హేమను అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు 

సినీ నటి హేమ చుట్టూ రేవ్ పార్టీ ఉచ్చు బిగుస్తోంది. ఆమె  తప్పించుకుని వచ్చినట్లు చెబుతున్న బెంగుళూరుపోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఎట్టకేలకు   మవారం హేమను అరెస్ట్ చేశారు.  సినీ నటి హేమ కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు గాలించారు. సీసీబీ పోలీసులు ఆమెకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి సీసీబీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వచ్చారు. నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు... రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.

‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’

‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’ ఈ పదాన్ని మళ్ళీ వినడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి హోదా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అని ఫిక్సయిపోయింది. ఎందుకంటే, ఈ నిర్ణయాన్ని తీసుకుంది వాళ్ళే కదా.. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పోలీసులు అడక్కుండానే భద్రత పెంచారంటేన అసలు విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సోమవారం టీడీపీ ఏపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకు వందలాది మంది కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. అందరూ ‘సీఎం... సీఎం’ అంటూ నినదించారు. సందర్శకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయంలో సందడి నెలకొంది. సేమ్ టైమ్ మేమే గెలుస్తామని వైసీపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారుగానీ, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మాత్రం వెలవెలబోతోంది.

రాధాకిషన్ కు ఎస్కార్ట్ తో కూడిన బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి  ఆదివారంరాత్రి మృతి చెందింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ ముఖ్య  భూమిక వహించారు.  తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు అవకాశమిచ్చింది. కానీ షరతులతో కూడిన బెయిల్ అతనికి మంజూరు చేసింది.  రేపు సాయంత్రం వరకు అతనికి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన తల్లి సరోజినీదేవి ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం ఇచ్చింది.

చిప్పకూడు నంబర్-1 సజ్జల

వైసీపీ నాయకులు ఐదేళ్ళలో తాము చేసిన పాపాలకు పరిహారం పొందాల్సిన సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయంలా కనిపిస్తోంది. అలా చిప్పకూడు తినే వైసీపీ నాయకులలో మొట్టమొదటి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వుండబోతున్నారు. ఈ అరుదైన అవకాశం పొందబోతున్న సజ్జలకు అభినందనలు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రెచ్చిపోండి అంటూ సజ్జల చేసిన కామెంట్ల విషయంలో ఈసీ సీరియస్ అయి, సజ్జల మీద క్రిమినల్ కేసు బుక్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కౌంటింగ్ అయిన మర్నాడే.. అంటే బుధవారం నాడు సజ్జల పోలీసు విచారణకు హాజరు కావలసి వుంది. పోలీసు విచారణకు హాజరైన సజ్జలను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. సజ్జల తర్వాత మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిప్పకూడు తినడానికి క్యూలో వున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద జైల్లో  పడటానికి చాలా పెద్ద క్యూనే వున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ‘ఖైదీ నంబర్ వన్’ హోదా పొందబోతున్న సజ్జల రామకృష్ణారెడ్డికి అభినందనలు. 

చెవిరెడ్డికి సుప్రీంలో గూబగుయ్యి!

చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నియోజకవర్గ పరిధిలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్లను మళ్లీ స్కృటినీ చేయాలనీ, అలాగే నియోజకవర్గ పరిధిలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆన సుప్రీం ను ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది.అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి చెబుతున్నారు.   దీనిపై హైకోర్టును ఆశ్రయించిన మోహిత్ రెడ్డి హైకోర్టు అందుకు సమ్మతింకకపోవడంతో  హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం మోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపి హైకోర్టు తీర్పును సమర్ధించింది. 

కుప్పం, హిందుపురం.. నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం జెండాయే!

నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాలలో తెలుగుదేశం వినా మరో జెండా ఎగిరిందే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ఆ రెండు నియోజకవర్గాలూ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగానే ఉన్నాయి. ఆ నియోజకవర్గాలలో ఒకటి కుప్పం అయితే రెండోది హిందూపురం. ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్, వైసీపీ సహా ఏ ఇతర పార్టీ ఇప్పటి వరకూ విజయం సాధించిందే లేదు. ఔను 1983 నుంచి ఇఫ్పటి వరకూ తెలుగుదేశం తప్ప మరో పార్టీ గెలిచిన చరిత్ర లేదు.  ఈ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు మారితే మారారు కానీ, గెలిచిన పార్టీ మాత్రం తెలుగుదేశమే. ప్రత్యర్థి పార్టీలు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని గెలుపు గుర్రాలుగా భావించిన అభ్యర్థులను బరిలోకి దింపినా.. ఫలితం మాత్రం తెలుగుదేశం విజయమే. ఆ నియోజకవర్గాలు ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమైపోయే ఉంటుంది. ఔను కుప్పం, హిందూపురం నియోజకవర్గాలలో గత నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీదే విజయం. మరో పార్టీకి ఈ నియోజకవర్గాలలో స్థానమే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలూ తమ మద్దతు విషయంలో అటూ ఇటూ చూడలేదు. తెలుగుదేశం తప్ప మరో పార్టీ వైపు మొగ్గు చూపింది లేదు.   కుప్పం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ తెలుగుదేశం విజయాలు 1983 నుంచి ఆరంభమయ్యాయి. 1983 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి రంగస్వామి నాయుడు విజయం సాధించారు. 1985 ఎన్నికలలో కూడా ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా కుప్పం ని యోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.  చంద్రగిరి నియోజకవర్గం నుంచి పరాజయం పాలైన చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి కుప్పంపై దృష్టి సారించారు.  1989 ఎన్నికలలో కుప్పం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన చంద్రబాబు.. అప్పటి నుంచీ వరుసగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు.   1989 to 2019 ఆయన కుప్పం నుంచి ఓటమి అన్నదే ఎరుగకుండా విజేతగా నిలుస్తూ వచ్చారు. వ్యూహాత్మకంగా  చంద్రగిరి నుంచి కుప్పంకు మారిన చంద్రబాబు మూడున్నర దశాబ్దాలుగా అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. 2024 ఎన్నికలలో కూడా చంద్రబాబు కుప్పుం నుంచి ఘన విజయం సాధించడం ఖాయమని పోలింగ్ సరళిని బట్టి ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు. ఇప్పటి వరకూ వరుసగా ఏడు సార్లు కుప్పం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన చంద్రబాబు. ఇప్పుడు ఎనిమిదో సారి కూడా విజయం సాధించనున్నారు.  ఇక హిందూపురం నియోజవకర్గానికి వస్తే.. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచింది. నిలుస్తూ వస్తోంది. ఈ నియోజకవర్గ ప్రజలు అభ్యర్థులు ఎవరన్నది కాకుండా వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే చాలు గెలిపించేసుకుందాం అన్నట్లుగా ఉంటారు.  అంతే కాకుండా నందమూరి కుటుంబానికి ఇక్కడ తిరుగులేని ప్రతిష్ట, ప్రజాభిమానం  ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు నందమూరి కుటుంబీకులే విజయం సాధించారు.  1983లో హిదూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పామిశెట్టి రంగనాయకులు విజయం సాధించారు.   ఆ తరువాత 1985, 1989లో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 1994 ఎన్నికలలో కూడా ఎన్టీఆర్ హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నారు.  ఇక 2014 నుంచి హిందూపురం నుంచి నందమూరి తారకరామారావు వారసుడు నందమూరి బాలకృష్ణ ఇక్కడ నుంచి వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించిన బాలకృష్ణ, 2024 ఎన్నికలలో విజయం సాధించి తండ్రిలాగే తాను కూడా హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడానికి రెడీగా ఉన్నారు.   

అబ్ కీ బార్ హైదరాబాద్ బాహర్ 

అబ్ కీ బార్ 400 బాహర్ అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బిజెపి తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తుందని వివిధ  ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే కౌంటింగ్ కు 24 గంట ముందు రెండు ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మాత్రం హైదరాబాద్ లోకసభ బిజెపి కైవసం చేసుకుంటుందని వెల్లడైంది. హైదరాబాద్ స్థానం గత 40 ఏళ్లుగా మజ్లిస్ చేతిలో ఉంది. బిజెపి ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఒక మహిళకు అధిష్టానం హైదరాబాద్ టికెట్ కేటాయించింది. బిజెపిలో పాతుకుపోయిన హిందుత్వ వాదులను కాదని    పాతబస్తి మూలాలు ఉన్న మాధవిలతకు టికెట్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సనాతన సంప్రదాయాన్ని ప్రమోట్ చేసే మాధవిలతకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. తాను  హైదరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు కూడా మాధవిలత  ఏనాడు అధిష్టానానికి చెప్పుకోలేదు. కనీసం దరఖాస్తు చేసుకోలేదు. పాతబస్తీలో సున్నితమైన గోషా మహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన రాజాసింగ్ ను సైతం కాదని మాధవిలతకు బిజెపి టికెట్ ఇచ్చింది. హైదరాబాద్ లోకసభ టికెట్ ఆశించిన రాజాసింగ్ తన సన్నిహితులతో బాటు పార్టీ ముఖ్యనేతలతో పలు మార్లు తన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని చెప్పుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా మాధవిలతకు టికెట్ ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బిజెపి మహిళా మోర్చా అధికారప్రతినిధి యమునాపాఠక్ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని మాధవిలతకు టికెట్ కేటాయించడం పార్టీలో అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. రాజాసింగ్ అయితే పార్టీలో మగాళ్లే దొరకలేదా  అని అధిష్టానాన్ని ఏకిపారేశారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయినప్పుడు కూడా అధిష్టానాన్ని పల్లెత్తు మాట అనని రాజాసింగ్ మాధవిలత విషయంలో అధిష్టానాన్ని గట్టిగానే చురకలు అంటించారు.  ఎన్నికల ప్రచారంలో మాధవిలత వాహనం ఎక్కని రాజాసింగ్ పోలింగ్ తర్వాత మాత్రం లక్ష వోట్ల మెజార్టీతో మాధవిలత గెలుస్తారని ప్రకటన చేశారు. ఆ తర్వాత  రాజాసింగ్  మాధవిలత విషయంలో అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. తాజాగా మాధవిలత ఓడిపోతుందని, దీనికి ప్రధాన కారణం బోగస్ వోట్లేనని రాజాసింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ మాధవిలత కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గలేదు. హైదరాబాద్ సీటు నాదేనని ధీమా వ్యక్తం చేశారు.  మహరాష్ట్ర బిజెపి ఎన్నికల ప్రచారంలో కూడా మాధవిలత స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. హైదరాబాద్ లో పోలింగ్ తర్వాత  ఆమె నేరుగా  మహరాష్ట్రకు బయలేదేరారు.  హైదరాబాద్ బిజెపిలో  ఫైర్ బ్రాండ్ పేరున్న రాజాసింగ్ కు మాత్రం  ఈ సారి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆహ్వానం అందలేదు . ధీంతో ఆయన మహరాష్ట్ర ఎన్నికల ప్రచారానికి   ఆయన దూరంగా  ఉన్నారు. కాని మాధవిలతను మాత్రం  మహరాష్ట్ర బిజెపి శాఖ మాత్రం  ఘనంగా ఆహ్వానించింది.  తాను మహరాష్ట్రకు వచ్చినప్పుడు పుట్టింటికి వచ్చిన అనుభూతికి లోనయ్యానని మాధవిలత అక్కడ ఎన్నికల పచారంలో వ్యాఖ్యలు చేశారు.  మాధవిలత రాజాసింగ్ మధ్య విబేధాలు చాలకాలంగానే  ఉన్నాయి. కానీ బయట మాత్రం సఖ్యతగా ఉన్నట్లు ఇద్దరూ కవరింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోకసభ ఎన్నికల ప్రచారంలో  ఉన్నప్పుడు మీడియా ప్రతినిధులు  రాజాసింగ్ ను ప్రశ్నించినప్పుడు మాత్రం సమాధానాన్ని దాట వేశారు. తాను గోషా మహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి  హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో పర్యటించలేనన్నారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి మాధవిలతకు సపోర్ట్ చేయాలని  మౌఖికంగా చెప్పారు. రాజాసింగ్ తన తమ్ముడు వంటి వాడని మాధవిలత చెప్పినప్పటికీ ఎన్నికల  ప్రచారంలో కల్సి పాల్గొనలేదు.   రాజాసింగ్ మాధవిలత ఒకే ప్రేములో కనిపించలేదు. బోగస్ వోట్లతో మజ్లిస్ పార్టీ గెలుపొందుతూ వస్తోందని మాధవిలత ఆరోపిస్తూ వచ్చారు. చనిపోయిన వోటర్ల ను కూడా బతికి ఉన్నట్లు చూపించి మజ్లిస్ రిగ్గింగ్ కు పాల్పడుతుందని  మాధవిలత ఆరోపిస్తూ వస్తున్నారు. మజ్లిస్ కార్పోరేటర్ కు చెందిన ఓ ఇంట్లో పోలింగ్ బూత్ ఉందని, ఆ బూత్ లోనే రిగ్గింగ్ జరిగిందని మాధవిలత ఆదారాలతో బయట పెట్టారు. తన సెల్ ఫోన్ లోనే రికార్డు చేసిన రిగ్గింగ్ దృశ్యాలను మాధవిలత సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇవే  ఆధారాలు అని మాధవిలత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.  వోటు వేయడానికి బురఖాతో వచ్చిన  ఒక మహిళ హిజాబ్ తీసివేయాలని ఒక పోలింగ్ బూత్ లో అభ్యర్థి హోదాలో  మాధవిలత అడగడం  వివాదాస్పదమైంది. ముస్లిం మహిళ హిజాబ్ తీసివేయాలనడం చట్ట విరుద్దమని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అంతే కాదు కేసు కూడా నమోదు చేయాలని పోలీసులను  ఆదేశించింది. పాత బస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో రిగ్గింగ్ ను నిలువరించలేకపోయిందని, బోగస్ వోట్లను ఎన్నికల కమిషన్ ఏరివేయలేకపోయిందని  మాధవిలత ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు అన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ  చర్యలు తీసుకోలేదని  మాధవిలత ప్రధాన ఆరోపణ. రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో రిపోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో  మెజారిటీ వోట్లు గల్లంతయ్యాయని ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు.  అయితే మాధవిలత ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఖండించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు  నాంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన డాటానే మాధవిలత ఇచ్చిందని, తాను కొత్తగా ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్టేట్ మెంట్ వంత పాడాడు.  పోలింగ్ జరిగిన తర్వాత కూడా  మాధవిలత తన యుద్దాన్ని ఆపలేదు. ఎన్నికల కమిషన్ కు  తన ఫిర్యాదుల పర్వం ఆపలేదు. హైదరాబాద్  లోకసభ పరిధిలో రీ పోలింగ్ జరపాలన్న మాధవిలత డిమాండ్ ను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. ఓటు హక్కు రాని వోటర్లు తిరిగి తమ వోట్ల  నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చినప్పటికీ వోటర్లు పెద్దగా స్పందించలేదు. ఓటు   నమోదు కార్యక్రమం కోసం మాధవిలత   వాట్సాప్ లో క్యూఆర్ కోడ్  క్రియేట్ చేసినప్పటికీ వోటర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో మాధవిలత మిన్నకుండిపోయారు. మాధవిలత ఓడిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా  యాక్సెస్ మై ఇండియా, చాణక్యటుడే సర్వేలు మాత్రం మాధవిలత విజయం ఖాయమని డిక్లేర్ చేశాయి. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మాధవిలత గెలుపు బిగ్గెస్ట్ మిరాకిల్ అని చెప్పొచ్చు. 

వైసీపీ కేసు.. సుప్రీంలో డిస్మిస్

పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న జగన్ పార్టీకి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసీపీ వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మీద సోమవారం ఉదయం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారన చేపట్టింది. వైసీపీ తరఫున లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వెలగపూడి రామకృష్ణ ఈ కేసు విషయంలో కేవియట్ దాఖలు చేశారు. ఆయన తరఫున ఆదినారాయణ, సిద్ధార్థ లూధ్రా, రవితేజ పదిరి, జవ్వాజి శరత్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ వైసీపీ దాఖలు చేసిన ఎస్ ఎల్ పిని డిస్మిస్ చేసింది.

పవన్ ఓడిపోవాలి: ఎవరిదీ కోరిక?

బిగినింగ్‌లోనే క్లారిటీ ఏంటంటే, కొంతమంది ఊహిస్తున్నట్టుగా, మరికొంతమంది ఆశిస్తున్నట్టుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోరు. ఎవరూ ఊహించనంత భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకోబోతున్నారు. లేటెస్టుగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ పవన్ కళ్యాణ్ భారీ విజయం ఖాయమని స్పష్టం చేశాయి. అయినప్పటికీ కొన్ని ‘శక్తులు’ పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని తపస్సు చేస్తున్నాయి. ఆ శక్తుల్లో వైసీపీ వాళ్ళు ఎలాగూ వుంటారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారంటే, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. రాష్ట్ర రాజకీయాలలో వైసీపీ ప్రాబల్యం బాగా తగ్గిపోయే అవకాశం వుంది. ఈ కారణం వల్ల వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకోవడం సహజమే. కానీ, పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకుంటున్నది మరెవరో కాదు... ఏ కాపులైతే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని కోరుకుంటూ వున్నారో, ఆ కాపుల్లోనే వున్న కొన్ని వర్గాలు. కాపు సామాజికవర్గం వంగవీటి రంగా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఆయన హత్య కాపులకు పెద్ద షాక్ అయింది. ఆ తర్వాత వాళ్ళ ఆశలు దాసరి నారాయణరావు మీద కొంతవరకు మళ్ళినప్పటికీ, అవి బలపడలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించేసరికి కాపులలో ఉత్సాహం ఉరకలు వేసింది. తాము కోరుకుంటున్నట్టుగా ‘కాపు ముఖ్యమంత్రి’ అయ్యే అవకాశం చిరంజీవికి వుందని అనుకున్నారు. అయితే ఆ కలలు మధ్యలోనే కల్లలైపోయాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోయినప్పటికీ, రాబోయే కాలంలో అయినా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే శక్తి ఆయనకు వుందన్న నమ్మకం కాపులలో రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది కాపులు ఇలా ఆశలు పెట్టుకుంటే, కొంతమంది కాపులు మాత్రం అలా జరక్కూడదని, పవన్ కళ్యాణ్ గెలవకూడదని కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్న వాళ్ళలో అగ్రస్థానంలో నిలిచే వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఇంతకాలం ఆయన ‘కాపు కార్డు’ దగ్గర పెట్టుకుని, దాన్ని క్రెడిట్ కార్డు వాడేసినంత ఈజీగా వాడేశారు. వైసీపీకి చేరువైన తర్వాత ఆ కార్డు వాడకం మరింత పెరిగి లిమిట్ దాటిపోయింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గెలిచారా.. ఇక కాపులు ముద్రగడని ఎంతమాత్రం పట్టించుకోరు. ‘కాపు కుల పెద్ద’ పోస్టు నుంచి ఆయన్ని తీసి పక్కన పెట్టేస్తారు. వారానికో పదిరోజులకో ఒకసారి అయినా ‘నమస్తే ముద్రగడ గారూ’ అని పలకరించేవారు కూడా వుండరు. పరిస్థితి ఇంత దారుణంగా మారే అవకాశం వుంది కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గెలవకూడదు దేవుడా అని మొక్కుకుంటూ వుంటారు. ముద్రగడ మాత్రమే కాదు.. ప్రస్తుతం వైసీపీలో కాపు కుల ప్రతినిధులుగా వున్నవాళ్ళు, పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చే కాపు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గెలవకూడదనే వ్యక్తిగతంగా కోరుకుంటున్నారు. కాపు కులానికి పవన్ కళ్యాణ్ పెద్దదిక్కుగా మారిన తర్వాత వీళ్ళని పట్టించుకునేవాళ్ళే వుండరు.. అంతేకాదు.. వీళ్ళ నియోజకవర్గాల్లో కొత్త కాపు నాయకత్వం బయల్దేరుతుంది. దాంతో వీళ్ళు క్రమంగా రెండో స్థానానికి పడిపోయే ప్రమాదం వుంది. దాంతో వీళ్ళు కూడా ముద్రగడతో కలసి పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎవరెన్ని రకాలుగా కోరుకున్నా.. పవన్ కళ్యాణ్ గెలుపు అనివార్యం.

సజ్జలకు నోటీసులు!.. పేర్ని నానిపై కేసు?

వైసీపీ నుంచి అధికార పగ్గాలు చేజారిపోతున్నాయనడానికి  స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా తన మౌఖిక ఆదేశాలతో పోలీసు శాఖను ఉరుకులు పరుగులు పెట్టించిన సజ్జలపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నమోదు చేసి ఊరుకోలేదు.. ఈ నెల 5న అంటే కౌంటింగ్ ముగిసి, ఫలితాలు వెలువడిన మరుసటి రోజు విచారణకు రావలసిందిగా నోటీసులు సైతం జారీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ మేరకు వైసీపీ పరాజయం పాలైతే.. క్రిమినల్ కేసులో విచారణ తరువాతి మర్యాద అరెస్టే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కౌంటింగ్ రోజున రూల్స్ గీల్స్ అంటూ కూర్చోవద్దు రెచ్చిపోండి అంటూ కౌంటింగ్ ఏజెంట్లకు దిశా నిర్దేశం చేసిన కేసులో సజ్జలపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి విచారణకు జూన్ 5న రావాల్సిందిగా తాడేపల్లి పోలీసులు సజ్జలకు నోటీసులు జారీ చేశారు. ఇలా ఉండగా పేర్నినానిపై కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేయడానికి  రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.  వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అధికారులను భయపెట్టేలా  చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం  మచిలీపట్నం తెలుగుదేశం నాయకులు తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో  చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడానికి పోలీసులు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తోంది.  

పిన్నెల్లికి ముందస్తు బెయిలు.. హైకోర్టు తప్పు చేసిందని సుప్రీం వ్యాఖ్య

మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది. పిన్నెల్లికి ముందస్తు బెయిలు ఇస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ నంబూరి శంకరరావు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలలో కూడిన ధర్మాసనం సోమవారం (జూన్ 3) విచారణ జరిపింది. ఈ సందర్భంగా  హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిలు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వ్యులు జారీ చేయడం న్యాయాన్ని అవహేళన చేయడమేనని వ్యాఖ్యనించింది.    ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్‌ కేంద్రంలోకి  వెళ్లవద్దంటూ పిన్నెల్లిని ఆదేశించింది.  అంతే కాదు కౌంటింగ్ రోజుల మాచర్ల నియోజకవర్గంలోని వెళ్లకూడదనీ స్పష్టం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పు పడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశపనం కలిగించి హైకోర్టు తప్పు చేసిందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

కవితక్కాయ్ రిమాండ్ పొడిగింపు

కల్వకుంట్ల కవిత ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత రిమాండ్‌ని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు పదిహేను రోజుల చొప్పున రిమాండ్ పొడిగిస్తూ వచ్చిన వచ్చిన న్యాయస్థానం ఇప్పుడు ఏకంగా నెలరోజులపాటు పొడిగించింది. ఈ లెక్క ప్రకారం జులై 3 నాటికి కవిత జైలుకు వెళ్ళి దగ్గర దగ్గర నాలుగు నెలలు అవుతుంది. పరిస్థితిని బట్టి చూస్తుంటే, తమిళనాడు రాజకీయ నాయకురాలు కనిమోళి రికార్డును కవిత బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనిమోళి మొత్తం ఆరు నెలలు జైల్లో వున్నారు. జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ పొడిగించడం అనేది ఈడీ కేసు విషయంలో జరిగింది. సోమవారం నాడు సీబీఐ కేసులో కస్టడీ పొడిగింపు విషయం కూడా విచారణకు రానుంది. ఈ కేసులో ఎంతవరకు రిమాండ్ పొడిగిస్తారో తెలియాల్సి వుంది. పాపం, ఈ స్టార్ కాంపైనర్ ప్రచారం చేయకుండానే ఎలక్షన్లు ముగిశాయి.. రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇదిలా వుంటే, ఇంతకాలం జైల్లో వున్నప్పటికీ కవిత బుద్ధి మారినట్టు కనిపించడం లేదు. కోర్టు విచారణకు వచ్చినప్పుడు నినాదాలు చేయవద్దని, స్టేట్‌మెంట్లు ఇవ్వవద్దని ఆమెను ఆల్రెడీ హెచ్చరించారు. అయినప్పటికీ కవిత తన పద్ధతిని మార్చుకోలేదు. సోమవారం నాడు కోర్టుకు హాజరైన కవిత ‘జై తెలంగాణ’, ‘జై భారత్’ అనే నినాదాలు చేశారు. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే.

వైఎస్ షర్మిల వాట్ నెక్స్ట్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగిలిన దాఖలాలు లేవు. విభజన తరువాత జరిగిన తొలి రెండు ఎన్నికలలోనూ జీరో స్థానాలతో రిక్త హస్తాలతో మిగిలిన పార్టీ.. 2024 ఎన్నికలలో మాత్రం రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాకపోయినా.. ఉనికి చాటుకోవడానికి చాలా చాలా కష్టపడింది. పార్టీకి దూరమైన వైఎస్ బ్రాండ్ ను షర్మిల ద్వారా తిరిగి సొంతం చేసుకోవడానికి ఎత్తుగడ వేసింది. సరిగ్గా ఎన్నికలకు నెలల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించింది. ఇది కాంగ్రెస్ శ్రేణులలో ఒకింత జోష్ నింపింది. అయితే ఆ జోష్ రాష్ట్రంలో కనీసం కొన్ని అసెంబ్లీ స్థానాలలైనా గెలుచుకునేందుకు ఇసుమంతైనా సరిపోలేదని పోలింగ్ తరువాత స్పష్టమైంది.  అయితే షర్మిల స్వయంగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆమె ప్రసంగాలు, అధికార పార్టీపై, మరీ ముఖ్యంగా తన సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ పై ఆమె చేసిన విమర్శలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.  కాంగ్రెస్ అధినేత్రిగా ఆమె రాష్ట్రం మొత్తం పర్యటించి పార్టీ తరఫున ప్రచారం చేసినా ఆమె మొత్తం కాన్సన్ ట్రేషన్ అంతా స్వయంగా తాను పోటీ చేస్తున్న కడప లోక్ సభ స్థానంపైనే పెట్టారు. తన ఎన్నికల  ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఆయనను వెనకేసుకు వస్తున్న అన్నని గట్టిగా నిలదీశారు. ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేక ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య అంశం ఎత్తకూడదంటూ కడప కోర్టు నుంచి గాగ్ ఆర్డర్ సైతం తెచ్చుకున్నారు.  వివేకా హత్య ఒక వైపు అవినాష్ విజయంపై నీలి నీడలు కమ్ముకునేలా చేయగా, మరో వైపు సరిగ్గా పోలింగ్ కు ముందు రోజు  వైఎస్ విజయమ్మ..  అమెరికా నుంచి ఓ వీడియో సందేశంలో వైఎస్ షర్మిలని గెలిపించాలని కడప ఓటర్లకు చేసిన విజ్ణప్తితో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి షర్మిల విజయం తథ్యమన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం షర్మిల విజయం అంత సునాయాసం కాదని తేల్చేశాయి. ఏ ఎగ్జిట్ పోల్ కూడా కడపలో షర్మిల విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొన లేదు. అంతే కాదు రాష్ట్రంలో   కాంగ్రెస్   శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఒక్కంటే ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కూడా లేవనే పేర్కొన్నాయి.   దీంతో ఇప్పుడు షర్మిల పొలిటికల్ స్టెప్ ఏమిటి? అన్న చర్చ మొదలైంది.  కాంగ్రెస్   రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పార్టీ ఉనికే కనిపించని పార్టీ తరఫున చేసే పని కూడా ఉండదు. దీంతో షర్మిల వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న తలెత్తుతోంది. పరిశీలకులు మాత్రం ఆమెకు ముందుగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ మేరకు ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు.   

బీఆర్ఎస్ పతనం పరిపూర్ణం?

తెలంగాణ సాధించిన పార్టీగా పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు పరిపూర్ణంగా పతనమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రారంభమైన బీఆర్ఎస్ పతనం లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత పరిపూర్ణమౌతుందని అంటున్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగించి టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచి ఆ పార్టీ తిరోగమనం ఆరంభమైంది. తాజా లోక్ సభ ఎన్నికలలో కనీస స్థానాలలో కూడా ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ తేల్చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్  భవిష్యత్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ లోగా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ పార్టీ నిలబెట్టుకున్నా.. పార్టీకి అదేమంత కలిసొచ్చేది కాదని అంటున్నారు.  తాజాగా ముగిసిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ సోదిలోకి లేకుండా పోయిందనీ, ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే జరిగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చడానికి ముందే పరిశీలకులు కూడా ఆ దిశగానే విశ్లేషణలు చేశాయి. అసలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలే కనిపించ లేదు.  గత ఏడాది డిసెంబర్ లో జరిగని అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ గ్రేటర్ పరిథిలో మంచి ఫలితాలు రాబట్టింది. ఆ స్థానాలే బీఆర్ఎస్ విపక్ష హోదా దక్కించుకోవడానికి దోహదం చేశాయి. అయితే  ఈ తరువాత వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికలలో గ్రేటర్ పరిథిలో  బీఆర్ఎస్ బాగా వెనుకబడిందని ఎగ్జిట్ పోల్స్ ను బట్టి తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పతనం పరిపూర్ణమైనట్లే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే గ్రేటర్ పరిథిలోని  మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ లలో లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉండాలి. కానీ పోలింగ్ తరువాత బీఆర్ఎస్ లో ఆ ధీమా ఇసుమంతైనా కనిపించలేదు. తీరా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తరువాత ఆయా స్థానాలలో బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదని తేటతెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే జరిగిందని అర్ధమౌతున్నది.   

జగన్ పై సొంత పార్టీ నేతల తిరుగుబాటు?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్  ఫలితం ఎలా ఉండబోతోందో సంకేతాలిచ్చేశాయి. ఇక మంగళవారం (జూన్ 4) అధికారికంగా ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే ఇప్పుడు ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆశక్తి దాదాపు ఎవరిలోనూ మిగలలేదు. తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమన్న నిర్ణయానికి దాదాపు అందరూ వచ్చేశారు. కనీసం విపక్ష హోదా అయినా వైసీపీకి దక్కుతుందా? అన్న విషయంపై ఓ కాస్త ఆసక్తి, ఉత్కంఠ మిగిలి ఉంది. చివరాఖరికి వైసీపీ నేతలూ, క్యాడర్ కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో వైసీపీ పార్టీలో జగన్ పై తిరుగుబాటు మొదలైనట్లు కనిపిస్తోంది. తమ ఓటమికి, పార్టీ పరిస్థితికి జగన్ తీరే కారణమన్న విమర్శలు పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.   అసలు సిట్టింగులను మార్చాలన్న నిర్ణయంతోనే జగన్ ఎన్నికలలో ఓటమిని అంగీకరించేసినట్లైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధినేత తాను ముందుండి నడిపించాల్సింది పోయి, అభ్యర్థులను మార్చేసి ఎవరి విజయానికి వారే బాధ్యులు అన్నట్లుగా వ్యవహరించడం ఏమిటని అంటున్నారు. ఇక్కడ చెల్లని కాణీ అక్కడ చెల్లుతుందా అని అప్పట్లోనే పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి మొదలైంది. ఇప్పుడు పార్టీ ఓటమి ఖరారు అని తేలిపోయిన తరువాత ఆ అసమ్మతి గళాలు గట్టిగా వినిపిస్తున్నాయి.  పార్టీ అభ్యర్థులను ముందుండి గెలిపించలేని జగన్ తమ నాయకుడిగా ఉండటమే దురదృష్టమని, పలువురు వైసీపీ నేతలు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. అలాంటి వారిలో అత్యధికులు ఈ సారి ఎన్నికలలో పోటీ చేసి ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిన వారే ఉన్నారు.   పార్టీ ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని  జగన్ ఇంకా వైసీపీ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా అవసరమా అనే ప్రశ్నలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తి, ఆగ్రహ తీవ్రత చూస్తుంటే.. వైసీపీలో జగన్ పై తిరుగుబాటు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఇలాంటి తిరుగుబాటును ముందే ఊహించి జగన్ తనను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలని గతంలోనే భావించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  పార్టీలో జగన్ పై తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంటుంది అన్నది.. ఫలితాల వెల్లడి తరువాత వైసీపీ గెలుచుకునే సీట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ఫలితాల తరువాత జగన్ పార్టీపై పట్టు పూర్తిగా కోల్పోయే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. 

నిబద్ధత, క్రమశిక్షణకు తెలుగుదేశం కేడర్ బ్రాండ్!

తెలుగుదేశం కేడర్ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. గత పదేళ్లుగా తెలంగాణలో పార్టీ దాదాపు నామమాత్రపు కార్యక్రమాలకే పరిమితమైనా, పార్టీ తరఫున పదవులు, హోదాలు అనుభవించిన నేతలు గోడ దూకేసి పక్క పార్టీలకు వలస వెళ్లిపోయానా.. క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.  పార్టీ పట్ల అంకిత భావానికీ, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. అదే విధంగా ఏపీలో కూడా ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం క్యాడర్ తన ప్రత్యేకత ఏమిటన్నది చాటింది.  ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, వేధింపులకు గురై, దాడులు, దౌర్జాన్యాలకు బాధితులుగా మారిన తెలుగుదేశం క్యాడర్ మొక్కవోని ధైర్యంతో వాటన్నిటినీ ఎదుర్కొన్నారు.  అయితే ఎన్నికల ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుకు సై అనడంతో క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన సాగించిన జగన్ కు అన్ని విధాలుగా అండదండలు అందించిన పార్టీతో పొత్తును తెలుగుదేశం క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. బాహాటంగానే తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. పొత్తు అవసరాలను, అనివార్యతను పార్టీ నాయకత్వం వివరించినా సరిపెట్టుకోలేకపోయింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి అధిక స్థానాలను కేటాయించడంపై కూడా తెలుగుదేశం క్యాడర్ తన వ్యతిరేకతను బాహాటంగానే చాటింది. రాష్ట్రంలో నోటాతో పోటీ పడే ఓటు బ్యాంకు ఉన్న పార్టీ కోసం ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నేతలు ఎందుకు త్యాగం చేయాలి అని క్యాడర్ నిలదీసింది కూడా. క్యాడర్ లో అసంతృప్తి తమకు భారీగా లబ్ధి చేకూరుతుందని వైసీపీ కూడా చంకలు గుద్దుకుంది. అయితే ఒక సారి పొత్తు ఖరారై సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన తరువాత, పార్టీ నేత కూటమి విజయం కోసం తెలుగు తమ్ముళ్లంతా పని చేయాలని పిలుపు ఇచ్చిన తరువాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం క్యాడర్ ఎస్ ఇఫ్.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, పాతిక పార్లమెంటు స్థానాల్లో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులంతా తెలుగుదేశం కేండిడేట్సే అన్నట్లుగా పని చేశారు. పార్టీల మధ్య ఓట్ల బదలీ సజావుగా సాగడంలో క్యాడర్ నిబద్ధత, అంకిత భావం ప్రస్ఫుటంగా కనిపించింది.  ఆ ఫలితం జూన్ 1 (శనివారం) వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో ప్రతిఫలించింది. తెలుగుదేశం, బీజేపీ మధ్య ఓట్ల బదలీ వందకు వంద శాతం అయ్యిందన్న సంగతి తేటతెల్లమైంది.  యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఏపీలో బీజేపీకి 13శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలో పూర్తిగా ఒకశాతం ఓటు షేరు కూడా లేని బీజేపీ ఏకంగా 13 శాతం ఓట్ షేర్ సాధించగలిగిందంటే అది కచ్చితంగా తెలుగుదేశం క్యాడర్ కూటమి అభ్యర్థుల విజయం కోసం రెండో ఆలోచన లేకుండా పని చేయడమేనని పరిశీలకులు అంటున్నారు. అధినేత మాటే శిరోధ్యార్యంగా తెలుగుదేశం క్యాడర్ పని చేసిన తీరుకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు. కూటమి పార్టీల మధ్య వంద శాతం ఓట్ల బదలీ జరగడం అంటే నిజంగా అద్భుతమేనని అంటున్నారు. అటువంటి అద్భుతం జరగడానికి క్షేత్రస్థాయి నుంచి క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం క్యాడర్ వల్లే సాధ్యమౌతుందని చెబుతున్నారు.  

జగన్‌ని తిట్టిపోసిన ‘పంచ్ ప్రభాకర్’!

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మెల్లగా తమ ప్రభావాన్ని చూపించడం ప్రారంభించాయి. ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న  ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్‌ని తిట్టడం ప్రారంభించాడు. అమెరికాలో వుండి బూతు పురాణాన్ని విప్పుతూ వుండే పంచ్ ప్రభాకర్‌ని అరెస్టు చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి, తాను  అమెరికాలో ఏ కలుగులో దాక్కుని వున్నా ఈడ్చుకుని వస్తారని భయపడినట్టున్నాడు... ఇప్పుడు జగన్‌ని తిట్టడం ప్రారంభించడం ద్వారా పంచ ప్రభాకర్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఆదివారం నాడు జగన్‌ని తిడుతూ పంచ్ ప్రభాకర్ ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో అతను జగన్‌ని ఉద్దేశించి మాట్లాడాడు.  ‘‘జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ నంబర్‌వన్. ప్రజల్లో కలియతిరిగేసి, ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్ చేరుకుని తలుపులు వేసుకున్నాడు. అది ఎందుకు అనేది చెప్పమనడం లేదు.. ఇది నిజం.. మనం అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఇది మనం హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా టెన్షన్లు ఉన్నాయి కదా.. మీ అందరికీ చెబుతున్నా.. నంబర్ 2 ఓవర్ యాక్షన్ ఆఫ్ బటన్ నొక్కుడు. చెప్పా.. అరేయ్... నువ్వు చేసే పని పదే పదే చెప్పొద్దు.. ఒకసారి చెబితే సరే అనుకుంటారు. రోజూ చెప్పేసరికి వీడు పెద్ద పిచ్చి తుగ్లక్ అనుకున్నారు. అదేవిధంగా, మాటమాటకీ బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటే, చాలామంది ప్రజలు ఆ మాటకు విసిగిపోయారు. ఎస్.. నువ్వే చెప్తావు కదా...  ఎడమ చేతితో దానం చేస్తే, కుడిచేతికి తెలియకూడదు.. కుడిచేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని.. అలాంటప్పుడు నువ్వు బటన్ నొక్కానన్న మాట పదేపదే ఎందుకు చెప్పావు? ఓకే.. నంబర్ త్రీ.. ఏం చేశాడు? కార్యకర్తలను పట్టించుకోలేదు. కోటరీలను మాత్రమే దగ్గరకి తీశాడు. వాళ్ళు ఏం చేసుకున్నారో మనకి తెలియదు. నిన్ను గుండెలలో పెట్టుకున్నవాళ్ళని నువ్వు పలకరించిన దాఖలాలు లేవు. నువ్వు  గెలిపించుకున్న ఎమ్మెల్యేలను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కదా...  వాళ్ళని ఎవరికో ఆఫీసులో సమ్ ఎక్స్.కి, గాలికి వదిలేశావ్. వాళ్ళు నానా పడిగాపులు కాసి, నిన్ను కలవలేక, నీకు చెప్పుకోలేక వెళ్ళిపోయేవారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా. వాళ్ళు నిన్ను మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు అడగలేదు. భుజకీర్తులు అడగలేదు. కనీసం మాట పలకరింపు అడిగారు. అదేదో నువ్వు ఒక్కడివే సత్య సాక్షాత్ హరిశ్చంద్రుడివన్న టైపులో...  ఓకే.. దట్స్ గుడ్.. నువ్వు, మీ నాన్న, నీఫ్యామిలీ, నీ కష్టం.. దాన్ని ఎవరూ శంకించడం లేదు. కానీ, ఏంటో.. ఎప్పటినుంచో, ఎన్నోసార్లు వేసిన వీడియోలు రీ క్యాప్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఏంటా అని. తర్వాత, నువ్వు పేదరికాన్ని రూపుమాపాలని అనుకున్నావుగానీ, పేదరికంలో నా ఎస్సీ, నా బీసీ, నా ఓసీ అనేవి వుండవు. పేదరికం పేదరికమే.. అన్నివర్గాల్లో పేదరికం వుంటుంది. అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, బలిజ కావచ్చు, కాపు కావచ్చు.. అందరిలో పేదరికం వుంటుంది.  కానీ, నువ్వు పదే పదే నొక్కి వక్కాణించావు చూడు.. ఐథింక్ అది ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. అంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎలక్షన్లు అయిపోయినాయి కదా.. ఇప్పుడు మనం మనం మాట్లాడుకోవడమే మంచిది. సో, ఏది ఏమైనాగానీ, జగన్మోహన్రెడ్డీ... నువ్వు గెలవాలనే నా కోరిక. నాకు అంతకంటే ఇంకేమీ లేదు. నువ్వు పది కాలాలపాటు ప్రజల్ని ఏలాలనే నా కోరిక.. కానీ, నిన్ను ఏకాలని, ఏకిపారేయాలనీ లేదు. కానీ, మనసులోని మాటలను చెప్పుకోవడం అనేదే నాకు చాలా సంతృప్తి. రాజకీయాల్లో నిన్ను మించిన వీరుణ్ణి నేను చూడలేదు. నువ్వే జగదేకవీరుడివి. సో గుడ్ లక్.. థాంక్యూ వెరీమచ్.. బైబై’’ అని పంచ్ ప్రభాకర్ తన వీడియో ముగించాడు.