వైజాగ్ పిచ్చాస్పత్రిలో ‘జగన్ బ్యాచ్ విభాగం’..!
posted on Aug 24, 2024 @ 4:12PM
ఊహించని విధంగా అధికారం కోల్పోతే జనరల్‌గా కొన్నిరోజులు డిప్రెషన్లో పడిపోయి, ఆ తర్వాత కోలుకోవడం ఎవరికైనా సహజమే. కానీ, అధికారం కోల్పోయిన వాళ్ళకి మెంటల్ కూడా ఎక్కుతుందనే విషయం ఇప్పుడు వైసీపీ నాయకులని, వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నవారిని చూస్తే అర్థమవుతోంది. ఏనాడయితే అధికారం పోగొట్టుకున్నారో ఆనాటి నుంచి వీళ్ళు పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. అధికారంలో వున్నప్పుడు కూడా వీళ్ళు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవారు. కానీ, ప్రజలు దాన్ని పిచ్చితనం అని కాకుండా అధికారమదం అని అనుకునేవారు. అధికారం పోయిన తర్వాతగానీ, అది మదం కాదు.. పిచ్చి అనే విషయం ప్రజలకు అర్థమవుతోంది. పార్టీ నాయకుడు జగన్ దగ్గర మొదలు పెడితే, చిట్టచివర్న వుండే కార్యకర్త వరకూ అందరూ ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ అయితే శవాల పిచ్చి పట్టినట్టుగా తయారయ్యాడు. ఎక్కడ శవం కనిపిస్తుందా.. ఆ శవాన్ని పీక్కుతినాలా అని రాబందు టైపులో వ్యవహరిస్తున్నాడు. చాలామంది వైసీపీ నాయకులు అధికారం కోల్పోయి ఇన్నాళ్ళయినా ఇంకా అధికారంలోనే వున్నామన్న భ్రమల్లో మునిగిపోయి, అధికారంలో వున్నప్పుడు ఎంత ‘బలుపు’గా మాట్లాడేవారో అంతే బలుపుగా మాట్లాడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు ఇప్పటికీ కూటమి కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు.
ఇలా వైసీపీ నాయకుల పిచ్చి ప్రవర్తన చూసిన తర్వాత అర్థమవుతున్న విషయం ఏమిటంటే, జగన్‌కి ఎంతో ఇష్టమైన వైజాగ్‌లోని పిచ్చాస్పత్రిలో ‘జగన్ బ్యాచ్ విభాగం’ అనే పేరుతో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించాలి. ఈ వార్డులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వైసీపీ నాయకులను వేయాలి. వాళ్ళకి పిచ్చి పూర్తిగా తగ్గిన తర్వాతే బయటకి వదిలిపెట్టాలి. ఎందుకంటే, వీళ్ళు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఇటుక, ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తోంది. ఈ పిచ్చిబ్యాచ్ ఆ ప్రయత్నాలని డిస్ట్రబ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత వైజాగ్ పిచ్చాస్పత్రి మీద కూడా వుంది.