ప్రేమ, కరోనా రెండు జయించిన.. టీఆర్ఎస్ యువజన లీడర్ చివరికి..

అతను ప్రేమను జయించాడు.. పెళ్లి అయి జస్ట్ మూడు నెలలు మాత్రమే అవుతుంది.. కరోనా అందరిని కాటు వేసినట్టే కాలంతో పాటు అతని కూడా కరోనా కాటు వేసింది.. అయిన కరోనాను కూడా జయించాడు.. అంత బాగానే ఉందన్న టైం లో మరో మహమ్మారి బారిన పడ్డాడు ఆ యువకుడు.. దాడుపు చాలా డబ్బు ఖర్చు పెట్టారు అయిన ఫలితం లేకపోయింది. అతను  ఆ మహమ్మారి తో పోరాడి, పోరాడి అతని సత్తువ కోల్పోయాడు.. చివరికి  ఆ గుండె ఆగిపోయింది.. కొత్త పెళ్లి కూతురు ఆశలు గాలిలో కలిసిపోయాయి.. అతని  కుటుంబం కన్నీరు ఇంకెలా ఏడిచారు అయిన ఏం చేస్తాం.. ప్రజల ప్రాణాలు పాలకులకు పట్టవయో.. సామాన్యుడికి ఆసుపత్రుల్లో వైద్యం దొరకడాయే.. దద్దులు డబ్బులు తీసుకొని ఓటు వేయడం.. మన వాళ్ళు చనిపోతే ఏడవడం తప్పా మనమే చేస్తాం చెప్పండి.. సరేలే ఇనేవాడు ఉంటే భగవత్ గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎంతో చెప్పినట్లు..ఈ విషయాలు మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి కానీ అసలు విషయంలోకి వెళ్దాం..  అది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారం మున్సిపాలిటీ పరిధిలో యంనం పేట గ్రామం.. ఆ గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు. అతని వయసు 29 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన యువతికి ప్రేమించాడు.. అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఈ విషయమై పెద్దలకు చెపితే ఒప్పుకుంటారు అన్న నమ్మకం తో తన ప్రేమ విషయం పెద్దలకు చెప్పాడు మొదటి అందరి పెద్దల లాగే ఒప్పుకోక పోయిన రాజేష్ మెల్లి మెల్లిగా వాళ్ళను ఒప్పించాడు. చివరికి కోరుకున్న ప్రేయసిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఇంట్లో ఒక విషాదం జరిగింది.. ఈ విషాదం ఏంటో తెలుసుకోవాలని ఉందా..? మారేందుకు ముందుకు పదండి..   ఇది కనికరం లేని కరోనా కాలం.. ఎవరు దొరికితే వాళ్ళను గడ్డలా తన్నుకుపోతుంది. అనేక జీవితాల్ని నాశనం చేసింది. వందల కుటుంబాల్ని శోకం సంద్రంలోకి నెట్టింది. పెద్ద చిన్నా, ముసలి ముతక అనే తేడా లేకుండా వేలాది మంది ప్రాణాల్ని బలితీసుకుంది. కరోనా కాటుకు అనేకమంది తమ జీవితాల్ని అర్థంతరంగా ముగించారు. నక్క రాజేశ్‌ మూడు నెలల క్రితమే వీరిద్దరి ప్రేమ పెళ్లి జరిగింది. జీవితం ఆనందంగా సాగిపోతుందనుకున్న క్రమంలో అతడికి కరోనా సోకింది. వివాహం జరిగిన నెల రోజులకే రాజేశ్‌కు కరోనా సోకింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో నెలరోజుల పాటు చికిత్స తీసుకొని మహమ్మారిపై విజయం సాధించాడు.కానీ చివరికి బ్లాక్‌ఫంగస్‌ ప్రాణాలు తీసింది. కొద్దిరోజులకే మరోసారి అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరాడు. టెస్టులు చేయగా రాజేశ్‌కు బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసింది. దీంతో అతడి కన్ను కూడా వైద్యులు తొలగించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. రాజేశ్ టీఆర్ఎస్ యువజన విభాగంలో పనిచేస్తున్నాడు. రూ.27 లక్షలు ఖర్చు పెట్టినా తమ కొడుకు ప్రాణాలు దక్కలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  

టీడీపీ కార్యకర్తలకు తాగునీరు కట్! సీఎం.. ఇదేం మూర్ఖత్వం.. 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లోనూ వైసీపీ నేతలు కక్ష రాజకీయాలు చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. తెలుగు దేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారనే కోపంతో తాగునీరు కట్ చేసిన అరాచక ఘటన వెలుగులోనికి వచ్చింది.  కర్నూలు జిల్లా బసలదొడ్డిలో టీడీపీ సానుభూతి పరులకు తాగునీరును స్థానిక వైసీపీ నేతలు నిలిపివేయించారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వరకే రాజకీయాలు. ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజలందరినీ సమానంగా చూడాలి. కానీ జగన్‌రెడ్డి... కుల, మత, ప్రాంత, పార్టీల వారీగా విభజించి పాలిసున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి కాదు.. మూర్ఖమంత్రి అని నిరూపించుకుంటున్నారని  రా లోకేశ్‌ విమర్శించారు.  తీవ్రంగా ఖండించారు. అవినీతి, అక్రమాలను నిలదీస్తున్న ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రజలపైనా కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని మండిపడ్డారు. ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే ఎంత ఘోరంగా ఉంటుందో జగన్‌రెడ్డి పాలననే నిదర్శనమని ధ్వజమెత్తారు. టీడీపీ హాయంలో రాష్ట్రమంతా అభివృద్ధి, సంక్షేమం కనిపించేవని, వైసీపీ పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కన్పిస్తున్నాయని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీని హత్యా రాజకీయాల కేంద్రంగా మార్చారని లోకేష్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతి పరులకు తాగునీరు నిలిపివేయడం హేయమని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ‘‘జగన్‌రెడ్డి ఎన్నికలకు ముందు కులం, మతం చూడం అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల వాళ్లకు కనీసం తాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇది దుర్మార్గం. దీనిని ఖండిస్తున్నాం’’ అని ఆయన మండిపడ్డారు. ‘‘టీడీపీకి ఓట్లు వేస్తే తాగటానికి నీరివ్వరా? జగన్‌ సీఎంగా సేవ చేయాల్సింది రాష్ట్ర ప్రజలందరికీనా? లేక వైసీపీ కార్యకర్తలకేనా? టీడీపీకి ఓటేశారని తాగునీళ్లు, రేషన్‌, పింఛన్‌ ఆపేయడం జగన్‌ ఫ్యాక్షన్‌ మనస్తత్వానికి నిదర్శనం’’ అని విమర్శించారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వాలిడిటీ అన్నారు. తర్వాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ఆరోజు నుంచి జగన్‌, వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి రోజూ పశ్చాత్తాప పడాల్సి వస్తుందని అచ్చెన్న హెచ్చరించారు.  

భార‌త్ బ‌యోటెక్‌కు సీఐఎస్ఎఫ్ క‌మెండోలు.. ఎందుకో తెలుసా?

భార‌త్ బ‌యోటెక్‌. ఇదిప్పుడు జ‌స్ట్ కంపెనీ కాదు. దేశానికి సంజీవ‌ని. వ్యాక్సిన్లు త‌యారు చేసే గ‌ని. కోట్ల సంఖ్య‌లో కోవాగ్జిన్ టీకాల ఉత్ప‌త్తి కేంద్రం. భార‌త్ మేడ్ వ్యాక్సిన్ ఇదొక్క‌టే. మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన‌ భారతీయ టీకా. భార‌త్ బ‌యోటెక్ ఎంత సుర‌క్షితంగా ఉంటే.. భార‌తదేశం అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే, ఈ టీకాల కంపెనీపై ఉగ్ర‌వాదుల క‌న్ను ప‌డే అవ‌కాశం ఉందంటూ నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి. అంతే. క్ష‌ణం ఆలోచించ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వెంట‌నే భార‌త్ బ‌యోటెక్‌కు కేంద్ర భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో సెక్యూరిటీ క‌ల్పించాల‌ని ఆదేశించింది.  హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట జినోమ్‌వ్యాలీలో ఉన్న కంపెనీ ప్రాంగణానికి 64 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమెండోలతో రక్షణ కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి కమెండోలు పరిశ్రమకు రక్షణగా ఉంటూ పహారా కాస్తారని సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనిల్ పాండే తెలిపారు. 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు సంస్థలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తోంది. పూణె, మైసూరులోని ఇన్ఫోసిస్, నవీ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్, హరిద్వార్‌లోని రాందేవ్ బాబా పతంజలి సహా దేశవ్యాప్తంగా పది కంపెనీల‌కు సీఐఎస్ఎఫ్ భద్రత ఉంది. తాజాగా, కోవాగ్జిన్ ఉత్ప‌త్తి కేంద్ర‌మైన‌ భారత్ బయోటెక్‌కు సైతం సీఐఎస్ఎఫ్ కమెండోలతో భద్రత కల్పించనుంది కేంద్రం.   

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. జూన్‌ నుంచే పీఆర్సీ అమ‌లు..

ఎప్పుడో ప్ర‌క‌టించిన పీఆర్సీకి ఇప్ప‌టికి మోక్షం ల‌భించింది. ఇప్ప‌ట్లో ఇస్తారో ఇవ్వ‌రో అని టెన్ష‌న్ పెట్టించిన ఉద్యోగుల జీతాల పెంపున‌కు తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. 30 శాతం పెంపుతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లకు కూడా ఈ పీఆర్సీ పెంపు వర్తిస్తుంది. జూన్ నెల నుంచే పెంపును వర్తింపజేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే జులై నుంచి పెరిగిన జీతం అందుతుంది. నోషనల్ బెనిఫిట్‌ను 1 జులై 2018 నుంచి, ఆర్థిక లబ్ధిని 1 ఏప్రిల్ 2020 నుంచి అమలు చేస్తారు. వేతనాల్లో మార్పును 1 ఏప్రిల్ 2021 నుంచి అమలు చేయనున్నారు. పింఛన్ దారులకు 1 ఏప్రిల్ 2020 నుంచి చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించనుంది.  పీఆర్సీ అమ‌లుతో 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ది క‌ల‌గ‌నుంది. మార్చి 22నే పీఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం కార‌ణంగా అమ‌లు వాయిదా పడుతూ వచ్చింది. తాజా కేబినెట్ భేటీలో జూన్ నుంచే పీఆర్సీ వ‌ర్తింప‌జేయాల‌ని మంత్రిమండ‌లి తీసుకున్న‌ నిర్ణ‌యంపై ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. పీఆర్సీ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నాయి.  

ఈటల దెబ్బకు దిగొచ్చిన కేసీఆర్..

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. లాక్‌డౌన్‌ను పొడిగించి.. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో స‌డ‌లింపులు ఇచ్చారు. లాక్‌డౌన్‌తో పాటు మ‌రికొన్ని నిర్ణ‌యాలు కూడా తీసుకుంది. అందులో ఒక‌టి.. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 4,46,169 రేషన్‌ కార్డులను వెంట‌నే మంజూరు చేయ‌డం.. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయడం.. రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు పరిష్కారానికి కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయడం. ఇదీ విష‌యం. పైపైన చూస్తే ఇది మామూలు మేట‌ర్‌లానే అనిపిస్తుంది. కానీ, త‌ర‌చి చూస్తే.. రేష‌న్‌కార్డుల జారీ వెనుక‌.. మాజీ మంత్రి ఈట‌ల ఎఫెక్ట్ బాగా ప‌ని చేసిందనే చెప్పాలి.  స‌డెన్‌గా ఎప్పుడూ లేనిదీ ఇప్పుడే కేబినెట్‌కు రేష‌న్‌కార్డుల విష‌యం ఎందుకు గుర్తొచ్చిందోనని ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఈట‌ల ఎఫెక్ట్ అలాంటిది మ‌రి. రేష‌న్‌కార్డుల జారీకి, ఈట‌ల‌కు ఏం సంబంధం అనుకుంటున్నారా. చాలా చాలా సంబంధం ఉంది మ‌రి. ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి డిమాండ్ చేయ‌కున్నా.. ఉద్య‌మాలు జ‌ర‌గ‌కున్నా.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ఎవ‌రూ ముట్ట‌డించ‌కున్నా.. మీడియాలో వార్త‌లు రాకున్నా.. ఎవ‌రూ అడ‌గ‌కుండానే.. కేసీఆర్ దాదాపు నాలుగున్న‌ర ల‌క్ష‌ల రేష‌న్ కార్డులను హ‌డావుడిగా ఎందుకు ఇస్తున్న‌ట్టు? ఎందుకంటే.. ఈట‌ల ఎఫెక్ట్.  అవును. అంత‌గా ప‌దే ప‌దే ఈట‌ల ఎఫెక్ట్ అన‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. అదేంటంటే.. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లొచ్చిన ఈట‌ల‌.. మీడియా స‌మావేశం పెట్టి ఎమ్మెల్యే ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌నిలో ప‌నిగా కేసీఆర్‌పై దుమ్మెత్తి పోశారు. ముఖ్య‌మంత్రి ప‌ని తీరుపై అనేక ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. అందులో ఒక‌టి.. ఈ రేష‌న్ కార్డుల అంశం. అవును.. రెండేళ్లుగా బియ్యం కార్డులు  ఎందుకు ఇవ్వ‌డం లేదంటూ ఆ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ను నిల‌దీశారు ఈట‌ల రాజేంద‌ర్‌. కుటుంబంలో స‌భ్యులు పెర‌గ‌డం లేదా? వారికి బియ్యం ఇవ్వ‌రా? రెండేళ్ల‌వుతున్నా.. ఒక్క రేష‌న్ కార్డు అయినా ఇచ్చారా? కొత్త రేష‌న్‌కార్డులు ఎందుకు ఇవ్వ‌రు కేసీఆర్ అంటూ ముఖ్య‌మంత్రిని గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఎవ‌రికైనా డౌట్ ఉంటే.. నాలుగు రోజుల క్రితం జ‌రిగిన ఈట‌ల రాజేంద‌ర్ ప్రెస్‌మీట్ స్పీచ్‌ను మ‌రోసారి వినండి.. మీకే క్లారిటీ వ‌స్తుంది... ఇలా రేష‌న్‌కార్డుల జారీ విష‌యంలో కేసీఆర్‌ను ఈట‌ల నిల‌దీయడంతో ముఖ్య‌మంత్రి ఉలిక్కిప‌డిన‌ట్టున్నారు. నిజ‌మే క‌దా.. రెండేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేష‌న్‌కార్డులు ఇవ్వలేదగా అని ఇప్పుడు యాదికి వ‌చ్చిన‌ట్టుంది. వెంట‌నే అధికారుల‌ను పిలిపించుకుని లెక్క‌లు తెప్పించుకున్నార‌ట కేసీఆర్‌. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 4,46,169 రేషన్‌ కార్డు అప్లికేష‌న్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఆఫీస‌ర్లు చెప్పార‌ట‌. దీంతో.. వెంట‌నే పెండింగ్ బియ్యం కార్డుల‌ను 15 రోజుల్లోగా జారీ చేసేలా కేబినెట్ మీటింగ్‌లో నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కారు. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం వ‌చ్చిన అప్లికేష‌న్లే నాలుగున్న‌ర ల‌క్ష‌లుంటే.. మ‌రి ఈ రెండేళ్ల‌లో కొత్త కుటుంబాలు, కొత్త కుటుంబ స‌భ్యులు సైతం భారీగానే పుట్టుకొచ్చి ఉంటారుగా. ప‌నిలో ప‌నిగా.. పెండింగ్‌తో పాటు అర్హుల కోసం కొత్త రేష‌న్ కార్డులు కూడా ఇస్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా జ‌ర‌గ‌ని రేష‌న్‌కార్డుల జారీ ప్ర‌క్రియ‌.. ఈట‌ల నోటి నుంచి వ‌చ్చిన ఒక్క డైలాగ్‌తో.. నాలుగు రోజుల్లోనే దిగొచ్చారు సీఎం కేసీఆర్ అంటున్నారు. అదే విధంగా.. ఈట‌ల ప్ర‌శ్నించిన.. పెన్ష‌న్‌ల పని కూడా కాస్త చూడండి కేసీఆర్ సారూ అని కోరుతున్నారు జ‌నాలు.  కేబినెట్ తీసుకున్న పెండింగ్ రేష‌న్‌కార్డుల జారీ నిర్ణ‌యం.. కేసీఆర్‌పై పోరాటం ప్రారంభించిన ఈట‌లకు తొలి విజ‌యంగా చెబుతున్నారు. రాజేంద‌ర్ ప్ర‌శ్న‌లు.. కేసీఆర్ ప్ర‌భుత్వంలో ప్ర‌కంప‌ణ‌లు సృష్టించాయ‌ని.. ఈట‌ల దెబ్బ‌కు ముఖ్య‌మంత్రి దిగొచ్చార‌ని రాజేంద‌ర్ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.  

జగదీశ్ పార్టీలో ఏం జరిగింది? లీకిచ్చిందెవరు? బలయ్యేదెవరు? 

ఈటల రాజేందర్ బర్తరఫ్ రచ్చ చల్లారకముందే టీఆర్ఎస్ లో మరో తుపాను బయటికొచ్చింది. కర్ణాటకలో జరిగిన ఓ విందు పార్టీ.. గులాబీ పార్టీలో కల్లోలం రేపుతోంది. ఈటలకు బర్తరఫ్ కు కారణమైన ఈ ఘటనపై.. ఇప్పుడు మరో మంత్రి మెడకు చుట్టుకుంటోంది. కేసీఆర్ కు అత్యంత నమ్మినబంటుగా ముద్ర పడిన మంత్రి జగదీష్ రెడ్డికి కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో సెగలు రేపుతున్న కర్నాటకలోని హంపీలో జరిగిన పార్టీలో అసలేం జరిగింది..మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ పార్టీలో జరిగింది ఇది..   మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా గత జనవరిలో కర్నాటక రాష్ట్రంలోని హంపిలోని ఒక ఫాంహౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు. తనకు బాగా సన్నిహితులు అనుకున్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో పాటు, అధికారంలో వివిధ హోదాలను అనుభవిస్తున్న పలువురు ముఖ్యులు ఈ పార్టీకి హాజరయ్యారు. హుషారుగా పార్టీ మొదలైంది. మందేసిన తర్వాత అసలు సినిమా మొదలైంది. కేసీఆర్ పాలన పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు మనసులో మాట బయట పెట్టారట. పాలన పూర్తిగా కుటుంబమయమైపోయిందని... పెత్తనం మొత్తం అయ్యా కొడుకుల దగ్గరే ఉందని ఒక్కొక్కరుగా రెచ్చిపోయారట. ఈటెల రాజేంద్రను  అధిష్టానం టార్గెట్ చేయడంపైనా కొందరు ఫైరయ్యారట. పెద్దసార్ నియంత అయినా భరించనం కాని..  రేపొద్దుగాల చిన్నసారు సీఎం అయితే... భరించుడు మనతో ఐతదా...!? అన్న కోణంలో చర్చ జరిగిందట. సహజంగా కళాకారుడైన ఓ ఎమ్మెల్యే మత్తులోనే కేసీఆర్ నియంత పాలన, రేపొద్దున కేటీఆర్ సీఎం అయితే చిన్నసారు నియంత పాలన ఎట్లుంటదో తనదైన శైలిలో ఊహించుకుని, పాటకట్టి పాడాడట. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ మనసులో మాట చెప్పుకోగలం అన్నట్టు ఎవరికి వారు రెచ్చిపోయారని సమాచారం.  సీన్ కట్ చేస్తే... హంపిలో జరిగిన తతంగమంతా  కేసీయార్‌కు చేరింది. ఆ పార్టీలో పాల్గొన్న ఒక ఎమ్మెల్యేల ద్వారా ఆ వీడియో కూడా బాస్ కు అందిదట. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే వీడియో ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ముఖ్యుల ప్రతి కదలికపై నిఘా ఉంది. ప్రతి కాల్ రికార్డవుతుంది… తనకు పూసగుచ్చినట్టు అన్ని వివరాలూ చేరిపోయాయి… ఆ పాటను జగదీష్‌రెడ్డి ఆపలేదు సరికదా సైలెంటుగా చూస్తూ కూర్చున్నాడట… కేసీయార్ దయవల్ల ఓ నామినేటెడ్ పోస్టు పొందిన ఓ మేధావి కేసీయార్ మీద ఔట్ రైట్ విమర్శలకు దిగాడట… నిజానికి బెంగుళూరులో ఇలాంటి మీటింగే ఒకటి పెట్టాడట ఈటల… ఆ వివరాలన్నీ బయటికి వచ్చాకే ఈటలతో రిలేషన్స్ పూర్తిగా దెబ్బతిన్నయని తెలుస్తోంది. చివరకు కేసీయార్ కత్తితీశాడు. ఇప్పుడిక జగదీష్‌రెడ్డే టార్గెట్. తనను మంతివర్గం నుంచి తీసేయడమే కాదు, ఆయన స్థానంలో సీఎం తన సన్నిహితుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని తీసుకోబోతున్నాడని చెబుతున్నారు. జగదీష్‌రెడ్డి సీఎంను కలిసి ఏదో వివరణ ఇచ్చుకున్నా సీఎం కన్విన్స్ కాలేదని తెలుస్తోంది.  జగదీష్‌రెడ్డి కుటుంబసభ్యుడు, ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులో ఉన్న వ్యక్తి ఈమధ్య ఫేస్‌‌బుక్‌లో కేసీయార్ వ్యతిరేక పోస్టులు పెట్టారు. అప్పుడే జగదీష్‌రెడ్డికీ కేసీయార్‌కూ  గ్యాప్ వచ్చిందన్న  సంకేతాలు వచ్చాయి. అయితే వేటు పడితే జగదీశ్ రెడ్డి ఒక్కడిపైనే పడుతుందా లేద పార్టీలో పాల్గొన్న ఎమ్మెల్యేలపైనా చర్యలుంటాయా అన్నది తేలడం లేదు. మొత్తానికి హంపి పార్టీ గులాబీ పార్టీలో పెను ప్రకంపనలు, కీలక పరిణామాలకు వేదిక కాబోతుందని భావిస్తున్నారు. చూడాలి మరీ ఏం జరగబోతుందో.. 

లాక్ డౌన్ పొడిగింపు.. సడలింపు పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను మరో 10 రోజులపాటు పొడిగించింది. లాక్ డౌన్ సడలింపు సమయాన్ని మరింత పెంచుతూ స్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు సడలింపు ఉండగా.. గురువారం నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. ఇంటికి చేరుకునేందుకు మరో గంట వెసులుబాటు. సాయంత్రం 6 గంటల కల్లా అందరూ ఇంట్లో ఉండాలని సూచించింది.  గతంలో పొడిగించిన లాక్ డౌన్ రేపటితో ముగియనున్న క్రమంలో.. సమావేశమైన కేబినెట్ లాక్ డౌన్ పొడిగింపు, కరోనా కట్టడితో పాటు పలు అంశాలపై చర్చించింది. లాక్ డౌన్ సడలింపు పై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేయనుంది. కాగా.....కరోనా పూర్తిగా  అదుపులోకిరాని..   సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

అప్పుడు 86 లక్షలు.. ఇప్పడు 45లక్షలు! మడమ తిప్పిన జగన్ రెడ్డి..

ప్రభుత్వాలు మారితే, రాష్ట్ర జనాభా మారుతుందా? రాష్ట్రంలో వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే వారి జనాభా  మారిపోతుందా? అప్పుడున్న రైతుల్లో సగంమంది ఇప్పడు మాయమై పోతారా? అంటే అవుననే అంటోంది,ఘనతవహించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి, అనేక సందర్భాలలో  రైతుల పేరున దీక్షలు చేశారు. అసెంబ్లీలో, బయట రైతుల సమస్యలపై ప్రసంగించారు. ఈ అన్ని సందర్భాలాలో  రాష్ట్రంలోని 86 లక్షల మంది రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ చేశారు. అనే రాష్ట్రంలో రైతుల జనాభా 86 లక్షలని, ఆయనే చెప్పారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచియన్ తర్వాత, ఓ వంక తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకుంటూనే రాష్ట్రంలో రైతుల సంఖ్యను సగానికి సగం తెగ నరికేసింది. రాష్టంలో ఇప్పుడున్న రైతులు 45 లక్షల మందే అన్నట్లు లెక్కలు చూపుతోంది.అంటే, 40 లక్షల మంది రైతులను రైతులుగానే గుర్తించడం లేదు. ఇదీ, ప్రభుత్వం చేసున్న మోసంచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం కాదని, రైతు ద్రోహ ప్రభుత్వమని,బీజేపీ ఆరోపించింది. రైతుల పట్ల జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం బీజేపే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు నిర్వహించింది. పార్టీ నేతలు , కార్యకర్తలు ఇళ్ళ వద్దనే  దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అనతపురంలో ఈ విమర్శ చేశారు. నిజానికి,జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేయడం మాత్రమే కాదు. వ్యవసాయా రంగాన్నే నిర్వీర్యం చేస్తోంది.ఆంధ్ర ప్రదేశ్ జీవధార పోలవరం పనులు ఎక్కడి వక్కద ఆగిపోయాయి. రాజధాని రైతుల అందోళన  600 రోజులకు చేరుకుంటోంది అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ రైతులకు ఇవ్వవలసిన కౌలుపైకం  ఇవ్వడం లేదు. ప్రభుత్వం అంటే అప్పులు చేయడం, పంచి పెట్టడం... అన్నట్లుగానే పరిపాలన సాగుతోంది. నిజనికి ఒక వ్యసాయ రంగం మాత్రమేకాదు..,. అన్ని రంగాలదీ అదే పరిస్థితి.

జూలైలో పార్ల‌మెంట్ సెష‌న్‌!.. జ‌గ‌న్‌రెడ్డికి ద‌బిడి దిబిడే...

క‌రోనా కేసులు భారీగా త‌గ్గుతున్నాయి. దేశ ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జోరుగా సాగుతోంది. ప‌రిస్థితులు ఇలానే కుద‌ట‌ప‌డితే.. జూలైలో పార్ల‌మెంట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు కేంద్రం సిద్ద‌ప‌డుతోంది. ఈ బ్రేకింగ్ న్యూస్‌.. అంద‌రికీ గుడ్ న్యూస్ అయితే.. ఒక్క జ‌గ‌న్‌రెడ్డికి మాత్రం వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. ఎందుకంటే.. పార్లమెంట్ సెష‌న్ కోస‌మే ఎంపీ ర‌ఘురామ వెయిట్ అక్క‌డ‌. ఈ మాటే జ‌గ‌న్‌రెడ్డి గుండెద‌డ‌ను అమాంతం పెంచేస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే పార్ల‌మెంట్ స‌మావేశాలు అన‌గానే.. వైసీపీ స‌ర్కారులో ఉలిక్కిపాటు మొద‌లైంద‌ని అంటున్నారు. ఎందుకంటే విష‌యం అలాంటిది మ‌రి. గాయ‌ప‌డిన బెబ్బులిలా ఢిల్లీలో కాచుకు కూర్చున్న ర‌ఘురామ‌.. త‌న‌పై జ‌రిగిన దారుణంపై పార్ల‌మెంట్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టించేందుకు చకోరా ప‌క్షిలా ఎదురు చూస్తున్నారు మ‌రి.  ఎప్పుడెప్పుడు పార్ల‌మెంట్ త‌లుపులు తెరుస్తారా.. ఎప్పుడెప్పుడు త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని దేశ అత్యుత్త‌మ స‌భ‌లో చెవులు చిట్లుప‌డేలా మొర‌పెట్టుకోవాలా.. అని ర‌ఘురామ వెయిట్ చేస్తున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ముందుగానే.. సీఎం జ‌గ‌న్‌రెడ్డిని స‌భ‌లో ఎండ‌గ‌ట్టేందుకు.. దేశం ముందు దోషిగా నిల‌బెట్టేందుకు.. త‌గిన కార్య‌చ‌ర‌ణ ఇప్ప‌టికే సిద్ధం చేసేశారు. త‌న‌పై రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేసి.. అరెస్ట్ చేసి.. క‌స్ట‌డీలో హింసించారంటూ.. ఒక ఎంపీగా త‌న‌పై జ‌రిగిన దాడిని పార్ల‌మెంట్‌పై జ‌రిగిన దాడిగానే చూడాలంటూ.. దేశంలోని అన్నిపార్టీల ఎంపీల‌కు లేఖ‌లు రాశారు. త‌న కాలికి అయిన గాయాల ఫోటోల‌ను సైతం ఆ లేఖ‌కు జ‌త చేశారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోసం సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేసినందుకే త‌న‌ను అలా హింసించార‌ని స‌హ‌చ‌ర ఎంపీల దృష్టికి తీసుకొచ్చారు ర‌ఘురామ‌. ర‌ఘురామకు జ‌రిగిన దారుణంపై ప్రాంతాలు, పార్టీలక‌తీతంగా అనేక మంది ఎంపీల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. బ‌హిరంగంగానే వారంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌ఘురామ‌కు మ‌ద్దుతు ప్ర‌క‌టించారు. ఓ ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగాన్ని ఖండిస్తూ.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. తామంతా ర‌ఘురామ‌కు జ‌రిగిన అన్యాయంపై పార్ల‌మెంట్‌లో పోరాడుతామ‌ని.. స‌భ‌లో ఈ విష‌యాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తామ‌ని హామీ ఇచ్చారు.  లోక్‌స‌భ స్పీక‌ర్‌కు సైతం ర‌ఘురామ విష‌యం తెలుసు. స్వ‌యంగా ర‌ఘురామ‌నే స్పీక‌ర్‌ను క‌లిసి త‌న కాలి గాయాల‌ను చూపించారు. ఒక ఎంపీపై జ‌రిగిన దాడిపై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ దారుణం కేంద్ర హోంశాఖ‌, ర‌క్ష‌ణశాఖ‌ మంత్రి దృష్టికీ వెళ్లింది. ఇక‌, జ‌గ‌న్ మిన‌హా దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కూ ర‌ఘురామ లేఖ‌లు రాశారు. త‌మ పార్టీ ఎంపీల‌ను పార్ల‌మెంట్‌లో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేలా చూడాల‌ని కోరారు. ఇలా, త‌న సొంత పార్టీ వైసీపీ మిన‌హా దేశంలోని ప్ర‌తీ ఒక్క పార్ల‌మెంట్ స‌భ్యుడినీ.. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై జ‌గ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా స‌భ‌లో గ‌ళం విప్పేలా.. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేలా.. సిద్ధం చేశారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. ఆయ‌న నుంచి ఈ స్థాయిలో ప్ర‌తిఘ‌ట‌న ఉంటుంద‌ని.. పాపం జ‌గ‌న్‌రెడ్డి ఊహించ‌లేక‌పోయార‌ని అంటున్నారు. అందుకే, పార్ల‌మెంట్ స‌మావేశాలు అన‌గానే జ‌గ‌న్‌రెడ్డిలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ర‌ఘురామ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పార్ల‌మెంట్ సెష‌న్ కోసం ఎదురు చూస్తున్నారు. సెష‌న్ తొలిరోజే త‌న అంశం ఎజెండాలో చేర్చేలా చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారని తెలుస్తోంది.  జైల్లోనే మగ్గేలా చేద్దామ‌ని ర‌ఘురామ‌పై రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేస్తే.. ఆయ‌న ఏపీ చెర‌లోంచి తుర్రున జారుకొని.. ఢిల్లీకి చేరి.. క‌మాన్, వెయిటింగ్ ఇక్క‌డ‌.. అంటూ జ‌గ‌న్‌రెడ్డికి స‌వాల్ విసురుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. పార్ల‌మెంట్ సాక్షిగా.. దేశ‌ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్‌రెడ్డిని దోషిగా నిల‌బెట్టి.. శిక్షించేందుకు సిద్ద‌మ‌వుతుండ‌టం సంచ‌ల‌నం. ర‌ఘురామ ఎత్తుగ‌డ‌లు ఊహాతీతం.. అంచ‌నాల‌కు మించి.. అంత‌కుమించి.. ఉంటుండ‌టం ఆస‌క్తిక‌రం.

ఈటలకు కాంగ్రెస్ సపోర్ట్! బీజేపీకి షాక్ తప్పదా.. 

ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాల్లో ఈ పదమే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అన్ని పార్టీల రాజకీయమంతా ఆయన చుట్టే తిరుగుతోంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీజేపీలో చేరుతానని ఈటల అంతర్గత సంభాషల్లో చెబుతున్నా.. అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పినా.. ఇంకా చేయలేదు. రాజీనామా చేయకుండానే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజకీయ గమనంపై మళ్లీ కొత్త చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లు ఈటల విషయంలో మరింత గందరగోళం కల్గించేలా ఉన్నాయి. ఈటల రాజేందర్ ఇప్పుడే బీజేపీలో చేరకపోవచ్చని తెలుస్తోంది.  ఈటల బీజేపీలో చేరడం ఖాయమని తెలిసిన తర్వాత కూడా ఆయనపై కాంగ్రెస్ ఇంకా సాఫ్ట్ కార్నర్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నేతల ప్రకటనలు కూడా అలానే ఉంటున్నాయి. రాజేందర్ ఇంకా బీజేపీలో చేరకపోవడంతో.. ఆయన కోసం  కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారని అనిపిస్తోంది. రాజేందర్ తో ఎంపీ రేవంత్ రెడ్డి టచ్ లోనే ఉన్నారని అంటున్నారు. అందుకే ఈటల బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్నా ఆయన స్పందించడం లేదని చెబుతున్నారు. ఈటల కాంగ్రెస్ లో చేరితే బాగుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు రోజుల క్రితం కూడా వ్యాఖ్యానించారు. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  హుజూరాబాద్ లో స్వతంత్ర  అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని చెప్పారు. ఇండిపెండెంట్‌గా ఈటల నిలబడితే 50 వేల ఓట్లతో గెలుస్తారని  జీవన్‌రెడ్డి తెలిపారు. ఈటల బీజేపీలో చేరడం వల్ల బలహీన పడ్డారని చెప్పారు. ఈటల బీజేపీలో చేరతానని తన వ్యక్తిత్వాని తగ్గించుకున్నారన్నారు. టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తోందన్నారు. అవినీతి చేసిన టీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో పెడతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు జీవన్ రెడ్డి.  ఎమ్మెల్యే పదవికి రాజేందర్ ఇంకా రాజీనామా చేయకపోవడం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. హుజూరాబాద్ లో బీజేపీ కంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తేనే బెటరని ఈటల భావిస్తున్నారని తెలుస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే... కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఆయనకు కొందరు అనుచరులు సూచిస్తున్నారట. అందుకే బీజేపీలో చేరికను ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. హుజూరాబాద్ లో గెలిచిన తర్వాత బీజేపీలో చేరితే.. బలం కూడా పెరుగుతుందని.. బీజేపీకి కండీషన్లు కూడా భారీగా పెట్టవచ్చని ఆయన అనుకుంటున్నారని తాజా సమాచారం. అందుకే నియోజకవర్గంలో తిరుగుతున్నారని అంటున్నారు. నియోజకవర్గ జనాల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈటల తదుపరి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 

సీజేఐకి 5వ తరగతి విద్యార్థిని లేఖ! బహుమతి పంపిన జస్టిస్ రమణ  

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తనదైన శైలిలో పని చేస్తున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. కోర్టు తీర్పుల విషయంలోనూ కాదు మౌలిక వసతులు, ఇతరత్రా అంశాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. తన దృష్టికి వచ్చే సమస్యలపైనా అత్యంత వేగంగా స్పందిస్తున్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. తాజాగా ఐదవ తరగతి బాలిక రాసిన లేఖకు స్పందించారు. ఆమెను అభినందిస్తూ వెంటనే ప్రత్యుత్తరం రాశారు జస్టిస్ రమణ.  కేరళకు చెందిన  చిన్నారి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు సకాలంలో స్పందించి ప్రభుత్వాలకు తగు సూచనలు చేసిందని అభినందించింది. అందుకు ఆమె కోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. తాను రోజూ ‘ది హిందూ’ దినపత్రిక చదువుతానని తెలిపింది. దీంతో కోర్టు ఎప్పటికప్పుడు స్పందిస్తున్న తీరును గమనించే అవకాశం కలిగిందని పేర్కొంది. కోర్టు చర్యల వల్ల అనేక మందికి సకాలంలో ఆక్సిజన్‌ సహా ఇతర వైద్య సాయం అంది ప్రాణాలు నిలిచాయని చిన్నారి కొనియాడింది.   త్రిశూర్‌లోని కేంద్రీయ విద్యాలయలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్‌ లేఖతో ఆగలేదు. సుప్రీంకోర్టులో చీఫ్‌ జస్టిస్‌ ఆసీనులయ్యే బెంచ్‌, అక్కడ ఉండే వస్తువులను స్వయంగా తన చేతులతో బొమ్మ గీసి లేఖకు జత చేసింది. అందులో చీఫ్‌ జస్టిస్‌ తన చేతిలో ఉండే సుత్తితో కరోనాను బాదుతున్నట్లు ఉండడం విశేషంగా ఆకట్టుకుంటోంది. లేఖను సైతం అందమైన స్వదస్తూరితో రాసింది లిద్వినా జోసెఫ్‌. చిన్నారి లేఖకు చీఫ్‌ జస్టిజ్‌ ఎన్వీ రమణ మంత్రముగ్ధులయ్యారు. లిద్వినా జోసెఫ్‌ లేఖకు వెంటనే ఉత్తరం రాశారు. తాను గీసిన అందమైన బొమ్మతో పాటు లేఖ అందినట్లు తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నందుకు అభినందిస్తున్నానన్నారు. మహమ్మారి సమయంలో ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నందుకు చిన్నారిని ప్రశంసించారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఓ బాధ్వతగల పౌరురాలిగా ఎదుగుతావని ఆకాంక్షించారు. అలాగే ఆయన సంతకం చేసిన ఓ రాజ్యాంగ ప్రతిని ఆమెకు బహుమానంగా పంపారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. 

తెరమీదకు మళ్ళీ ప్రత్యేక హోదా.. ఈసారైనా ఓకేనా?

ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో కేంద్ర సర్కార్ ఇచ్చిన హామీ మేరకే వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక  హోదానే శరణ్యమనే వాదన రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఆ రాష్ట్ర నేతలు ముమ్మరం చేశారు.. అయితే ప్రత్యేక హోదా అనగానే ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినదని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులే కాలేసినట్టే. కేంద్రానికి జీ హూజూర్ అంటున్న జగన్ రెడ్డి సర్కార్ ప్రత్యేక హోదా పై మాట్లాడే ధైర్యం చేస్తుండని ఊహించడం కూడా ఆశగానే మిగిలిపోతుంది. తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది బీహార్ లో.  బీహార్  వివరాలోకి వెళ్ళే ముందు.. ఊరించి ఉసురుమనిపించిన ఏపీ హోదా వివరాల్లోకి వెళితే...రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ పెద్దల సభ సాక్షిగా ఇచ్చిన హామీ, 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏడుకొండల వెంకన్న సాక్షిగా, ఇప్పటి ప్రదాని  నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ,  ఇంత  వరకు నెరవేరలేదు. ఇక  ముందు నెరవేరుతుందన్న ఆశ లేదు. నిజానికి  ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసింది. అధికార పార్టీ ఆ ఊసే ఎత్తదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే హోదా పైన శ్రద్ద లేదు. ప్రతిపక్ష నేతగా అధికారం కోసం చేసిన పాదయాత్ర పొడవునా ఆయన వైసీపీకి రాష్ట్రంలో అధికారం, లోక్ సభలో 25 కు 25 స్థానాలు ఇస్తే ప్రత్యేక  హోదా పట్టుకోస్తామని ప్రగల్బాలు పలికారు. అయన మాటలు నమ్మి ప్రజలు  ఎన్నికలలో వైసీపీని  భారీ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్ర శాసనసభలో 151/175 సీట్లు, లోక్ సభలో 22/25 సీట్లు కట్ట బెట్టారు.  కానీ, మాట తప్పం ..మడమ తిప్పం అది మా వంశంలోనే లేదని ఊదర కొట్టిన జగన్ రెడ్డి, ఫలితాలు పూర్తిగా రాకముందే మాట తప్పారు మడమ తిప్పారు’  కేంద్రంలో బీజేపీ/ఎన్డీఎకి భారీ  మెజారిటీ వచ్చింది, కాబట్టి ప్రత్యేక హోదా  విషయంలో ఇక మనం ఏమి చేయలేం, ఏదో కేంద్రాన్ని అడుగుతూ ఉండడమే కానీ, ఇంకేమీ చేయలేమని చేతులు ఎత్తేశారు.పోనీ ఆ అడగడం అన్నా చేశారా? అంటే అదీ లేదు. అడిగితె మోడీ, అమిత్ షా  ఎక్కడ అగ్రహిస్తారో, అక్రమాస్తుల కేసుల్లో ఎక్కడ అడుగు ముందుకేస్తారో అన్న భయంతో అడగడటమే మానేశారు. అందుకే, ప్రజలు కూడా జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ప్రత్యేక హోదాను మరిచి పోవడమే మంచిందన్న నిర్ణయానికి వచ్చారు.  బీహార్ రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా, ఇప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రంలో కాకరేపుతోంది. నీతి అయోగ్ ఇటీవల విడుదల చేసిన, ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం’ (సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్) (ఎస్దీజీ) సూచి చిచ్చురేపింది. ఈ సూచిలో బీహార్, బీమార్ స్టేట్’గానే మిగిలి పోయింది. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జాబితాలో పైన నిలిస్తే, బీహార్ వందకు 52 పాయింట్లతో అట్టడుగుకు చేరింది. దీంతో విపక్షాలు ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నాయి. పదేళ్ళ ఎన్డీఎ పాలనలో రాష్ట్రం  అద్వాన్న స్థితికి చేరిందని దుయ్యపడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పట్టుపడుతున్న జేడీయూ నాయకుడు ఉపేంద్ర కుశ్వాహ, ఇప్పటికైనా, ఎప్పుడో ఇస్తామన్న ప్రత్యేక హోదా గురించి పునరాలోచించాలని, ప్రధానిని కోరుతూ ట్వీట్ చేసి, ప్రధాని నరేంద్ర మోడీని ట్యాగ్ చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం చేయగలిగింది చేసినా, ఆశించిన అభివృద్ధి అందని దాక్షగానే మిగిలి పోయిందని, సో ... ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం వనరులు పుష్కలంగా ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాన్ని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతో అవశేష బీహార్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకు పోయిందని, కుశ్వాహ చెప్పారు.  ఇక ఇప్పుడు మళ్ళీ మనం ఏపీ విషయానికి వస్తే, బీహార్ పరిస్థితే ఏపీలోనూ ఉంది,అన్ని హంగులు, వనరులు ఉన్న హైదరాబాద్ నగరం అటు తెలంగాణకు వెళ్లిపోవడంతో, 13 జిల్లాల అవశేష ఆంధ్ర ప్రదేశ్ అనాధగా మిగిలింది. అయినా, బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్, జనతా దళ్ (యు)ఎన్డీఎలో భాస్వామ్య పక్షంగా ఉండి కూడా ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్నారు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం హోదా ఉసేత్తెందుకే భయపడుతున్నారు. ఇప్పటికైనా బీహార్’ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రం పై వత్తిడితేవాలని ఆంధ్రులు కోరుకుంటున్నారు.

ఆన్లైన్ లో బూతు బొమ్మలు.. వెబ్ సైట్ లో ఫోన్ నెంబర్.. కుర్రోడు మంచి ఊపుమీద ఉన్నాడు.. 

సోషల్ మీడియా ఇప్పుడు పిచ్చోడి చేత్తోలో రాయిగా మారింది. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి ఉపయోగించే సోషల్ మీడియాను కొంత మంది వ్యక్తుల స్వేచ్ఛను తూట్లుకొట్టడానికి వాడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాను చాలా మంది చాలా రకాలుగా వాడుతున్నారు.. మాములుగా వాడడం లేదు.. కొంత మంది మోసాలకు  అడ్డాగా మార్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్దాం..   అది మహబూబ్‌నగర్‌ జిల్లా, నారాయణపేట మండలం, పల్లా అర్జున్‌వాడా. ఈ వాడకు చెందిన తుము భరత్‌ కుమార్‌. వయసు  22 సంవత్సరాలు.  బీఏ చదువుతున్నాడు. భరత్ ఆన్‌లైన్‌ బ్లూ ఫిలిమ్స్ కి బానిసయ్యాడు. అక్కడినుండి వరస పెట్టి చూస్తూనే ఉన్నాడు.. అక్కడితో చూసి సంతోషించక.. ఆవేశాన్ని ఆపుకోలేక ఆన్‌లైన్‌లో కాల్‌బాయ్‌ అని చెప్పుకుంటూ తన కాంటాక్ట్‌ నంబర్‌ను లోకాంటో, స్కోక్కా వంటి వివిధ వైబ్‌సైట్లలో ఫోన్‌ నంబర్‌ పోస్ట్‌ చేశాడు. అక్కడ ఉండి స్పందనలు రాకపోవడంతో నిందితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తికి గూగుల్‌ హ్యాంగ్‌అవుట్స్‌లో చాట్‌ చేయమని కోరాడు. అది పోర్న్ సినిమాలకు బానిసగా మారాడు. ఆన్ లైన్‌లో అదే పనిగా అలాంటి వీడియోలే చూస్తుండేవాడు. వివరాల్లోకి వెళ్తే..  దీంతో కొన్ని రోజులు వారు చాట్‌ చేస్తూ బాధితుడి వ్యక్తిగత, కుటుంబ వివరాలన్నీ సేకరించాడు. ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ సృష్టించి అక్కడ నుంచి నిందితుడిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ కుటుంబ సభ్యుల ఫోటోలు తన దగ్గర ఉన్నాయి డబ్బులు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం భారత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

బైపోల్ బెదుర్స్‌.. ఆల‌స్యం ఎవ‌రికి అమృతం? ఎవ‌రికి విషం?

రేపేమాపో ఈట‌ల రాజీనామా. రాజేంద‌ర్ రాజీనామాతో త్వ‌ర‌లో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక‌. ఇదీ కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట‌. అయితే, ఆ 'త్వ‌ర‌లో' అంటే ఎన్నిరోజులో చెప్ప‌డం మాత్రం క‌ష్టం అంటున్నారు. క‌లిసొస్తే క‌నీసం ఆరు నెల‌లు. లేదంటే అంత‌కుమించే స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఆలోగా రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ఈట‌ల రాజీనామా వేడి చ‌ల్లారిపోవ‌చ్చు. రాష్ట్రంలో మ‌రో పొలిటిక‌ల్ హ‌డావుడి పెర‌గొచ్చు. ఈట‌ల త‌ర్వాత మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిపైనా వేటు ప‌డుతుంద‌ని అంటున్నారు. అదే నిజ‌మైతే.. ఫోక‌స్ హుజురాబాద్ నుంచి సూర్యాపేట వైపు షిఫ్ట్ అవ్వొచ్చు. కాలం గ‌డుస్తున్నా కొద్దీ రాజ‌కీయం ఎలాగైనా మారొచ్చు. అందుకే, ఇప్పుడు ఈట‌ల రాజీనామా, ఆమోదం, ఉప ఎన్నిక‌పై ఉత్కంట పెరుగుతోంది.  ఎమ్మెల్యే ఎవరైనా రాజీనామా చేస్తే.. స్పీక‌ర్ ఆమోదం త‌ప్ప‌నిస‌రి. అయితే, రాజీనామాపై స్పీక‌ర్ వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అది ఆయ‌న విచ‌క్ష‌ణ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. గ‌తంలో అనేక‌మంది ఎమ్మెల్యేల రాజీనామాలు నెల‌ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉండ‌టం తెలిసిందే. అయితే,, ఈట‌ల విష‌యంలో అలా జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. ఆయ‌న ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారా? అని ప్ర‌భుత్వం ఎదురుచూస్తోంది. సో, ఈట‌ల ఇలా రాజీనామా చేయ‌గానే.. అలా స్పీక‌ర్ అమోదం ల‌భిస్తుంద‌ని అంటున్నారు.  స్పీక‌ర్‌ ఆమోదం పొందిన తర్వాత గరిష్ఠంగా ఆరు నెలల్లోగా ఈసీ ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించవచ్చు. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బైపోల్‌కు 6 నెల‌ల కంటే అధిక స‌మ‌యం ప‌ట్ట‌డం చూస్తున్నాం. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా జరగాల్సిన వివిధ ఎన్నికలను ఈసీ వాయిదా వేస్తూ వస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా తగ్గుముఖం పట్టకపోతే, థ‌ర్డ్ వేవ్ దూసుకొస్తే.. హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు 6 నెల‌ల కంటే ఎక్కువే స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఆల‌స్యం అయితే.. ఆ ఆల‌స్యం ఎంత‌నేది కీల‌కంగా మార‌నుంది. ఎందుకంటే... హుజురాబాద్ ఉప ఎన్నిక 6 నెల‌ల్లోగా జ‌ర‌గ‌కుండా మ‌రింత ఆల‌స్యం అయితే.. పొలిటిక‌ల్ ఇంపార్టెన్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక‌వేళ బైపోల్ ఆల‌స్య‌మై.. వ‌చ్చే ఏడాదిలో సెకండ్ హాఫ్‌లో జ‌రిగితే.. అప్పటి నుంచి 2024లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంటుంది. అంటే.. అసెంబ్లీ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు.. హుజురాబాద్ బై ఎల‌క్ష‌న్‌ సెమీ ఫైన‌ల్‌లా మారే ఛాన్స్ ఉంది. అప్పుడు ఉప సంగ్రామం మ‌రింత‌ హోరాహోరీగా మారుతుంది. ఆ ప‌రిణామాన్ని ప‌లు ర‌కాలుగా చూడాల్సి ఉంటుంది.  మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌య‌మే ఉందిగా.. ఎమ్మెల్యేగా ఎవ‌రు ఉంటే ఏంట‌ని.. ప్ర‌జ‌లు లైట్ తీసుకుంటే..? ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓటు వేసి.. స‌ర్కారు ఆగ్ర‌హానికి గురైతే.. అభివృద్ధి ఆగిపోతుంద‌నుకుంటే..?  పెద్దోళ్ల పోరులో మ‌న‌మెందుకు బ‌లి కావాల‌ని ఓట‌రు భావిస్తే..? అది ఈట‌ల‌కు పెద్ద మైన‌స్‌గా మారుతుంది.   మ‌రో ఏడాదిన్న‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి కాబ‌ట్టి.. ఈ ఉప ఎన్నిక‌లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల‌ని.. ఇప్పుడు ఓడిస్తే.. అప్ప‌టికి సెట్ అవుతాడ‌ని.. గులాబీ బాస్ అహం దిగి.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తాడ‌ని.. కేసీఆర్‌కు ఎలాగైనా ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని భావిస్తే.. ఈట‌ల‌ను గెలిపించి.. దొర త‌ల‌బిడుసుత‌నాన్ని త‌గ్గించాల‌ని డిసైడ్ అయితే.. అది టీఆర్ఎస్‌కు తీర‌ని న‌ష్టాన్ని తీసుకొస్తుంది. దుబ్బాకలో అదే జ‌రిగింది. అది హుజురాబాద్‌లోనూ రిపీట్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. అందుకే, హుజురాబాద్ ఉప‌ ఎన్నిక‌ ఆల‌స్యం అయినా కొద్దీ.. తెలంగాణ‌లో రాజ‌కీయ భ‌విష్య‌త్ ప‌రిణామాలు అమాంతం మారిపోయే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు. 6 నెల‌ల లోపు ఎన్నిక‌లు జ‌రిగినా.. హోరాహోరీ మాత్రం త‌ప్ప‌దు.  అయితే, ఎమ్మెల్యే ప‌ద‌వికి త్వ‌ర‌గా రాజీనామా చేసి ఈటల బీజేపీలో చేరితే.. కేంద్రం త‌ల‌చుకున్న‌ప్పుడు హుజురాబాద్‌కు ఉప ఎన్నిక రావొచ్చ‌నేది మ‌రో పాయింట్‌. ముందుగానో, ఆల‌స్యంగానో.. హుజురాబాద్‌లో ఉప పోరు మాత్రం ప‌క్కా. అటు కేసీఆర్‌, ఇటు ఈట‌ల‌.. మ‌ధ్య‌లో బీజేపీ.. అంతా పంతం.. నీదా నాదా సై అంటుండ‌టంతో.. హుజురాబాద్‌లో ఎప్పుడు ఉప పోరు జ‌రిగినా.. ర‌చ్చ రంబోలే....

పోలీసులా.. ప్రైవేట్ సైన్యమా? ఏపీలో ఏం జరుగుతోంది.. 

ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామ రాజు అరెస్ట్ , ఆ తర్వాత జరిగిన ఘటనపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీ సీఐడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విశాఖలో ఫార్మసీ ఉద్యోగిపై జరిగిన పోలీసుల దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. లాక్ డౌన్ సమయంలో చాలా ప్రాంతాల్లో పోలీసుల తీరుపై జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరును ఎండగడుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.   విశాఖలో నడిరోడ్డుపై దళిత యువతి లక్ష్మీ అపర్ణను పోలీసులు అడ్డుకున్న తీరును ప్రస్తావిస్తూ.. ప్రజల హక్కులను హరిస్తున్న వైనాన్ని తన లేఖలో చంద్రబాబు వివరించారు. పోలీసులు నిరంకుశ పాలకుల ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయాల్లో ప్రజలకు కావాల్సింది ఆదుకునే ప్రభుత్వం, స్నేహ హస్తం అందించే పోలీసులు అని వివరించారు. కానీ, అందుకు విరుద్ధమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు. విశాఖలో మొన్న లక్ష్మీ అపర్ణ అనే దళిత యువతి, మరో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో ప్రజల హక్కులను హరించే విధంగా పోలీసుల తీరు ఉందని పేర్కొన్నారు. ఒక రాష్ట్రాధిపతిగా వ్యవస్థను చక్కదిద్దే దిశగా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ ను కోరారు.

దేశానికి మరో గండం! యువతపైనే భారం.. 

కొవిడ్ తో దేశం వణికిపోయింది. ఫస్ట్ వేవ్ లో గడ్డు పరిస్థితులు ఎదురవగా.. సెకండ్ వేవ్ లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది హాస్పిటల్ పాలయ్యారు. ఆక్సిజన్ అందక వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు. దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గు ముఖం పట్టింది. అంతలోనే బ్లాక్ , ఎల్లో, వైట్ ఫంగస్ లు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఫంగస్ కేసులు కాస్త తగ్గాయి. హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే దేశానికి మరో గండం పొంచి ఉంది. ఆ గండం నుంచి వీలైనంత త్వరగా గట్టెక్కకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.  రక్తం వల్ల విలువైన ప్రాణాలు కాపాడుతాయి. అలాంటి ప్రాణాధారమైన రక్త నిలువలు దేశంలో అడుగంటాయి. ఎక్కడికి వెళ్లినా నో స్టాక్‌.. నో బ్లడ్‌ అన్న బోర్డులే కనిపిస్తున్నాయి. రక్తం అవసరం ఉన్న రోగుల బంధువులు కాళ్లరిగేలా బ్లడ్‌ బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అన్ని చోట్ల నిల్వలు అడుగంటాయి. ప్రధానంగా రక్తం నిల్వ చేసే రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకుల్లోనే నో స్టాక్‌.. నో బ్లడ్‌ అన్నే సమాధానం వస్తోంది. కొన్ని బ్లడ్‌ బ్యాంక్‌ మొత్తంలో ఒక్క యూనిట్‌ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో 18 ఉండగా.. వాటిల్లో కేవలం 4 వందల యూనిట్లు మాత్రమే నిల్వ ఉంది. కృష్ణా జిల్లాలోని రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ఈ వారం కేవలం ఒకే ఒక్క యూనిట్‌ రక్తం అందుబాటులో ఉంది.  అనంతపురంలోనూ రెండే యూనిట్లు ఉన్నాయి. ఇలా అన్ని జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ నిల్వలు మాత్రమే ఉన్నాయి.  తెలంగాణలోనూ రక్తం నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుతం రెడ్‌క్రాస్‌ దగ్గర 3వందల యూనిట్లు మాత్రమే నిల్వలున్నాయి. కరోనాకు ముందు ప్రతి నెలా ఏపీలో 5 వేల, తెలంగాణలో 3వేల యూనిట్ల రక్తసేకరణ  జరిగేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. కరోనా భయం, లాక్‌డౌన్‌తో దాతలు ఎవరూ ముందుకు రావడం లేదు.కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుండడంతో.. ఆ ప్రభావం తీవ్రంగా చూపుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమైన నేపథ్యంలో మూడు నెలలుగా రక్త దాన శిబిరాలు పూర్తిగా నిలిచి పోయాయి. సినీహీరోల బర్త్‌డేల సమయంలో కూడా ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో రక్త దానం చేసేవారు. ఇప్పడు అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు.వ్యాక్సిన్‌ వేసుకున్నాక 8 వారాల పాటు రక్తం ఇవ్వకూడదన్న మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో రక్తం సేకరణ కష్టంగా మారింది.    బ్లడ్ కొరత ప్రభావం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులపై తీవ్రంగా చూపుతోంది. ఒక్కో సమయంలో విలువైన ప్రాణాలు కూడా పోతున్నాయి. రక్తం అందుబాటులో లేకపోవడంతో తలసేమియా పేషెంట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. గర్బిణీలు, ఆక్సిడెంట్స్‌లో గాయాల పాలైన వారు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. రక్తం అవసరం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ముందుగా ప్లాన్ చేసుకున్న ఆపరేషన్లకు, రెండు ప్రమాదాల సమయంలో, మూడవది తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు. ఆపరేషన్లు, క్షతగాత్రులకు కొంత సమయం ఉంటుంది, ఓల్డ్ రక్తం కూడా ఇవ్వొచ్చు. కానీ.. తలసేమియా రోగులకు మాత్రం రక్తం సేకరించిన ఐదు రోజుల లోపే ఫ్రెష్‌ బ్లడ్‌ ఎక్కించాలి. ఇలా ప్రతి 20 రోజులకు ఒక సారి రక్తం అవసరం ఉంటుంది. ఇలాంటిది ఇప్పుడు ఈ రోగులకు బ్లడ్‌ కొరత ప్రాణ సంకటంగా మారింది.  రెడ్‌ క్రాస్‌ సొసైటీ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా రక్త దానం చేసే వారు ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. తమ దగ్గర ఉన్న కాంటాక్ట్‌ నెంబర్లకు ఫోన్లు చేసినా సరైన స్పందన రావడం లేదని రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు అంటున్నారు. రక్తం కొరతను చక్క దిద్దేందుకు ఈ నెల 17న 75 క్యాంపుల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ తర్వాత ఇవ్వడం కుదరదంటున్న నిపుణులు.. వ్యాక్సిన్‌కు ముందే రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్‌ డిస్టెన్స్‌ ఉండేలా ఏర్పాట్లు చేశామని రక్తం ఇవ్వడానికి యూత్‌ ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. రక్త దానం చేసేవారు ఎవరైనా ఉంటే.. తమ టోల్‌ ఫ్రీ నెంబర్‌కి ఫోన్‌ చేస్తే తామే వస్తామంటున్నారు. 

మహేష్ మాములేడు కాదు. ఏకంగా 12 మంది మహిళలను వాడుకున్నాడు..

కొందరు నేరాలు చేస్తారు.. ఎంతకాలమైనా దొరికి సావారు.. ఇంకొందరు నేరాలు చేస్తారు వెంటనే పట్టుపడుతారు.. మరికొంత మంది ఎన్ని నేరాలు చేశాక బయట పడతారు.. అదేదో సినిమాలో కిడ్నప్ చెయ్యడం ఆర్ట్ అన్నట్లు.. మహిళలను మోసం చేయడమే ఇతని ఆర్ట్ గా పెట్టుకున్నాడు.. ఇంతకీ ఆ ఆర్టిస్ట్ ఎవడో సులుసుకోవాలనుకుంటున్నారా.. పదండి మరి..   అది  మలాడ్.  అతని పేరు మహేష్  అలియాస్ కరణ్ గుప్తా, .33 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్. అతను మంచి పేరు ఉన్న విద్య సంస్థలో చదివాడు.. పెద్ద పెద్ద సంస్థలో ఉద్యోగాలు చేశాడు.  కొంత కాలంగా హ్యాకర్ గా పనిచేశాడు.. ఇవ్వని చేసిన అతను 12 మంది మహిళలపై అత్యాచారం చేశాడు అది ఎలా అనుకుంటున్నారా.. అయితే ఆలస్యం ఎందుకు ముందుకు వెళ్ళండి.. మొత్తం విషం తెలుసుకుందాం..?  వివాహ పరిచయ వేదికల్లో తప్పుడు వివరాలు పెట్టడం..బాగా విద్యావంతులైన మహిళలే లక్ష్యంగా వివాహ పరిచయ వేదికల్లో తప్పుడు ఖాతాలు సృష్టించాడని, వరుడు కావాలి అని ఎదురు చూసే యువతులను వలలో వేసుకోవడం.ప్రొఫైల్ నచ్చిన మహిళకు ఫోన్ చేసి పబ్బులు లేదా రెస్టారెంట్లు, మాల్స్ వద్ద కలిసేవాడని చెప్పారు. తన వద్దకు వచ్చిన మహిళలకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడన్నారు. అలా ఇప్పటిదాకా 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అయితే, ఇంకా ఎక్కువ మందే అతడికి బాధితులై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి నేరానికీ కొత్త ఫోన్ నంబర్ వాడాడని, అవి కూడా తన పేరు మీద తీసుకున్నవి కాదని చెప్పారు. కొంత కాలం క్రితం హ్యాకర్ గా పనిచేశాడని, దీంతో అతడికి కంప్యూటర్లపై మంచి పట్టుందని తెలిపారు. మంచి పేరున్న విద్యా సంస్థల్లోనే చదివాడని, పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు. ఫిర్యాదులు అందడంతో నాలుగు నెలలుగా మహేశ్ కోసం వెతుకుతున్నామని, ఇప్పటికి దొరికాడని చెప్పారు.  

ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు! బాంబే హైకోర్టు సంచలనం 

మహరాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, సినీ నటి నవనీత్ కౌర్ (35) కు  ఊహించని షాక్ తగిలింది. ఆమె ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దుతో పాటు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది న్యాయస్థానం.  ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. కుల ధ్రువీకరణ రద్దు నేపథ్యంలో నవనీత్ కౌర్ తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ అమరావతి  ఎస్సీ రిజర్వ్  స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.  అయితే, నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఆమె ఎస్సీ కాదని తేల్చింది.  గత మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించడం కలకలం రేపింది. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, శివసేన లెటర్ హెడ్ తో బెదిరింపు లేఖలు వస్తున్నాయని, హెచ్చరికలు చేస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.  2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నవనీత్ కౌర్ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా గతంలో హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. నవనీత్ కౌర్ 1986 జనవరి 3న ముంబైలో జన్మించారు. ఆమె తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు పంజాబ్‌కు చెందినవారు. నవనీత్ కౌర్ తెలుగు సహా ఏడు భాషలు మాట్లాడగలరు. 

రియల్ ఎస్టేట్ కోసమే విశాఖ రాజధాని ప్రమోషన్స్..!

సినిమా మీద క్రేజ్ పెంచాలంటే ఏదో ఒక లీకు ఇవ్వడం .. లేదంటే అప్డేట్ పేరుతో ఒక న్యూస్ ఇవ్వడం చేస్తుంటారు. లేదంటే ఆ టెంపో పడిపోతుంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా కలెక్షన్లు పెంచడానికి ప్రమోషనల్ ప్రెస్ మీట్స్ పెడుతుంటారు.. సినిమా హిట్ హిట్ అని పదే పదే వద్దన్నా చెబుతుంటారు. ఈ ఫార్ములా ఏ బిజినెస్ అయినా ఫాలో అవ్వాల్సిందే. ఏపీ వైసీపీ నేతల విశాఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే .. అదే ఫార్ములా ఫాలో అవక తప్పడం లేదు మరి. మూడు రాజదానులని చెప్పినా..అసలు రాజధాని విశాఖపట్నం అనేది అందరికీ తెలిసిందే.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయినా కాస్త జాగ్రత్తగా మాట్లాడారేమో గాని..ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఎక్కడా లిమిట్,కంట్రోల్ లేకుండా చెలరేగిపోతూనే ఉన్నారు.భీమిలిలోనే రాజధాని ఏర్పాటవుతుందని ముందే చెప్పింది ఆయనే. ముందే భూములన్నీ కంట్రోల్ లోకి తీసుకున్నాకే ఈ ప్రకటనలు వచ్చాయని ఆరోపణలు వినపడుతూనే ఉన్నాయి. అయితే అమరావతి రైతులతో సహా, కొందరు హైకోర్టుకు వెళ్లడంతో..రాజధాని తరలింపుకు బ్రేకులు పడ్డాయి. అయినా అప్పటినుంచీ ఏదో ఒక విధంగా తరలించాలని ప్రయత్నాలు చేయడం మాత్రం ఆపలేదు. ఏదో ఒక లీకు ..అదిగో ఉగాదికి సీఎం వెళ్లిపోతారని..కాదు ఈసారి దసరాకు ఖాయం అని.. తర్వాత సంక్రాంతి అని.. కథలు నడిపించారు.కోర్టు బ్రేకులతో పాటు..కోవిడ్ సంక్షోభం కూడా అడ్డు వచ్చింది ఈసారి. అందుకే అప్పటి నుంచి దాని గురించి ఊసే లేకుండా పోయింది. కోవిడ్ నుంచి ఇప్పటికీ కోలుకోలేని ఏపీలో.. రాజధాని అంశం మరుగున పడింది. కోవిడ్ సంక్షోభం వల్లో.. రాజధాని లేటు అవుతుందనో మొత్తానికి విశాఖ రియల్ ఎస్టేట్ అనుకున్నంత స్పీడు అందుకోలేకపోగా.. కాస్త వెనక్కు తగ్గినట్లయింది. దీంతో దానిని లేపటానికి ఇప్పుడు సోకాల్డ్ నేతలు జాకీలు పట్టుకుని మరీ ట్రై చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన అలాంటి జాకీయే. రాజధాని తరలింపు ఆగలేదని..ఏ క్షణమైనా జరగొచ్చని మంత్రిగారు చెప్పుకొచ్చారు. అబివృద్ధిని అడ్డుకునే శక్తులే కోర్టులకు వెళ్లి ఆటంకాలు సృష్టిస్తున్నాయని కూడా కామెంట్ చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజధాని విశాఖకు చేరుతుందని గ్యారంటీ కూడా ఇచ్చారు. ఇంతకీ సార్ ఇచ్చిన ష్యూరిటీలు, గ్యారంటీలన్నీ రియల్ ఎస్టేట్ వర్గాలకేనని విశాఖలో టాక్.  ఇలా గతంలో కూడా అవసరమైనప్పుడు తెరపైకి వచ్చి మంత్రులు స్టేట్ మెంట్లు ఇవ్వడం కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు చేయించారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖకు రాజధాని తరలింపు వేగవంతం చేయాలని జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తోంది.  కాని న్యాయపరమైన చిక్కులు తొలగకుండా ముందుకు పోవడానికి లేదని అధికారులు చెబుతున్నారని సమాచారం. పైగా తమ ప్రత్యర్ధి ఒకరు కీలకమైన స్థానంలోకి వచ్చాక.. ఆ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలనేది అధికారుల సూచన. ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం కోవిడ్ తగ్గుముఖం పట్టాక..ఏదో ఒక ముహూర్తం చూసుకుని.. అనధికారికంగా అయినా సరే సీఎం విశాఖలో కూర్చోవాలనే వ్యూహాన్ని పన్నారని..అదే ఫాలో కావాలని ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ఎన్నివ్యూహాలు పన్నినా..ఎలా చేసినా.. పైన వారి రహస్య స్నేహితుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే అడుగు వేయరని..ఎటూ ఆ రహస్య స్నేహితుడికి వీరి అవసరం కూడా పెరిగిన నేపథ్యంలో.. అది కూడా పెద్ద కష్టమేమి కాదనే అనిపిస్తోంది.