బాబోయ్.. బాబూమోహన్!

మొన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించనంత వరకు తెలంగాణలో చాలామంది ‘ప్రముఖ నాయకులు’ చాలామంది తెలుగుదేశం పార్టీని చిన్నచూపు చూశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్న అభిప్రాయంలోనే చాలామంది వుండేవారు. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్టు అయినప్పుడు హైదరాబాద్ మొత్తం చంద్రబాబు వైపు నిలబడిందో అప్పుడు చాలామందికి తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని దూరం చేయడం ఎవరి వల్లా కాదనే విషయం అర్థమైంది. బంగారానికి తావి అబ్బినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. దాంతో చాలామంది వాయిస్‌లో మార్పు వచ్చింది. ‘తెలుగుదేశం పార్టీ ఆంధ్రాపార్టీ... తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏం పని’ అంటూ అవాకులు చెవాకులు పేలిన కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే తప్పేముంది అంటూ వాస్తవంలోకి వచ్చి మాట్లాడారు. ఇలా ఇటీవల జరిగిన పరిణామాలతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి జోష్ పెరిగింది. తెలంగాణలో ఉనికిని చాటుకోవడం మాత్రమే కాదు.. తెలంగాణలో అధికారంలోకి వచ్చే సత్తా కూడా తెలుగుదేశం పార్టీకి వుందన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఇతర పార్టీల నాయకుల చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళుతోంది. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురదియెట్లన్నన్... తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.. అని సుమతి శతకకారుడు ఏనాడో చెప్పాడు కదా..! తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తూ వుండటంతో తెలుగుదేశం గూట్లోకి వచ్చి వాలిపోవాలని అనేక వలస పక్షులు ప్రయత్నాలు ప్రారంభించాయి. అలాంటి అనేక పక్షుల్లో ఒకానొక పక్షి సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్! సోమవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఇంతలో ఉరుములేని పిడుగులా బాబూమోహన్ అక్కడకి వచ్చారు. చంద్రబాబు దగ్గరకి వెళ్ళారు. పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాక బాబూమోహన్ తాను తెలుగుదేశం పార్టీలో వున్నప్పటి రోజులను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చింది, ఎమ్మెల్యేని చేసింది, మంత్రిని చేసింది తెలుగుదేశం పార్టీయే అని తలచుకుని కళ్ళు తుడుచుకున్నారు. ఆగర్భ శత్రువు ఎదురైనా చిరునవ్వుతో పలకరించే చంద్రబాబు, బాబూమోహన్‌తో కూడా చిరునవ్వుతో మాట్లాడి పంపించేశారు. ఇలా బాబూమోహన్ టీడీపీ ఆఫీసుకి వెళ్ళి చంద్రబాబును కలవటంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. నేడో రేపో బాబూ మోహన్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, తెలుగుదేశం వర్గాలు మాత్రం ‘బాబోయ్.. బాబూమోహన్’ అంటున్నాయి. బాబూ మోహన్ రాజకీయంగా ఎదిగిందే తెలుగుదేశం పార్టీలో. ఆయన ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవిని వెలగబెట్టినా తెలుగుదేశం పార్టీ చలవతోనే. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాబూమోహన్ తెలుగుదేశం పార్టీని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కేసీఆర్ నా ఫ్రెండ్ అంటూ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత బాబూమోహన్ రాజకీయంగా పతనం అయిపోతూ వచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, టీఆర్ఎస్‌ని వదిలిపెట్టి, బీజేపీలో చేరి, ఆ తర్వాత బీజేపీ నుంచి కూడా బయటకి వచ్చేసి, ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నట్టు చెప్పి, ఆ తర్వాత తూచ్ నేను చేరలేదని చెప్పి... ఇలా రాజకీయాల్లో రకరకాల విన్యాసాలు చేసి, తన నియోజకవర్గం అయిన అందోలు ప్రజల మద్దతు కోల్పోయారు. ప్రస్తుతం రాజకీయాల్లో చెల్లని కాసు బాబూమోహన్. ఆయనకి ప్రజల్లో విలువ లేదు. రాజకీయాల్లో గౌరవం లేదు. బాబూమోహన్‌ని తీసుకోవడానికి ఏ పార్టీకీ ఆసక్తి లేదు. ఇలాంటి సందర్భంలో ‘పచ్చగా’ వున్న తెలుగుదేశం పార్టీ మీద బాబూమోహన్ కన్ను పడింది. పచ్చ చొక్కా వేసుకుని వచ్చి, చంద్రబాబుని కలిసి, భావోద్వేగాలు ప్రదర్శించి వెళ్ళారు. ఇలాంటి బాబూమోహన్ లాంటి అవకాశవాదులను పార్టీలోకి తీసుకోకూడదన్న అభిప్రాయాలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులలో వ్యక్తం అవుతున్నాయి. నిజమే, ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కావలసింది పోరాటం చేసే వాళ్ళే తప్ప... పదవుల కోసం పార్టీలు మారేవాళ్ళు కాదు!

చందమామ అద్భుత ఫోటో విడుదల చేసిన ‘నాసా’

చందమామ అందాలను వీనుల విందు కనుల విందు చేసే కవులు, కళాకారులు. చందమామ అందాలను మరింత పెంచే విధంగా నాసా తన భుజాలపై వేసుకుంది.  అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అప్పుడప్పుడు మన విశ్వానికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా అమెరికా స్పేస్ ఏజెన్సీ విడుదల చేసే ఖగోళ దృశ్యాలు అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్దులను చేస్తుంటాయి. విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. భూమి, అంతరిక్షం ఫొటోలతో పాటు ఎన్నో ఎడ్యుకేషనల్ వీడియోలను పంచుకునే సానా తాజాగా మరో అద్భుతమైన ఫొటోను విడుదల చేసింది. పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అస్తమయానికి సంబంధించిన అద్భుత ఫొటోను విడుదల చేసింది. దాదాపు 4 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసిస్తున్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ ఫొటోను తీశారు. ‘‘పసిఫిక్ సముద్రం మీద చంద్రుడు అస్తమిస్తున్నాడు. హవాయి సమీపంలో ఏర్పడిన ఉష్ణమండల తుపాను ‘హోన్‌’ని చిత్రీకరించడానికి వెళ్లాం. అయితే తుపాను మమ్మల్ని దాటిన తర్వాత చంద్రుడి అస్తమయం మొదలైంది’’ అని నాసా వ్యోమగామి డొమినిక్ పేర్కొన్నారు. ఈ ఫొటోకు సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా నాసా వెల్లడించింది. ‘‘400ఎంఎం, ఐఎస్‌వో 500, 1/20000ఎస్ షట్టర్ స్పీడ్, ఎఫ్2.8, క్రాప్డ్, డీనాయిస్డ్’’ అని పేర్కొంది.  కాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిత్రంలోని మేఘాలు, భూవాతావరణం నుంచి నీలం రంగులతో కనిపిస్తున్న చందమామ రూపం అద్భుతం అనిపిస్తోంది. ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాసా షేర్ చేసిన ఈ ఫొటోకు లక్షల వ్యూస్, వేలలో లైక్స్ లభించాయి.  ‘గొప్ప ఫొటో షాట్!’’ అంటూ ఓ నెటిజన్ ప్రశంసించాడు. ఈ ఫోటో తన హృదయాన్ని తాకిందని మరో యూజర్ రాసుకొచ్చాడు. అంతరిక్షం చాలా అందంగా ఉందని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

బడా బాబులకు హైడ్రా జ్వరం?

హైదరాబాద్ లో హైడ్రా దడ పుట్టిస్తోంది. నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో న‌గ‌రంలో టాపిక్‌ ఆఫ్‌ ది న్యూస్‌గా హైడ్రా మారింది. గ‌త ప‌దిహేను రోజులుగా బుల్డోజర్లతో దండయాత్ర చేస్తోంది. ఒక్కోరోజు ఒక్కో ప్లేస్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మ‌రో వైపు హైడ్రా దూకుడుకు రాజ‌కీయ రంగు కూడా పులుముకుంది. బీఆర్ఎస్ నేత‌ల క‌ట్ట‌డాల‌ను టార్గెట్ గా చేసుకొని హైడ్రా కూల్చివేత‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ నేత‌లు చెరువుల‌ను ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌ట్టినా వాటి జోలికి హైడ్రా వెళ్ల‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ నేత‌లు సైతం దీటుగా స‌మాధానం ఇస్తున్నారు. అక్ర‌మ నిర్మాణాలు అని తేలితే మా భ‌వ‌నాల‌పైనా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు ఎవ‌రి వాద‌న‌లు వారు వినిపిస్తున్నారు. హైడ్రా దూకుడు స‌రైందేన‌ని ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు పేర్కొన‌గా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోలా స్పందించారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేతలు ఎలా చేస్తారు? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయం ఇలా అన్నీ.. అక్రమ నిర్మాణాలకు కల్పించింది ప్రభుత్వమే కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.   హీరో నాగార్జున సైతం హైడ్రాకు బాధితుడిగా మార‌డంతో.. చెరువు భూముల‌ను ఆక్ర‌మించి క‌ట్ట‌డాలు చేప‌ట్టిన వారి వెన్నుల్లో హైడ్రా వ‌ణుకు పుట్టిస్తోంది.  మాదాపూర్ ప‌రిధిలో హీరో నాగార్జునకు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ఉంది.  పదేళ్ల క్రితం దీని  నిర్మాణం చేప‌ట్టారు. తుమ్మిడి చెరువును ఆక్ర‌మించి ఈ నిర్మాణం చేప‌ట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాదాపు మూడున్న‌ర ఎక‌రాలు క‌బ్జా చేసి ఎన్‌ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను నిర్మించార‌ని అధికారుల‌కు గ‌తంలో ఫిర్యాదులు అందాయి. తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ‌యాంలో జీహెచ్ఎంసీ కమిషన‌ర్‌గా సోమేశ్ కుమార్ ఉన్న‌ప్పుడు ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. నిర్మాణాన్ని కూల్చివేయ‌డానికి వెళ్లిన బుల్డోజర్లు దాన్ని టచ్‌ చేయకుండానే వెన‌క్కి వ‌చ్చేశాయి. అప్పటి నుంచి ఈ భవనం జోలికి ఎవరూ వెళ్లలేదు. ఈ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తాజాగా హైడ్రా రంగంలోకి దిగింది. దీనికితోడు గ‌త వారంరోజుల క్రితం మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిసైతం ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో రంగ‌నాథ్ సార‌థ్యంలోని హైడ్రా బృందం క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌కు సంబంధించిన స‌మాచారం తెప్పించుకొని విచార‌ణ చేసింది. వారి విచార‌ణ‌లో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ చెరువును క‌బ్జా చేసి నిర్మాణం చేశార‌ని తేలింది. దీంతో శ‌నివారం (ఆగస్టు 25) తెల్ల‌వారు జామున రంగంలోకి దిగిన హైడ్రా గంట‌ల వ్య‌వ‌ధిలోనే క‌నెన్ష‌న్ సెంట‌ర్ ను నేల‌మ‌ట్టం చేసింది. అక‌స్మాత్తు ప‌రిణామంతో కంగుతిన్న హీరో అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్ర‌యించాడు. దీంతో కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే కూల్చివేత ప్రక్రియను హైడ్రా బృందం పూర్తిచేసింది.  హీరో అక్కినేని నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను హైడ్రా నేల‌మ‌ట్టం చేయ‌డంతో న‌గ‌రంలోని చెరువుల‌ను క‌బ్జాచేసి అక్ర‌మ క‌ట్ట‌డాలు చేప‌ట్టిన వారిలో వ‌ణుకు మొద‌లైంది. హైడ్రా దూకుడుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తున్న‌ప్ప‌టికీ.. ప‌లు వ‌ర్గాల‌ వారు హైడ్రా తీరును త‌ప్పుబ‌డుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చివేత‌లు చేప‌డుతున్నార‌ని, కేవ‌లం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న‌వారి క‌ట్ట‌డాల‌నే హైడ్రా కూల్చేస్తున్నద‌ని విమ‌ర్శిస్తున్నారు. అయితే, హైడ్రా బృందం విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోవ‌టం లేదు. కూల్చివేతలలో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉండటంతో బీఆర్ఎస్ విమర్శలను జనం కూడా పట్టించుకోవడం లేదుప. హైద‌రాబాద్ లో అక్ర‌మ నిర్మాణాల‌ను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం, విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌గ‌రానికి అండ‌గా ఉండ‌టం హైడ్రా ప్ర‌ధాన ల‌క్ష్యాలు. ఆ మేర‌కు  ముందుకెళ్తామ‌ని హైడ్రా బృందం చెబుతున్నది. ప్ర‌స్తుతం అక్కినేని నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ సహా పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.  హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏమిటి.. ఎవ‌రి ఆక్ర‌మ‌ణ‌ల‌పై కొర‌డా ఝుళిపించ‌బోతుంద‌నే చ‌ర్చ న‌గ‌ర వాసుల్లోనూ, రాజ‌కీయ పార్టీల నేత‌ల్లోనూ ఆస‌క్తిని రేపుతోంది. అయితే, అంద‌రి దృష్టి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే  మ‌ల్లారెడ్డి కాలేజీల‌పై ప‌డింది.  గ‌తంలోనే మ‌ల్లారెడ్డి కాలేజీల‌ను చెరువుల‌ను ఆక్ర‌మించి క‌ట్టార‌ని ప‌లువురు ఫిర్యాదులు చేశారు. మ‌రోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే  ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డికి చెందిన గాయ‌త్రి ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మేడ్చ‌ల్ జిల్లా ఘ‌ట్ కేస‌ర్ మండ‌లం వెంక‌టాపూర్ లోని అనురాగ్ విశ్వ‌విద్యాల‌యం భ‌వ‌నాల‌ను వెంక‌టాపూర్ చెరువులో నిర్మించార‌ని అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.  ముందు ముందు ఇంకెంత మంది ఆక్రమణదారుల పేర్లు వెలుగుతోకి వస్తాయా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. 

తెలుగుదేశం తలుపు తట్టిన బాబూ మోహన్

ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ తెలుగుదేశం గూటకి చేరనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తున్నది. బాబుమోహన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆదివారం (ఆగస్టు 25) ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఫొటో సెషన్ లో చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా బాబూ మోహన్ కూడా ట్రస్ట్ భవన్ కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తెలుగుదేశంతో తనకు గల అనుబంధాన్ని నెమరు వేసుకున్న బాబూ మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు.  బాబూ మోహన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి చంద్రబాబును కలవడంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బాబూమోహన్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు కేఏపాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ గూటికి చేరిన సంగతి తెలిసిందే.   ఇప్పుడు ఆయన ఆ పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బాబూ మోహన్ గతంలో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తరువాత టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇటీవలి ఎన్నికల ముందు ప్రజాశాంతి గూటికి చేరారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి అంటే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  

‘‘దామోదర్ గౌతమ్ సవాంగం అన్న’’... సమగ్ర చరిత్ర..!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) వెల్‌కమ్ టు జర్నలిస్ట్ లాండ్రీ. దామోదర్ గౌతమ్ సవాంగ్. 1986 ఏపీ కేడర్‌కి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. స్వరాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. బీఏ చదివిన గౌతమ్ సవాంగ్ బీకాం చదివిన మాస్టర్ మైండ్ అబ్దుల్ కరీం తెల్గీ... అంటే నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం చేసిన అబ్దుల్ కరీం తెల్గీతో సంబంధాలు కలిగి వున్నాడని నాడు సీబీఐ తేల్చింది. 1992 నుంచి 2003 వరకు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు సాగిన మూడువేల కోట్ల రూపాయల ఈ నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం 2003లో వెలుగులోకి వచ్చింది. తెల్గీ అరెస్టు కంటే ముందు నుంచే అతనితో గౌతమ్ సవాంగ్ సన్నిహిత సంబంధాలు కలిగివున్నాడని, పలుమార్లు తెల్గీతో కలసి హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్‌లో ప్రయాణించాడని నాడి ఏపీ సీఐడీ నిర్ధారించింది. బాంబేలో పెద్ద మొత్తంలో సవాంగ్‌కి తెల్గీ నుంచి డబ్బులు ముట్టాయని వార్తలు వచ్చాయి. గౌతమ్ సవాంగ్‌కి సహకరించిన నాటి ఏసీపీ భూపేందర్ రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడే అని సీబీఐ తేల్చింది. ఇదే కేసులో నాటి టీడీపీ మంత్రి కృష్ణ యాదవ్ అరెస్టయి జైలు జీవితం గడిపారు. డిటెక్టివ్ డిపార్ట్.మెంట్ డీఐజీ నరసింహారావు ఈ కేసులో అరెస్టయి సంవత్సరాలపాటు ఊచలు లెక్కపెట్టాడు. హైదరాబాద్ వెస్ట్ డీసీపీగా పనిచేస్తు్న్న గౌతమ్ సవాంగ్‌ను ఈ కేసులో విచారించడానికి సీనియర్ అధికారి ఉమేష్ షరాఫ్ నాటి సవాంగ్ ఆఫీసులో అడుగుపెడితే గౌతమ్ సవాంగ్ ఏం చేశారో తెలుసా? గోడ దూకి పారిపోయారు అనే వార్త అప్పట్లో హల్‌చల్ చేసింది. ఇదే కేసులో డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, సీఐ మహ్మద్ అషీఫ్, ఎస్.ఐ. మధుమోహన్, కానిస్టేబుల్ కేపీ రెడ్డి కూడా జైలుపాలయ్యారు. కేసు సీబీఐకి బదిలీ అయింది. గౌతమ్ సవాంగ్‌కి ఉచ్చు బిగిసే సమయంలో నాటి టీడీపీ ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో సవాంగ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నాడు సీబీఐ సిఫార్సు చేసింది అనే వాదన బలంగా వుంది. ఆ తర్వాత కొద్దికాలానికే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అందివచ్చిన అవకాశాన్ని స్వయంగా క్రిస్టియన్ అయిన గౌతమ్ సవాంగ్ వినియోగించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర క్రిస్టియన్ ఫాదర్ల లాబీయింగ్‌తో సీబీఐ సిఫారసు చేసిన శాఖాపరమైన చర్యలు అటకెక్కాయనేది బహిరంగ రహస్యం.  ఆంధ్రప్రదేశ్ రెండ్ రాష్ట్రాలుగా విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ పోలీస్ కమిషనర్‌గా గౌతమ్ సవాంగ్ జులై 2015 నుంచి జులై 2018 వరకు మూడు సంవత్సరాలు కొనసాగారు. సవాంగ్ ఆగం 2.0 ఇక్కడే మొదలైంది. విజయవాడ పోలీస్ కమిషనర్‌గా అనేక అక్రమాలకు పాల్పడ్డారని కింది స్థాయి పోలీసు సిబ్బందిని ఎవరిని కదిలించినా కథలు కథలుగా చెబుతారు. అందులో ప్రధానంగా దొంగ బంగారం ముచ్చట ముందు చెబుతాను. సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు, ఆ తర్వాత వచ్చిన పోలీస్ కమిషనర్ల కాలం పరిశీలిస్తే దొంగ బంగారం లెక్క ఇట్టే తేలిపోతుంది. చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు దొంగల నుంచి రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తారు. ఉదాహరణకు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. కేజీ బంగారం చోరీకి గురైంది. పోలీసులు ఆ దొంగని పట్టుకున్నారు. ఆ కేజీ బంగారం దొంగ నుంచి రికవరీ చేశారని అనుకుందాం. బాధితుడికి 750 గ్రాములే చేరుతుంది. ఇక్కడ పావుకిలో బంగారం గోవిందా. అదే గౌతమ్ సవాంగ్ కమిషనర్‌గా వున్న సమయంలో కేజీకి అరకేజీ.. ముప్పావు కేజీ గోవిందా. పోలీస్ కమిషనర్ స్థాయిలో వుండి సీఐ స్థాయి సిబ్బందితో నేరుగా నాకు రికవరీ బంగారం కావాలని అడగటం పోలీసు శాఖ చరిత్రలో ఇటువంటి ఉన్నతాధికారిని మేము అంతకుముందు ఎన్నడూ చూసి ఎరగం అనేవారంటే, పరిస్థితి ఎంత ఘోరంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో సివిల్  పంచాయితీలు. పక్కరాష్ట్రంలో వున్న వ్యక్తులను సైతం అక్రమంగా ఎత్తుకొచ్చి, ఆంధ్రాలో నిర్బంధించి, బెదిరించి పంచాయితీలు చేసేవారనే ఆరోపణలు అప్పుడు బలంగా వినిపించాయి.  సవాంగ్ కమిషనర్‌గా వుండగా విజయవాడలో సెక్స్ రాకెట్, కాల్ మనీ వార్త పెను సంచలనం స‌ృష్టించింది. నాటి ఎంపీ కేశినేని నాని, గౌతమ్ సవాంత్ సంయుక్తంగా ముందుకు తీసుకువచ్చిన కేసు... విజయవాడ కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసు. ఏమాత్రం పసలేని కేసును పట్టుకుని నాటి ప్రతిపక్షం జగన్ గ్యాంగ్ ఏ స్థాయిలో నాటి ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేశాయో మనం చూశాం. అత్యంత వివాదాస్పద కేసులలో పోలీసు ఉన్నతాధికారులు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరణ ఇవ్వడం ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. అటువంటి బెజవాడలో అటు ప్రతిపక్ష పార్టీ రచ్చ, ఇటు మీడియాలో సంచలన కథనాలు... వీటిమీద స్పందించాల్సిన సవాంగ్ హైదరాబాద్ వెళ్ళి కూర్చున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు వివరించమంటే లెక్క చేయలేదు. చంద్రబాబు నాటి డీజీపీ జేవీ రాములును గట్టిగా మందలిస్తే సవాంగ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి  తూతూమంత్రంగా కేవలం ఐదు నిమిషాల్లో సమావేశం ముగించారు.  ఆ తర్వాత కాలంలో గౌతమ్ సావాంగ్‌కి ఒక బలమైన కోరిక వుండేది. అదే డీజీపీ పోస్ట్. తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్ళి చంద్రబాబు మనవడు దేవాన్ష్.తో ఆడుకోవడం, కాకాపట్టడం మొదలుపెట్టారు. ఒక ఫైన్ మార్నింగ్ సవాంగ్ డీజీపీ కలను చంద్రబాబుతో పంచుకోవడం జరిగింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏం సమాధానం చెబుతారు? చూద్దాం అంటారు. చంద్రబాబు కూడా అదే అన్నారు... చూద్దాం అని! గౌతమ్ సవాంగ్ బలహీనతను అర్థం చేసుకున్న ఒక మీడియా అధినేత నేను మాట్లాడాను. నువ్వే డీజీపీ అని గౌతమ్ సవాంగ్‌లో బలీయంగా వున్న కోరికను తట్టి లేపాడు ఆ మీడియా అధినేత. అలా ఒకసారి కాదు.. పలుమార్లు జరిగింది. అదే అదనుగా గౌతమ్ సవాంగ్ చేత అనేక సివిల్ పంచాయితీలు చేయించి లాభపడ్డారు. ఇంకోపక్క ఇదే కోవలో రాష్ట్రంలో ఆటోమోబైల్ టైకూన్‌గా పేరున్న వ్యక్తి కూడా అనేక సివిల్ పంచాయితీలు చేయించి ఇరువురూ లాభపడ్డారు అని చెబుతారు. ఇక మీడియా అధినేత వాడకం అంతా ఇంతా కాదు అని చెబుతారు.  డీజీపీ మార్పు సమయం రానే వచ్చింది. జూన్ 30 సాయంత్రం 5 గంటలకు నాటి డీపీజీ మాలకొండయ్య రిటైర్‌మెంట్. మరి, నూతన డీజీపీ ఎవరు? చంద్రబాబు అప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. గౌతమ్ సవాంగ్‌లో తీవ్ర ఆందోళన మొదలైంది. సవాంగ్ మీడియా అధినేతకు ఫోన్ చేశారు. నీ పేరే కన్ఫమ్. ఇంకొద్దిసేపట్లో చంద్రబాబు సంతకం పెట్టనున్నారు అనే తప్పుడు సమాచారాన్ని తెలియజేశారు. తన జీవితకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది అనే తన్మయత్వంలో సవాంగ్ మునిగిపోయారు. గౌతమ్ సవాంగ్‌ని అభిమానించే మహిళలు, శ్రేయోభిలాషులు సవాంగ్ ఆఫీసుకి క్యూ కట్టారు. పూల బొకేలు, దండలు, స్వీట్ ప్యాకెట్లు, టపాసులు సిద్ధం చేశారు. ఆ  రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏ కబురూ లేదు. తెల్లారి చంద్రబాబు కార్యాలయం నుంచి ఆర్పీ ఠాకూర్‌కి పిలుపు వచ్చింది. ఆర్పీ ఠాకూర్ ఏపీ నూతన డీజీపీగా ప్రకటన వెలువడింది. గౌతమ్ సవాంగ్‌లో నిర్వేదం, విషాదం అలముకున్నాయి. ఇదేంటి ఇలా జరిగింది అని ఆ మీడియా అధినేతను సవాంగ్ ప్రశ్నిస్తే అప్పటి వరకు సవాంగ్‌ని ఒక రేంజ్‌లో వాడిన మీడియా అధినేత ప్లేటు తిప్పేసి, సరిగ్గా చంద్రబాబు సంతకం పెట్టే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు అడ్డుపడ్డారు అనే కట్టుకథలో సవాంగ్‌ని నమ్మించడంలో విజయవంతం అయ్యారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం సవాంగ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్.మెంట్ డీజీగా నియమించింది. ఇక్కణ్ణించి కథ కొత్త మలుపు తీసుకుంది. తన డీజీపీ కల ఆవిరైపోయిన వేదనలో సవాంగ్ అడుగులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ వైపు పడ్డాయి. ఆనాడే, చంద్రబాబు ప్రభుత్వం వుండగానే లోటస్‌పాండ్ వేదికగా సవాంగ్ ఒక ఐపీఎస్ టీమ్‌ని సిద్ధం చేసుకున్నారు. వారంతా చంద్రబాబు వ్యతిరేకులుగా, ప్రతిపక్ష నేత జగన్ అనుకూల టీమ్‌ని సిద్ధం చేయడంలో గౌతమ్ సవాంగ్ విజయవంతం అయ్యారు.  2019 ఎన్నికలలో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ మరుసటిరోజే మే 31న గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా నియమించబడ్డారు. ఇక్కడి నుంచి అసలు సవాంగం అన్న 3.0 స్టార్ట్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, ఆ మాటకొస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే దారుణమైన పోలీసు రాజ్యం నడిచింది. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో కూడా ఎమర్జెన్సీ అని ప్రకటించిన తర్వాత మాత్రమే నిర్బంధం కొనసాగింది. సవాంగ్ నేతృత్వంలో పోలీసు దమనకాండ ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్ఠను పాతాళంలోకి తొక్కేసింది. సవాంగ్ పోలీసు పాలనలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు, సామాన్య ప్రజలు అనేక దారుణాలకు గురయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెను విధ్వంసం సృష్టించారు. సవాంగ్ మార్కు వేట మొదలైంది. అందులో ముందు వరస... ఆలూరు బాల వెంకటేశ్వరరావు. ఏబీ వెంకటేశ్వరరావుపై సాగించిన దమనకాండ మీకు తెలుసుకదా! నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఉన్నవీ, లేనివీ అనేక చాడీలు చెప్పి, నకిలీ పత్రాలు సృష్టించి ఏబీ వెంకటేశ్వరరావుపై విరుచుకుపడటం ప్రధాన అంశం. ఏబీతోనే ఆగలేదు. ఏబీ కింద పనిచేసిన ఉద్యోగులందర్నీ ముప్పుతిప్పలు పెట్టించి మూడు చెరువుల నీళ్ళు తాగించారు.  సవాంగ్ లిస్టులో మరొక బాధితురాలు.. ఐపీఎస్ అధికారిణి గీతాదేవి. ఆమె చేసిన నేరం.. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డీజీగా వున్నప్పుడు గీతాదేవి రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఆర్ఐఓ‌)గా పనిచేయటమే ఆమె చేసిన నేరం. గీతాదేవి మాతృమూర్తి కేన్సర్‌తో ఆఖరి పోరాటం చేస్తుంటే సవాంగ్ ఆమెను మానసికంగా కోలుకోలేనంత వేధింపులకు గురిచేశారు. ఇక తరువాతి వరుస చంద్రబాబు సామాజికవర్గం. పోలీసు శాఖలో పనిచేసే కమ్మ అధికారుల లిస్టు తయారుచేశారు. హెడ్ కానిస్టేబుల్ దగ్గర్నుంచి ఐపీఎస్ వరకు వున్న వున్న అధికారులు సవాంగ్ దృష్టిలో అంటరానివారు. స్వతహాగా జగన్ రెడ్డిది వివాదాస్పద, వికృత మనసత్త్వం. దానికి గౌతమ్ సవాంగ్ విషపూరిత ఆలోచనలు తోడైతే ఏమవుతుంది? అదే అయింది! ఎటుచూసినా విధ్వంసం. ఐదేళ్ళ జగన్ పాలన మీకు తెలియంది కాదు. ఎన్నికలకు ఏడాది ముందు పాలెగాడు జగన్‌కి సవాంగం అన్నపై ఉన్నపళంగా కోపం వచ్చింది. డీజీపీ పోస్టు నుంచి పీకిపడేశాడు.  తెలుగుదేశం పార్టీ అతివాదులు సవాంగ్‌ను జగన్ ఇన్నాళ్ళూ అడ్డగోలుగా వాడుకుని కరివేపాకులా తీసిపారేశాడు... నాడు ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నియ్య.. నేడు సవాంగ్ అన్నియ్య అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. జగన్ శిబిరం ఆలోచనలో పడింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా సవాంగ్‌ను నియమించారు. ఆ పదవిలో కూడా గౌతమ్ సవాంగ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వున్నాయి. గ్రూప్-1 పరీక్ష పేపర్లు దిద్దే కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ తీవ్ర నేరానికి పాల్పడ్డారు. పరీక్ష పత్రాలను డిజిటల్ పద్ధతిలో దిద్దటాన్ని హైకోర్టు రద్దు చేసి, మాన్యువల్ రీవాల్యుయేషన్ చేయమని ఆదేశించింది. మొదటిసారి రీవాల్యుయేషన్ పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలో నిర్వహించబడింది. రెండోసారి గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో రీవాల్యుయేషన్ జరిగింది. హైకోర్టులో గౌతమ్ సవాంగ్ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. దాంట్లో రీవాల్యుయేషన్ ఒకసారే జరిగిందనే తప్పుడు సమాచారాన్ని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈమొత్తం ప్రక్రియ అక్రమమని తేల్చింది. పరీక్ష ఫలితాలు, ఎంపిక జాబితాను రద్దుచేసి మళ్ళీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అలాగే, ఎంపికై ఉద్యోగంలో చేరినవారు కూడా కొనసాగటానికి వీల్లేదని తీర్పు చెప్పింది. ఇంటర్వ్యూ ప్రక్రియలో పోస్టులకు రేటు కట్టి అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి గౌతమ్ సవాంగ్‌తోపాటు ఏపీపీఎస్సీ సభ్యులను విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. నాడు గౌతమ్ సవాంగ్ ఉత్సాహం చూపించిన కాల్ మనీ కేసును కోర్టు కొట్టివేసింది. గౌతమ్ సవాంగ్ ఆ కేసును కోర్టులో నిరూపించలేకపోయారు. 

కేటీఆర్ ఫామ్‌హౌస్.. నేడే కూల్చివేత!?

హైదరాబాద్‌లో హైడ్రా రెచ్చిపోతోంది. చెరువుల ఉనికినే దెబ్బతీసేలా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. గత వారం పది రోజులుగా హైడ్రా ధాటికి వందల కొద్దీ భవనాలు కుప్పకూలిపోయాయి. దాంతో చెరువులను ఆక్రమించి కట్టిన, చెరువుల ఫుల్ ట్యాంక్ పరిధిలో కట్టిన భవనాల యజమానులు వణికిపోతున్నారు. హైడ్రా చిన్నా చితకా భవనాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద అపార్టమెంట్ల వరకు దేనినీ వదలడం లేదు. అన్నిటినీ చితమంటల్లోకి నెట్టేస్తోంది. చెరువుల విషయంలో ఆక్రమణ జరిగిందా... నిబంధనల అతిక్రమణ జరిగిందా.. అయితే కూల్చేయ్.. ఇదీ హైడ్రా వరస. హైదరాబాద్‌లో ఇంతవరకు కనీ వినీ ఎరుగని విధంగా ఎన్నో పెద్ద పెద్ద అపార్టుమెంట్లు హైడ్రా బారిన పడి శిథిలాలుగా మారిపోయాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనసులో ఇంకా ఏయే ఆలోచనలు వున్నాయో.. ఇంకా ఏ రేంజ్‌లో కూల్చివేతలు జరగబోతున్నాయో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.  సినీ నటుడు అక్కినేని నాగార్జున దశాబ్ద కాలానికి పైగా తన ఎన్ కన్వెన్షన్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. మాదాపూర్‌లోని తిమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు నాగార్జున ఆక్రమించారని, అక్కడ తనకు వున్న స్థలాన్ని అలాగే వుంచి, మూడున్నర ఎకరాల చెరువును పూడ్చి అందులో ఎన్ కన్వెన్షన్ కట్టారనే ఆరోపణలు వున్నాయి. ఎన్నో ఫిర్యాదులు కూడా వున్నాయి. అయితే నాగార్జున చాలాకాలంగా కోర్టుల ద్వారా, ప్రభుత్వాలను మేనేజ్ చేయడం ద్వారా తన ఎన్ కన్వెన్షన్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే శనివారం నాడు ఉరుము లేని పిడుగులాగా ఒక్కసారిగా హైడ్రా దళాలు ఎన్ కన్వెన్షన్ మీద దాడి చేశాయి. నోటీసులూ గట్రా ఏవీ లేకుండానే ఎన్ కన్వెన్షన్‌ని నేలమట్టం చేశాయి. ఇది చట్టవిరుద్దం అంటూ నాగార్జున ప్రకటన చేశారు. కూల్చివేతలు పూర్తయిన తర్వాత హైకోర్టు కూడా స్టే ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఎన్ కన్వెన్షన్ మొత్తం నేలమట్టం అయిపోయింది. ఈ కూల్చివేతల విషయంలో బీఆర్ఎస్ ఎంతమాత్రం స్పందించలేదు.. ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కూడా కూల్చివేతలను సమర్థిస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కరెక్టే అని బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ప్రకటించారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వాలు చేసే పనుల్లో... అది ఎంత మంచి పని అయినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. అయితే ఎన్ కన్వెన్షన్ విషయంలో గానీ, ఇతర కట్టడాల కూల్చివేత విషయంలోగానీ బీజేపీ కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అంటే అర్థం ఏమిటి.. ఈ కూల్చివేతలకు మద్దతు అభిస్తోంది. కూల్చివేతలు ముందుముందు మరింత ముమ్మరంగా జరగబోతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కిన అన్ని భవనాలను కూల్చేయాలన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్‌హౌస్‌ని కూల్చేస్తారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్‌లోని జంట జాలాశయాల పరిధిలో 111 జీవో అమలులో వుంది. అంటే ఈ ప్రాంతంలో భారీ కట్టడాలు కట్టకూడదు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్‌లు వెలిశాయి. ఈ ప్రాంతంలోనే వెలిసిన కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో ఇక్కడ కూల్చివేతలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫామ్‌హౌస్‌ వీడియోలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన నేరం మీద రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం జైలుకు కూడా పంపింది. ఆనాడు జరిగిన దానికి ఈనాడు రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, కూల్చివేతల పర్వం కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో ప్రారంభం కాలేదు.. ఆ ఒక్కదానితో ముగిసేదీ కాదు.. ఏది ఏమైనప్పటికీ ఈ ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారనే అనుమానాలు అయితే బలంగా వున్నాయి. ఆ ఫామ్ హౌస్ నాది కాదు.. నా ఫ్రెండ్‌ది.. నేను కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నానని కేటీఆర్ ప్రకటించారు. అందులో ఏవైనా అతిక్రమణలు వుంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తాను అని కూడా ప్రకటించారు. దానితోపాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి పలువురు కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్‌లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్‌కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. నా ఫామ్ హౌస్ నిబంధలకు వ్యతిరేకంగా వుంటే కూలగొట్టుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. కేటీఆర్‌దిగా భావిస్తున్న ఫామ్‌హౌస్‌ని కూల్చేయాలని పలువుని నుంచి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఫామ్ హౌస్ ఓనర్‌గా చెబుతున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూలగొట్టవద్దు అని చెప్పలేదు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పింది. కాబట్టి కోర్టు వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందువల్ల లైన్ మొత్తం క్లియర్‌గా వుంది.. ఇక కూలగొట్టడమే మిగిలి వుందని, ఆ కార్యక్రమం ఆదివారం నాడు పూర్తి అవబోతోందని తెలుస్తోంది.

చంద్రబాబుతో మంద కృష్ణమాదిగ భేటీ!

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాదిగ నాయకుడు మంద కృష్ణమాదిగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మంద కృష్ణ మాదిగ చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆమోదించిన వెంటనే మండ కృష్ణ ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చొరవ వల్లే వర్గీకరణ సాధ్యమైందని, గతంలో కూడా చంద్రబాబు వల్లే ఎంతోమంది దళితులకు ఉద్యోగాలు వచ్చాయని మందకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపినప్పుడు, మాదిగల అభ్యున్నతికి కట్టుబడి వున్నానని, మాదిగల సంక్షేమం విషయంలో తాను పెద్ద మాదిగలా పనిచేస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.

‘ఎన్’ కన్వెన్షన్ ఎందుకు కూల్చామంటే... రంగనాథ్ వివరణ!

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్  ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. "తుమ్మడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలను హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తుమ్మిడికుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవు. ఎల్ఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించింది. సంబంధిత అధికారులు ఎల్‌ఆర్ఎస్‌కి అనుమతించలేదు" అని రంగనాథ్ వివరించారు.

వైజాగ్ పిచ్చాస్పత్రిలో ‘జగన్ బ్యాచ్ విభాగం’..!

ఊహించని విధంగా అధికారం కోల్పోతే జనరల్‌గా కొన్నిరోజులు డిప్రెషన్లో పడిపోయి, ఆ తర్వాత కోలుకోవడం ఎవరికైనా సహజమే. కానీ, అధికారం కోల్పోయిన వాళ్ళకి మెంటల్ కూడా ఎక్కుతుందనే విషయం ఇప్పుడు వైసీపీ నాయకులని, వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నవారిని చూస్తే అర్థమవుతోంది. ఏనాడయితే అధికారం పోగొట్టుకున్నారో ఆనాటి నుంచి వీళ్ళు పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. అధికారంలో వున్నప్పుడు కూడా వీళ్ళు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవారు. కానీ, ప్రజలు దాన్ని పిచ్చితనం అని కాకుండా అధికారమదం అని అనుకునేవారు. అధికారం పోయిన తర్వాతగానీ, అది మదం కాదు.. పిచ్చి అనే విషయం ప్రజలకు అర్థమవుతోంది. పార్టీ నాయకుడు జగన్ దగ్గర మొదలు పెడితే, చిట్టచివర్న వుండే కార్యకర్త వరకూ అందరూ ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ అయితే శవాల పిచ్చి పట్టినట్టుగా తయారయ్యాడు. ఎక్కడ శవం కనిపిస్తుందా.. ఆ శవాన్ని పీక్కుతినాలా అని రాబందు టైపులో వ్యవహరిస్తున్నాడు. చాలామంది వైసీపీ నాయకులు అధికారం కోల్పోయి ఇన్నాళ్ళయినా ఇంకా అధికారంలోనే వున్నామన్న భ్రమల్లో మునిగిపోయి, అధికారంలో వున్నప్పుడు ఎంత ‘బలుపు’గా మాట్లాడేవారో అంతే బలుపుగా మాట్లాడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు ఇప్పటికీ కూటమి కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు.  ఇలా వైసీపీ నాయకుల పిచ్చి ప్రవర్తన చూసిన తర్వాత అర్థమవుతున్న విషయం ఏమిటంటే, జగన్‌కి ఎంతో ఇష్టమైన వైజాగ్‌లోని పిచ్చాస్పత్రిలో ‘జగన్ బ్యాచ్ విభాగం’ అనే పేరుతో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించాలి. ఈ వార్డులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వైసీపీ నాయకులను వేయాలి. వాళ్ళకి పిచ్చి పూర్తిగా తగ్గిన తర్వాతే బయటకి వదిలిపెట్టాలి. ఎందుకంటే, వీళ్ళు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఇటుక, ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తోంది. ఈ పిచ్చిబ్యాచ్ ఆ ప్రయత్నాలని డిస్ట్రబ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత వైజాగ్ పిచ్చాస్పత్రి మీద కూడా వుంది.

హైడ్రా చర్యలు చట్ట విరుద్ధం... నాగార్జున!

హైదరాబాద్ మాదాపూర్‌లోని ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత కార్యక్రమాన్ని ‘హైడ్రా’ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్ కన్వెన్షన్ అధినేత,  సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని ఆ పోస్టులో పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాను ఎలాంటి చర్యలూ చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు వెల్లడించారు. "ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. నూటికి నూరుశాతం ప్రైవేట్ స్థలంలో నిర్మించిన కట్టడాలవి. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే మంజూరు చేసింది. ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో, చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ కూల్చివేతలకు సంబంధించి మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిని. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అని నాగార్జున పేర్కొన్నారు.

హర్యానా ఎన్నికలు.. కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అక్టోబర్‌ 1వ తేదీన హర్యానాలోని 90 స్థానాల శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తథ్యమని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనీ, ఇక ప్రాంతీయపార్టీ అయిన  జననాయక్‌ జనతా పార్టీ (జె.జె.పి) ఎప్పటి మాదిరిగానే తన మూడవ స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సారైనా హర్యానాలో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)  ఇండీ కూటమి భాగస్వామ్యపక్షంగా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.  రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి తీవ్రమైన యాంటీ ఇంకంబన్సీ ఎదుర్కొంటోందనీ, ఆ ప్రభుత్వ వ్యతిరేకతే తమకు అవకాశంగా మారుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది.  అయితే బీజేపీ కూడా ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైనీని కూర్చోబెట్టింది. అలాగే పలు సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజాభిమానాన్ని పొందడంపై దృష్టి కేంద్రీకరించింది.  అదే విధంగా ప్రభుత్వంపై సర్పంచ్ ల అసంతృప్తిని తగ్గించి, వారి ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి చర్యలు చేపట్టింది. అందులో ప్రధానంగా సర్పంచ్ ల వ్యయపరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 21 లక్షల రూపాయలకు పెంచింది.  ప్రజలలో అసంతృప్తిని తగ్గించేందుకు, ప్రభుత్వంపై అభిమానాన్ని పెంచి మద్దతు కూడగట్టేందుకు సమాధాన్ శిబిర్ లే ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నడుంబిగించింది.  కాంట్రాక్టు ప్రాతిపదిన పనిచేస్తున్న సుమారు 1.20 లక్షల మంది ఉద్యోగులకు వారు పదవీ విరమణ చేసేవరకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సైనీ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఓబీసీలను క్రీమీలేయర్‌ గా ప్రకటిస్తూ ఖట్టర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, ఆ ఆదాయ పరిమితిని 8 లక్షలకు సైని సర్కార్ పెంచడం ద్వారా ఆదాయవర్గాలను సంతోషపెట్టింది.  అగ్నివీర్‌ పథకం కింద పనిచేసిన సైనికులకు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతామని సైనీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. అయితే ఎన్ని చేసినా బీజేపీకి ఇబ్బందికలిగించే అంశాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ చట్టాలు, అగ్నివీర్ పథకం వంటివి అధికార బీజేపీ పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తికి కారణమయ్యాయి. అందుకే గత పదేళ్లుగా బీజేపీకి అనుకూలించిన జాట్, జాటేతరుల విభేదాలు ఈ సారి ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు.  బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతుంటే.. అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్ లాంటి కాంగ్రెస్ మాత్రం అవి రచ్చకెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, పార్టీ ఐక్యంగా ఉందన్న సంకేతాలు ఇస్తోంది.  అన్నిటికీ మించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రచార సారథి,  మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హూడా వ్యవసాయ రంగాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తామని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చేసిన వాగ్దానం రైతులను, యువతకు కాంగ్రెస్ కు చేరువ చేసింది.  ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని 20 లోక్ సభ స్థానాలకు గాను పదింటిలో బీజేపీ విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ కు కూడా పది స్థానాలు దక్కాయి. అయితే లోక్ సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకూ చాలా తేడా ఉందనీ, పార్లమెంటు ఎన్నికలలో ఉన్న సానుకూలత, రాష్ట్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపికీ అసెంబ్లీ ఎన్నికలలో ఉండే అవకాశాలు తక్కువని పరిశీలకులు అంటున్నారు.  

తెలంగాణ పిసిసి రేసులో మధు యాష్కి? 

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  స్థానంలో కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో అధిష్టానం ఉంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో బలమైన ప్రతిపక్ష పాత్ర వహించిన కాంగ్రెస్ అధికారంలో వచ్చి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్ష పదవి అనివార్యమైంది. బీసీల్లో మంచి పేరు ఉన్న నేతను అధిష్టానం అన్వేషిస్తుంది. అధిష్టానికి ఆరుగురు పేర్లు వచ్చినప్పటికీ మధుయాష్కి పేరు ఫైనలైజ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  కొత్త టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానంతో రాష్ట్ర నాయకత్వం పలుమార్లు చర్చలు జరిపింది. పీసీసీ రేసులో ఆరుగురు నేతలు... మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేత మధు యాష్కీ నిలిచారు.  ఈ క్రమంలో... ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు బీసీ నాయకులను ఫైనల్ చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మధు యాష్కీ, మహేశ్ కుమార్ లు ఫైనల్ రేసులో నిలిచారు. వీరిలో ఒకరిని పీసీసీ పదవి వరించనుంది. పీసీసీ పదవి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపా దాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రెసిడెంట్ ఎంపికపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆరుగురు పేర్ల నుంచి ఇద్దరిని ఎంపిక చేశారు. మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ... దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. కొంతకాలంగా పలు కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలులో నుంచి బయటకి వచ్చిన వెంటనే‌ పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు. ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీసు అధికారిపై దాడికి యత్నించడం వంటి కేసుల్లో ఆయన సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏపీ హైకోర్టు నిన్న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే హడావుడిగా తన వాహనంలో ఆయన మాచర్లకు బయల్దేరారు. మరోవైపు పిన్నెల్లి విడుదలవుతున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు జైలు వద్దకు వెళ్లారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కలకలం!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కామ పిశాచాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఒకరి తర్వాత ఒకరి కామపురాణాలు బట్టబయలు అవుతున్నాయి. తాజాగా మరో నాయకుడి బట్టలు లేని వీడియో బయటపడింది. ఆ నాయకుడు ఎవరో కాదు.. దళిత డ్రైవర్ని ఎంచక్కా చంపేసి, ఎంతో అభిమానంతో డెడ్‌బాడీని హోమ్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు. జగన్‌ దృష్టిలో ఎంతో మంచివాడైన ఈ అనంతబాబు నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అనంతబాబు తన ‘అసలు స్వరూపం’ బయటపెట్టాడు. ఈ తతంగం ఎన్నాళ్ళనుంచి జరుగుతోందోగానీ.. ఇప్పుడు బయటపడింది.. గతంలో అప్పటి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ బట్టలు విప్పి చేసిన వీడియో జనాలకు వాంతులు తెప్పించింది. ఇప్పుడు మరోసారి ఆ రేంజ్‌లో ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వుందని అంటున్నారు. ఇక వీరిద్దరి రోత మధ్యలో పలువురు వైసీపీ నాయకుల రాసలీలల బాగోతాలు బయటపడుతూ ప్రజలకు ఇంతకాలం మనల్ని పాలించింది వీళ్ళా అనే అసహ్యం పుట్టేలా చేస్తున్నాయి. ఇలా వైసీపీ నాయకులు కామకలాపాలతో రెచ్చిపోతుంటే పార్టీ అధినేత జగన్‌రెడ్డి శవాల కోసం వెతుక్కుంటూ కాలక్షేపం చేస్తున్నాడు.

రామ్ మాధవ్ రీ ఎంట్రీ.. జమ్మూకాశ్మీర్ బీజేపీలో నయాజోష్!

వారణాసి రామ్ మాధవ్.. రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న వారెవరికీ ఈ పేరును పరిచయం చేయనవసరం లేదు.   కొద్ది కాలమైనా సరే జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి కాగలిగిందంటే అందుకు కర్త, కర్మ, క్రియా అన్నీ రామమాదవ్ మాత్రమే. అటువంటి రామ మాధవ్ గత కొంత కాలంగా రాజకీయాలలో కలికానిక్కూడా కనిపించకుండా కనుమరుగయ్యారు. అందుకు కారణాలేమిటన్నది పక్కన పెడతే..  రామ్ మాధవ్ ను పక్కన పెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు అన్యధా శరణం నాస్తి అన్నట్లుగా ఆయననే ఏరి కోరి తెచ్చచుకుని జమ్మూకాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకుని బీజేపీ వంటి పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన రామ్ మాధవ్ ఆ పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ హోల్ టైమర్ గా ఉన్న రామ్ మాధవ్ ను బీజేపీ ఏరి కోరి పార్టీలోకి తెచ్చుకుని ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టింది. అంతేనా అత్యంత కీలకమైన జమ్మూ  కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతలను రామ్ మాధవ్ చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహించారు. ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం రామ్ మాధవ్ నైజం. ఆ కారణంగానే ఆయన బీజేపీలో వేగంగా ఎదిగినా, అంత కంటే వేగంగా కనుమరుగవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.  2014 తర్వాత ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన రామ్ మాధవ్  పార్టీ ప్రధాన కార్యదర్శిగా,  ఈశాన్య రాష్ట్రాలు,  జమ్మూకశ్మీర్ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టి వాటికి పూర్తి న్యాయం చేశారు. తాను ఇన్ చార్జిగా ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యేలా ఆయా రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేశారు. ఎన్నికలలో విజయానికి అవసరమైన వ్యూహాలను పక్కాగా రచించి అమలు చేశారు.  ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో  బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో రామమాధవ్ ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అయితే 2019 ఎన్నికలలో  బీజేపీ సొంతంగా ప్రభుత్వం చేపట్టేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధించే అవకాశం లేదనీ, భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదనీ ఆయన చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. ఆ ఎన్నికలలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. అయినా భాగస్వామ్య పక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారాయి. అమిత్ షా తరువాత పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా  అయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో రామ్ మాధవ్ ఐదేళ్ల పాటు రాజకీయంగా కనుమరుగైపోయారు. ఇప్పుడు అంటే 2024 ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. పూర్తిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ఎదుర్కోవలసిన పరిస్థితిలో ఉంది. దీంతో బీజేపీకి మళ్లీ రామ్ మాధవ్ అవసరం ఏర్పడింది. మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని బీజేపీ లీడర్, క్యాడర్ కూడా రాష్ట్రంలో బీజేపీ బలంగా పోరాడాలంటే రామ్ మాధవ్ రావాల్సిందేనని బలంగా చెబుతున్నారు. దీంతో అనివార్యంగా బీజేపీ అగ్రనాయకత్వం రామ్ మాధవ్ ను ఆర్ఎస్ఎస్ నుంచి మళ్లీ బీజేపీలోకి తెచ్చుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించింది. జమ్మూ కశ్మీర్‌లో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 18న తొలి దశ, 25న రెండోదశ, అక్టోబర్‌ ఒకటిన మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.  

విజయసాయిరెడ్డి కూతురుకు హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌ జడ్ నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ ప్రహరీగోడ విషయంలో చర్యలు తీసుకోవడానికి జీవీఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.   భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్ వాదనలు వినిపించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ కు సమీపంలో నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.  

ఎన్ కన్వెన్షన్ పై  హైడ్రా రంగనాథ్ దెబ్బ

గత కొన్ని రోజులుగా హైడ్రా చేపడుతున్న కూల్చివేతల కార్యక్రమం బడావ్యక్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తన సినిమాలతో యువతను ఉర్రూత లూగించిన మాస్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలకొరిగింది అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్‌గా మారిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్‌ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్ టిఎల్  పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు. ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు. మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియోపై కూడా ఆంక్షలు విధించారు.కాగా, హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద 'హైడ్రా' స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్‌హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ పడింది.