మాజీ మంత్రి అంబటిపై విజిలెన్స్ విచారణ
posted on Sep 5, 2025 @ 1:16PM
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వైసీపీ హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఆయనపై వచ్చి న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. దీంతో అంబటిపై సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ తన విచారణ నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. విజిలెన్స్ విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే కేసు విచారణను ఏసీబీకి అప్పగించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే వైసీపీ మాత్రం అంబటిపై విజిలెన్స్ విచారణను కక్ష సాధింపు చర్య అంటూ గగ్గోలు పెడుతున్నది.
అయితే అంబటిపై భారీ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ల్యాండ్ కన్వర్షన్, ఎస్టేట్ వెంచర్లలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనీ, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్నారన్న తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న అంబటి ఎకరం ఒక ఎకరం భూమిని పది లక్షల రూపాయలకు కొనుగోలు చేసి.. అదే భూమిని 30 లక్షల రూపాయలకు జగనన్న కాలనీల కోసం విక్రయించి, భారీగా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లూ ఆరోపణలు, ఫిర్యాదులూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి ఉన్నాయి. రూ.7 లక్షలకు అమ్మినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.