తెలంగాణ జిన్నా కేసీఆర్!

తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాక తప్పదని ఆయన అన్నారు. ఈ అంశంలో అన్ని విషయాలూ బయటపడుతున్నాయని, మే 26న ఎమిరేట్స్ విమానంలో హరీష్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్ళి వచ్చింది పరారీలో వున్న ప్రభాకరరావు ఇండియా రాకుండా ఆపడానికేనని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇదంతా కేసీఆర్ ప్లానింగ్ ప్రకారమే జరిగిందని ఆయన చెప్పారు. కేసీఆర్ తెలంగాణకు జిన్నాలా మారారని, కేసీఆర్‌తో స్నేహం చేసిన జగన్ చేసిన మోసం వల్ల కేసీఆర్ తెలంగాణను ఎండబెట్టారని కోమటిరెడ్డి చెప్పారు. తాను అమెరికా వెళ్ళలేదని ప్రమాణం చేయడానికి హరీష్ రావు సిద్ధమా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్ళి రావాల్సిన అవసరం హరీష్ రావుకి ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ని వదిలిపెట్టేది లేదని, ప్రభాకరరావు లొంగిపోయేలా కేసీఆర్ ఒప్పించాలని కోమటిరెడ్డి అన్నారు.

హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌కి బంధం నేటితో తెగిపోనుంది..

జూన్ 2, 2024న కొద్ది గంటల్లో హైదరాబాద్‌తో, తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వున్న బంధం తెగిపోనుంది. విభజన చట్టం ప్రకారం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్‌కి ఏమాత్రం సంబంధం లేని నగరంగా మారబోతోంది. 👉 2014 జూన్ 2 నుంచి నేటి వరకు 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్... 👉 ఈ రోజుతో, 1956లో ఏర్పడ్డ బంధం పూర్తిగా తెగిపోనుంది. 👉 1591 నుంచి నిజాం పాలనలో రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.... 👉 భాగ్యనగరంలో అద్భుత చారిత్రక కట్టడాలతో గోల్కొండ ఖిల్లా రాజ్యంగా  కొనసాగింది... 👉 జంట నగరాలు, మూసీ నది  పరవళ్ళతో 1769 నుంచి 1948 వరకూ  కొన్నాళ్ళు మొఘలుల పాలనలో... ఎక్కువ కాలం నిజాం పాలనలోనే హైదరాబాద్... 👉 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపారు. 👉 పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రులకి కర్నూలు రాజధానిగా నిర్ణయం జరిగింది. 👉 భాషా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలను కలిపి హైదరాబాద్‌ను రాజధానిగా చేయాలన్న దానిమీద అంగీకారం కుదిరింది. 👉 58 ఏళ్ల తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా రెండు ముక్కలు అయింది. చివరికి 2014 నుంచి  10 ఏళ్ల హక్కుని మాత్రమే సాధించుకున్న ఆంధ్రప్రదేశ్... 👉 ఐదేళ్ళపాటు తనను తాను నిర్మించుకునే ప్రయత్నంలో ఎన్నో అవరోధాలు. గత ఐదేళ్ళుగా ఏళ్లుగా విధ్వంసానికి గురై తనని తాను నిర్మించుకోలేక రాజకీయ గాయాలతో నలుగుతున్న ఆంధ్రప్రదేశ్... 👉 అభివృద్ధి సంగతి దేవుడెరుగు... కనీసం రాజధాని లేని రాష్ట్రంగా చులకన అయిపోయిన ఆంధ్రప్రదేశ్. 👉 రాష్ట్రం పట్ల ప్రేమ, నిబద్దత, నా రాష్ట్రం, నా ప్రజల అభివృద్ధి అనేది మరచి స్వార్థ రాజకీయాలు నడిపిన రాజకీయ నాయకులు... 👉 కేంద్ర సంస్థల కొరత, కొత్త కంపెనీల ఆశలు, ఇవన్నీ అందని ద్రాక్షలుగా ఎందుకు మారాయి? ఈ పాపం ఎవరిది? 👉 ప్రజాచైతన్యం కొరవడిందా, ప్రశ్నించే తత్వం సన్నగిల్లిందా... సరైన నాయకుల ఎంపిక లోపమయ్యిందా...? 👉 ఎన్నికల కోడ్ అడ్డమో... రాజకీయమే అడ్డమో... తెగిపోయే ఈ బంధంపై నోరువిప్పని నాయకులు... 👉 దశాబ్ది ఉత్సవాలతో సందడిగా తెలంగాణ. 👉 పదేళ్ళ తర్వాత కూడా అడుగు ముందుకు పడని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. 👉 ఆంధ్ర ప్రజల తెలివి తెలంగాణ ప్రజల తెలివి ముందు చిన్నబోయిందా...? 👉 విడిపోయి కలిసుందామన్న తెలంగాణ గొప్ప భావం నిలబడింది... 👉 విడిపోయి నిలబడగలం అన్న ఆంధ్రప్రదేశ్ ధైర్యం చిన్నబోయింది... 👉 ఆంధ్రప్రదేశ్ గాయాలను మాన్పే నాయకత్వం వస్తుందని ఆశిద్దాం..

ఎపిలో మరో మూడ్రోజుల్లో నైరుతి రుతు పవనాలు 

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి. మరో మూడ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇవాళ చిత్తూరు, కడప, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో  అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని... అదే సమయంలో విజయనగరం, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు, మన్యం, బాపట్ల, విశాఖ, గుంటూరు, అనకాపల్లి, ఎన్టీఆర్, కాకినాడ, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

పల్నాడు జిల్లాలో ఐదో తేదీ వరకు 144 సెక్షన్ , బంద్ 

ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.   ఎల్లుండి  కౌంటింగ్ నేపథ్యంలో, పల్నాడు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మలికా గార్గ్ అల్లర్లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుండగా... కౌంటింగ్ నేపథ్యంలో, నేటి సాయంత్రం నుంచి 5వ తేదీ వరకు జిల్లాలో బంద్ వాతావరణం కనిపించనుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, లాడ్జిలు, కల్యాణ మండపాలను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు.  కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో, పల్నాడు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడ చూసినా పోలీస్ సైరన్లు వినిపిస్తున్నాయి. పోలీసులు గ్రామగ్రామాల్లో తిరుగుతూ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా రౌడీ షీట్ తెరుస్తామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ రోజున నరసరావుపేటను అష్టదిగ్బంధనం చేయనున్నారు. నరసరావుపేటలో ప్రస్తుతం ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.   

తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ , రాహుల్

ప్రత్యేక తెలంగాణ బిల్లు  కాంగ్రెస్  పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.   తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, పదేళ్ల తెలంగాణ వేడుకల వేళ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదరసోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. దేశాభివృద్ధిలో తెలంగాణ అందించిన సహకారం ప్రతీ భారతీయుడికీ గర్వకారణమని చెప్పారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకత అని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. తెలంగాణ అమరులకు నివాళులు: రాహుల్ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. సమానత్వం, సమ న్యాయం, సాధికారత.. ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వివరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ లో బిజెపి ఘన విజయం

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. మార్చి 18న జరిగిన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్ కేఎం) మెజారిటీ మార్కును ఇప్పటికే దాటేశాయని ఈసీ వెల్లడించింది. సిక్కింలో మరోసారి ఎస్ కేఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 18 స్థానాల్లో ఎస్ కేఎం అభ్యర్థులు గెలుపొందగా.. మరో 13 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఫలితాల్లో కనిపిస్తోంది.

నేటి అర్ధ రాత్రి నుంచి పెరగనున్న టోల్ చార్జీలు 

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్లు తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఎగ్జిట్ పోల్స్ పై తొలిసారి స్పందించిన పికె

ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు  నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తొలిసారి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ దాదాపుగా ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌లో ఓ పోస్టును షేర్ చేసిన ప్రశాంత్ కిశోర్.. ‘‘వచ్చేసారి రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు పనికిమాలిన చర్చలు, ఫేక్ జర్నలిస్టులు, పెద్ద నోరేసుకుని పడిపోయే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్ మీడియా నిపుణుల విశ్లేషణల్లో దూరి మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు’’ అని సూచించారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఎన్డీయేకు 361 నుంచి 401 సీట్ల వరకు వస్తాయని ఇండియా టుడే-మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇండియా కూటమి 131 నుంచి 166 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చి చెప్పింది.  ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే విషయం చెప్పారు. 2019 ఫలితాలు రిపీట్ అవుతాయని పేర్కొన్నారు. అయితే, 400 మార్క్ దాటడం కష్టమని తేల్చి చెప్పారు. బీజేపీకి 270 సీట్లు కూడా రావని అందరూ అనుకుంటున్నదని తప్పదని, 370 సీట్లకు పైనే గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పీకే ఇలా స్పందించారు.

ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్ 

నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.  మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 109 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ విజయం సాధించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 28 న పోలింగ్ నిర్వహించారు. ఆదివారం మహబూబ్ నగర్ లోని జూనియర్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఐదు టేబుళ్లపై ప్రారంభమైన కౌంటింగ్.. పది గంటలకు ముగిసినట్లు సమాచారం. కాగా, ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తంగా 1,439 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు మినహా అందరూ ఓటేశారు. వీటిలో చెల్లని ఓట్లు 21, మిగతా వాటిలో 762 ఓట్లు నవీన్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. కాగా, నవీన్ రెడ్డి విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. హరీశ్ రావు అభినందన నవీన్ కుమార్ కు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఆయన గెలుపుకు కృషి చేసిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.  

చంద్రబాబు రికార్డు.. శానా కాలం యాదుంటాది!

నారా చంద్రబాబునాయుడు ప్రజలకు కష్టాలలోనూ, సంక్షోభంలోనూ గుర్తుకు వచ్చే నేత. కష్టాల నుంచీ, సంక్షోభం నుంచీ తన దార్శనికతతో రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడిగా ఏపీ ప్రజలు నమ్మే నేత చంద్రబాబునాయుడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా విశ్వసనీయతను చూరగొన్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ అధికారంలో కన్నా విపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నారు. ఔను ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే.. విపక్ష నేతగా 15 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడ్డారు.  సహజంగా ఎవరికైనా వయసు ముందుకు సాగుతుంది, వృధ్యాప్యం వైపు అడుగులు వేస్తుంది, కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో వయసు వెనక్కి, యవ్వనం వైపుకు అడుగులు వేస్తోందా అనిపించేలా, వయసు పెరిగే కొద్దీ ఆయన కొత్త శక్తిని పూనుకుని మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.    అవును, 74 ఏళ్ల వయస్సులో   ఆయనలో ఎక్కడ వార్ధక్యపు ఛాయలు కన్పించడంలేదు.   చంద్రబాబు నాయుడు నడకలో, నడతలో, ఆలోచనలలో ఎక్కడా అలసట అనేదే కనిపించదు. అందుకే  రాజకీయ రణక్షేతంలో అలుపెరగని యోదునిలా ముందుకు దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో  వైసేపీ అరాచక పాలనను అంతమొందించేందుకు తెలుగు దేశం సారధిగా శంఖారావాన్ని పూరించారు.  తెలుగుదేశం పార్టీకి ముందుండి నడిచారు. నడిపించారు.  వై నాట్ 175 అంటూ విర్రవీగిన జగన్ మోహన్ రెడ్డికి ఓన్లీ 14 ఫర్ యూ అని చాటడమే కాదు.. వై నాట్ పులివెందుల అని సవాల్ విసిరారు.  మే 13న పోలింగ్ జరిగిన వెంటనే వైసీపీ పరాజయాన్ని జనం ఖరారు చేసేశారన్న విషయం అందరికీ తెలిసిపోయింది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ తరువాత ఇంకా ఎవరిలోనైనా వైసీపీ విజయంపై మిగిలిన ఉన్న దింపుడు కళ్లెం ఆశలు కూడా అణగారిపోయాయి. జూన్ 4న వెలువడే ఫలితం ఎలా ఉంటుందో స్పష్టత వచ్చేసింది. గడచిన నాలుగు దశాబ్దాల అవిభక్త ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్ర రాజకీయ చరిత్ర నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ, జీవిత చరిత్ర వేరు చేయడం కుదిరే వ్యహారం కాదు. ముఖ్యంగా 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి మొదలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు రాజకీయ ప్రత్యర్ధులు అనేక మంది వచ్చి వెళ్ళారు. చరిత్రకే పరిమితమయ్యారు. కానీ, చంద్రబాబు నాయుడు, చరిత్ర సాక్షిగా తిరుగులేని నాయకునిగా, ఇటు ముఖ్యమంత్రిగా అటు ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రలో అత్యధిక కాలం సేవలు అధించిన  ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, సేవలు అందించారు. రాష్ట్ర విభజనకు ముందు తర్వాత  కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఏకైక నాయకుడుగానూ చంద్రబాబు నాయుడు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2019 నుంచి ప్రతిపక్ష నేతగా అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నిఖార్సైన్ రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనంగా ఉన్నారు. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. జగన్ ప్రభుత్వ దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలిచారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తూ ధైర్యం నింపారు.  కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా, దార్శనికుడిగా ప్రజల మనస్సుల్లో సుస్థిరంగా నిలిచారు. కష్టంలో ఆదుకునేందుకు నేనున్నానంటూ ముందుకు నడిచే నేతగా చెరగని ముద్ర వేసుకున్నారు.  చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ పార్టీని విజయవంతంగా నడిపించడమే కాకుండా ప్రతిపక్షంలో ఉండి అత్యధిక కాలం పాలించిన చరిత్రలో నిలిచిపోతారు. ఎగ్జిట్ పోల్స్లాగే .. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు తెలుగుదేశం ఘన విజయాన్ని చాటితే.. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తొలి తెలుగు ముఖ్యమంత్రిగా మరో చరిత్ర సృష్టిస్తారు. ఈ రికార్డు శానా కాలం యాదుంటాది.  

‘తెలుగువన్’ సర్వే: కూటమికే ప్రజల ఓటు!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికే పట్టం కట్టారని ‘తెలుగువన్’ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.  175 ఎమ్మెల్యే స్థానాల్లో కూటమికి 144 స్థానాలు, వైసీపీకి 31 స్థానాలు దక్కనున్నాయి. అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమికి 20 స్థానాలు, వైసీపీకి 5 స్థానాలు దక్కుతాయని ‘తెలుగువన్’ చేసిన ఎగ్జిట్‌ పోల్‌లో తేటతెల్లమైంది. పార్లమెంట్ నియోజకవర్గాలు హిందూపూర్ (కూటమి), అనంతపురం (కూటమి), కర్నూలు (వైసీపీ), నంద్యాల (వైసీపీ), కడప (వైసీపీ), రాజంపేట (వైసీపీ), చిత్తూరు (కూటమి), తిరుపతి (కూటమి),  నెల్లూరు (కూటమి), ఒంగోలు (కూటమి), బాపట్ల (కూటమి), నర్సరావుపేట (కూటమి),  గుంటూరు (కూటమి), విజయవాడ (కూటమి), మచిలీపట్నం (కూటమి), ఏలూరు (కూటమి), నర్సాపూర్ (కూటమి), అమలాపురం (కూటమి), రాజమండ్రి (కూటమి), కాకినాడ (కూటమి),   అనకాపల్లి (కూటమి), విశాఖపట్నం (కూటమి), అరకు (వైసీపీ), విజయనగరం (కూటమి), శ్రీకాకుళం (కూటమి). అసెంబ్లీ నియోజకవర్గాలు రాప్తాడు (కూటమి), మడకశిర (ఎస్సీ) (వైసీపీ), హిందూపూర్ (కూటమి), పెనుకొండ (కూటమి), పుట్టపర్తి (కూటమి), ధర్మవరం (కూటమి), కదిరి (కూటమి). రాయదుర్గం (కూటమి), ఉరవకొండ (కూటమి), గుంతకల్ (కూటమి), తాడిపత్రి (కూటమి), సింగనమల (ఎస్సీ) (వైసీపీ), అనంతపురం (కూటమి), కళ్యాణదుర్గం (కూటమి). కర్నూలు (కూటమి), పత్తికొండ (కూటమి), కోడుమూరు (ఎస్సీ) (వైసీపీ), ఎమ్మిగనూరు (కూటమి), మంత్రాలయం (వైసీపీ), ఆదోని (వైసీపీ), ఆలూర్ (వైసీపీ). ఆళ్ళగడ్డ (కూటమి), శ్రీశైలం (కూటమి), నందికొట్కూరు (ఎస్సీ (వైసీపీ), పాణ్యం (వైసీపీ), నంద్యాల (వైసీపీ), బనగానపల్లె (కూటమి), డోన్ (కూటమి). బద్వేల్ (ఎస్సీ) (వైసీపీ), కడప (కూటమి), పులివెందుల (వైసీపీ), కమలాపురం (వైసీపీ), జమ్మలమడుగు (కూటమి), ప్రొద్దుటూరు (వైసీపీ), మైదుకూరు (కూటమి). రాజంపేట (కూటమి), కోడూరు (ఎస్సీ) (వైసీపీ), రాయచోటి (వైసీపీ), తంబళ్ళపల్లె (వైసీపీ), పీలేరు (కూటమి), మదనపల్లె (కూటమి), పుంగనూరు (వైసీపీ). చంద్రగిరి (కూటమి), నగరి (కూటమి), గంగాధర నెల్లూరు (ఎస్సీ) (వైసీపీ), చిత్తూరు (కూటమి), పూతలపట్టు (ఎస్సీ) (కూటమి), పలమనేరు (కూటమి), కుప్పం (కూటమి). సర్వేపల్లి (కూటమి), గూడూరు (ఎస్సీ) (కూటమి), సూళ్ళూరుపేట (ఎస్సీ ) (వైసీపీ), వెంకటగిరి (కూటమి), తిరుపతి (కూటమి), శ్రీకాళహస్తి (కూటమి), సత్యవేడు (ఎస్సీ) (వైసీపీ). కందుకూరు (కూటమి), కావలి (కూటమి), ఆత్మకూర్ (కూటమి), కోవూరు (కూటమి), నెల్లూరు సిటీ (కూటమి), నెల్లూరు రూరల్ (కూటమి), ఉదయగిరి (కూటమి). యర్రగొండపాలెం (వైసీపీ), దర్శి (కూటమి), ఒంగోలు (కూటమి), కొండపి (కూటమి), మార్కాపురం (కూటమి), గిద్దలూరు (కూటమి), కనిగిరి (కూటమి). వేమూరు (కూటమి), రేపల్లె (కూటమి), బాపట్ల (వైసీపీ), పర్చూరు (కూటమి), అద్దంకి (కూటమి), చీరాల (వైసీపీ), సంతనూతలపాడు (కూటమి). పెదకూరపాడు (కూటమి), చిలకలూరిపేట (కూటమి), నరసరావుపేట (వైసీపీ), సత్తెనపల్లి (కూటమి), వినుకొండ (కూటమి), గురజాల (కూటమి), మాచర్ల (కూటమి). తాడికొండ (ఎస్సీ) (కూటమి), మంగళగిరి (కూటమి), పొన్నూరు (కూటమి), తెనాలి (కూటమి), ప్రత్తిపాడు (ఎస్సీ) (కూటమి), గుంటూరు పశ్చిమ (కూటమి), గుంటూరు తూర్పు (కూటమి). తిరువూరు (ఎస్సీ) (వైసీపీ), విజయవాడ పశ్చిమ (కూటమి), విజయవాడ సెంట్రల్ (కూటమి), విజయవాడ తూర్పు (కూటమి), మైలవరం (కూటమి), నందిగామ (కూటమి), జగ్గయ్యపేట (కూటమి). గన్నవరం (కూటమి), గుడివాడ (కూటమి), పెడన (కూటమి), మచిలీపట్నం (కూటమి), అవనిగడ్డ (కూటమి), పెనమలూరు (కూటమి), పామర్రు (కూటమి). ఉంగుటూరు (కూటమి), దెందులూరు (కూటమి), ఏలూరు (కూటమి), పోలవరం (వైసీపీ), చింతలపూడి (ఎస్సీ) (కూటమి), నూజివీడు (కూటమి), కైకలూరు (కూటమి). ఆచంట (కూటమి), పాలకొల్లు (కూటమి), నరసాపురం (కూటమి), భీమవరం (కూటమి), ఉండి (కూటమి), తణుకు (కూటమి), తాడేపల్లిగూడెం (కూటమి). రామచంద్రపురం (కూటమి), ముమ్మిడివరం (కూటమి), అమలాపురం (ఎస్సీ) (కూటమి), రాజోలు (ఎస్సీ) (కూటమి), పి.గన్నవరం (ఎస్సీ) (కూటమి), కొత్తపేట (కూటమి), మండపేట (కూటమి). అనపర్తి (కూటమి), రాజానగరం (కూటమి), రాజమహేంద్రవరం సిటీ (కూటమి), రాజమహేంద్రవరం రూరల్ (కూటమి), కొవ్వూరు (ఎస్సీ) (కూటమి), నిడదవోలు (కూటమి), గోపాలపురం (ఎస్సీ) (కూటమి). తుని (కూటమి), ప్రత్తిపాడు (కూటమి), పిఠాపురం (కూటమి), కాకినాడ రూరల్ (కూటమి), పెద్దాపురం (కూటమి), కాకినాడ సిటీ (కూటమి), జగ్గంపేట (కూటమి). చోడవరం (కూటమి), మాడుగుల (కూటమి), అనకాపల్లి (కూటమి), పెందుర్తి (కూటమి), ఎలమంచిలి (కూటమి), పాయకరావుపేట (కూటమి), నర్సీపట్నం (కూటమి). శృంగవరపుకోట (కూటమి), భీమిలి (కూటమి), విశాఖ తూర్పు (కూటమి), విశాఖ దక్షిణం (కూటమి), విశాఖ ఉత్తరం (కూటమి), విశాఖ పశ్చిమం (కూటమి), గాజువాక (కూటమి). పాలకొండ (ఎస్టీ) (కూటమి), కురుపాం (ఎస్టీ) (వైసీపీ), పార్వతీపురం (ఎస్సీ) (వైసీపీ), సాలూరు (ఎస్టీ) (కూటమి), అరకులోయ (ఎస్టీ) (కూటమి), పాడేరు (ఎస్టీ) (కూటమి), రంపచోడవరం (ఎస్టీ) (వైసీపీ). ఎచ్చెర్ల (కూటమి), రాజాం (ఎస్సీ) (కూటమి), బొబ్బిలి (కూటమి), చీపురుపల్లి (వైసీపీ), గజపతినగరం (కూటమి), నెల్లిమర్ల (కూటమి), విజయనగరం (కూటమి). ఇచ్ఛాపురం (కూటమి), టెక్కలి (కూటమి), పలాస (కూటమి), పాతపట్నం (కూటమి), ఆమదాలవలస (కూటమి), శ్రీకాకుళం (కూటమి), నరసన్నపేట (కూటమి). ఓట్ల శాతం ఎన్డీయే కూటమి = 52 శాతం వైసీపీ = 41 శాతం ఇండియా కూటమి= 4 శాతం ఇతరులు = 3 శాతం

కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఔట్‌.. తేల్చేసిన ఎగ్జిట్‌పోల్స్‌

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వ‌స్తుంది?  గెలిచే అభ్య‌ర్థులు ఎవ‌రు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవ‌రు? అనే ఉత్కంఠ‌ ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రిలో నెల‌కొంది. ఏపీలో మే13న 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 82శాతం పోలింగ్ న‌మోదైంది. దాదాపు 300 పోలింగ్ కేంద్రాల్లో అర్థ‌రాత్రి 2గంట‌ల వ‌ర‌కు ఓటింగ్ జ‌రిగింది. భారీగా ఓటింగ్ జ‌ర‌గ‌డంతో ఎవ‌రికి లాభం చేకూరుతుంద‌నే విష‌యంలో ఇరు పార్టీల నేత‌లు టెన్ష‌న్ ప‌డుతున్నారు. అయితే, భారీ ఓటింగ్ అధికార పార్టీ వైసీపీ ఓట‌మికి కార‌ణం కాబోతుంద‌న్న చ‌ర్చ ప్ర‌ధానంగా జ‌రుగుతోంది. తాజాగా వెల్ల‌డైన ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేలు సైతం అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి.  మూడు, నాలుగు ఎగ్జిట్ పోల్స్ మిన‌హా మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల్లో తెలుగుదేశం కూట‌మి ఘన విజయం సాధించి అధికారంలోకి రాబోతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఇది తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఐదేళ్ల అవిశ్రాంత పోరాటానికి తగిన ఫలితం రాబోతోందన్న ధీమా వారిలో వ్యక్తం అవుతోంది. అంతకు మించి తెలుగుదేశం శ్రేణులలో ఉత్సాహంతో ఉరకలేసేలా చేస్తున్నదేంటంటే  గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, గుడివాడ‌లో కొడాలి నాని, న‌గ‌రిలో ఆర్కే రోజా, స‌త్తెన‌ప‌ల్లిలో అంబ‌టి రాంబాబు   ఓట‌మి పాల‌వుతున్న‌ట్లు అన్ని సర్వేలూ విస్పష్టంగా తేల్చి చెప్పేయడం.  2019 ఎన్నిక‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే   వైసీపీ అధికారంలోకి రావ‌డంతో కొద్దిరోజుల‌కే గోడదూకి జగన్ పార్టీలో చేరిపోయారు. వైసీపీలోకి వెళ్లిన వంశీ త‌న నోరుకు  అదుపులో ఉంచుకోకుండా చంద్ర‌బాబు, నారా లోకేశ్ పై ఇష్టారీతిలో మాట్లాడారు. దీనికితోడు చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిని అవ‌మానించేలా వ్యాఖ్య‌లు చేశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు వంశీ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.  వ‌ల్ల‌భ‌నేని వంశీని ఓడించేందుకు టీడీపీ నేత‌లు తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు. అన్ని వర్గాల ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌ట్టుకొని వంశీ ఓట‌మికి కృషి చేశారు. ఫ‌లితంగా ప్ర‌స్తుతం వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓడిపోతున్నారని ప‌లు స‌ర్వేలు తేల్చిచెప్ప‌డంతో టీడీపీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రో వైపు కొడాలి నానిసైతం ఈ ఎన్నిక‌లో ఓడిపోతున్నాడ‌ని ప‌లు స‌ర్వే సంస్థ‌లు స్స‌ష్టం చేశాయి. గుడివాడ నుంచి విజ‌యం సాధించిన కొడాలి నాని గ‌త ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు, నారా లోకేశ్‌, నంద‌మూరి కుటుంబాల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో కొడాలి నానిని ఓడించేందుకు తెలుగుదేశం నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకొని కూట‌మి అభ్య‌ర్థి విజ‌యానికి అహ‌ర్నిశ‌లు కృషి చేశారు. తాజాగా వెల్ల‌డైన స‌ర్వే ఫ‌లితాల్లో కొడాలి నాని ఓడిపోతున్నారని తేలింది. దీంతో ఇద్ద‌రు బూతుల నేత‌లు అసెంబ్లీలో అడుగుపెట్టే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.  వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానితో పాటు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రోజా సైతం ఓడిపోతున్నార‌ని స‌ర్వే సంస్థ‌లు తేల్చిచెప్పాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ జగన్  క్యాబినెట్ లో మంత్రులందరిదీ  ఓటమి బాటేనని అంచనా వేశాయి.  స‌త్తెన‌ప‌ల్లి నుంచి అంబ‌టి రాయుడు, ప‌లాస నుంచి సిదిరి అప్ప‌రాజు,  శ్రీ‌కాకుళం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు, గాజువాక నుంచి పోటీచేసిన గుడివాడ‌ అమ‌ర్నాద్, త‌ణుకు నుంచి పోటీ చేసిన‌ కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి పోటీ చేసిన  చెల్లుబోయిన వేణుగోపాల్ రావు, తాడేప‌ల్లి గూడెం నుంచి పోటీ చేసిన కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, పెన‌మ‌లూరు నుంచి పోటీచేసిన  జోగి ర‌మేష్ , గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేస్తున్న విడుద‌ల ర‌జ‌ని, సంత‌నూత‌లపాడు నుంచి పోటీ చేస్తున్న మేరుగ నాగార్జున, అలాగే ఆదిమూల‌పు సురేష్‌, ఉష‌శ్రీ చ‌ర‌ణ్ తోపాటు ప‌లువురు వైసీపీ అభ్య‌ర్థులు ఓడిపోతార‌ని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.   మొత్తానికి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర ఓట‌మి త‌ప్ప‌ద‌ని స‌ర్వే సంస్థ‌లు చెప్ప‌డంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఇది ముందుగానే ఊహించిన వైసీపీ అధిష్టానం కొన్ని స‌ర్వే సంస్థ‌ల‌ను ప్రలోభాలకు గురి చేసి చేసి త‌మ‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేలా మేనేజ్ చేసుకుందని, మొత్తానికి వైసీపీ సినిమా అయిపోయిందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కదు.. వైసీపీకి వణుకుపుట్టిస్తున్న కేకే ఎగ్జిట్ పోల్ ఫలితం

 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి.. మ‌రోసారి సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేస్తారా..? చంద్ర‌బాబు సీఎం సీటును అదిరోహించ‌బోతున్నారా?  ఓట‌ర్లు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇచ్చారు..? అనే విష‌యాల‌పై ఏపీ ప్ర‌జ‌ల్లోనేకాదు.. దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌నెల‌కొంది. గ‌తంకంటే ఎక్కువ స్థానాల్లో మా పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని వైసీపీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తుండ‌గా.. కూట‌మి అధికారంలోకి రావ‌డం ప‌క్కా అంటూ టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు చెబుతున్నారు.  అయితే, వీరిలో ఎవ‌రు అధికార పీఠాన్ని ద‌క్కించుకోబోతున్నారు అనే విష‌యాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌ల‌న్నీ కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాయి. 100 నుంచి 140 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని ప‌లు స‌ర్వేలు స్ప‌ష్టం చేశాయి. అయితే  కేకే స‌ర్వే సంస్థ వెల్ల‌డించిన ఫ‌లితాలు వైసీపీ నేత‌లకు ద‌డ‌పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీకి ఈ ఎన్నిక‌ల్లో ఘోర‌ ప‌రాభ‌వం ఎదురు కాబోతున్నద‌ని కేకే స‌ర్వే తేల్చిచెప్పింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కేకే సర్వే తేల్చేసింది. కేకే సర్వే  ఫ‌లితాలపై ఏపీ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం ఎక్కువ‌. ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ 150 నియోజ‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని కేకే స‌ర్వే సంస్థ చెప్పింది. ఆ స‌మ‌యంలో వైసీపీ నేత‌లు సైతం అంత‌ రావంటూ ఎగ‌తాళి  చేశారు. కానీ, కేకే స‌ర్వే సంస్థ చెప్పిన‌ట్లుగానే ఫ‌లితాలు ప‌క్కాగా దిగిపోయాయి.  కేకే స‌ర్వే వెల్ల‌డించిన ఫ‌లితాల ప్ర‌కారం.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల్లో 161 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌నున్నారు. వీరిలో టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల‌కు గానూ 133 స్ధానాలలో, జ‌న‌సేన 21 స్థానాల‌కు 21లోనూ , బీజేపీ పోటీ చేఃసిన 10 స్థానాల‌కు ఏడు స్థానాల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌నుంది. ఇక అధికార వైసీపీ అభ్య‌ర్థులు కేవ‌లం 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే విజ‌యం సాధిస్తార‌ని కేకే స‌ర్వే పేర్కొంది. దీనికి తోడు శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, ప‌శ్చిమ గోదారి, కృష్ణా, గుంటూరు, అనంత‌పురం జిల్లాల్లో కూట‌మి క్లీన్ స్వీప్ చేయ‌బోతుంద‌ని కేకే స‌ర్వే వెల్ల‌డించింది. లోక్‌స‌భ స్థానాల విష‌యానికి వస్తే రాష్ట్రంలోని  పాతిక  లోక్ స‌భ స్థానాలనూ తెలుగుదేశం  కూట‌మే గెలుచుకోనుందని కేకే స‌ర్వే  పేర్కొంది.  వైసీపీ , టీడీపీ కూట‌మికి కులాల‌ వారిగా పోలైన ఓట్ల వివ‌రాలు కేకే సర్వే ప్రకారం ఇలా ఉన్నాయి.. ఎస్సీ (వైసీపీకి 80శాతం, కూట‌మికి 20శాతం), ఎస్టీ (వైసీపీకి 70శాతం, కూట‌మికి 30శాతం), ముస్లిం (వైసీపీకి 70శాతం, కూట‌మికి 30శాతం), క్రైస్త‌వులు (వైసీపీకి 80శాతం, కూట‌మికి 20శాతం), కాపు (వైసీపీకి 10శాతం, కూట‌మికి 90శాతం), క‌మ్మ (వైసీపీకి 10శాతం, కూట‌మికి 90శాతం), క్ష‌త్రియ (వైసీపీకి 10శాతం, కూట‌మికి 90శాతం), బీసీ (వైసీపీకి 40శాతం, కూట‌మికి 60శాతం), రెడ్డి (వైసీపీకి 30శాతం, కూట‌మికి 70శాతం), వైశ్య (వైసీపీ 20శాతం, కూట‌మి 80శాతం), బ్రాహ్మ‌ణ (వైసీపీకి 10శాతం, కూట‌మికి 90శాతం) ఓట్లు పోల‌య్యాయి.  కేకే స‌ర్వే ప్రకారం రాష్ట్రంలోని 13 ఉమ్మడి ల్లాల‌ వారిగా  తెలుగుదేశం కూటమి   గెలిచే స్థానాల స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి...   శ్రీ‌కాకుళం  జిల్లాలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. ఆ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధిస్తారు.  ఇఖ విజ‌య‌న‌గ‌రం జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో తొమ్మిది నియ‌జ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తారు.  విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలో 15 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌బోతున్నారు.  తూర్పుగోదావ‌రి జిల్లాలో 19 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇందులో కూట‌మి అభ్య‌ర్థులు 18 నియోజ‌క‌వ‌ర్గాల్లో, వైసీపీ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం సాధించ‌నుంది.  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 15 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండగా ఆ  15 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తారు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. అలాగే కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదు. కృష్టా జిల్లాలో 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారు. గుంటూరులో కూడా అదే పరిస్థితి. గుంటూరు జిల్లాలో 17 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. మొత్తం  17నియోజ‌క‌ వ‌ర్గాల్లోనూ కూట‌మి అభ్య‌ర్థులదే విజయం అని కేకే సర్వే పేర్కొంది.   ప్ర‌కాశం జిల్లాలో 12 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండగా వాటిలో 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధిస్తారు.  ఇక నెల్లూరు జిల్లాలో 10 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారు.   చిత్తూరు జిల్లాలో 14 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వాటిలో 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారు.  అనంత‌పురం జిల్లాలో 14 నియోక‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌నున్నారు.  క‌డ‌ప జిల్లాలో 10 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారు.  క‌ర్నూల్ జిల్లాలో 14 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారు.

పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీకి షాక్: కేసు కొట్టేసిన కోర్టు

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా జగన్ పార్టీకి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. సీఈసీ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్‌కి సంబంధించిన ‘ఫారం - 13’ మీద అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీల్ లేకపోయినా పర్లేదు. ఆ అధికారం సంతకం వుంటే చాలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ ఏపీ హైకోర్టులో దావా వేసింది. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన కోర్టు తీర్పులను ఉదహరిస్తూ, వైసీపీ పిటిషన్‌ని కొట్టేసింది.

మళ్లీ మోడీ సర్కారే.. తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 4న ఫలితాలు అధికారికంగా వెలువడతాయి. అయితే ప్రజా నాడి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ దోహదం చేస్తాయి. సో..  మొత్తం లోక్ సభ స్థానాలు 543 స్థానాలకు గాను ఏ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న దానిపై వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే  మోడీ సర్కార్ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమని తోచక మానదు. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుచుకునే స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి.  జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ బీజేపీ కూటమి 362-392 కాంగ్రెస్ కూటమి 141-161 ఇతరులు 10-20 న్యూస్ నేషన్... బీజేపీ కూటమి 340-378 కాంగ్రెస్ కూటమి 153-169 ఇతరులు 21-23 టైమ్స్ నౌ... బీజేపీ కూటమి 353-368 కాంగ్రెస్ కూటమి 118-133 ఇతరులు 43-48 ఇండియా న్యూస్- డీ డైనమిక్స్... బీజేపీ కూటమి- 371 కాంగ్రెస్ కూటమి- 125 ఇతరులు- 47 రిపబ్లిక్-పీ మార్క్... బీజేపీ కూటమి- 359 కాంగ్రెస్ కూటమి- 154 ఇతరులు- 30 రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్... బీజేపీ కూటమి 353-368 కాంగ్రెస్ కూటమి 118-133 ఇతరులు 43-48 దైనిక్ భాస్కర్... బీజేపీ కూటమి 281-350 కాంగ్రెస్ కూటమి 145-201 ఇతరులు 33-49