Read more!

రాముడు తెలుగువాడా!

 

 

రాముడు తెలుగువాడా!

 

 

శ్రీరామునికి ఓ ప్రాంతం అంటూ ఏముంది. మొత్తం భరతజాతికంతటికీ ఆయన ముద్దు బిడ్డ. అయితే రాముని మూలాలు కొన్ని తెలుగునాట కూడా ఉన్నాయని ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. అందుకు ముఖ్యమైన సాక్ష్యం రాముని తల్లి కౌసల్యే! కౌసల్య ‘దక్షిణ కోసల’ దేశానికి చెందిన రాజకుమారి అని చెబుతారు. ఈ దక్షిణ కోసల దేశం మరేదో కాదు. ఇప్పటి చత్తీస్‌ఘడ్‌, ఒడిషాలలోని భాగమే. ఇందులో ఈనాటి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో కొంత భాగం కూడా ఉండి కలిసి ఉండవచ్చు.

 

రామాయణంలో పేర్కొన్న దక్షిణ కోసల ప్రాంతం స్పష్టంగా ఇదీ అని చెప్పలేకున్నా, అది నేటి తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉందన్న మాట మాత్రం వాస్తవం. ఒకప్పుడు తెలుగువారు దక్షిణకోసలలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేవారన్న విషయమూ చారిత్రక సత్యమే. ఇప్పటికీ ఆయా రాష్ట్రాలలో ఉన్న తెలుగువారి సంఖ్య తక్కువేమీ కాదు. ఒక్క చత్తీస్‌ఘడ్‌లోనే పదిలక్షలకు పైగా తెలుగువారు నివసిస్తున్నారు. కాబట్టి శ్రీరాముని తల్లి కౌసల్య, తెలుగింటి ఆడపడుచు అన్న మాటను కొట్టి పారేయలేము. ఒకవేళ వారు తెలుగువారు కాకున్నా, తెలుగు సంస్కృతితో పరిచయం మాత్రం తప్పకుండా ఉండి ఉంటుంది.

...Nirjara