దైవం ఒక్కటే

 

దైవం ఒక్కటే

 

పసుల వన్నెవేరు పాలేకవర్ణమౌ
పుష్పజాతి వేరు పూజయొకటె
దర్శనంబులు వేరు దైవంబు ఒక్కటే
విశ్వదాభిరామ వినురవేమ

వేమన పద్యాలలో అంతగా ప్రాచుర్యం లేని పద్యాలలో ఇది ఒకటి. కానీ పోలికను చూపుతూ నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో మిగతా పద్యాలకు ఏమాత్రం తీసిపోదు. గోవుల వర్ణంతో సంబంధం లేకుండా అవి ఇచ్చే పాలన్నీ తెల్లగానే ఉంటాయి. పూవులు వేరైనా వాటితో చేసే పూజ ఒకటిగానే సాగుతుంది. అలాగే రూపం వేరైనా దేవతలంతా ఒక్కరే అని చెబుతున్నారు వేమన.

 

-నిర్జర