చిప్పకూడు నంబర్-1 సజ్జల
posted on Jun 3, 2024 @ 2:44PM
వైసీపీ నాయకులు ఐదేళ్ళలో తాము చేసిన పాపాలకు పరిహారం పొందాల్సిన సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయంలా కనిపిస్తోంది. అలా చిప్పకూడు తినే వైసీపీ నాయకులలో మొట్టమొదటి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వుండబోతున్నారు. ఈ అరుదైన అవకాశం పొందబోతున్న సజ్జలకు అభినందనలు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రెచ్చిపోండి అంటూ సజ్జల చేసిన కామెంట్ల విషయంలో ఈసీ సీరియస్ అయి, సజ్జల మీద క్రిమినల్ కేసు బుక్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కౌంటింగ్ అయిన మర్నాడే.. అంటే బుధవారం నాడు సజ్జల పోలీసు విచారణకు హాజరు కావలసి వుంది. పోలీసు విచారణకు హాజరైన సజ్జలను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. సజ్జల తర్వాత మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిప్పకూడు తినడానికి క్యూలో వున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద జైల్లో పడటానికి చాలా పెద్ద క్యూనే వున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ‘ఖైదీ నంబర్ వన్’ హోదా పొందబోతున్న సజ్జల రామకృష్ణారెడ్డికి అభినందనలు.