తల్లికి వందనం.. జగన్‌కి వాత!
posted on Jul 24, 2024 @ 2:05PM
తల్లికి వందనం స్కీమ్ విషయంలో జగన్‌కి, ఆయన తోక బ్యాచ్‌కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అట్లకాడ కాల్చి వాత పెట్టారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు.. ఈ జగన్ పిశాచాలు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాల మీద విష ప్రచారాన్ని చేయడంలో బిజీగా వున్నాయి. ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకం మీద ఈ దండుపాళ్యం బ్యాచ్ ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు వాగుతూ విషాన్ని చిమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కి, జగన్ దండుపాళ్యం బ్యాచ్‌కి నోళ్ళు మూతలు పడేలా మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. తమ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే, తల్లికి ఎంతమంది పిల్లలు వున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. జగన్ ప్రభుత్వం వున్న సమయంలో అమ్మ ఒడి పథకంలో రకరకాల మార్సులు చేసి ఇచ్చే డబ్బులో ఎన్నెన్నో కోతలు కోశారని, తమ ప్రభుత్వం అలాంటి పనులు చేయదని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ అండ్ జగన్ దండుపాళ్యం బాచ్‌లూ.. ఈ పథకం విషయంలో మీకు పడిందిగా వాత.. ఇక మీ నోళ్ళకి పడాలి మూత!