మహేష్ మాములేడు కాదు. ఏకంగా 12 మంది మహిళలను వాడుకున్నాడు..
posted on Jun 8, 2021 @ 3:29PM
కొందరు నేరాలు చేస్తారు.. ఎంతకాలమైనా దొరికి సావారు.. ఇంకొందరు నేరాలు చేస్తారు వెంటనే పట్టుపడుతారు.. మరికొంత మంది ఎన్ని నేరాలు చేశాక బయట పడతారు.. అదేదో సినిమాలో కిడ్నప్ చెయ్యడం ఆర్ట్ అన్నట్లు.. మహిళలను మోసం చేయడమే ఇతని ఆర్ట్ గా పెట్టుకున్నాడు.. ఇంతకీ ఆ ఆర్టిస్ట్ ఎవడో సులుసుకోవాలనుకుంటున్నారా.. పదండి మరి..
అది మలాడ్. అతని పేరు మహేష్ అలియాస్ కరణ్ గుప్తా, .33 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్. అతను మంచి పేరు ఉన్న విద్య సంస్థలో చదివాడు.. పెద్ద పెద్ద సంస్థలో ఉద్యోగాలు చేశాడు. కొంత కాలంగా హ్యాకర్ గా పనిచేశాడు.. ఇవ్వని చేసిన అతను 12 మంది మహిళలపై అత్యాచారం చేశాడు అది ఎలా అనుకుంటున్నారా.. అయితే ఆలస్యం ఎందుకు ముందుకు వెళ్ళండి.. మొత్తం విషం తెలుసుకుందాం..?
వివాహ పరిచయ వేదికల్లో తప్పుడు వివరాలు పెట్టడం..బాగా విద్యావంతులైన మహిళలే లక్ష్యంగా వివాహ పరిచయ వేదికల్లో తప్పుడు ఖాతాలు సృష్టించాడని, వరుడు కావాలి అని ఎదురు చూసే యువతులను వలలో వేసుకోవడం.ప్రొఫైల్ నచ్చిన మహిళకు ఫోన్ చేసి పబ్బులు లేదా రెస్టారెంట్లు, మాల్స్ వద్ద కలిసేవాడని చెప్పారు. తన వద్దకు వచ్చిన మహిళలకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడన్నారు. అలా ఇప్పటిదాకా 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అయితే, ఇంకా ఎక్కువ మందే అతడికి బాధితులై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రతి నేరానికీ కొత్త ఫోన్ నంబర్ వాడాడని, అవి కూడా తన పేరు మీద తీసుకున్నవి కాదని చెప్పారు. కొంత కాలం క్రితం హ్యాకర్ గా పనిచేశాడని, దీంతో అతడికి కంప్యూటర్లపై మంచి పట్టుందని తెలిపారు. మంచి పేరున్న విద్యా సంస్థల్లోనే చదివాడని, పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు. ఫిర్యాదులు అందడంతో నాలుగు నెలలుగా మహేశ్ కోసం వెతుకుతున్నామని, ఇప్పటికి దొరికాడని చెప్పారు.