వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు!
posted on Jul 23, 2024 @ 12:05PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో రైతులు, యువత కోసం భారీ కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు.
ఉత్పాదకత, వాతావరణాన్ని తట్టుకునే 9 రకాల వంగడాలను పెంచడంపై దృష్టి సారించేలా వ్యవసాయ పరిశోధన జరుగుతుందన్నారు. వాతావరణాన్ని తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ పరిశోధన సెటప్‌ను సమగ్రంగా సమీక్షించాలన్నారు. ఈ నిధితో వ్యవసాయం, సంబంధిత రంగాలకు పథకాలు రూపొందించనున్నారు.
ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యతలలో ఒకటి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి. దీని కింద మొదటిసారి ఉద్యోగార్ధులకు భారీ సహాయం అందనుంది. మొదటిసారిగా ఫార్మల్ రంగంలో ఉద్యోగం ప్రారంభించే వారికి ఒక నెల జీతం నగదు బదిలీ ద్వారా మూడు విడతలుగా విడుదల చేస్తారు. దీని గరిష్ట మొత్తం రూ.15 వేలు. ఈపీఎఫ్ లో నమోదు చేసుకున్న వ్యక్తులు ఈ సహాయం పొందేందుకు అర్హత. ఆ అర్హత పరిమితి నెలకు రూ. 1 లక్ష . దీనివల్ల 2.10 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలుగుతుంది.