చండీయాగంలో రెండో రోజు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం గురువారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. చండీయాగంలో భాగంగా గురువారం నాడు నిర్వహించే కార్యక్రమాలు ఇవి... గురుప్రార్థన, గోపూజ, ఏకాదశ న్యాసపూర్వక ద్వి సహస్ర చండీ పారాయణ, నవావరణ పూజ, యోగినీ బలి, మహా ధన్వంతరీ యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణ, మహాసౌరం, ఉక్తదేవతా జపాలు, కుమారి - సువాసినీ - దంపతి పూజ, మహ మంగళహారతి, విశేష నమస్కారాలు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధార్మిక ప్రవచనం, సాయంత్రం కోటి నవాక్షరి పునశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు, శ్రీచక్ర మండలారాధనం, అష్టావధాన సేవ, ప్రసాద వినియోగం, రాత్రి ఏడున్నరకు శ్రీరామలీల హరికథా కాలక్షేపం.