వినాయక నవరాత్రులు ముగిసేలోపు ఈ పారాయణం చేసి చూడండి.. అద్బుతం జరుగుతుంది..!
వినాయక నవరాత్రులు ముగిసేలోపు ఈ పారాయణం చేసి చూడండి.. అద్బుతం జరుగుతుంది..!
వినాయక చవితి ఆగస్టు 27వ తేదీన మొదలైంది. వినాయక విగ్రహాల ప్రతిష్ఠ, వ్రతం అన్నీ ఈ రోజునే జరుగుతాయి. అయితే ఆ తరువాత తొమ్మిది రోజులు వినాయకుడిని అలాగే ఉంచి పూజలు చేస్తారు. దుర్గా నవరాత్రులు చేసినట్టు గణపతి నవరాత్రులు కూడా చేస్తారు. అయితే చాలా మంది పూజలు, భనజలు, కీర్తనలు చేయడం సహజమే.. కానీ గణపతి నవరాత్రులు అయిపోయే లోపు.. అంటే.. గణపతి నవరాత్రులు భాద్రపద చవితి నుండి అనంత చతుర్దశి వరకు ఉంటాయి. ఈ పది రోజుల లోపు ఎప్పుడైనా సరే.. గణపతికి సంబంధించి చేసే ఒక్క పారాయణ.. ఎన్నో సమస్యలను మంత్రించినట్టు మాయం చేస్తుంది. ఇంతకీ ఏమిటా పారాయణ.. తెలుసుకుంటే..
గణపతి అధర్వణశీర్షం..
గణపతి అధర్వణశీర్షం అథర్వవేదంలోని గణపతి ఉపనిషత్తు. దీనిని గణపతి ఉపనిషత్తు అని కూడా అంటారు. ఇది చిన్నదైనప్పటికీ అత్యంత శక్తివంతమైన ఉపనిషత్తు. దీన్ని పారాయణం చేయడం వల్ల అధ్బుతం జరుగుతుందని పండితులు చెబుతారు .
గణపతి అధర్వణశీర్షం పారాయణ ఫలితాలు
విద్యాభ్యాసం, జ్ఞానం..
విద్యార్థులు దీన్ని పారాయణం చేస్తే మేధాశక్తి పెరుగుతుంది, స్మరణశక్తి బలపడుతుంది. పరీక్షల్లో విజయాన్ని, విద్యా సాధనలో అభివృద్ధిని కలిగిస్తుంది.
అడ్డంకులు తొలగింపు..
గణపతి అనగా విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించేవాడు. గణపతి అధర్వశీర్షం పారాయణం చేస్తే పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించే ముందు చదివితే సాఫల్యం లభిస్తుంది.
ఆరోగ్యం, ఆయుష్షు..
శారీరక, మానసిక శక్తి పెరుగుతుంది. ఆందోళన, భయాలు తగ్గి మానసిక శాంతి కలుగుతుంది.
సంపద, ఐశ్వర్యం..
వ్యాపారం, ఉద్యోగంలో శ్రేయస్సు, అభివృద్ధి, స్థిరత్వం కలిగిస్తుంది. ఆర్థికంగా బలంగా నిలబడేలా ఆశీర్వదిస్తుంది.
ఆధ్యాత్మిక ఫలితాలు
గణపతి బ్రహ్మ స్వరూపుడని ఈ ఉపనిషత్తు చెబుతుంది. దీన్ని పఠించడం వలన ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం క్రమంగా కలుగుతుంది. సాధకుడు తనలో గణపతి సాక్షాత్కారం పొందగలడు.
గణపతి మూలాధార చక్రంలో ఉంటాడని చెబుతారు. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మూలాధార చక్రం జాగృతం అవుతుందో అప్పుడు ఆధ్యాత్మికంగా మెరుగవుతారని చెబుతారు.
ఎవరు పారాయణ చేయాలి?
ఏ వయసు, ఏ వర్ణం, ఏ లింగమైనా భక్తితో చదవవచ్చు. ఇది ఉపనిషత్తు అయినప్పటికీ మంత్రోపనిషత్తు కాబట్టి అందరికీ సాధ్యమే. విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపారులు, ఆధ్యాత్మిక సాధకులు ఎవరికైనా అనుకూలం.
ప్రతి రోజు ఉదయం స్నానం తర్వాత స్వచ్ఛంగా కూర్చొని చదవడం ఉత్తమం. గణపతి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి పారాయణం చేస్తే మరింత శక్తివంతమైన ఫలితాలు లభిస్తాయి.
జాగ్రత్తలు
పారాయణం చేసే ముందు గణపతిని ధ్యానించి నమస్కరించడం మంచిది.
మంత్రోచ్చారణలో తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలి. చదవలేని వారు మొదటి ఆడియోలు వింటూ ఎలా చదవాలో నేర్చుకుని చదవడం మంచిది.
పారాయణం చేయలేని వారు కనీసం వినడం ద్వారా కూడా ఫలితం పొందవచ్చు.
*రూపశ్రీ.