జగన్‌ని తిట్టిపోసిన ‘పంచ్ ప్రభాకర్’!
posted on Jun 2, 2024 @ 8:19PM
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మెల్లగా తమ ప్రభావాన్ని చూపించడం ప్రారంభించాయి. ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్‌ని తిట్టడం ప్రారంభించాడు. అమెరికాలో వుండి బూతు పురాణాన్ని విప్పుతూ వుండే పంచ్ ప్రభాకర్‌ని అరెస్టు చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి, తాను అమెరికాలో ఏ కలుగులో దాక్కుని వున్నా ఈడ్చుకుని వస్తారని భయపడినట్టున్నాడు... ఇప్పుడు జగన్‌ని తిట్టడం ప్రారంభించడం ద్వారా పంచ ప్రభాకర్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఆదివారం నాడు జగన్‌ని తిడుతూ పంచ్ ప్రభాకర్ ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో అతను జగన్‌ని ఉద్దేశించి మాట్లాడాడు.
‘‘జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ నంబర్‌వన్. ప్రజల్లో కలియతిరిగేసి, ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్ చేరుకుని తలుపులు వేసుకున్నాడు. అది ఎందుకు అనేది చెప్పమనడం లేదు.. ఇది నిజం.. మనం అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఇది మనం హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా టెన్షన్లు ఉన్నాయి కదా.. మీ అందరికీ చెబుతున్నా.. నంబర్ 2 ఓవర్ యాక్షన్ ఆఫ్ బటన్ నొక్కుడు. చెప్పా.. అరేయ్... నువ్వు చేసే పని పదే పదే చెప్పొద్దు.. ఒకసారి చెబితే సరే అనుకుంటారు. రోజూ చెప్పేసరికి వీడు పెద్ద పిచ్చి తుగ్లక్ అనుకున్నారు. అదేవిధంగా, మాటమాటకీ బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటే, చాలామంది ప్రజలు ఆ మాటకు విసిగిపోయారు. ఎస్.. నువ్వే చెప్తావు కదా... ఎడమ చేతితో దానం చేస్తే, కుడిచేతికి తెలియకూడదు.. కుడిచేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని.. అలాంటప్పుడు నువ్వు బటన్ నొక్కానన్న మాట పదేపదే ఎందుకు చెప్పావు? ఓకే.. నంబర్ త్రీ.. ఏం చేశాడు? కార్యకర్తలను పట్టించుకోలేదు. కోటరీలను మాత్రమే దగ్గరకి తీశాడు. వాళ్ళు ఏం చేసుకున్నారో మనకి తెలియదు. నిన్ను గుండెలలో పెట్టుకున్నవాళ్ళని నువ్వు పలకరించిన దాఖలాలు లేవు. నువ్వు గెలిపించుకున్న ఎమ్మెల్యేలను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కదా... వాళ్ళని ఎవరికో ఆఫీసులో సమ్ ఎక్స్.కి, గాలికి వదిలేశావ్. వాళ్ళు నానా పడిగాపులు కాసి, నిన్ను కలవలేక, నీకు చెప్పుకోలేక వెళ్ళిపోయేవారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా. వాళ్ళు నిన్ను మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు అడగలేదు. భుజకీర్తులు అడగలేదు. కనీసం మాట పలకరింపు అడిగారు. అదేదో నువ్వు ఒక్కడివే సత్య సాక్షాత్ హరిశ్చంద్రుడివన్న టైపులో... ఓకే.. దట్స్ గుడ్.. నువ్వు, మీ నాన్న, నీఫ్యామిలీ, నీ కష్టం.. దాన్ని ఎవరూ శంకించడం లేదు. కానీ, ఏంటో.. ఎప్పటినుంచో, ఎన్నోసార్లు వేసిన వీడియోలు రీ క్యాప్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఏంటా అని. తర్వాత, నువ్వు పేదరికాన్ని రూపుమాపాలని అనుకున్నావుగానీ, పేదరికంలో నా ఎస్సీ, నా బీసీ, నా ఓసీ అనేవి వుండవు. పేదరికం పేదరికమే.. అన్నివర్గాల్లో పేదరికం వుంటుంది. అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, బలిజ కావచ్చు, కాపు కావచ్చు.. అందరిలో పేదరికం వుంటుంది. కానీ, నువ్వు పదే పదే నొక్కి వక్కాణించావు చూడు.. ఐథింక్ అది ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. అంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎలక్షన్లు అయిపోయినాయి కదా.. ఇప్పుడు మనం మనం మాట్లాడుకోవడమే మంచిది. సో, ఏది ఏమైనాగానీ, జగన్మోహన్రెడ్డీ... నువ్వు గెలవాలనే నా కోరిక. నాకు అంతకంటే ఇంకేమీ లేదు. నువ్వు పది కాలాలపాటు ప్రజల్ని ఏలాలనే నా కోరిక.. కానీ, నిన్ను ఏకాలని, ఏకిపారేయాలనీ లేదు. కానీ, మనసులోని మాటలను చెప్పుకోవడం అనేదే నాకు చాలా సంతృప్తి. రాజకీయాల్లో నిన్ను మించిన వీరుణ్ణి నేను చూడలేదు. నువ్వే జగదేకవీరుడివి. సో గుడ్ లక్.. థాంక్యూ వెరీమచ్.. బైబై’’ అని పంచ్ ప్రభాకర్ తన వీడియో ముగించాడు.