Read more!

ఆముక్తమాల్యాద

 

ఆముక్తమాల్యాద

ఆముక్తమాల్యద తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ప్రబంధ గ్రంధం.

దీనికే ‘విష్ణుచిత్తియం’ అని మరో పేరు.

దీనిని సాహితీ సమారాంగణ సార్వభౌముడిగా ఖ్యాతి వహించిన శ్రీకృష్ణదేవరాయాలు కు కలలో శ్రీకాకుళాన్ధ్ర విష్ణువు కనపడి తెలుగులో తనపై ఒక కావ్యము వ్రాయమని ఆనతి నీయగా తత్ ప్రకారం కృష్ణదేవరాయాలు ఈ తెలుగు ప్రబంధ కావ్యమును రచిస్తాడు.

  ఈ గ్రంధం ‘ఆముక్తమాల్యాద’ అనే పేరున్న ‘విష్ణుచిత్తుని’ కధ.

ఈ గ్రంధం యమునాచార్యుడు, మాలదాసరి కధలను ప్రస్థావిస్తూ గోదాదేవి కళ్యాణం తో ముగుస్తుంది. 

ఈ ప్రబంధ కధలో విష్ణుచిత్తుడనే శ్రీవిల్లుపుత్తూరు లో మన్నారు స్వామి ఆలయం లో అర్చకుడుగా జీవించే స్వామి కి      పిల్లలు లేకపోవడం తో, విష్ణుచిత్తునకు తులసీ వనంలో ఒక స్త్రీ శిశువు లభిస్తుంది. ఆమెకు గోదాదేవి అని నామకారణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూటాడు. ఈమె గత జన్మలో భూదేవి. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలాలను తాను ధరించి చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలాలను తన తండ్రికి తెలియ కుండా యాధాస్థానం లో ఉంచితే, విష్ణుచిత్తుడు స్వామికి  సమర్పించి అర్చించే వాడు.

ఆముక్తమాల్యాద అనే పదానికి సాహితీ పరమైన అర్ధం ఏమిటంటే.. తాను ముడిచి విడిచిన మాలను స్వామి కి సమర్పించునది.

గోదాదేవి తాను గత జన్మలో సత్యభామా దేవినని తెలుసుకుని, అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగం లో రంగనాధునిగా వెలిసాడని తెలుసుకుని ఆయననే వలచి వివాహం చేసుకుంటుంది.

దీనినే మనం ధనుర్మాసం అంతా జరుపుకుని చివరిలో   గోదాకళ్యాణం జరిపిస్తాము.

ఇది సూర్యడు ధనుర్రాశిలోకి ప్రవేశించ గానే మార్గశిర మాసం లో బ్రాహ్మీ ముహూర్తం లో ప్రతీ దినం ఒక్కొక్క పాశురాం చప్పున ముప్పయ్ పాశురాలు పారాయణ చేస్తాం.

ఈ నెల రోజులూ… తిరుమల వేంకటేశ్వరుని కూడా ప్రతీ దినము సుప్రభాతం పఠనంతో కాకుండా ఈ దివ్య పాశురాలు పఠిoచి నిద్ర మేల్కొలుపుతారు.

బ్రాహ్మీ ముహూర్తంలో సామూహికంగా ఈ తిరుప్పావై పారాయణ ఒక అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది.

శ్రీ కృష్ణ దేవరాయలుచే రచించ బడిన ఈ ప్రబంధం కావ్యాన్ని శ్రీకాకుళాంధ్ర దేవుని ఆనతి మేరకు తిరుమల శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు.


కన్నడిగుడైన శ్రీ కృష్ణదేవరాయలు ఆంధ్రభాష మీద మక్కువతో తెలుగులో రచించి మనకు అందుబాటులో ఉంచడం ప్రతీ సాహితీప్రియుని పూర్వజన్మ సుకృతం.

.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు