యేసు ప్రభువు పునరుత్థానం చెందిన రోజు.. ఈస్టర్..!
యేసు ప్రభువు పునరుత్థానం చెందిన రోజు.. ఈస్టర్..!
ఈస్టర్ ఆదివారం క్రైస్తవ మతం ప్రధాన పండుగ. ఇది యేసుక్రీస్తు పునరుత్థానం జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఈ పండుగ ఆధ్యాత్మిక పునర్జన్మను సూచించడమే కాకుండా కొత్త ప్రారంభాన్ని, ఆశకు సందేశాన్ని కూడా ఇస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థన సమావేశాలు నిర్వహించబడతాయి. అక్కడ భక్తులు ప్రభువైన యేసు జీవితం, త్యాగం, పునరుత్థానం గురించి ప్రేయర్ చేస్తారు. దీనిని "పామ్ సండే" అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం ఈస్టర్ ఆదివారం ఎప్పుడు వస్తుంది, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంటే..
2025 సంవత్సరంలో ఈస్టర్ ఆదివారం ఏప్రిల్ 20న జరుపుకుంటారు. దీనికి రెండు రోజుల ముందు ఏప్రిల్ 18న, గుడ్ ఫ్రైడే జరుపుకున్నారు. ఇది ప్రభువైన యేసు త్యాగాన్ని గుర్తుచేస్తుంది. క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం ప్రభువైన యేసు మరణించిన మూడు రోజుల తర్వాత పునరుత్థానం చెందాడు. దీని తరువాత ఆయన తన శిష్యులతో నలభై రోజులు గడిపి ప్రజలకు ప్రేమ, దయ, క్షమాగుణం గురించి సందేశాన్ని ఇచ్చాడు. తరువాత అతను స్వర్గానికి వెళ్లిపోయాడు. అందుకే ఈ అద్భుత సంఘటన జ్ఞాపకార్థం ప్రజలు ఈస్టర్ ఆదివారం జరుపుకుంటారు.
ఈ పవిత్ర రోజున క్రైస్తవ మత ప్రజలు చర్చికి వెళ్లి ప్రార్థన చేసి కొవ్వొత్తులను వెలిగిస్తారు. ఈ రోజున ప్రజలు ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈస్టర్ పండుగ సందర్భంగా గుడ్లను రంగురంగుల పద్ధతుల్లో అలంకరించి బహుమతులుగా ఇచ్చి పుచ్చుకోవడం ఒక ప్రత్యేక సంప్రదాయం. ఈ రోజు బైబిల్ పఠనాలు, ఆధ్యాత్మిక పాటల ద్వారా మరింత లోతుగా యేసు ప్రభువు త్యాగాన్ని అనుభూతి చెందుతారు.
*రూపశ్రీ