Home » Others » జ్ఞానప్రదాత - హయగ్రీవుడు!!


జ్ఞానప్రదాత - హయగ్రీవుడు!!

 

విద్యకు అధిపతి హయగ్రీవుడుసాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ వుంటారు. అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతా రాల్లో 'హయగ్రీవావతారం' ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు ... బ్రహ్మదేవుడి గురిం చి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలి నవారి చేతిలో మాత్రమే తన కి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.

వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానార కాలుగా హింసించ సాగాడు. దాంతో దేవత లంతా ఆది దంపతులను శరణువేడారు. యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల ... శరీరం నుంచి వేరై పోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని ... శక్తి సామర్ధా్యలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు

ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా ... జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతా రాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

విద్యార్థులకు జ్ఞానప్రదాత

గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు ... హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధి స్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ ... విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది. ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలను అందుకుంటున్నాడు. అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవస్వామిని ఆరాధిస్తూ వుండాలి. ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూ వుండాలి

" జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే "

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. ఈ హయగ్రీవావతారం కూడా మహావిష్ణువుదే. ఒకసారి ఓ రాక్షసుడు తన లాంటి వాడితోనే తనకు మరణం సంభవించాలని కోరుకుంటే ఆ దానవుడి కోరిక తీర్చటానికి మహావిష్ణువు హయగ్రీవావతారు డయ్యాడని ఓ కథనం. ఓ సారి మహా విష్ణువు దానవులతో పోరు సల్పి చాలా అలసిపోయ తన చేతిలోని ధనస్సునే ఆధారం చేసుకొని నిద్రపోయాడు. నిద్రాదేవి ఒడిలో సేదతీరుతున్న మహావిష్ణువును మేల్కొపడానికి ఏ హేతువు కన్పించక ఇంద్రాది దేవతలు చెదపురుగును ధనస్సుకున్న అల్లెత్రాడును కొరకమన్నారట. ఆ శబ్దం వల్ల మహావిష్ణువు మేల్కొంటాడన్న ఆశతో. కానిచెదపురుగు కొరు కుడు వల్ల మహావిష్ణువుకు నిద్రాభంగమేకాక కంఠం కూడా తెగిపోయంది.

ఇక అపుడు ఏమి చేయాలో తోచక పరాశక్తిని వేడుకొంటే ఆ తల్లి అశ్వముఖాన్ని మహావిష్ణువుకు అతికించమని చెప్పిందట. ఆ అమ్మచెప్పినట్టుగా దేవతలు చేయగా హయగ్రీవవతారుడయనాడు మహావిష్ణువు. ఆ పైన ఆ వేదాలను అపహరించిన హయగ్రీవుడను రాక్షసునితో పోరాడి మహావిష్ణువు విజయం సాధించాడు. రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది.అశ్వ ముఖంతో, మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భు జాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్త్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి హయగ్రీవావతారాన్ని చూచిన దేవ తలందరూ చేతులెత్తి మొక్కారు. ఈ అవతారాన్ని కొలిచినవారికి జ్ఞానం అపారంగా కలుగుతుందని పురాణ వచనం. ఈ తండ్రిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.

◆ సరస్వతికి గురువు

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. హయగ్రీవోపాసన చేసిన వారికి సకలవిద్యలూ కరతలామలకం అవుతాయ. విశ్వశ్రేయోదాకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హయగ్రీవునిగా అవతరించిన ఈ రోజు మనం కూడా హయగ్రీవుని పూజించి ధర్మ సంస్థాపనకు మనవంతు చేయూతనిద్దాం.తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

◆ వెంకటేష్ పువ్వాడ
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.