స్థంభించిన యూట్యూబ్ సేవలు
posted on Feb 27, 2024 @ 4:44PM
జీమెయిల్.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగించే ఈమెయిల్ సర్వీస్. అనేక సంస్థలు, కోట్లాది మంది యూజర్లు జీమెయిల్‌ను, గూగుల్ వర్క్‌స్పేస్‌ను రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. యూట్యూబ్ కూడా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ఈ రెండింటి సేవల్లో అంతరాయం ఏర్పడడం వల్ల వారంతా ఇబ్బంది పడ్డారు. జీమెయిల్, యూట్యూబ్.. రెండూ గూగుల్‌లో భాగమే. సమస్యకు కారణం ఏంటనే విషయంపై గూగుల్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రముఖ వీడియో ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ స్తంభించిపోయింది. మంగళవారం నాడు మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూట్యూబ్ పనిచేయలేదని వంద మంది కామెంట్ రాశారు. యూట్యూబ్ పనిచేయలేదని ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించి పరిష్కారం కనుగొనే డౌన్ డిటెక్టర్ నిర్ధారించింది.
యూట్యూబ్‌లో 80 శాతం మంది వీడియోలు చూడటంలో ఇబ్బంది పడ్డారు. మరికొందరు వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. యూట్యూబ్‌లో అంతరాయం భారతదేశంలో ఏర్పడిందా..? మిగతా దేశాల్లో వచ్చిందానే అంశానికి సంబంధించి మాత్రం స్పష్టత లేదు అని’ డౌన్ డిటెక్టర్ పేర్కొంది.
యూట్యూబ్‌లో వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్య ఏర్పడిందని కొందరు యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యూట్యూబ్ సర్వర్ డౌన్ అయ్యిందా.? ఇతర సమస్యలు ఉన్నాయా..? స్పష్టత ఇవ్వండి. తాను లైవ్, షార్ట్స్ అప్ లోడ్ చేయాల్సి ఉంది. తన వైటీ స్టూడియోలో ఏమీ కనిపించడం లేదు. యూట్యూబ్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. యూట్యూబ్ డౌన్‌కు సంబంధించి ఇప్పటివరకు యాజమాన్యం మాత్రం ప్రకటన చేయలేదు.
జీమెయిల్, యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాల్లోని నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్ వర్క్‌స్పేస్‌లోకి లాగిన్ కాలేకపోతున్నామని వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్‌లోనూ వీడియోలు చూడడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయారు. యూట్యూబ్ సహా జీమెయిల్ పని చేయట్లేదని యూజర్లు స్క్రీన్ షాట్లు పెట్టారు. అలాగే ట్విట్టర్లో తమ జీమెయిల్‌ను సైన్ ఇన్ చేయగా ఓపెన్ కావట్లేదని ట్వీట్లు చేశారు.
అంతకుముందు 2022 అక్టోబరు 25న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రంగంలోకి దిగిన వాట్సాప్ మాతృ సంస్థ 'మెటా' సర్వీసులను పునరుద్ధరించింది. మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపడం, అందుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్' అని వచ్చిందని, ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని యూజర్లు వాపోయారు. ట్విట్టర్లో 'వాట్సాప్ డౌన్' హ్యాష్‌ట్యాగ్ సైతం ట్రెండ్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్చల్ చేశాయి.అప్పట్లో వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడంపై వాట్సాప్ మాతృసంస్థ 'మెటా' అధికార ప్రతినిధి స్పందించారు. 'వాట్సాప్ సేవలు ఆగాయని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా సేవలకు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాం' అని తెలిపారు. కాసేపటికే సేవలు పునరుద్ధరించినట్లు ప్రకటించారు.
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు 2021 అక్టోబరు 5న 6 గంటలపాటు నిలిచిపోయాయి. ఫలితంగా మెటా సంస్థ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఈ క్రమంలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంపై మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్‌లైన్‌లోకి వచ్చినట్లు ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. అలాగే వాట్సాప్ సైతం తన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం యాప్ సాధారణంగా పనిచేస్తోందని వెల్లడించింది.
అంతర్జాల సమస్యలపై దృష్టి సారించే డౌన్‌డిటెక్టర్.. ఫేస్బుక్ అంతరాయంపై కీలక ప్రకటన చేసింది. ఫేస్బుక్ సమస్యపై ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా కోటికి పైగా ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో ఎక్కువ ప్రభావం కనిపించిందని చెప్పింది. ఫేస్బుక్ సేవల్లో ఏర్పడిన సుదీర్ఘ అంతరాయం ఇదేనని వెల్లడించింది.