వ్యక్తుల ఇమేజ్ కాదు.. రాజముద్రకే ఇంపార్టెన్స్

ఏపీ ప్రభుత్వం పథకాలకు పేర్లు మార్చింది. ఒక లక్ష్యంతో వ్యక్తుల ఇమేజ్ కాకుండా, మహానుభావుల పేర్ల మీదుగా పథకాలు ఉండాలన్న సదుద్దేశంతో ఈ మార్పు చేసింది.  గత ప్రభుత్వం అన్ని పథకాలకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ పేర్లు పెట్టింది. పేర్ల మార్పు యోచనలో లోకేష్ ఉన్నట్లు తెలియగానే అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   మహనీయుల పేర్లను ఆయా పథకాలకు  పెట్టాలని, సూచించారు.    విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆ సూచనను చాలా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు.  లోకేష్ విద్యా శాఖలో తనదైన ముద్ర వేసుకోవాలని కృషి చేస్తున్నట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయన గత వైసీపీ ప్రభుత్వం తాలూకా గురుతులు అనేవి లేకుండా నిర్వీర్యం చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా అనేక పధకాలకు 'జగనన్న' అని పేరు తగిలించడంతో పాటుగా ఏకంగా ఆయన ఫోటోని వాటికి తగిలించింది. జగన్ పేరు మారుమోగాలనే తపనతోనే వారు ఇలా చేశారన్నదాంటో ఎటువంటి సందేహం లేదు.   అయితే  జగన్ పేరు, ఫొటో పిచ్చి గీత దాటిపోయి రోత పుట్టేస్థాయికి చేరిందని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నే   టీడీపీ కూటమి సర్కార్ జగన్ పేర్లను, ఫోటోలను తొలగించి వాటి స్థానంలో  ఆంధ్ర ప్రదేశ్ రాజ ముద్రని వేస్తున్నది. తెలుగుదేశం కూటమి సర్కార్ కూడా  వైసీపీ లాగా అలోచించి పథకాలకు పేర్లు పెట్టి ఉంటే  రెంటికీ తేడా లేదన్న విమర్శలు వచ్చేవి. కానీ లోకేష్ అలా చేయలేదు.. ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం లోగోని ఎంచుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. మరోవైపు.. ఆయన తన శాఖలో అరడజను పైగా ఉన్న పథకాలకు జగన్ పేర్లని తొలగిస్తూ లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ పేరు తొలగించి ఆయా పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.  జగనన్న అమ్మ ఒడి పధకం పేరుని తల్లికి వందనం అని, జగనన్న విద్యా కానుక పధకానికి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్ధి మిత్ర అని, జగనన్న గోరుముద్ద పధకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని, మన బడి నాడు మన బడి నేడు అన్న పధకానికి మన భవిష్యత్తుగానూ, స్వేచ్చ అన్న దానికి బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు అన్న పధకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేర్లు మార్చారు.  ఈ మార్పు పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.  

క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి ప్రతిపాదనలు పంపని జగన్ సర్కార్!

కేశినేని చిన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం గత అయిదేళ్లలో  క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన సమర్పించిందా? ఎపిలోని  క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి నుండి కేటాయించిన  మొత్తం నిధులు ఎంత? ఆ నిధుల వినియోగం, ల‌బ్ధి పొందిన క్రీడాకారుల వివ‌రాల పై సోమ‌వారం పార్ల‌మెంట్ లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్  కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల శాఖ‌ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా ను ప్ర‌శ్నించారు.  కేంద్ర‌మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా లిఖిత‌పూర్వ‌కంగా ఎంపి కేశినేని శివనాథ్ కి  స‌మాధానం చెప్పారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంతో పాటు దేశ‌వ్యాప్తంగా క్రీడాకారుల కోసం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ క్రీడాకారుల జాతీయ సంక్షేమ పథకం అమ‌లు అవుతున్నద‌ని,  గ‌త ఐదేళ్ల‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి  క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి అమలు చేయడానికి ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్ర‌మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా  ఇచ్చిన లిఖిత పూర్వక స‌మాధానంలో తెలియ‌ప‌ర్చారు.

అమ్మో ఒకటో తారీకు!.. పింఛన్లు, వేతనాలూ చెల్లించేదెలా?

జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, ఆ సర్కార్ ఆర్థిక అరాచకత్వం కారణంగా తెలుగుదేశం కూటమి చిక్కులు ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఎన్ని సమస్యలున్నా అన్న మాట ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీకే పించన్ల పంపిణీ, వేతనాల చెల్లింపులు చేస్తున్నా.. అమ్మో ఒకటో తారీకు అన్న బెంగ మాత్రం తప్పడం లేదు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు, వేతనాలు చెల్లిస్తోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత తొలి నెలలో చెప్పినట్లుగానే అరియర్స్ తో సహా పింఛన్లు చెల్లించింది. అలాగే ఏ అవాంతరాలూ లేకుండా ఉద్యోగుల వేతనాలను కూడా వాటి ఖాతాలో వేసేసింది. వలంటీర్లతో పని లేకుండా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించింది.  ఇక ఇప్పుడు ఆగస్టు ఒకటో తేదీ రాబోతోంది. ఆగస్టు 1నే పించన్ల పంపిణీ పూర్తికి చంద్రబాబు సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేసేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ ఆర్థిక శాఖ నిధుల కొరతతో సతమతమౌతోంది. అప్పో సొప్పో చేసి ఈ నెల పించన్లు, వేతనాల పంపిణీని గట్టెక్కించేసినా మళ్లీ ఒకటో తారీకు వచ్చే సరికి మళ్లీ అప్పుల కోసం వెతుకులాట తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల నెలా అమ్మో ఒకటో తారీకు అనుకుని బెంబేలు పడే స్థితిలో ఉంది. పింఛన్లు వేతనాలు సరే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా నిధులు అవసరం.  ఫించన్లు,జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మల్లగుల్లాలు పడుతోంది.  67లక్షల మందికి సామాజిక ఫించన్లు,ఉద్యోగుల జీతాలు,రిటైర్ అయిన వారి పింఛన్లకు1వ తేదీన చెల్లించాలి. గత నెలలో రిజర్వ్ లో ఉన్న రూ.ఏడువేల కోట్లు ఉపయోగపడ్డాయి.ఆగస్టు నెల  సామాజిక పింఛన్లకు ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల మీద రుణాలు సేకరిస్తున్నారు. ఇవి సామాజిక ఫించన్లకు, ఉద్యోగులజీతాలు ,రిటైర్ ఉద్యోగుల ఫించన్లులకు చెల్లించాల్సిన 5వేల కోట్లకు కూడా సరిపడా వస్తాయని భావిస్తున్నారు.  అధికారంలోకి వచ్చి 50  రోజులైనా గ్యారెంటీలు అమలు పై ఇంకా నిర్ణయం కాలేదు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెబుతున్నది.ఆర్టీసీ కొత్త బస్సులు కావాలంటోంది. ఈ పథకానికి ప్రతి నెలా ఆర్టీసీకీ రూ.250కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా.ఇక అన్న క్యాంటిన్లు అన్నీ ఆగస్టు 15 నాటికి సిద్ధం కాలేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.183 క్యాంటిన్ 100 మాత్రమే సిద్ధమవుతాయని తెలుస్తున్నది. సమగ్ర భూ సర్వేలో జగన్ ఫోటో ఉన్న 77లక్షల రాళ్లను తొలగించాలంటే రూ.15కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చడం గమనార్హం. జగన్ ఫోటో లపిచ్చితో రూ.700కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది.ఇది కాక విశాఖలో 500కోట్లతో రుషికొండపై కట్టిన రాజభవనం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అయింది. అలాగే విశాఖలో  ప్రభుత్వ కార్యాలయాలు,ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టి జగన్ హయాంలో అప్పులు చేసారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వైసీపీ హయాంలో జరిగిన తప్పులు,అవకతవకలు, ప్రజా ధనం స్వాహ వెలికితీయడానికే సమయం సరిపోవటంలేదు. రోజుకో కుంభకోణం బయట పడుతోంది. మరో పక్క ఆ ప్రభుత్వం చేసిన అప్పులతోనే సతమతమవుతోంది. కొత్త అప్పులు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు.  రోజువారీ ఖర్చులతో పాటు గ్యారెంటీల అమలు చేయాలంటే అప్పుచేయక తప్పదు.అభివృద్ధి చూపించి ఆ ఫలాలతో హామీలు నెరవేర్చుతామని  తెలుగుదేశం కూటమి ఎన్నికలలో  చెప్పింది. అయితే అభివృద్ధి, దానిఫలాలు వెంటనే రావు.  అభివృద్ధి పనులు జరగాలి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ తరువాత వాటి ఫలాలు వస్తాయి. సంపద సృష్టి జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కు ఆర్థిక కష్టాలు తప్పవు.  వచ్చే నెలలో అమ్మ ఒడి, రైతు భరోసా చెల్లించాల్సి ఉంది.స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. వరినాట్లు కూడా మొదలయ్యాయి.ముఖ్యంగా రైతు రుణాలు మంజూరు చేయించాలి. కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిఉంది. మరి ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకుంటుందన్నదే ప్రశ్న. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం హామీల అమలుతో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ పథకానికీ నిధుల కొరత లేకుండా చూస్తామని చెబుతున్నారు. అదే సమయంలో అభివృద్ధినీ పట్టాలెక్కిస్తామంటున్నారు.  మొత్తం మీద కొంత కాలం పాటు ఏపీకి ఆర్థిక ఇక్కట్లు తప్పవని అంటున్నారు. 

చార్మినార్ గడియారానికి కాల‘దోషం’

చార్ సౌ సాల్ షెహర్ అని చెప్పుకునే హైదరాబాద్ నగరానికి చార్మినార్   బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచింది.  చారిత్రక చార్మినార్‌లోని 135 ఏళ్ల నాటి గడియారం దెబ్బతింది. చార్మినార్‌కు మరమ్మతులు చేస్తుండగా ఓ ఇనుపరాడ్ గడియారానికి తగలడంతో 5, 6 నంబర్ మధ్య అద్దం కొద్దిగా పగిలింది. అయినప్పటికీ ఇంకా అది పనిచేస్తుండడం గమనార్హం. 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తూర్పు వైపున ఉన్న గడియారం ధ్వంసమైంది.  చార్మినార్‌ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. ఈ చతురస్రాకార నిర్మాణం  అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతారు. అయితే చార్మినార్‌ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా పూర్తిగా తెలియరాలేదని చరిత్రకారులు చెబుతుంటారు.    ప్లేగు వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రార్థించాడని  పూర్వికులు చెబుతుంటారు.  అప్పట్లో  ప్లేగు అంతం కావడంతో  అల్లాకు నివాళిగా చార్మినార్‌ నిర్మించారు. చార్మినార్ కు ఉన్న  నాలుగు స్తంభాలు కూడా ఇస్లాం లోని  మొదటి నాలుగు ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి.కర్బలా యుద్ధంలో తన ప్రాణాలను కోల్పోయిన ప్రవక్త ముహమ్మద్ అల్లుడు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారని కూడా చెబుతారు, దీని రూపకల్పన షియా తజియాస్ ఆకారంలో ఉంది. చార్మినార్ ఉన్న ప్రదేశంలోనే  సుల్తాన్ తన కాబోయే భార్య భాగమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరు నమ్ముతారు.  17వ శతాబ్దంలో ఇక్కడ ప్రయాణించిన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు, జీన్ డి థెవెనోట్ ప్రకారం దీని నిర్మాణానికి కారణం పూర్తిగా భిన్నమైనదని చెప్పొచ్చు. పర్షియన్ గ్రంథాలప్రకారం చార్మినార్ రెండవ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడింది.పునాది రాయిపై ఉన్న శాసనం ‘ఈ నా నగరాన్ని ప్రజలతో నింపండి, ఓ ప్రభూ, నదిని చేపలతో నింపండి’ అని అనువదించబడింది. చరిత్రకారుడు మహమ్మద్ సఫీయుల్లా ప్రకారం, చార్మినార్ హైదరాబాద్‌కు కేంద్రంగా నిర్మించబడింది. 1670లో పిడుగుపాటుకు గురై ఒక మినార్ కింద పడిపోయింది. అప్పుడు సుమారు రూ.58000 ఖర్చుతో మరమ్మతులు చేశారు. 1820లో, దానిలో కొంత భాగాన్ని సికందర్ జా  పునరుద్ధరించారు. చార్ మినార్ పై అంతస్తులో అత్యంత పురాతన  మసీదు ఉంది. 1889 సంవత్సరంలో చార్మినార్కు  నాలుగు వైపులా నాలుగు గడియారాలు కూడా అమర్చారు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి డ్యామేజ్ అయ్యింది.  గత కొన్ని రోజులుగా ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్  మరమ్మత్తులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక  పొడవైన ఇనుప రాడ్ చార్మినార్ గడియారాన్ని తాకింది. దీంతో గడియారం అద్దం పగిలిపోయింది. అప్పట్లో  ఆగిపోయిన గడియారాలను వహీద్ వాచ్ కంపెనీ రిపేర్ చేసి పునరుద్దరించినప్పటికీ తాజాగా జరిగిన డ్యామేజి పట్ల హైదరాబాద్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. 

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. శిథిలాల కింద వందల మంది?

కేరళలో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో వందలాది మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలో  కొండ ప్రాంతాలలో జరిగిన ఈ ఘటనల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.   మంగళవారం (జులై 30) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో   ఒకసారి, ఆ తరువాత  కొండచరియలు విరిగిపడ్డాయి.  4  గంటల ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.  విష యం తెలుసుకున్న అధికారులు, పోలీసులు  కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ  ఫైర్‌ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి.  ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు19 ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అయితే వందల మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని స్థానికుల చెబుతున్నారు.  సంఘటనా స్థలంలో ఆరు వందల మంది ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమై ఉణ్నారు. సహాయక చర్యలకు భారీ వర్షం అడ్డంకిగా మారింది. ఇలా ఉండగా కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోడీ   దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ ‌గ్రేషియో ప్రకటించారు.  

అధికార పక్షమే.. ప్రతిపక్షం.. గౌరవ సభగా ఏపీ అసెంబ్లీ!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పింది చేసి చూపించారు. బూతులు, అనుచిత వ్యాఖ్యలతో కౌరవ సభగా మారిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని గౌరవ సభగా మార్చేశారు. అర్ధవంతమైన చర్చలతో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసమస్యల పరిష్కారం లక్ష్యంగా సభను సాగిస్తున్నారు. ఔను జగన్ హయాంలో ఐదేళ్ల పాటు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించాలంటేనే ఏటువంటి అనుచిత వ్యాఖ్యలు వినాల్సి వస్తుందోనని జనం భయపడ్డారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  ఆంధ్రప్రదేశ్లో  అసెంబ్లీ సమావేశాలు అర్ధవంతంగా సాగాయి. గతంలో అంటే జగన్ హయాంలో శాసనసభ కౌరవ సభలా మారింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా అప్పటి విపక్ష నేత చంద్రబాబు ప్రకటించి.. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెట్టి.. కౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని ప్రతిజ్ణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా సభను గౌరవ సభగా మార్చారు.  ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అర్ధవంతమైన చర్చలతో సభను నిర్వహిస్తున్నారు.  ఒక పక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సైతం జరుగుతున్నాయి. వీటితో  పాటుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ఐదు రోజుల పాటు జరిగాయి. లోక్ సభ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా, విమర్శలు, ప్రతి విమర్శలు, ప్లకార్డుల ప్రదర్శనలు, వాదోపవాదాలతో సాగుతుంటే.. ఏపీ అసెంబ్లీ మాత్రం ప్రశాంతంగా అర్థవంతమైన చర్చలతో, అధికార పక్షమే విపక్ష పాత్ర కూడా పోషిస్తూ సమస్యలకు పరిష్కారం దిశగా సమాలోచనలు చేస్తూ సాగుతోంది.  ఏపీలో తెలుగుదేశం కూటమికి ప్రజలు పట్టం కట్టారు. విపక్షమే లేదా అన్నట్లుగా 175 మంది సభ్యులుండే అసెంబ్లీలో విపక్ష వైసీపీకి చెందిన 11 మంది సభ్యులు మాత్రమే విజయం సాధించారు. అయితే ఆ 11 మందీ కూడా సభకు హాజరు కాలేదు. అయినా ఏపీ అసెంబ్లీలో అధికార విపక్ష  పాత్రలను తెలుగుదేశం కూటమి సభ్యులే  పోషిస్తున్నారు.   పాలక పక్షమే ప్రతిపక్షంగా మారి అర్ధవంతమైన చర్చలకు నిలయంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సాగుతోంది. గత ఐదేళ్లుగా అసెంబ్లీ ని కౌరవ సభగా మార్చిన జగన్ కు ఇప్పుడు గౌరవ సభ ఎలా ఉంటుందో చేసి చూపించారు సభా అధ్యక్షుడు చంద్రబాబు. నాడు విపక్ష నేతగా తానేం చెప్పారో అది నేడు చేసి  చూపిస్తున్నారు.  ఏపీ అసెంబ్లీలో గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పుల పైనా,  జగన్ సర్కార్ విధి విధానాలపై ఎ  శ్వేత పత్రాలను విడుదల చేస్తూ ప్రజలకు అన్ని విషయాలపైనా పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చడానికి 5 రూ.కే అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటిస్తే వాటితో పాటుగా డొక్కా సీతమ్మ క్యాంటిన్లను కూడా ఏర్పాటు చేయాలనీ ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఆయన సూచనపై సానుకూలంగా స్పందించి  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసే మధ్యాన్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును ఖరారు చేసారు.  విద్యాశాఖ మంత్రి లోకేష్.  అలాగే ఆయా శాఖల మీద, వాటి విధి విధానాల మీద ఎమ్మెల్యే లు తమకున్న సందేహాలను, అపోహలను సభలోనే చర్చల రూపంలో అడిగి తెలుసుకుంటున్నారు. ఒక అర్ధవంతమైన గౌరవ సభ మాదిరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. విపక్షం లేకపోయినా, ఆ పాత్రను అధికారపక్షమే ప్రోత్సహిస్తూ సభా గౌరవాన్ని ఇనుమడింప చేస్తోంది. 

ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఝార్ఖండ్ ల మంగళవారం (జులై 30) తెల్లవారు జామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఝార్ఖండ్ లోకి చక్రధరూర్ డివిజన్ లో  హౌరా-ముంబై రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  జంషడ్పూర్ కు 80 కిలోమీటర్ల దూరంలోని చ క్రధర్పూర్ వద్ద ఈ తెల్లవారు జామున గూడ్స్ రైలు పట్టాలు తప్పి దాని బోగీలు పక్క ట్రాక్ పై పడ్డాయి. అదే సమయంలో ఆ లైన్లో వచ్చిన హౌరా ముంబై రైలు ఆ బోగీలను ఢీకొంది. ఈ ఘటనలో హౌరా-ముంబై రైలుకు చెందిన 18 బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.  

కేసీఆర్‌.. చంద్ర‌బాబును చూసినేర్చుకో!

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు కావ‌టం స‌ర్వ‌సాధార‌ణం. అధికారంలో ఉన్నామ‌ని విర్ర‌ వీగితే అధికారం కోల్పోయిన త‌రువాత ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌. అన్నీ అనుకూలిస్తే దేశానికి ప్ర‌ధాని కాబోయేది నేనే అంటూ పెద్ద‌ పెద్ద స్టేట్ మెంట్ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చారు. ప‌క్క‌రాష్ట్రాలైన ఏపీ, మ‌హారాష్ట్ర‌లో బీఆర్ఎస్ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో రాష్ట్రానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చినా.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు నేను పోయేదేంటి అన్న‌ట్లుగా కేసీఆర్ వ్యవహరించారు. ఇక అసెంబ్లీలో అయితే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీ స‌భ్యుల‌ను ఓ ఆటాడుకున్నారు. ఇంత‌లా రెచ్చిపోయిన నేత‌ల‌ను ప్ర‌జ‌లు అస్సలు ఉపేక్షించ‌రు. తెలంగాణ ప్ర‌జ‌లు కూడా అదే ప‌నిచేశారు. ఎన్నిక‌ల స‌మ‌య‌లో కేసీఆర్ కు గ‌ట్టి షాకిచ్చారు. దీంతో అధికారం కోల్పోయి.. ప్ర‌స్తుతం అసెంబ్లీకి వ‌చ్చేందుకు సైతం కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నారు.   తెలంగాణ‌లో అధికారం కోల్పోయిన నాటినుంచి మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. పార్టీ నేత‌ల‌కు అప్పుడ‌ప్పుడు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నారే త‌ప్ప అధికార పార్టీని నేరుగా ఎదుర్కొనే సాహ‌సం చేయ‌డం లేదు. కేసీఆర్ పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆయ‌న పెద్ద‌గా నోరు మెద‌ప‌డం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతుండ‌టం బీఆర్ఎస్ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. గ‌త అసెంబ్లీ స‌మావేశాల‌కు సైతం కేసీఆర్ హాజ‌రు కాలేదు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, పార్టీ శ్రేణులు కేసీఆర్ అసెంబ్లీకి హాజ‌రు కావాల‌ని ఒత్తిడి చేశారు. అయినా. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌రు కాలేదు. కేవ‌లం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్ర‌మే అసెంబ్లీకి వ‌చ్చారు. భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌సంగాన్నివిని  అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ విలేక‌రుల‌తో మాట్లాడారు. వేస్ట్ బ‌డ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం రాదు.. వాళ్ల‌కు ఏఏ రంగానికి ఎంత కేటాయింపులు చేయాలోకూడా తెలియ‌డం లేదంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఆర్నెళ్లు స‌మ‌యం ఇవ్వాల‌ని నేనే అసెంబ్లీకి రాలేదు.. ఇక‌ నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ స‌భ్యుల సంగ‌తి చూస్తా అంటూ కేసీఆర్ చిన్న‌పాటి హెచ్చ‌రిక‌లు చేశారు.  అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ ప్ర‌సంగాన్ని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేశాయి. సింహం అసెంబ్లీకి వ‌స్తుంది.. కాంగ్రెస్ నేత‌ల‌కు మూడింది అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టాయి.   కానీ, బ‌డ్జెట్ పై అసెంబ్లీలో జ‌రిగే చ‌ర్చ‌కు సైతం కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీంతో అసెంబ్లీకి సింహం వ‌స్తుంద‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద‌ పెద్ద పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అసెంబ్లీకి పోకుండా ఇంటివ‌ద్ద‌ ఏం చ‌స్తున్నావ్ కేసీఆర్ అంటూ అదే సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఇక కేసీఆర్ ప‌నైపోయింది.. బీఆర్ఎస్ ఖేల్ ఖ‌త‌మే అంటున్నారు. ఇంత‌కీ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావ‌డం లేదు.. అధికార ప‌క్షం పాల‌నా తీరుపై ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ప్ర‌ధాన కార‌ణం ఉంది‌. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ శ్రేణుల‌ను కేసీఆర్ ముప్పుతిప్ప‌లు పెట్టారు. ముఖ్యంగా ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీలో ఉండ‌టంతో కేసీఆర్ ప్ర‌తిప‌క్ష హోదాలో అసెంబ్లీకి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కేసీఆర్ అసెంబ్లీకి వెళితే.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స‌భ్యులు ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం ఖాయం. ఈ క్ర‌మంలో ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంది. కౌంట‌ర్ ఇచ్చేందుకు కేసీఆర్ త‌ప్ప‌నిస‌రిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో కేసీఆర్ ను అసెంబ్లీ వేదిక‌గా కాంగ్రెస్ స‌భ్యులు అవ‌మానిస్తార‌ని అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేద‌ని కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. కేసీఆర్ ముందుగానే ఎందుకు అలా భ‌య‌ప‌డుతున్నార‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును చూసి నేర్చుకో కేసీఆర్ అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో సూచ‌న‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ స‌భ్యులు తీవ్ర స్థాయిలో అవ‌మానించారు. అయినా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేందుకు చంద్ర‌బాబు అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. త‌న‌కు సాధ్య‌మైనంత స్థాయిలో జ‌గ‌న్, వైసీపీ స‌భ్యుల‌కు అసెంబ్లీలో గ‌ట్టిగా ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు. చివ‌రికి త‌న భార్య విష‌యాన్ని అసెంబ్లీలో ప్ర‌స్తావించ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన చంద్ర‌బాబు.. సీఎం హోదాలోనే అసెంబ్లీలోనే అడుగు పెడ‌తాన‌ని శ‌పథం చేశాడు. అన్న‌ట్లుగా ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే, చంద్ర‌బాబు త‌ర‌హా రాజ‌కీయాలు కేసీఆర్‌కు అబ్బ‌లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించ‌డం కంటే త‌న ప‌రువు మ‌ర్యాద‌లే   ముఖ్య‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతున్నది. కేసీఆర్ తీరుపట్ల బీఆర్ఎస్ నేత‌లు,  కార్యకర్తలు సైతం  ఒకింత ఆగ్ర‌హంతో ఉన్నారు.  

ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర అతిథిగా శివనాగిరెడ్డి

195 దేశాలు పాల్గొంటున్న భారతదేశం ఆతిథ్యమిస్తున్న 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలకు పురావస్తు పరిశోధకుడు, వారసత్వ పరిరక్షణ నిపుణుడు, ప్లీచ్‌ ఇండియా పౌండేషన్‌, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని  తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర అతిథిగా నామినేట్‌ చేసింది. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆయన 29,30 తేదీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. యునెస్కో సభ్యదేశాలు, తమ దేశాలకు చెందిన పురాతన స్థలాలు, కట్టడాలు, సుందరతర ప్రకృతి ప్రదేశాలకు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కోసం పంపే ప్రతిపాదనలను ఈ సమావేశాల్లో చర్చించి, అప్పటికే తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకొన్న వాటిపై ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తికరంగా సాగే చర్చల ద్వారా, కొత్త ప్రతిపాదనల నివేదికల తయారీకి అవసరమైన నైపుణ్యాన్ని సంతరించుకొనే వీలు చిక్కిందని శివనాగిరెడ్డి చెప్పారు.  తనతో పాటు వారసత్వ నిపుణులు, వాస్తు శిల్పులు (ఆర్కిటెక్ట్‌లు) మణికొండ వేదకుమార్‌, ఎం.పాండురంగరావు, డాక్టర్ శోభ,  ప్రొఫెసర్ కె.పి. రావు, డాక్టర్ పద్మనాభలను తెలంగాణా ప్రభుత్వం నామినేట్‌ చేసిందని శివనాగిరెడ్డి తెలిపారు.  తనకు అవకాశమిచ్చిన తెలంగాణా ప్రభుత్వ పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శికి, ప్రభుత్వానికి శివనాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ భేటీ వెనుక ఏదో ప్లానుంది!

సోమవారం ఒక వార్త మీడియాలో గుప్పుమంది. అదే, వైఎస్ విజయమ్మ, జేసీ ప్రభాకరరెడ్డి భేటీ వార్త. జగన్‌కి బద్ధ శత్రువైన జేసీ ప్రభాకరరెడ్డితో విజయమ్మ భేటీ అయ్యారంటే ఏదో ప్రత్యేకమైన రాజకీయ కారణం వుందన్న అభిప్రాయం అందర్లోనూ కలిగింది. చాలా కీలకమైన ఈ వార్త క్షణాల్లో దావానలంలా వ్యాపించింది. ఈ వార్తలు చూసి వైసీపీ వర్గాల గుండెలు గుభేల్ అన్నాయి. ఎన్నికల జరిగినప్పుడు జగన్‌కి వ్యతిరేకంగా వీడియో మెసేజ్ రాష్ట్ర ప్రజలకు పంపిన విజయమ్మ, జగన్ ఓటమికి ఒక కారణంగా నిలిచారు. ఇప్పటికే జగన్ సర్వనాశనం అయిపో్యాడు.. ఇప్పుడు ఇంకా నాశనం చేయడానికి విజయమ్మ జేసీతో భేటీ అయిందేమోనన్న అభిప్రాయాలు వినిపించాయి.  అయితే, ఆ తర్వాత జేసీ ప్రభాకరరెడ్డి నుంచి వివరణ వెలువడింది. ‘‘నేను విజయమ్మతో రాజకీయ కారణాలతో భేటీ కాలేదు. నేను హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రికి వెళ్ళాను. అక్కడ విజయమ్మ కూడా వున్నారని తెలిసింది. ఆమెతో నేను లాంజ్‌లో కూర్చుని మాట్లాడాను అంతే.. అంతకంటే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదు’’ అనే సారాంశం వచ్చేలా ఆయన వివరణ ఇచ్చారు. దాంతో ఈ ఇష్యూ సర్దుమణిగింది. అనవసరంగా ఏదేదో ఊహించుకున్నామే అని మీడియా అనుకుంటే, అనవసరంగ భయపడి  చచ్చాం అని వైసీపీ వర్గాలు అనుకున్నాయి. కానీ, ఈ భేటీ అంత లైట్‌గా తీసుకోవాల్సిన భేటీ అని మాత్రం అనిపించడం లేదు. ఏదో  ఆస్పత్రిలో కాకతాళీయంగా కనిపించినప్పటికీ జగన్‌కి శత్రువు అయిన జేసీ ప్రభాకరరెడ్డితో విజయమ్మ ఎందుకు భేటీ అవ్వాలి? అలా భేటీ అయితే అసలే అనుమానపు పక్షి అయిన జగన్, షర్మిల మీద పీకల వరకూ కోపంగా వున్న జగన్ ఈ భేటీని రాజకీయ కోణంలో ఆలోచిస్తాడేమోనని విజయమ్మ అనుకోలేదా? సరే, కాసేపు అసలు ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదనే అనుకుందాం. ఆయన నమస్కారం విజయమ్మగారూ అంటే, ఈవిడ నమస్తే రెడ్డిగారూ అంటే సరిపోతుంది కదా... అక్కడితో ఇష్యూ క్లోజ్ అయ్యేది కదా! మరి, వీళ్ళిద్దరి భేటీ ఫొటో తీసిందెవరు? దాన్ని మీడియాకి రిలీజ్ చేసిందెవరు? వాళ్ళ ప్రమేయం లేకుండానే, వాళ్ళ అనుమతి లేకుండానే ఫొటో తీశారా? కాబట్టి, ఈ భేటీలో ఏదో రాజకీయ ప్రాధాన్యం వుంది.. అదేంటో ఇప్పటికిప్పుడే తెలియకపోవచ్చుగానీ, అతి త్వరలోనే బయటపడే అవకాశాలు అయితే వున్నాయి!

ఆస్పత్రిలో విజయమ్మకి చికిత్స... బెంగళూరులో జగన్ భజన!

తల్లీ, చెల్లీ అంటే ఎంతమాత్రం అభిమానం లేని సిల్లీ ఫెలో ఎవరయ్యా అంటే మన జగన్ అని ఎంతమాత్రం తడుముకోకుండా చెప్పవచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య, మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తల్లి అయిన విజయమ్మ గత కొన్ని రోజులుగా బంజారాహిల్స్.లోని ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. జగన్ గత కొంతకాలంగా తాడేపల్లి నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి తాడేపల్లికి, మధ్యమధ్యలో బెంగళూరుకి, అంతకుముందు నెల్లూరు సెంట్రల్ జైలుకి, ఆ తర్వాత వినుకొండలోని రషీద్ ఇంటికి వెళ్ళారు. ఇన్నిచోట్లకి వెళ్ళి ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్టు పోజులు కొడుతున్నారుగానీ, తనను ప్రపంచంలోకి తెచ్చిన తల్లి గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే, తల్లిదగ్గరకి వెళ్ళడానికి కూడా ఇతగాడికి తీరికలేకుండా పోయింది. అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడన్నట్టుగా వుంది జగన్ వ్యవహారశైలి. కన్నతల్లినే పట్టించుకోని ఈ పుత్రరత్నం ఏపీలో వున్న అక్కచెల్లెళ్ళని, అవ్వతాతలను ఆదుకుంటాడట.. ఏడిసినట్టుంది! ఢిల్లీ నుంచి తాడేపల్లికి వచ్చిన తర్వాత, మళ్ళీ ఎగేసుకుంటూ ఆ బెంగళూరుకు వెళ్ళి భజన చేయకపోతే, ఆస్పత్రిలో వున్న తల్లిని పరామర్శించవచ్చుగా? 

కృష్ణాజిల్లాని ఈ రాక్షసుడి చేతిలో పెట్టారేంటో!

కృష్ణాజిల్లా ఎస్పీగా గంగాధరరావుని నియమించడం కృష్ణాజిల్లా పోలీసు శాఖలో మాత్రమే కాకుండా, తెలుగుదేశం పార్టీలో కూడా చర్చకు దారితీసింది. జగన్ పార్టీతో ఐదేళ్ళు అంటకాగి, జగన్ చెప్పినట్టల్లా ఆడి, తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను వేధించిన గంగాధర్‌ని ఇప్పుడు కృష్ణాజిల్లా ఎస్పీగా చంద్రబాబు నియమించారు. గంగాధర్ తన ప్రతాపాన్ని కేవలం టీడీపీ క్యాడర్ మీద మాత్రమే చూపించలేదు.. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు మీద కూడా తన అధికార దుర్వినియోగాన్ని ప్రయోగించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా గంగాధర్ వున్న సమయంలో అంగళ్ళు ఘటనలో చంద్రబాబు మీద, తెలుగుదేశం నాయకుల మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసిన ఘనత గంగాధర్‌దే. చంద్రబాబు మీద రాళ్ళ దాడి చేసిన వారిని వదిలేసి, రాళ్ళదాడికి గురైన చంద్రబాబు తదితరుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన గొప్ప పోలీస్ ఆఫీసర్ గంగాధర్. సాధారణంగా అయితే ఇలాంటి ఆఫీసర్ని ఏదైనా ప్రాధాన్యం లేని పోస్టులో నియమిస్తారు. కానీ, ఏకంగా కృష్ణాజిల్లా ఎస్పీగా నియమించడం తెలుగుదేశం నాయకులు మింగుడు పడటం లేదు. వైసీపీ ప్రభుత్వం వుంది కాబట్టి గంగాధర్ అప్పట్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి వుండొచ్చు అనడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆయన ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ మీద కొద్ది రో్జుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన మీద ఆయన ఫిర్యాదు చేయలేదు. అలాగే రాజకీయ రంగు కూడా పులమలేదు. ఈనెల 17న కృష్ణాజిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ గుడివాడకి వెళ్ళి లక్ష్మోజీని పరామర్శించారు. తన మీద జరిగిన దాడి ఘటన మీద కేసు నమోదు చేయించారు. గంగాధర్ ఇదంతా కొడాలి నాని ఆదేశాల మేరకు చేస్తున్నారని, ఈ దాడి ఘటన కేసుని తెలుగుదేశం నాయకుల మీదకి నెట్టే ఉద్దేశంతోనే గంగాధర్ ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  చంద్రబాబు నాయుడు అతి మంచితనంతో ఇలాంటి నాయకుడికి కృష్ణాజిల్లా ఎస్పీలాంటి కీలక పదవిలో కూర్చోబెట్టడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పాలనలో తన రాక్షసత్వాన్ని చూపించిన గంగాధర్ చేతిలో క‌ృష్ణాజిల్లాని చంద్రబాబు పెట్టారని అంటున్నారు.

వినుకొండ రషీద్ కుటుంబానికి జగన్ షాక్!

జగన్‌ని నమ్మితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టే.. షాక్ కొట్టాక గానీ జగన్‌ని నమ్మడం ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తాము చేసిన తప్పు తెలిసొచ్చింది. అందుకే, ఆ తప్పు మరోసారి చేయకుండా తమను తాము రక్షించుకున్నారు. కానీ, పాపం ఇంకా కొంతమందికి జగన్ అసలు స్వరూపం అర్థం కాలేదు. అందుకే గొర్రె కసాయివాడిని నమ్మినట్టు జగన్‌ని నమ్ముతున్నారు. నమ్మడం మీ వంతు, మిమ్మల్ని మోసం చేయడం నావంతు అన్నట్టుగా జగన్ తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్.గా జగన్ చేతిలో దారుణంగా మోసపోయింది ఎవరయ్యా అంటే, వినుకొండలో హత్యకి గురైన రషీద్ కుటుంబ సభ్యులు. హతుడు రషీద్, హంతకుడు జిలానీ ఇద్దరూ పాత స్నేహితులే. ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే. అయితే కారణాలు తెలియవుగానీ, ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. అది రషీద్ హత్యకి దారి తీసింది. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్య అని పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. రషీద్‌కి, జిలానీకి వ్యక్తగత కక్షలు ఎప్పటి నుంచో వున్నాయని రషీద్ కుటుంబానికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో రషీద్ హత్యకు గురికావడంతో శవాల కోసం వెతికే రాబందు జగన్మోహన్‌రెడ్డికి మంచి అవకాశం దొరికింది. రషీద్ కుటుంబాన్ని పరామర్శించే పేరుతో వినుకొండకి వెళ్ళి నానా రచ్చ చేయడానికి ఛాన్సొచ్చింది. జగన్ నాటకం మరింత రక్తి కట్టడానికి కావలసింది రషీద్ కుటుంబ సభ్యుల మద్దతు. అంతే, జగన్ ఆదేశాలతో లోకల్ వైసీపీ బ్యాచ్‌ రషీద్ కుటుంబం దగ్గరకి వెళ్ళింది. జగన్ సార్ పరామర్శకి వస్తారు. మీరు ఆ సమయంలో ఇది రాజకీయ హత్యేనని చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పాలి. పనిలోపనిగా తెలుగుదేశం పరిపాలన సరిగా లేదని కూడా చెప్పాలి. జగనన్న పరామర్శకు వచ్చి వెళ్ళిన తర్వాత పది లక్షల రూపాయలు మీకు అందుతాయి. చెట్టంత రషీద్‌ని పోగొట్టుకున్న బాధలో వున్న మీకు ఆ డబ్బు వస్తే కొంత ఊరట దక్కుతుంది అని చెప్పి ఒప్పించారు. ఆ తర్వాత జగన్ వినుకొండకి రావడం, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం, రషీద్ కుటుంబం తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పడం, మధ్యమధ్యలో చంద్రబాబు పథకాలు ఏవీ అందడం లేదని కూడా చెప్పడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాతే స్టోరీలో జగన్ మార్కు అసలు ట్విస్టు మొదలైంది. జగన్ రావడం అయింది, వెళ్ళడం అయింది. రషీద్ కుటుంబానికి ఇస్తానన్న ఆర్థిక సాయం మాత్రం అందలేదు. రేపో ఎల్లుండో జగన్ సార్ డబ్బు పంపుతారు అని ఎదురుచూసిన రషీద్ కుటుంబానికి మెల్లగా జ్ఞానోదయం కలిగింది. ఈ విషయంలో స్థానిక నాయకులను అడిగితే, వాళ్ళు ‘‘మాకేం తెలుసు.. ఆయన పదిలక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తారని అనుకున్నాం.. కానీ అలా జరగలేదు’’ అని చేతులెత్తేశారు. దాంతో రషీద్ కుటుంబం షాకైపోయారు. అప్పటికి గానీ వాళ్ళకి జగన్ అసలు స్వరూపం అర్థం కాలేదు. పాపం.. కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయారు.. జగన్ దిక్కుమాలిన రాజకీయాల్లో పావులా మారారు. 

ఏపీ రాజముద్రతో పట్టాదార్ పాస్‌బుక్‌లు!

ఆంధ్రప్రదేశ్ రైతులు ఐదేళ్ళపాటు భరించిన దరిద్రం వదలబోతోంది. ఇంతకాలం రైతులు సహించిన నరకం తప్పబోతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందబోతున్నాయి. జగన్ దుర్మార్గ పాలనలో రైతుల భూమి హక్కుపత్రమైన పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో ముద్రించారు. తమ ఆస్తి హక్కుపత్రం మీద జగన్ ముఖం చూడలేక రైతులు ఇంతకాలం తల్లడిల్లిపోతూ వచ్చారు. ఇదేమని ప్రశ్నిస్తే కొరివితో తల గోక్కున్నట్టే అవుతుందని వాళ్ళలో వాళ్లే కుమిలిపోతూ వచ్చారు. జగన్ ముఖారవిందం వున్న పాస్ పుస్తకాలను చించిపారేయాలన్నంత ఆవేశం వచ్చినా తమాయించుకున్నారు. అయితే కొంతమంది రైతులైతే ఏదయితే అది అయిందని బహిరంగానే తమ పట్టాదార్ పాస్ పుస్తకాలను చించేసిన సందర్భాలు కూడా వున్నాయి. ఇప్పుడు ఆ చీకటి రోజులు పోయాయి కాబట్టి కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో వున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను త్వరలో ఆంధ్రప్రదేశ్ రైతులకు అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులూ.. కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందుకోండి.. పాత పుస్తకాలు చించిపారేయండి.

మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిన శాంతి

గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి సడెన్ గా కోర్డు గడపదొక్కింది. నాలుగు గోడల మధ్య ఉన్న ఈ వ్యవహారాన్ని మీడియాకెక్కిన శాంతి  యూటర్న్ తీసుకుంది.  తను పరువు తీస్తున్న మీడియాపై యాక్షన్ తీసుకోవాలని అని కోర్టు గడపతొక్కింది.  మీడియాలో ఆమె ప్రైవేసీకి భంగం కలిగే విధంగా ప్రచారం జరుగుతుందని హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు కు మొరపెట్టుకుంది. శాంతి వాదనలను బల పరిచే విధంగా కోర్టు ఉత్తర్వులు జారి చేసింది. ఇకపై శాంతి వ్యక్తిగత జీవనాన్ని ప్రసారం చేస్తే కోర్టు దిక్కరణ అవుతుందని శాంతి తరపు న్యాయవాది పేర్కొన్నారు. శాంతి భర్త మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో గుప్పు మంటున్నాయి. . శాంతికి పుట్టిన మగబిడ్డ తన బిడ్డ కాదని మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్నారు. శాంతి వైకాపా రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి డిఎన్ ఏ టెస్ట్ చేస్తే సరిపోతుందని మదన్ మోహన్ బలంగా నమ్ముతున్నారు.  యూట్యూబ్ సంస్థకు  కోర్టు నోటీసులు జారి చేసింది. శాంతి కంటెంట్ పూర్తిగా తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతిని వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లోబరుచుకున్నారని మీడియాలో కథనాలు  వస్తున్నాయి. 

వైఎస్ విజయమ్మతో జేసీ భేటీ.. జగన్ కు షాకేగా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తల్లి వైఎస్ విజయమ్మతో తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకరరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ విమర్శకులలో జేసీ ప్రభాకరరెడ్డి ముందు వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే.  జగన్ హయాంలో జేసీ దివాకరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి పలు విధాలుగా వేధిపులకు గురయ్యారు. జగన్ హయాంలో వారిపై పలు కేసులు నమోదుఅయ్యాయి. వారి ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సులను జగన్ సర్కార్ సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ సంస్థ వ్యవహరిస్తోందంటూ పలు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డిలు  జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.  కాగా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్  ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు బనాయించారంటూ జేసీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఆ సందర్భంగా జగన్ పై వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు.  ఈ నేపథ్యంలో జేసీ విజయమ్మల భేటీ రాజకీయంగా సంచలనానికి కారణమైంది. జేసీ సోమవారం (జులై 29) హైదరాబాద్  లోటస్ పాండ్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లి మరీ ఆమెతో భేటీ అయ్యారు. వీరి భేటీ అరగంటకు పైగా సాగింది. ఈ భేటీలో వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? అన్నది తెలియరాలేదు. జేసీ వర్గీయులు మాత్రం ఇది సాధారణ భేటీయేననీ, జేసీ విజయమ్మ ఆరోగ్యం, క్షేమ సమాచారాలను తెలుసుకున్నారని చెబుతున్నారు. గతంలో అంటే వైఎస్ హయాంలో జేసీ దివాకరరెడ్డి బ్రదర్ కాంగ్రెస్స్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలు కూడా ఉండేవి. ఆ పరిచయాలను పురస్కరించుకునే విజయమ్మను మర్యాదపూర్వకంగా జేసీ కలిశారని చెబుతున్నారు.  ఈ భేటీ ఉద్దేశం ఏమిటన్నది పక్కన పెడితే.. విజయమ్మతో జేసీ భేటీ జగన్ కు మాత్రం గట్టి షాక్ గానే చెప్పాలి. తనకు బద్ధ శత్రువుగా మారిన చెల్లెలు షర్మిలకు మద్దతుగా విజయమ్మ నిలబడ్డారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత ఆమె ఏ సందర్భంలోనూ కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. షర్మిలకు అండగానే నిలిచారు. ఇటీవలి ఎన్నికలలో కూడా ఆమె అమెరికా నుంచి పంపిన సందేశంలో షర్మిలను గెలిపించాల్సిందిగా కోరారు తప్ప జగన్  గురించి మంచిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  జగన్ కు రాజకీయంగా ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ ముభావంగానే ఉంటూ వచ్చారు. ఏవైనా కార్యక్రమాలలో అంటే వైఎస్ జయంతి, వర్థంతి వంటి కార్యక్రమాలకు హాజరై జగన్ ను హత్తుకుని ముద్దు పెట్టి ఫొటో దిగడానికే ఆమె పరిమితమయ్యారు. విజయమ్మ జగన్ కు దూరం కావడం కూడా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషించారు.  ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి విజయమ్మతో భేటీ కావడం రాజకీయంగా జగన్ కు ఇబ్బందికరమైన అంశమే.   జగన్ కు అధికారం కోల్పోయి, అన్ని వైపుల నుంచీ సమస్యలు చుట్టుముడుతున్న తరుణంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా విజయమ్మతో జేపీ భేటీ కొత్త తలనొప్పికి కారణమౌతుందనడంలో సందేహం లేదు.   

గన్నవరం నుంచి విమాన సర్వీసులు పెంచండి.. కేంద్ర మంత్రికి కేశినేని చిన్ని వినతి

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను ప్రారంభించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన నాయుడితో సోమవారం (జులై 29) భేటీ అయిన కేశినేని చిన్ని.. ఈ సందర్భంగా ఇండిగో సంస్థ సర్వే చేసిన మార్గాల్లో గన్నవరం నుంచి విమాన సర్వీసులు తక్షణం ప్రారంభించాలని కోరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వారణాసి వ‌యా వైజాగ్, విజయవాడ నుండి  కలకత్తా వ‌యా విశాఖపట్నం, విజయవాడ నుండి బెంగళూరు వ‌యా హైదరాబాద్ లేదా  కొచ్చి, విజయవాడ నుండి అహ్మదాబాద్, విజయవాడ నుండి పుణే విమాన స‌ర్వీసుల ప్రారంభించాల‌ని అభ్య‌ర్థించారు. ఆయా మార్గాలలో విమాన సర్వీసులపై ఇప్పటికే ఇండిగో సంస్థ సర్వే చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేశినేని చిన్ని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి వినతి పత్రం సమర్పించారు. అలాగే కేంద్ర పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహననాయుడికి లిఖితపూర్వక అభినందనలు తెలిపారు. కాగా కేశినేని చిన్ని అభ్యర్థనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. 

ఈ బంధం ఈ నాటిది కాదు... అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ప్రశంసలు 

తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధం ఈనాటిది కాదు. రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు ఉన్నబంధం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది.  తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ సునాయసంగా గెలిచింది.  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు పరోక్షంగా దోహదపడ్డారు. వీరిరువురి బంధం బలమైంది.  బలమైన బంధమని మరో మారు నిరూపణ అయ్యింది.  రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండుమూడుసార్లు ప్రస్తావించారు. విద్యుత్ కమిషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గురువులకు పంగనామం పెట్టే లక్షణం బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. మనం దాహంతో ఉన్నప్పుడు గ్లాస్ మంచినీరు ఇచ్చిన వారిని కూడా గుర్తు చేసుకోవడం మన తెలంగాణ వారి లక్షణమన్నారు. ఇరవై సంవత్సరాలు కలిసి పని చేసిన సహచరులను అగౌరవపరచడం సరికాదన్నారు. బీఆర్ఎస్ వారికి తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అలవాటేనని ఎద్దేవా చేశారు. తనకు మాత్రం అలాంటి గుణం లేదన్నారు. తాను మిత్రులు, సహచరులను బాగా చూస్తానని, పెద్దవారిని గౌరవిస్తానని, ఇది తనకు తన పెద్దలు నేర్పిన సంస్కారం అన్నారు. భోజనం పెట్టిన ఇల్లు, అవకాశం ఇచ్చిన వారి... ఇంటి వాసాలు లెక్కపెట్టడం, ఆ ఇంటికి నిప్పు పెట్టడం బీఆర్ఎస్‌కు అలవాటు అని ధ్వజమెత్తారు. అది వారి డీఎన్‌ఏలోనే ఉందన్నారు. పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షమైన బిఆర్ ఎస్ ను తూర్పారబడుతూనే టిడిపి అధ్యక్షుడైన చంద్రబాబు పట్ల గౌరవ ప్రదమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపం అన్నట్లుగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ ఆయన విచారణ కమిషన్ ముందుకు వచ్చి వాదనలు వినిపిస్తే వారి నిజాయతీ బయటపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ సభ్యులని అన్నారు. ఇప్పుడు వద్దని అంటోంది కూడా వాళ్లేనని విమర్శించారు.జగదీశ్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్‌పై న్యాయ విచారణ జరుగుతోందన్నారు. కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని డిమాండ్ చేశారు. విచారణ కమిషన్ కొత్త చైర్మన్‌ను సాయంత్రం నియమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. యూపీఏ ప్రభుత్వం నిర్ణయాల వల్ల హైదరాబాద్‌కు ఆదాయం పెరిగిందన్నారు.