Read more!

ఈ వారం (జనవరి 14st నుంచి జనవరి 20th) వార ఫలాలు

 

1.మేషరాశి - అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆర్ధిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. జీవిత బాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం సూచనలున్నవి. ఆదాయం సరిపడినంత ఉండదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

2.వృషభం - కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆలోచనలో ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతి సాధిస్తారు. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలుంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. సంతాన విద్యా విషయంలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించినరీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో వృథాఖర్చులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

3.మిధునరాశి - మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

4.కర్కాటక - రాశి  పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం ఉద్యోగ విషయంలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు కలలు సాకారం అవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందరిని ఆశ్చర్యపరుస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. కుటుంబంలో ఒత్తిడులు. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

5.సింహ రాశి - మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ వారం దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు ఆకస్మికంగా మార్పు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి కొంత వరకు బయటపడతారు. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


6.కన్య - ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. గృహప్రవేశం నిర్మాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థాన చలన సూచనలున్నవి. వారం మధ్యలో మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు భాదిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు క్రమంగా లాభాలబాట పడతాయి. అన్ని రంగాల వారికీ అనుకూలత పెరుగుతుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

7, తులారాశి - చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న తరహ పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తులు నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన పెట్టుబడులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో ధనవ్యయ సూచనలున్నవి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

8.వృశ్చిక రాశి  -విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలు సమస్యలను రాజీ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా బాధిస్తాయి. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

9.ధనుస్సు రాశి - మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సకాలంలో పనులు పూర్తి కావు. గృహనిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. కొన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ధన వ్యయ సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

10.మకరరాశి - ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం కుటుంబసభ్యులతో వివాదాలు నుండి బయటపడతారు. సోదరుల నుండి స్థిరాస్థి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

11.కుంభ రాశి  -ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం ఆస్తి వివాదాలు పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు. గృహమున కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి. అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వారంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలు లో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి. అన్నిరంగాల వారికీ ఉత్సాహకారవాతావరణం ఉంటుంది. వారం చివరిలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

12.మీనరాశి -పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చ గలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వారం ప్రారంభంలో ధన పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని రంగాలవారు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వారం చివరిలో కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ధన వ్యయ సూచనలున్నవి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.