సం'గ్రామం': వేగంగా పోలింగ్
మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ మంగళవార౦ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైందని ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాదులో వెల్లడించారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ జోరుగా సాగుతోంది.
అనంతపురం 50%, మెదక్ 54%, కృష్ణా 63%, గుంటూరు 70%, కడప 45%, చిత్తూరు 66%, కర్నూలు 70%, కడప 45%, విజయనగరం 61%, నల్గొండ 50%, రంగారెడ్డి 50%, ఎస్పీఎస్ నెల్లూరు 54%, రంగారెడ్డి 50%, పశ్చిమ గోదావరి 57%, తూర్పు గోదావరి 50%, వరంగల్ 57%, కరీంనగర్ 51%, ప్రకాశం 67%, మహబూబ్ నగర్ 47%, అదిలాబాద్ 35%, నిజామాబాద్ 48%, శ్రీకాకుళం 62%, విశాఖ జిల్లాల్లో 46% శాతంగా ఓటింగ్ నమోదయింది.