‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’
posted on Jun 3, 2024 @ 4:29PM
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’ ఈ పదాన్ని మళ్ళీ వినడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి హోదా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అని ఫిక్సయిపోయింది. ఎందుకంటే, ఈ నిర్ణయాన్ని తీసుకుంది వాళ్ళే కదా.. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పోలీసులు అడక్కుండానే భద్రత పెంచారంటేన అసలు విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సోమవారం టీడీపీ ఏపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకు వందలాది మంది కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. అందరూ ‘సీఎం... సీఎం’ అంటూ నినదించారు. సందర్శకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయంలో సందడి నెలకొంది. సేమ్ టైమ్ మేమే గెలుస్తామని వైసీపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారుగానీ, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మాత్రం వెలవెలబోతోంది.