మాజీ ఎంపీ కన్నుమూత.. కేసీఆర్ సంతాపం..

  మాజీ ఎంపీ రుమాండ్ల రాంచంద్రయ్య కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనకు హైదరాబాద్లోని మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. ఆయన మృతిచెందారు. అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రాంచంద్రయ్య.. 1997 నుంచి 2003 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 2003 తర్వాత రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షునిగాను, అనంతరం ఆప్కో సెల్ చైర్మన్‌గాను పనిచేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2013 మే 25న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

ఎంఐఎం ఎమ్మెల్యే సస్పెన్షపై అసదుద్దీన్ ఫైర్.. రాజ్యాంగంలో ఉందా..?

నా పీక మీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను అని వ్యాఖ్యానించి ప్రస్తుతం దేశంలో కొత్త వివాదానికి తెరలేపిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఒక అంశంపై నినాదాలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ అని అంటున్నారు. తాను చేసిన వ్యాఖ్యలవల్ల ఇప్పటికే పెద్ద దుమారం రేగుతోంది. ఈనేపథ్యంలోనే మహారాష్ట ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసినందకు అతనిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై స్పందించిన అసదుద్దీన్.. ఒక నినాదం చేయనందుకు సభ్యుడిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దేశ చరిత్రలో మొదటిసారని.. ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ వారికి ఉంటుంది.. ఒక నినాదం చేసినంత మాత్రాన అది చట్టాన్ని ఉల్లఘించినట్టా. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రధాని చెప్పినప్పుడు.. ఎన్నికైన సభ్యుడు ఇలాంటి నినాదాలు చేయాలని రాజ్యాంగంలో ఉందా.. లేకపోతే నినాదాలు చేయకపోతే సస్పెండ్ చేయాలని ఉందా అని ప్రశ్నించారు. మరి ఈ దుమారం ఎంత వరకూ పోతుందో చూడాలి.

నాకు పవన్, దేవుడు అంటే ఇష్టం.. కానీ.. వర్మ

  రాంగోపాల్ వర్మ తనకు ఎప్పుడు ఏం మాట్లాడాలనిపిస్తుందో.. అప్పుడు అది మాట్లాడేస్తుంటాడు. ట్విట్టర్ అనే ఆయుధంతో తన అభిప్రాయాలన్నీ కుండబద్దలు కొట్టినట్టు చెబుతూ అందరికి షాకిస్తుంటాడు. తాజాగా మరో ఝలక్ ఇచ్చాడు వర్మ.. ఎప్పుడూ తనకు దేవుడు అంటే ఇష్టం లేదని.. దేవుడిని తిడుతూ ఉంటే వర్మ.. ఒక్కసారిగా ఏమైందో ఏమో.. తనకు దేవుడంటే ఇష్టమంటూ ట్వీటాడు.. అంతేకాదు.. దేవుడితో పాటు పవన్ కూడా లాగాడు.. ఐ లవ్ పవన్‌కళ్యాణ్ అండ్ గాడ్ అంటూ ట్విట్టర్ లో కామెంట్‌ను పోస్ట్ చేశాడు. వన్, దేవుడు ఇద్దరూ తనకు ఇష్టమని..వీరిద్దని చాలా కారణాల వల్ల ఇష్టపడతానని అన్నారు. అక్కడితో ఆగకుండా అవే కారణాల వల్ల భక్తులన్నా, పవన్ అభిమానులన్నా తనకు ద్వేషమని చివర్లో షాకిచ్చాడు. మొత్తానికి వర్మ ఎంతైనా కొంచెం ఢిపరెంట్ అని మరోసారి రుజువు చేశాడు.  

అయ్యో సోనియా మాటజారారా..?

అప్పుడప్పుడు మాట జారడం అనేది మానవ సహజం. అయితే కాస్త పెద్ద స్థాయిలో ఉన్నవారు.. నలుగురిలో కొంచెం పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు.. మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. అందునా మీడియా ముందు అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. అలా జాగ్రత్త పడకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇలానే మాటజారి అందరూ విస్తుపోయేలా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ..తమ పాపానికి కాస్తయిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చూస్తుంది. తమ లాభం కోసమో.. రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమో తెలియదు కానీ ప్రత్యేక హోదా కోసం బానే పోరాడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కాంగ్రెస్ పార్టీనేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగానే సోనియా రెండేండ్లుగా అధికారంలోనున్న యూపీఏ ప్రభుత్వం ఏమి చేస్తున్నదంటూ నోరు జారారు. అంతే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. మరి ఎంతటివారైనా మాట్లాడేముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బెటర్..

రోజాకు ఊరట.. సస్పెన్షన్ తీర్మానం ఎత్తివేత

రోజాకు హైకోర్టులో ఊరట లభించింది.. రోజాపై సస్పెన్షన్ తీర్మానాన్ని హైకోర్టు ఎత్తివేసింది. తదుపరి విరాచరణను నాలుగు వారాల తరువాత వాయిదా వేసింది. కాగా కాగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ రోజాను ఏడాది పాటు రోజాను సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే.   ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విజయం నాది కాదు నా నియోజకవర్గ ప్రజలది.. అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. దీంతో న్యాయస్థానంపై గౌరవం మరింత రెట్టింపయింది.. తప్పు చేయనంత వరకు తప్పించుకు తిరిగే అవసరం లేదు.. పార్టీ ఏదైనా ప్రజల సమస్యలపై పోరాడతా.. ఆర్డర్ కాపీ అందగానే అసెంబ్లీకి వెళతా అని అన్నారు.

వేలానికి విజయ్ మాల్యా ఇల్లు.. 150 కోట్లకి

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాను ఎప్పుడు వస్తాడో కూడా తెలియని పరిస్థితి.. అక్కడి పరిస్థితులు బాలేదు.. ఇప్పుడప్పుడే తిరిగి రాను అని లండన్ లోని ఆన్ లైన్ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే బ్యాంకులు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నాయి. ముంబైలోని మాల్యా ఇంటిని భారతీయ స్టేట్ బ్యాంకు వేలానికి పెట్టింది.. గత నెలలో ముంబైలో మాల్యా ఇంటిని ఎస్ బీఐ స్వాధీనం చేసుకుంది. ఇంటి విలువ రూ.150 కోట్లుగా బ్యాంకు అధికారులు నిర్ధారించి.. ఆన్ లైన్ వేలానికి పెట్టినట్లు ఎస్ బీఐ స్పష్టం చేసింది. మరి ఇప్పుడైనా మాల్యా దేశానికి తిరిగి వస్తారా..? లేక ఇలానే ఆస్తులన్నీ వేలంలో పోయ వరకూ అక్కడే ఉంటారా..? చూడాలి..

అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం.. తీర్మానానికి వైసీపీ మద్దతు..

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విభజన సందర్భంగా పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని.. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ మొత్తం 17 అంశాలను అమలు చేయాలని కోరుతూ తీర్మానం పెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో.. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తామని ఆనాడు పార్లమెంట్లో హామీ ఇచ్చారు.. ఇప్పుడు   పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా ప్రత్యేక హోదా అంశం బిల్లులో చేర్చలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు.   అంతేకాదు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరిచాలి.. కేంద్రం సహరిస్తే 2018 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది.. ఇప్పటికి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 645 కోట్లు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం 1449 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచాలని కోరామన్నారు. సగటున ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున సీట్లు పెరుగుతాయని చెప్పారు.   ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ.. రాష్ర్టానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వ తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందని.. చంద్రబాబుపై నమ్మకం లేకపోయినా మద్దతిస్తున్నామని అన్నారు. గడ ఏడాది కూడా ఇలాగే తీర్మానం పెట్టారు.. ఆమోదం పొందింది.. కేంద్రానికి పంపారు ఏ జరిగంది.. ఈరోజు ఇంకొక తీర్మానం చేసి పంపుతున్నామని అంటున్నారు.. ఇది ఏమవుతుందో చూడాలి అని వ్యాఖ్యానించారు.

A4 నడుము... చైనాలో కొత్త ట్రెండ్‌

  ఇప్పటివరకూ జీరో సైజు నడుముతో తిండీ తిప్పలు మానేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు చూశాము. ఇప్పడు చైనాలో సరికొత్త పోకడ మొదలైంది. A4 నడుము పేరుతో కొందరు అమ్మాయిలు, అక్కడి సోషల్‌ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నారు. సాధారణంగా మనం ప్రింట్ఔట్ల కోసం వాడే కాగితాన్ని A4 కాగితం అంటాము. దీని వెడల్పు 10 అంగుళాలకంటే తక్కువే ఉంటుంది. ఈ కాగితంతో సమానమైన నడుముని సాధించామంటూ, ఓ A4 కాగితాన్ని ముందుంచుకుని అక్కడి యువతులు తెగ ఫొటోలు దిగుతున్నారట. దిగడమే కాదు, మన ట్విట్టర్‌లాగానే చైనాలో ప్రజాదరణ పొందిన ‘సైనా వీబో’ అనే సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి తమ ఘనతను చాటుకుంటున్నారట. చైనాలో రోజురోజుకీ వేలంవెర్రిగా పెరిగిపోతున్నా ఈ పోకడ చూసి అక్కడి పెద్దలు, వైద్యులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంత సన్నటి నడుము మున్ముందు తీవ్రమైన అనారోగ్య సమస్యలకి దారితీస్తుందనీ, ఒకోసారి ప్రాణాల మీదకే తెస్తుందనీ హెచ్చరిస్తున్నారు. అయినా పెద్దోళ్ల మాటని వినేదెవరు!

ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను ప్రారంభించిన రాష్ట్రపతి..

నేటి నుండి  ఐదురోజుల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో జరగనున్న ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్,  కేసీఆర్, కేంద్రమంత్రి ఆశోకగజపతిరాజు హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి 25 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు.. 12 దేశాల నుండి 200 కంపెనీల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగిస్తూ పౌర విమాన రంగంలో ప్రపంచంలోనే భారత్ 9వ ర్యాంకులో ఉందని, 2020 నాటికి మూడో స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానానికి చేర్చుతుందన్న ప్రణబ్‌, ఏవియేషన్ రంగంలో తయారీపై దృష్టిసారించామన్నారు.

సభలో నవ్వించిన జానారెడ్డి.. లెక్కలతో గందరగోళంలో పడేశారు..

  కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు జోకులు వేసి అందరిని నవ్విస్తూనే ఉంటారు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే సభలో నవ్వులు పూయించారు. ప్రతిపక్షనేతగా తెలంగాణ బడ్జెట్ పై చర్చను ప్రారంభించిన జానారెడ్డి.. ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలి.. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం లేకుంటే తెలియజేసే బాధ్యత ప్రతిపక్షానిది.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం ప్రజాస్వామ్యమా..? కొందరు మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.. ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే హక్కు లేదనడం నియంతృత్వ ధోరణికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. అనంతరం ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. బడ్జెట్ అంటేనే సాధారణంగా గందరగోళ అంశమని, అలాంటి బడ్జెట్ లెక్కలను చేతులకు ఇచ్చి మంత్రి ఈటల రాజేందర్ మరింత గందరగోళంలో పడేశారని.. ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పడంతో సభలో అందరూ నవ్వుకున్నారు. అంతేకాదు 'సభలో చాలామంది సభ్యులు లేరు. మంత్రులు ఎవరు లేరు. మండలికి పోయినరా' అంటూ మాట్లాడి సభలో నవ్వులు పూయించారు.  

సద్దాం హుస్సేన్ చాల మంచి వాడు.. ట్రంప్

  డోనాల్డ్ ట్రంప్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓహియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ట్రంప్ మాట్లాడుతూ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  సద్దాం హుస్సేన్ టెర్రరిస్టులను చంపడంలో చాల మంచి వాడని అన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఒబామా మీద విరుచుకుపడ్డారు. ఇరాన్, ఇరాక్ దేశాలను హస్తగతం చేసుకోవాలన్న కారణంతోనే ఆ దేశాలను హస్తగతం చేసుకుని క్రూడ్ ఆయిల్ పై చలామణి చెయ్యాలని ప్రయత్నించారని విమర్శించారు. అందుకే ఇరాక్ మీదకు అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని ఆరోపించారు.   ఈ కారణంగానే ఐసిస్ ఆవిర్భవించిందని అన్నారు. అయితే అంతలోనే ట్రంప్ మాట మార్చి.. సద్దాం హుస్సేన్ చాల మంచి వాడని ఎవరు చెప్పారు.. ఉగ్రవాదులను చంపడంలోనే సద్దాం హుస్సేన్ మంచివాడని తాను చెప్పాను అంతే అని చెప్పుకొచ్చారు.

జగన్ పై చంద్రబాబు ఫైర్.. ముఖ్యమంత్రిని సంబోధించండం ఇలాగేనా..?

అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రెండంకెల వృద్ధిని సాధించాం.. ప్రతిపక్షనేత ఏం మాట్లాడుతున్నారు..? ముఖ్యమంత్రిని సంబోధించండం ఇలాగేనా..?ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు..? బాష నేర్చుకోకపోతే సభ హుందాతనం పోతుంది అని హెచ్చరించారు. అంతేకాదు పోలవరం గురించి ఆయన మాట్లాడుతూ ఈ తీర్మానం రాష్ట్రానికి ఎంతో అవసరమని.. తీర్మానానికి చాలామంది సలహాలు, సూచనలు ఇచ్చారు.. సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2018 నాటికి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం..  పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసింది ఏం లేదు.. రాష్ట్రం ఖర్చు చేయకపోతే కేంద్రం ఇచ్చే దాగా ఆగాలి.. కేంద్రమే బాధ్యత వహిస్తానని చెబితే వెంటనే కేంద్రానికి అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఇచ్చిన దానిని నేనేమి దాచుకోవడం లేదు.. అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు.. ఏపీ రాజధానికి 35 వేల ఎకరాలు భూమిని రైతులు ఇస్తే.. భూములు లాక్కున్నామంటూ నిందలు వేస్తున్నారు అని ఆగ్రహం ప్యక్తం చేశారు. ప్రపంచంలో పెద్ద పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నాయని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడానికి ప్రతిపక్షాలు సహరించాలని కోరారు.

ఉద్యోగం కోసం వెళ్తే... ఓ ఇటుక ప్రాణం తీసింది

23 ఏళ్లా మౌనికారెడ్డి ఓ B.Sc గ్రాడ్యుయేట్. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం కోసమని ఆమె నిన్న బెంగళూరుకి వెళ్లింది. అక్కడ జరిగిన తొలి రౌండ్ ముఖాముఖిలో తన ప్రతిభను బాగానే నిరూపించుకుంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెబుదామనుకుంది. కానీ ఫోన్‌ సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో, ముఖాముఖి జరిగిన భవంతి నుంచి బయటకి వచ్చి నిల్చొంది. ఒక పక్క ఆమె తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతుండగానే, భవంతి పై నుంచి పడిన కొన్ని ఇటుకలు నేరుగా ఆమె తల మీద పడ్డాయి. దాంతో మౌనిక తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మౌనికతో పాటుగా తోడు వచ్చిన ఆమె బంధువు, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. బెంగళూరులోని నిబంధనల ప్రకారం, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తులకు తప్పనిసరిగా జాలీలు ఏర్పాటు చేయాలనీ, అలాంటి సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ జరిగినదానికి సంతాపం తెలియచేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామనీ, జరిగిన ఘటన గురించి నిర్వహించే దర్యాప్తుకు సహకరిస్తామనీ’ ఇన్ఫోసిస్‌ పేర్కొంది.

ఇక మీదట సమాజ్‌వాదీ సెంటు

  సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఈ నాలుగేళ్లలో అఖిలేష్‌ యాదవ్‌ సాధించిన ఘనత పెద్దగా ఏమీ లేదనీ, పైపెచ్చు నేరాలు పెచ్చరిల్లాయనీ విమర్శకులు అంటే అనవచ్చుగాక. తన ప్రభుత్వ కీర్తి గుబాళింపు ఎలా ఉన్నాగానీ, అఖలేష్‌కు మాత్రం తాము అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తియిన సందర్భంగా ఏదన్నా కొత్త పని చేయాలనిపించింది. ముఖ్యమంత్రి తల్చుకుంటే పథకాలకు కొదవా! వెంటనే ‘సమాజ్‌వాదీ సుగంధ్‌’ పేరుతో ఒక పరిమళాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఫ్రాగోమేట్రిక్స్‌ అనే సంస్థ అలాగే అంటూ ఓ నాలుగు పరిమళాలతో సమాజ్‌వాదీ సెంటుని రూపొందించింది. బెనారస్‌, కనౌజ్‌, తాజ్‌మహల్, రూమీదర్వాజా అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నాలుగు ముఖ్య ప్రదేశాల పేరుతో నాలుగు పరిమళాలను రూపొందించారు. వీటిలో ఏ పరిమళాన్ని అద్దుకున్నా, ఆ ప్రదేశానికి వెళ్లిన అనుభూతి కలుగుతుందట. ఇంతకీ ఈ సెంటు సీసాలు ఎక్కడపడితే అక్కడ అమ్మరని తెలిసింది. ముఖ్యమంత్రి ఇంటి దగ్గరా, రాజకీయనేతల కార్యాలయాల దగ్గర మాత్రమే అమ్ముతారట.

బస్సులో బాంబు పేలి 10మంది సచివాలయ ఉద్యోగులు మృతి..

  ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్టు లేకుండా పోయింది. రోజు రోజుకి వీరి ఆగడాలు ఎక్కువవుతున్నాయే తప్పా తగ్గడంలేదు. తాజాగా మరో రక్తపాతం సృష్టించారు ఉగ్రవాదులు. పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో 40 మంది ప్రయాణికులను తీసుకుని వెళ్తోన్న బస్సు సరద్ ప్రాంతంలోని మసీదు రోడ్డులో ఆగిన సమయంలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు వల్ల బస్సు30 నుంచి 40 అడుగుల దూరం ఎగిరి పడినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనలో 25 మృతిచెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. కాగా మృతుల్లో 10మంది పాక్‌ సచివాలయ ఉద్యోగులేనని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక లేడీ రీడింగ్‌ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు

ప్రభాస్‌ తమ్ముడికి ఏడాది జైలు శిక్ష..

  చెక్ బౌన్స్ కేసలో సినీ హీరో ప్రభాస్‌ సోదరుడు యూవీఎస్‌ఎస్‌ఆర్‌ ప్రబోధ్‌కు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. వివరాల ప్రకారం.. ప్రభాస్ నటించిన బిల్లా సినిమా నిర్మాతల్లో  ప్రబోధ్‌ కూడా ఒకరు. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో సికింద్రాబాద్‌కు చెందిన గంగాగనాతే అనే మహిళ దగ్గర రూ.43 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే తనకు డబ్బు చెల్లించే క్రమంలో ప్రబోధ్‌ చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు కాస్త బౌన్స్ అయింది. దీంతో ఆమె ప్రబోధ్ ను మరోసారి సంప్రదించింది. అయితే ప్రబోధ్ మాత్రం ఎంతకూ డబ్బు చెల్లించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో దీనిపై విచారించిన రాజేంద్రనగర్‌ కోర్టు ప్రబోధ్ కు సంవత్సరం జైలుశిక్షతో పాటు బాధితురాలికి నష్టపరిహారం కింద రెండు నెలల్లో రూ.87 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.