కోనసీమ తెలుగుదేశం క్లీన్ స్వీప్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కూటమి మెజారిటీ మార్కు దాటేసింది. కూటమి అభ్యర్థులు 143 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతుంటే.. వైసీపీ అభ్యర్థులు కేవలం 15 స్థానాలలో మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు.   కోనసీమ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెడుతోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.  ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఆ పార్టీ సీనియర్లు, మంత్రులు  ఓటమి బాటలో పయనిస్తున్నారు. ధర్మాన, బుగ్గన, రోజా, పెద్దిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, బొత్స తదితర మంత్రులందరూ వెనుకబడ్డారు.  వైసీపీ నేతలు, మంత్రులుపలువురు తొలి రౌండ్  ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.  

వై నాట్ 175 .. జగన్ మాటే నిజమయ్యేలా ఉంది!

"ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచాం.. ఈసారి 175 కి 175 స్థానాలు గెలుస్తాం" అంటూ "వై నాట్ 175" అనే నినాదంతో 2024 ఎన్నికల బరిలోకి దిగారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అయితే ఇప్పుడు ఆయన మాటే నిజమయ్యేలా ఉంది. కానీ జగన్ పార్టీ కాకుండా.. కూటమి ఆ ఫీట్ ని సాధించేలా ఉంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే ఏపీలో జగన్ కుర్చీ కదలడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందో.. అప్పుడే వైసీపీ పునాదులు కదలనున్నాయని అందరూ బలంగా ఫిక్స్ అయ్యారు. ముందు నుంచి తమ విజయం పట్ల కూటమి ఎంతో నమ్మకంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే స్పష్టం చేశాయి. ఇక ఈరోజు వెలువడుతున్న ఫలితాలు చూస్తుంటే.. "వై నాట్ 175" నిజమైనా ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది. ఏపీలో పోస్టర్ బ్యాలెట్ నుంచే కూటమి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలకు కనీసం 160 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ 10-15 సీట్లకే పరిమితం కానుందని ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి అర్థమవుతోంది. మొత్తానికి "వై నాట్ 175" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుని ఏపీ ప్రజలు మరోలా అర్థం చేసుకొని.. కూటమికి దాదాపు 170 స్థానాలు ఇచ్చేలా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు... వారణాసిలో మోదీ వెనుకంజ 

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బిజెపి గెలుస్తుందన్న ప్రచారాన్ని కొట్టేసే విధంగా కౌంటింగ్ రోజు ఫలితాలు దెలువడుతున్నాయి.  కౌంటింగ్ రోజు మాత్రం ఎగ్జిట్ పోల్  అంచనాలు తారుమారయ్యాయి. బిజెపి ఆధిక్యత తగ్గి కాంగ్రెస్ మాత్రం పుంజుకుంది. మూడోసారి బిజెపి అధికారంలో వస్తుందని వార్తలు అందినప్పటికీ ప్రధాని మోడీ తాను పోటీ చేస్తున్న వారణాసిలో మాత్రం వెనుకంజలో ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. 6223 ఓట్ల వెనుకంజలో ప్రధాని మోదీ ఉన్నారు. మోదీకి పోటీగా బరిలో నిలిచిన మోదీపై కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ ఆధిక్యం. దేశీ స్టాక్ మార్కెట్లు దెబ్బకు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1900 పాయింట్లు నష్టపోయి.. కొనసాగుతుండగా.. నిఫ్టీ 600 పాయింట్లు నష్టపోయాయి. యూపీలో లోక్ సభ ఫలితాలు సంచలనంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. 6223 ఓట్ల వెనుకంజలో ప్రధాని మోదీ ఉన్నారు. మోదీకి పోటీగా బరిలో నిలిచిన మోదీపై కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ ఆధిక్యం. దేశీ స్టాక్ మార్కెట్లు దెబ్బకు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1900 పాయింట్లు నష్టపోయి.. కొనసాగుతుండగా.. నిఫ్టీ 600 పాయింట్లు నష్టపోయాయి. యూపీలో లోక్ సభ ఫలితాలు సంచలనంగా మారుతున్నాయి. ఎస్పీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.. ఎస్పీ.. బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది.. ఎస్పీ 32 స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎన్డీయే మెజారిటీ మార్క్ దిశగా దూసుకెళ్తోంది.. ఎన్డీఏ 290 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమి 220 సీట్లలో లీడ్ లో ఉన్నాయి. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. ఎన్డీయే 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 21 స్థానాల్లో, టీఎంసీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ 2 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నియోజకవర్గంలో బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం ఓ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే ప్రధాని మోదీ వెనుకంజలో నిలిచారు. మోదీ కంటే అజయ్ రాయ్ 6223 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మోదీకి 5257 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 11,480 ఓట్లు వచ్చాయి.

ఏలూరు జిల్లాలో తెలుగుదేశం కూటమిదే హవా

ఏలూరు జిల్లాలో తెలుగుదేశం కూటమి హవా కొనసాగుతోంది. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం అభ్యర్థులే ఆధిక్యతలో ఉన్నారు. ఒక్క పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత కనబరుస్తున్నారు.  ఉంగుటూరు అసెంబ్లీ వైసిపి అభ్యర్థి వాసుబాబుకి తొలిరౌండ్ లో 4925, టిడిపి అభ్యర్థి ధర్మరాజు కి 6269 ఓట్లు పోలయ్యాయి.  పోలవరం వైసిపి అభ్యర్థి రాజ్యలక్ష్మి 6134, జనసేన అభ్యర్థి బాలరాజు కి 5398 ఓట్లు పోలయ్యాయి. చింతలపూడి అసెంబ్లీ వైసిపి అభ్యర్థి విజయ రాజుపై టిడిపి అభ్యర్థి రోషన్ కి 4520 ఓట్లు పోలయ్యాయి. ఏలూరు అసెంబ్లీ వై సిపి అభ్యర్థి ఆళ్ల నాని తొలి రౌండ్ లో 4598 ఓట్లు పొలవ్వగా, టిడిపి అభ్యర్థి చంటి కి 8592 ఓట్లు పోలయ్యాయి.   నూజివీడు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ప్రతాప్ పై  టిడిపి అభ్యర్థి పార్థసారథి ముందంజలో ఉన్నారు. 

గోషామహల్ లో మాధవిలత ఆధిక్యం 

హైదరాబాద్ లోక్ సభ  నుంచి బరిలో దిగిన బిజెపి అభ్యర్థి మాధవిలత  మజ్లిస్ అభ్యర్థిపై గట్టి పోటీ ఇస్తున్నారు. మాధవిలతను  అభ్యర్థిగా ప్రకటించిన బిజెపి అధిష్టానాన్ని ఏకి పారేసిన  గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్  తర్వాతి కాలంలో సర్దుకుని తన వైఖరి మార్చారు. హైదరాబాద్ నియోజకవర్గానికి మగాళ్లే దొరకలేదా అని అధిష్టానాన్ని నిలదీసిన  రాజాసింగ్  ఎన్నికల ప్రచారసభల్లో పెద్దగా పాల్గొనలేకపోయినప్పటికీ పార్టీ శ్రేణులకు మాత్రం మాధవిలత గెలుపు కోసం పని చేయాలని పిలుపు నిచ్చారు. ఈ పిలుపే గోషా మహల్ నియోజకవర్గంలో మాధవిలత ఆధిక్యంలో కొనసాగడానికి కారణమైంది. గతేడాది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి అరెస్టైన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాజాసింగ్ ని బిజెపి అధిష్టానం సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తవేసినప్పటికీ రాజాసింగ్ అధిష్టానంపై తిరుగు బాటు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. బీజేపీ ఎంపీ టికెట్ కైవసం చేసుకున్న మాధవీలత  ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరారు. అప్పుడు కూడా రాజాసింగ్ ఆమె వెంట లేకపోయినప్పటికీ  మాధవిలత గెలుపు కోసం తన వంతు పాత్రను పోషించారు.