పవన్, లోకేష్ ముందంజ

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందంజలో ఉన్నారు. తిరువూరులో కొలికిపూడి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. మంగళగిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ తెలుగుదేశం హవా కొనసాగుతోంది. చీపురుపల్లిలో  మంత్రి బొత్స వెనుకంజలో ఉన్నారు. పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా బాగా వెనుకబడ్డారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ముందంజలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందంజలో ఉన్నారు. నంద్యాలలో తెలుగుదేశం అభ్యర్థి శబరి ముందంజలో ఉన్నారు. 

జగన్ భజనతో సరి పూర్ణానంద స్వామి

కాకినాడ శ్రీపీఠం స్వామి పరిపూర్ణానందకు రాజకీయ పురుగు కుట్టింది. ఆధ్యాత్మిక బోధనలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయ ఉపన్యాసాలకు తెరలేపారు. తాను వేసుకునే కాషాయమే పార్టీ రంగు అయిన బీజేపీ పంచన చేరడానికి శతథా ప్రయత్నించారు. స్వామి వేషం కారణంగా ఉన్న వెసులుబాటుతో బీజేపీ అగ్రనాయకత్వానికి తన మనసులో మాట చెప్పారు. కాషాయ వస్త్రధారణ ఉండటంతో ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి కమలనాథులకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. లేదు కూడా. కానీ పార్టీ చేరికతో ఆగకుండా ఆయన హిందూపురం నుంచి లోక్ సభకు పోటీ చేయాలన్న ఆయన కోరికను మాత్రం మన్నించలేదు.   దీంతో   శ్రీపీఠం స్వామి వారికి మనిషికి వచ్చినంత కోపం వచ్చింది. బీజేపీ అండ ఎందుకు అంటూ ఏకంగా ఇండిపెండెంట్ గా హిందుపురం లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. వేసింది కాషాయ వేషం. ఇక తిరుగేముంటుంది? అని భావించిన స్వామి వారికి తీరా ఎన్నికల బరిలోకి దిగిన తరువాత కానీ తత్వం బోధపడలేదు. సరే మరి కొద్ది గంటలలో కౌంటింగ్ మొదలు కానున్న తరుణంలో ఆయనకు జ్ణానోదయం అయ్యింది. ఆ జ్ణానాన్ని పామర జనానికి పంచకపోతే ఆయన స్వామి ఎలా అవుతారు. దీంతో వెంటనే మీడియా ముందుకు వచ్చి ఎన్నికలలో గెలిచి ఏపీలో అధికారంలోకి రాబోయేదెవరో తన దివ్యదృష్టితో కనిపెట్టేశానంటూ చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దు, అవి వాస్తవాలు చెప్పడం లేదు. పరిపూర్ణానందమైన స్వామినైన తాను మాత్రమే కచ్చితమైన ఫలితాలను తన జ్ణాన దృష్టితో చూసి చెప్పగలను అని స్వొత్కర్షతో మొదలెట్టి చివరికి జగన్ భజనతో సరిపెట్టేశారు.  ఇంతకీ ఆయన చెప్పినదేమిటంటే.. ఈ ఎన్నికల్లో వైసీపీ 123 సీట్లు వస్తాయనీ, జగనే మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి అవుతారనీ.  జగన్ పార్టీ విజయంపై ఇంతలా చెబుతున్న పరిపూర్ణానంద స్వామి హిందూపురం లోక్ సభ స్థానంలో తన విజయం లేదా పరాజయం గురించి మాత్రం ఒక్కటంటే ఒక్క మాట చెప్పలేదు. దీంతో నెటిజనులు ఆయనను ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. జగన్ పార్టీ గెలుపు ఓటములపై చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ముందు మీ సంగతి చెప్పండి స్వామీ అంటూ సెటైర్లు వేస్తున్నారు.