ఢిల్లీలో శాంతి భర్త మదన్ ఆందోళన!
posted on Jul 24, 2024 @ 3:19PM
‘‘నా భార్యకి పుట్టిన కొడుకుకు తండ్రి ఎవరో తేల్చండి మహాప్రభో’’ అని గత కొన్ని రోజులుగా దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి భర్త మదన్ మోహన్ మొత్తుకుంటున్న విషయం తెలిసిందే. అదేంటోగానీ, జగన్ అండ్ కో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోజే, వాళ్ళ ఆందోళన కార్యక్రమానికి ఎదురుగానే మదన్ మోహన్ కూడా ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తన భార్యని ట్రాప్ చేశాడంటూ మదన్ మోహన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మదన్ మోహన్ ఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట చేశారు. తాను మీడియా ముందుకు వచ్చి గొంతు నొప్పి పుట్టేలా తన బాధను చెప్పుకుంటున్నా విజయ సాయిరెడ్డి పట్టించుకోవడం లేదని, డీఎన్ఏ టెస్టుకు అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. విజయసాయిరెడ్డి తనకు ఇతరుల చేత ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. తనకు, తన పిల్లలకు న్యాయం చేసేంతవరకు తన ఆందోళన ఆగదని మదన్ మోహన్ చెప్పారు. తన ఆందోళనలో భాగంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్‌తో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను చూపించబోతున్నట్లు మదన్ మోహన్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మదన్ మోహన్‌తోపాటు పలువురు గిరిజన నాయకులు కూడా పాల్గొన్నారు.