీఆర్ మాత్రం ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు ఢోకా ఉండదని భావించి, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం, జగన్ మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ.. సార్వత్రిక ఎన్నికలకు మందు సందర్భం ఉన్నా లేకపోయినా చెబుతూ వచ్చారు. కానీ కేసీఆర్ చెప్పినట్లు జరగలేదు. ఆయన ఆశించినట్లు జగన్ సీఎం అవ్వలేదు సరికదా, ఆయన పార్టీకి కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు.  తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఆ ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ విమర్శల గళం ఎత్తుకుందో, అదే విధంగా ఏపీలో వైసీపీ కూడా తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచీ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అంటూ గళమెత్తడం ప్రారంభించింది. అంతే కాకుండా హస్తిన వేదికగా ధర్నాకు కూడా దిగింది. వైసీపీ అధినేత జగన్ హస్తినలో నిర్వహించిన ధర్నాకు.. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ హాజరయ్యారు. నిన్న మొన్నటి దాకా బీజేపీతో అంటకాగిన జగన్ కు మద్దతుగా అఖిలేష్ రావడమేంటని రాజకీయ  పండితులను సైతం విస్తుపోయారు. అయితే ఢిల్లీలో జగన్ ధర్నాకు అఖిలేష్ మద్దతు పలకడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇంకా బీజేపీని పట్టుకు వెళాడితే లాభం లేదనీ, కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం కీలక భాగస్వామి కనుక.. జగన్ కు అక్రమాస్తుల కేసుల నుంచి రక్షణ కల్పించే విషయంలో బీజేపీ ముందుకు వచ్చే అవకాశం లేదనీ జగన్ భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ టచ్ లోకి వెడితే, వీలైతే.. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే.. ఏదో మేరకు కాంగ్రెస్ తనకు అండగా నిలుస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లడానికి జగన్ కు  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అవసరమైందనీ అంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ తో తనకున్న పరిచయం ద్వారా కేసీఆర్ జగన్ ధర్నాకు హాజరు కావాల్సిందిగా కోరారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మాట తీసేయలేకే అఖిలేష్ జగన్ ధర్నాకు హాజరయ్యారంటున్నారు. అఖిలేష్ ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నందున, ఆయన ద్వారా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లాలని కేసీఆర్ జగన్ కు సలహా ఇచ్చారంటున్నారు. అందుకే ధర్నా అయిపోయిన తరువాత కూడా జగన్ ఏపీకి రాకుండానే కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కోసం ఎదురు చూస్తూ హస్తినలోనే మకాం వేశారని అంటున్నారు. పేరుకు రాష్ట్రపతి, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ కోసం అని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో రైల్వేలకు 9,151 కోట్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంవత్సరం రైల్వేలకు 9,151 కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన దానికంటే ఈ ఏడాది పదింతలు పెంచామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వంద శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందన్నారు. ఏపీలో 73,743 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. "అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర 2,047 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించాం. రైల్వే పనులపై డీపీఆర్‌ని నీతి ఆయోగ్ ఆమోదించింది. మరికొన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశముంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు స్థలం కేటాయింపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. భూమి కేటాయించాలని అధికారులను ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు” అని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణాలో రైల్వే లైన్లు వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ జరిగాయి. రాష్ట్రంలో 32,946 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అమృత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా అభివృద్ధి చెందాయని అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

జగన్ దగ్గరకి రాకుండా వుండాల్సింది.. అఖిలేష్ పశ్చాత్తాపం!

లెవన్, శవన్ అలియాస్ జగన్ ఢిల్లీలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి అనవసరంగా వచ్చినట్టు సమాజ్‌వాది పార్టీ నాయకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాలుక కరుచుకున్నట్టు తెలుస్తోంది. జగన్ అసలు స్వరూపం గురించి సరిగా తెలియకపోవడం, విజయసాయిరెడ్డి తదితరులు అఖిలేష్ యాదవ్ దగ్గరకి వెళ్ళి కాళ్ళావేళ్ళా పడటంతో ఆయన జగన్ ధర్నా దగ్గరకి వచ్చారు. ఒక్క అఖిలేష్ యాదవ్ తప్ప చెప్పుకోదగ్గ నాయకులెవరూ అక్కడకి రాలేదు. జగన్ దగ్గరకి వచ్చిన అఖిలేష్ యాదవ్, ఇంకా ప్రముఖ నాయకులందరూ వస్తున్నారని, భూమి బద్దలు కాబోతోందని చెప్పారు కదా.. వాళ్ళందరూ ఏరి అని విజయసాయిరెడ్డి తదితరులను ప్రశ్నించారు. దాంతో వీళ్ళు ఆయనకు ఏదో చెప్పి మేనేజ్ చేశారు. ఇదేదో తేడా వ్యవహారం లాగానే వుందని అనుకుంటూ, అఖిలేష్ యాదవ్ అక్కడ నుంచి తిరిగి వెళ్ళే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన, జగన్ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న జడ్జి రామకృష్ణ అఖిలేష్ దగ్గరకి వెళ్ళారు. ఆయనకి ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డిల నేర చరిత్ర గురించి, వాళ్ళ అసలు స్వరూపం గురించి పూస గుచ్చినట్టు వివరించారు. అప్పటికి గానీ, తాను సంఘీభావం తెలిపింది ఒక క్రిమినల్‌కి అనే విషయం అఖిలేష్ యాదవ్‌కి అర్థం కాలేదు. ఈ క్రిమినల్ దగ్గరకి మనం అనవసరంగా వచ్చాం, ఇక్కడకి రాకుండా వుండాల్సింది అని అఖిలేష్ యాదవ్ అక్కడే వున్న తన సహచరులతో అన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ పరువు జాతీయ స్థాయిలో పోయినట్టు అయింది.

ఫోన్ ట్యాపింగ్ లో మరో ఆసక్తికర పరిణామం... బాధితుల్లోజర్నలిస్ట్ లు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇప్పటివరకు విచారణలో తేలగా తాజాగా జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు తేలింది. ఈమేరకు విచారణ అధికారులు జర్నలిస్టులకు సమాచారం అందించారు. ఏకంగా 36 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకారం బిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీకి 70 ఎకరాలు అప్పగించాలి, కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయే వరకు కూడా  ఆ స్థలాలు అప్పగించలేదు.సుప్రీం తీర్పు తర్వాత టీం జెఎన్ జె బృందం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా, అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేత పేట్ బషీర్ వద్ద ధర్నా చేపట్టడం వంటి కార్యక్రమాలను టీం జెఎన్ జె చేపట్టింది. పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి, మల్లురవి వంటి నేతలు టీం జెఎన్ జెకు సంఘీభావం తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో జెఎన్ జె హౌజింగ్ సొసైటీ ఎన్నికలు జరగలేదు. ఈ  ఎన్నికలు జరుగకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా  అడ్డుకుంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత టీం జెఎన్ జె సభ్యులైన  రమణారావు, అశోక్ రెడ్డిలు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. జెఎన్ జె హౌజింగ్ సోసైటీ ఎన్నికల్లో అత్యధిక వోట్లతో రమణారావ్ గెలుపొంది చర్చనీయాంశమయ్యారు. టీం జెఎన్ జె సభ్యులైన రమణారావ్, అశోక్ రెడ్డి, హసన్ షరీఫ్, బోడపాటి శ్రీనివాస్, నాగభూషణరావు ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం.  ఫోన్ ట్యాప్ కు గురైన జర్నలిస్టులకు ఫోన్లు చేసి పోలీసులు అసలు విషయం చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. గతేదాది మార్చి నుంచి అక్టోబర్ వరకు జర్నలిస్టుల కాల్ డేటా గురించి పోలీసులు క్షుణ్ణంగా వివరించడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారని సమాచారం. పోలిసుల సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు వెళ్ళిన కొంతమంది జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయా..? అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరితో ఎక్కడ మాట్లాడారు..? ఎంతసేపు మాట్లాడారు..? ఎక్కడెక్కడ ప్రయాణించారు..? అనే విషయాలను పోలీసులు స్పష్టంగా వివరించడంతో జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయని నిర్ధారణకు వచ్చారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టులలో ఎవరికైనా నాటి ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వేధింపులు ఎదురయ్యాయా..?అని జర్నలిస్టులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు వినియోగించుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ బీట్ చూసే జర్నలిస్టులను టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులే కాకుండా పత్రికల్లో పని చేసే జర్నలిస్టులపై కూడా నిఘా పెట్టారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టులను పిలిచి…ఈ అంశంపై మీద ఫిర్యాదు చేయాలనుకుంటే దర్యాప్తు చేపడుతామని పోలీసులు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

షర్మిల పగ ఇప్పట్లో చల్లారేట్టు లేదు!

సాధారణంగా అన్నాచెల్లెళ్ళ మధ్య కోపతాపాలు, పగలు ప్రతికారాలు ఎక్కువకాలం వుండవని అంటూ వుంటారు. వదిన కారణంగానో, ఆస్తిపాస్తుల కారణంగానో అన్నాచెల్లెళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పటికీ, ఏదో ఒక సందర్భంలో చెల్లెమ్మతో అన్నయ్య ‘బాగున్నావా చెల్లెమ్మా’ అంటే, సదరు చెల్లెలు మురిసిపోతుంది. అలాగే సదరు అన్నయ్యతో చెల్లెమ్మ ‘మంచిగున్నావా అన్నయ్యా’ అంటే సదరు అన్నయ్య కరిగిపోతాడు. ఇక అప్పట్నుంచి వాళ్ళిద్దరూ ‘‘అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మజన్మల సంబంధం’’ అని పాటలు పాడుకుంటూ తమ అనుబంధాన్ని కొనసాగిస్తారు. అయితే జగన్, షర్మిల విషయంలో మాత్రం మాత్రం పైన పేర్కొన్న కరిగిపోవడాలు, మురిసిపోవడాలు లాంటివేవీ కనిపించటంలేదు.. కేవలం ముదిరిపోవడాలు.. మురిగిపోవడాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘చెల్లెమ్మా’ అనడానికి జగన్ రెడీగా వున్నప్పటికీ, ‘వెళ్ళమ్మా’ అనే విధంగానే షర్మిల వ్యవహార శైలి కనిపిస్తోంది. మొత్తానికి జగన్ ఏ విషయంలో షర్మిలకు అన్యాయం చేశాడోగానీ, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరక ముందుకు వరకు జగన్ మీద తనకున్న వ్యతిరేకతను అంతగా బయటపెట్టలేదు. ఎప్పుడైతే ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిందో, అప్పటి నుంచి ఆమెలో వున్న ‘చంద్రముఖ’, ‘అపరిచితురాలు’ బయటకి వచ్చారు. జగన్‌ని ఎడాపెడా విమర్శించడం ప్రారంభించారు. ఆ విమర్శలు కూడా ఏదో తూతూమంత్రం విమర్శలు కాదు.. జగన్ నషాళానికి అంటే విమర్శలు... జగన్ అండ్ పార్టీ కక్కలేని, మింగలేని విమర్శలు. జగన్‌ని వేరే ఎవరైనా విమర్శిస్తే బూతులతో రెచ్చిపోయే జగన్ పార్టీ మూకలు షర్మిల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి వచ్చింది. వేరేవాళ్ళని తిట్టినట్టుగా షర్మిలని తిడితే అది తిరిగి తమ పీకకే చుట్టుకుంటుందన్న భయంతో తమను తాము కంట్రోల్ చేసుకున్నారు.  అప్పటి వరకు బాబాయ్ హత్య గురించి మరచిపోయిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాగానే ‘హు కిల్డ్ బాబాయ్’ అనే ప్రశ్నను ఒక బాణంలాగా తయారు చేసుకుని జగన్ మీదకి వదిలారు. అలాగే మరో చెల్లెలు, వివేకా కుమార్తె సునీత కూడా షర్మిలకు తోడు రావడంతో ఇద్దరూ కలసి జగన్‌ని ఒక ఆట ఆడుకున్నారు. ఎలక్షన్ సందర్భంగా వీళ్ళు పెట్టిన శాపనార్థాలు కూడా జగన్ తుక్కుతుక్కుగా ఓడిపోవడానికి ఒక కారణంగా కొంతమంది భావిస్తూ వుంటారు. జగన్‌ని షర్మిల వందరకాలుగా విమర్శిస్తుంటే తట్టుకోలేక జగన్ ఒకే ఒకసారి ఆమెని విమర్శించాడు. అది కూడా ఆమె కట్టుకున్న చీర రంగు గురించి మాట్లాడాడు. అంతే, ఆ పాయింట్ పట్టుకుని షర్మిల జగన్‌ని ఎడాపెడా వాయించేసింది. ఆ తర్వాత షర్మిల విషయంలో జగన్ కిక్కురుమంటే ఒట్టు. షర్మిల తన మదర్ సెంటిమెంట్ ప్రయోగించి తల్లి విజయమ్మని కూడా జగన్‌కి విజయవంతంగా దూరం చేసేసింది. జగన్ బారి నుంచి తప్పించుకుని అమెరికా వెళ్ళిపోయిన విజయమ్మ అక్కడ నుంచి ‘షర్మిలకు ఓటు వేయండి’ అంటూ ఏపీ ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. అంటే జగన్‌కి ఓటు వేయొద్దని చెప్పకనే చెప్పారు. కన్నతల్లిని కూడా జగన్‌కి వ్యతిరేకం చేసేసిన పవర్‌ఫుల్ పగ షర్మిలది. అందరి కృషితోతోపాటు షర్మిల శాపనార్థాలు కూడా ఫలించి జగన్ ఎన్నికలలో తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. అయినప్పటికీ అన్నయ్య మీద షర్మిలకు జాలి కలగలేదు. చచ్చిన పాముని ఇంకా చంపడం ఎందుకులే అనే సానుభూతి కూడా కలగలేదు. జగన్ అధికారంలో వున్నప్పుడు అన్నయ్యని ఏ స్థాయిలో విమర్శించిందో అధికారం కోల్పోయిన తర్వాత కూడా విమర్శల డోసు ఎంతమాత్రం తగ్గలేదు. ప్రభుత్వ పథకాలను జగన్ అండ్ కో విమర్శిస్తే, ప్రభుత్వం కంటే ముందే షర్మిల ముందుకొచ్చి జగన్ మీద విమర్శలు గుప్పిస్తోంది. తమరి పరిపాలనలో ఏం వెలగబెట్టారో ముందు అది చెప్పమని సవాళ్ళు విసురుతోంది. జగన్ ఓడిపోయిన తర్వాత దారిలోకి వచ్చి, చెల్లితో సయోధ్య కుదుర్చుకుందామని అనుకున్నా షర్మిల పడనివ్వలేదు.  లేటెస్ట్.గా జగన్ ప్రతిపక్ష హోదా కావాలంటూ కోర్టుకు వెళ్తే, షర్మిల వెటకారంగా ప్రతిస్పందన తెలిపింది. జగన్ ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకి వెళ్ళాడని, కానీ ప్రతిపక్ష హోదా కావాలి అంటే అసెంబ్లీకి వెళ్ళాలి అంటూ హితవు పలికింది. అసెంబ్లీకి వెళ్లకుండా డిల్లీలో సొంత పార్టీని నిలబెట్టుకునేందుకు ధర్నా చేస్తున్నాడు అని మండిపడింది. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి స్వలాభం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడని విమర్శించింది. ఎవరో కార్యకర్త మర్డరయ్యాడని ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌కి సొంత బాబాయ్‌ హత్య విషయంలో మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చెయ్యాలని అనిపించలేదా అని ప్రశ్నిస్తోంది. నిజమే కదా? మొత్తానికి జగన్ మీద షర్మిల పగ ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ పగ ఎప్పటికీ చల్లారకపోతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదని పరిశీలకులు అంటున్నారు.

విపక్ష హోదా.. జగన్ కు ఆ అర్హత లేదు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును లెక్క చేయడం లేదు. విపక్ష హోదాకు వైసీపీ తగదని విస్పష్టంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అలాగే జగన్ కు విపక్ష నేతగా ఉండే అర్హత లేదని తేల్చేశారు. అయినా జగన్ మాత్రం విపక్ష హోదా కోసం తహతహలాడుతున్నారు. ఆ హోదా ద్వారా తనకు కేబినెట్ ర్యాంక్, తద్వారా దక్కే గౌరవం కోసం వెంపర్లాడుతున్నారు. ఇందు కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తన తీరు ద్వారా తనకు విపక్ష నేత హోదా అర్హత లేదని తనకు తానే రుజువు చేసుకుంటున్నారు.  జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చకు గైర్హాజర్ అవ్వడం ద్వారా రాజకీయనాయకుడిగా తన బాధ్యతా రాహిత్యాన్ని జగన్ చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక కారణం.  ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని విస్పష్టంగా చెప్పింది. ప్రజలు కూడా ఈ చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అది వేరే సంగతి. ఇప్పుడు ఈ చట్టం రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చకు జగన్ గైర్హాజరు అయ్యారు. అసలు సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా లేరు.  అంటే తాను తీసుకువచ్చిన చట్టాల విషయంలో తనకు ఇసుమంతైనా బాధ్యత లేదని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  అంటే తన ప్రభుత్వం తీసుకువచ్చిన  చట్టాన్ని సమర్ధిస్తూ అసెంబ్లీలో తన గళాన్ని బలంగా వినిపించే ఒక మంచి అవకాశాన్ని జగన్ సభకు గైర్హాజర్ కావడం ద్వారా చేజార్చుకున్నారు.  అలా చేజార్చుకోవడమే కాదు.. తాను తీసుకువచ్చిన చట్టం వల్ల ప్రయోజనం లేదనీ, ఇది ప్రజా వ్యతిరేక చట్టమనీ పరోక్షంగా అంగీకరించేసినట్లైంది. ఇలా తన బాధ్యతారాహిత్యాన్ని చాటుకుని జగన్ తనకు విపక్ష నేత హోదా అర్హత లేదని తానే రుజువు చేసుకున్నట్లైందని పరిశీలకులు అంటున్నారు.  

జగన్ ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు.. జగన్ ది సెల్ఫ్ గోలేనా?

రాజకీయ హింసాకాండతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతోందని ఆరోపిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు. తనకున్న 11 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు, పార్టీ రాజ్యసభ సభ్యులతో హస్తిన వేదికగా ఆయన చేసిన ధర్నా ఒక విధంగా సెల్ఫ్ గోలేనంటున్నారు పరిశీలకులు. ఈ ధర్నా ద్వారా జగన్ తాను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చేరువ అవుతున్నాన్న సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ హాజరు కాలేదు కానీ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన సమాజ్ వాదీ పార్టీ. అన్నాడీఎంకే, శివసేన రెండు గ్రూపులు, ఐయుఎంఎల్ పార్టీలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. అయితే అలా హాజరైన వారిలో అఖిలేష్ యాదవ్ ను మినహాయిస్తే మిగిలిన ఎవరూ పెద్దగా గుర్తింపు ఉన్న వారు కాదు. వారి వారి పార్టీల్లోనే వారు చిన్న నేతలు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉన్నదంటూ ఏమైనా ఉందంటే అది వీరంతా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు. వీరైనా ఎలా వచ్చారంటే.. గత పదేళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, ఆ క్రమంలో పలు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. ఆ విధంగా ఆయన తనకున్న పలుకుబడిని ఉపయోగించి కొందరు ఎంపీలను జగన్ ధర్నాకు తీసుకురావడంలో సఫలమయ్యారు. అలాగే మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ, ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఓ డైరెక్టర్, ఈయనను జగన్ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. దీంతో ఆయన రిలయెన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా తన పరపతిని ఉపయోగించి మరి కొంత మంది ఎంపీలను జగన్ ధర్నాకు తీసుకువచ్చారు. సరే ఎలా వస్తే ఏమిటి కానీ, జగన్ ధర్నాకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు హస్తినలో జగన్ నిర్వహించిన ధర్నాకు హాజరయ్యారు. అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు జగన్ కు మద్దతుగా నిలిచాయి. దీని ద్వారా జగన్ కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తాను కాంగ్రెస్ కు, ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమికి చేరువ అవుతున్నాన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇలా సంకేతాలు పంపడం ద్వారా  రాజ్యసభలో తనకున్న సభ్యుల బలంతో బీజేపీని బ్లాక్ మెయిల్ చేయగలనని జగన్ భావిస్తుంటే భావిస్తుండ వచ్చు గాక, కానీ జగన్ పార్టీని చీల్చడం అన్నది చిటికెలో పని అని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ రాజ్యసభ సభ్యలు తెలుగుదేశం, జనసేన, బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.  అదే జరిగితే ఇంత కాలం  ఏ బీజేపీ అండతో అయితే జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ ను జాప్యం చేసుకోగలిగారో, అదే బీజేపీ ఆ కేసుల విచారణకు వేగవంతం చేసి జగన్ ను ఉక్కిరిబిక్కిర చేయడం ఖాయమని అంటున్నారు.  మొత్తం మీద ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో హస్తినలో ధర్నాకు దిగి జగన్ సెల్ఫ్ గోల్  చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఢిల్లీలో శాంతి భర్త మదన్ ఆందోళన!

‘‘నా భార్యకి పుట్టిన కొడుకుకు తండ్రి ఎవరో తేల్చండి మహాప్రభో’’ అని గత కొన్ని రోజులుగా దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి భర్త మదన్ మోహన్‌ మొత్తుకుంటున్న విషయం తెలిసిందే. అదేంటోగానీ, జగన్ అండ్ కో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోజే, వాళ్ళ ఆందోళన కార్యక్రమానికి ఎదురుగానే మదన్ మోహన్ కూడా ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తన భార్యని ట్రాప్ చేశాడంటూ మదన్ మోహన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మదన్ మోహన్ ఢిల్లీలోని పార్ల‌మెంట్ ఎదుట చేశారు. తాను మీడియా ముందుకు వ‌చ్చి గొంతు నొప్పి పుట్టేలా త‌న బాధ‌ను చెప్పుకుంటున్నా విజ‌య సాయిరెడ్డి పట్టించుకోవడం లేదని, డీఎన్ఏ టెస్టుకు అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. విజయసాయిరెడ్డి తనకు ఇతరుల చేత ఫోన్లు చేయించి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని.. త‌న‌కు, త‌న పిల్ల‌ల‌కు న్యాయం చేసేంతవరకు తన ఆందోళన ఆగ‌ద‌ని మదన్ మోహన్ చెప్పారు. తన ఆందోళనలో భాగంగా రాజ్యస‌భ ఛైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్క‌డ్‌తో పాటు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసి త‌న ద‌గ్గ‌ర ఉన్న అన్ని ఆధారాల‌ను చూపించ‌బోతున్న‌ట్లు మదన్ మోహన్ వెల్ల‌డించారు. ఢిల్లీలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మదన్ మోహన్‌తోపాటు పలువురు గిరిజన నాయకులు కూడా పాల్గొన్నారు.

నేపాల్‌లో కూలిన మరో విమానం!

నేపాల్ దేశం విమాన ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. సంవత్సరం క్రితం ఒక విమానం కూలి భారీగా జననష్టం జరిగింది. ఇప్పుడు కాఠ్మండూ విమానాశ్రయంలో మరో విమానం టేకాఫ్ అవుతున్న సమయలో కూలిపోయింది. కాఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కాఠ్మండూ నుంచి పొఖారాకి బయల్దేరిన బాంబేర్డియన్ సీఆర్‌జే 200 విమానం టేకిప్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి విమానం మొత్తం దగ్ధమైంది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది వున్నారు. ఈ దుర్ఘటనలో 18 మంది మరణించగా, పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. 

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హస్తిన వేదికగా ధర్నా చేస్తున్నారు.  ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలూ అన్నీ వైసీపీ పాలననే గుర్తుకు తెచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను సృష్టించారనీ, తన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిపై వేధింపులు, అక్రమ కేసులు, దాడులు హత్యలు నిత్యకృత్యంగా మారాయి. అయితే తన హాయంలో జరిగిన విధ్వంసం, హింసను ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి ఆపాదిస్తూ జగన్ హస్తిన వేదికగా హై డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో  ప్రతిపక్షాలను ఉక్కు పాదంతో తొక్కిన జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను అణిచివేశారు. జగన్ హయాంలో ప్రభుత్వ వేధింపులకు గురి కాని వర్గం రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదు. సామానుల నుంచి విపక్ష నేతల వరకూ అందరినీ వేధించారు. అక్రమ కేసులు బనాయించారు. సొంత పార్టీ రెబల్ ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజును కస్టోడియల్  టార్చర్ కు గురి చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకున్నారు. ఆయనను తన హోటల్ రూం నుంచే బయటకు కదలనీయకుండా నిర్బంధించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అర్ధరాత్రి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేనన్నిజగన్ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు అంతులేనన్ని ఉన్నాయి. అటువంటి జగన్ ఇప్పుడు తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ హస్తిన వేదికగా ధర్నాకు దిగారు. అయితే ఆయన ఆందోళనకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. ఆయన పిలుపును ఇసుమంతైనా పట్టించుకోకుండా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు హస్తిన ధర్నాకు డుమ్మా కొట్టి మండలి సమావేశాలకు హాజరయ్యారు. ఓ వైపు ఆయన హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే   వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. జగన్   తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయనీ, తమ పార్టీ అధినేత చెబుతున్నదాంట్లో ఇసుమంతైనా వాస్తవం లేదనీ ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ చెప్పకనే చెప్పేశారని భావించవచ్చు.  

ఇంకా అంధకారంలోనే ఏపీ అధికారులు!

జగన్ చీకటి పాలన తొలగిపోయి దగ్గర దగ్గర రెండు నెలలు కావొస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులలో చాలామంది ఇంకా అంధకారంలోనే వున్నారు. ఇంతకాలంలో చేయడానికి పనేమీ లేక టైమ్‌పాస్ చేసిన అధికారగణం, ఇప్పుడు ఒళ్ళు వంచి పనిచేయాల్సి రావడంతో ఇబ్బంది పడిపోతున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టుగా పని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయాల్లో వున్న కొందరు అధికారులైతే, తాము సక్రమంగా పని చేయకపోగా, కొత్త మంత్రులను బోల్తా కొట్టించేలా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ ఘనకార్యాలకు సంబంధించిన వివరాలు అడిగితే పూర్తి వివరాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద అసెంబ్లీ లాబీల్లో మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను వెలికి తీస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన పనులు, దోపిడీపై అనేక మంది సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిపై సరైన సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచిస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చే అరకొర వివరాలు చూసి కొత్త మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. తమనే బోల్తా కొట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నాని అంటూ  పలువురు మంత్రులు అసెంబ్లీలో చర్చించుకుంటున్నారు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులిచ్చిన సమాచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రశ్నకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండా ‘‘అవును, కాదు, ఉత్పన్నం కాదు’’ అంటూ అధికారులు సమాధానమివ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలిపారు. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను పవన్ ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపైనా అధికారుల సమాచారంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జగన్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎంత మాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారమిచ్చారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్​ ప్లాన్​ నిధుల మళ్లింపు విషయంలో పూర్తిస్థాయి సమాచారం తనకు అందలేదని మంత్రి తెలిపారు. వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

తల్లికి వందనం.. జగన్‌కి వాత!

తల్లికి వందనం స్కీమ్ విషయంలో జగన్‌కి, ఆయన తోక బ్యాచ్‌కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అట్లకాడ కాల్చి వాత పెట్టారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు.. ఈ జగన్ పిశాచాలు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాల మీద విష ప్రచారాన్ని చేయడంలో బిజీగా వున్నాయి. ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకం మీద ఈ దండుపాళ్యం బ్యాచ్ ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు వాగుతూ విషాన్ని చిమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కి, జగన్ దండుపాళ్యం బ్యాచ్‌కి నోళ్ళు మూతలు పడేలా మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. తమ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే, తల్లికి ఎంతమంది పిల్లలు వున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. జగన్ ప్రభుత్వం వున్న సమయంలో అమ్మ ఒడి పథకంలో రకరకాల మార్సులు చేసి ఇచ్చే డబ్బులో ఎన్నెన్నో కోతలు కోశారని, తమ ప్రభుత్వం అలాంటి పనులు చేయదని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ అండ్ జగన్ దండుపాళ్యం బాచ్‌లూ.. ఈ పథకం విషయంలో మీకు పడిందిగా వాత.. ఇక మీ నోళ్ళకి పడాలి మూత!

అక్కడ అన్న.. ఇక్కడ చెల్లి.. నాటకాల కుటుంబం!

అన్నియ్య జగన్, చెల్లెమ్మ షర్మిల ఎవరికివాళ్ళు ఆస్కార్ లెవల్లో యాక్టింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఒకవైపు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోయింది అని ఇక్కడ అరుపులు, రంకెలు పెట్టి.. ఇప్పుడు ఢిల్లీలో డ్రామా ఆడుతూ వుంటే, మరోవైపు చెల్లెమ్మ షర్మిల మరో వైరెటీ డ్రామా క్రియేట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల  పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడతో ఆగొచ్చు కదా.. అలా కాకుండా నడుంలోతు నీళ్లలో దిగి హడావిడి చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తూనే వుంది. ఇంతలోపే షర్మిల ఇలా నాటకాలు ఆడి, సీన్‌ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌ని ఇంకా నాశనం చేసి తీరాలని వైఎస్సార్ కుటుంబం తమవంతు ప్రయత్నం చేస్తోంది. వీరి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే!

మత్స్యకారులకు మంచి కబురు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు ఉరి తాడులా మారిన జీవో 217ను రద్దు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రకటించారు. శాసన సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, గత ప్రభుత్వంలో మత్స్యకారులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అచ్చెన్నాయుడు వివరించారు. జీవో 217 మత్సకారుల పాలిట మరణశాసనం అని చెప్పవచ్చు. ఇలాంటి దుర్మార్గమైన జీవోని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మత్స్యకారులు ఎంత వ్యతిరేకించినా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల మెడకు చుట్టుకున్న జీవో నంబర్ 217 అనే ఉరితాడు తొలగిపోయింది. ఈ జీవో ప్రకారం గ్రామాల్లో వంద ఎకరాలకు పైబడి వుండే చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం స్థానికంగా వుండే మత్స్యకారులకు వుండదు. ఆన్‌లైన్‌లో వేలంపాటలో పాల్గొనడం ద్వారానే సదరు చెరువుల మీద హక్కు ఏర్పడుతుంది. సాధారణంగా గ్రామాల్లో మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో చెరువుల్లో చేపల వేట జరుగుతూ వుంటుంది. ఆ సంప్రదాయానికి 217 జీవో బ్రేక్ వేస్తుంది. బయటివాళ్ళు చెరువుల మీద ఆధిపత్యం చేసే అవకాశం ఇస్తుంది. ఈ జీవో రాష్ట్రంలోని 7 వందలకు పైగా వున్న మత్స్యకార సహకార సంఘాలకు, వాటి మీద ఆధారపడి వున్న 4 లక్షల మంది మత్స్యకారులకు గొడ్డలిపెట్టు లాంటిది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలుగువన్ ముందే చెప్పింది.. జగన్ అడుగు కాంగ్రెస్ వైపే పడింది!

వైసీపీ వ్యూహం మార్చింది. ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు దగ్గరౌతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాల ఊసే లేకుండా గడిపేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోగానే బీజేపీకి దూరం జరిగి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు దగ్గర అవ్వడానికి అడుగులు వేస్తున్నది.  కాంగ్రెస్‌తో దోస్తీ.. మారిన జ‌గ‌న్ వ్యూహం !? శీర్షికన జగన్ అడుగులు ఏ దిశగా పడనున్నాయన్న విషయాన్ని తెలుగువన్ మూడు రోజుల ముందే చెప్పింది.  ఏపీలో చంద్రబాబు సర్కార్ ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి   కాంగ్రెస్ కు దగ్గరౌతున్నారని విస్పష్టంగా చెప్పింది. ఇందుకు కాంగ్రెస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా  వైసీపీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో కాంగ్రెస్ వాదనకు మద్దతు పలకడం ద్వారా తన అడుగులు ఎటుపడుతున్నాయన్నది చెప్పకనే చెప్పేసింది.    జగన్ కాంగ్రెస్ కు మద్దతుగా  నిలిస్తే అందుకు ప్రతిగా జాతీయ‌ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ మోహ‌న్ను హైలేట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు అంగీకరించారనీ, ఈ మేరకు వైసీపీ, కాంగ్రెస్ ల మధ్య డీల్ కుదిరిందని  ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తరువాత, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆ రెండు సందర్భాలలోనూ ఆయన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే జగన్ తన ప్రతిపాదనలను ఆయన ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.  కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయంగా వైసీపీ  మ‌ద్ద‌తు, ఫండింగ్ ఉంటుందని జగన్ చెప్పారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అప్పట్లో జగన్ తో  తన భేటీ వార్తలను డీకే శివకుమార్ ఖండించారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే.. జగన్, కాంగ్రెస్ ల మధ్య ఏదో స్థాయిలో సఖ్యత ఏర్పడిందని స్పష్టమౌతోంది.  వైసీపీ గత పదేళ్లుగా ఎన్డీయే కూట‌మికి మ‌ద్ద‌తుగా ఉంటూ వ‌చ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులేనని తెలిసిందే.  ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసులు జగన్ మెడపై కత్తిగా వేలాడుతున్నప్పటికీ   కాంగ్రెస్ కు వైసీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. ఇందుకు  కారణం లేకపోలేదు. కాంగ్రెస్ కు లోక్ సభలో మద్దతుగా నిలిచినా.. రాజ్యసభలో వైసీపీకి ఉన్న 11 మంది ఎంపీల మద్దతు కోసం మోడీ సర్కార్ తన జోలికి రాదని జగన్ ధీమాగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ విషయంలో వైసీపీ బాహాటంగా కాంగ్రెస్ వాదనకు మద్దతు ప్రకటించింది.  లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి కేటాయించాలంటూ గళమెత్తింది.   ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.  డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంటోందని, దీన్ని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమికి దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.