Read more!

తిరుమల తుంబురు తీర్థం Tirumala Tumburu

 

తిరుమల తుంబురు తీర్థం

Tirumala Tumburu Theertham

 

పాపనాశనం నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో కొండకు పల్లపు ప్రాంతంలో వంతెనకు రెండో వైపున ఉంటుంది తుంబురు తీర్థం. తుంబురు తీర్థానికి వెళ్ళే మార్గంలో సనగాన సనందన తీర్థం కనిపిస్తుంది. ఈ సనగాన సనందన తీర్థాన్ని తప్పనిసరిగా దాటి వెళ్తేనే తుంబురు తీర్థం చేరతాం. తిరుమల కొండల అటవీ మార్గాన వెళ్ళగా, వెళ్ళగా ఈ తీర్థం వస్తుంది. దారి పొడుగూతా రాళ్ళూరప్పలూ, తీగలు, లతలతో నిండి ఉంటుంది. అసలు ఈ మార్గంలో ఎవరైనా ఇంతకుముందు నడిచారా అనిపించేట్లు గుబురైన పొదలతో, నడవశక్యం కాకుండా ఉంటుంది. తుంబురు తీర్థం ఇలా పెడగా ఉన్నందువల్ల, నడిచే మార్గం సుగమంగా లేకపోవడం వల్ల చాలామంది భక్తులు ఈ తీర్ధాన్ని దర్శించకుండానే వెనుతిరిగి వెళ్తారు.

 

తిరుమలలో భక్తులకు ఇబ్బంది కలక్కుండా ఎక్కడికక్కడ ఆయా పుణ్య స్థలాలకు వెళ్ళే మార్గాలను, అవి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నదీ సూచించే బాణపు గుర్తులు కనిపిస్తాయి. తుంబురు తీర్ధానికి సైతం ఈ బాణపు గుర్తు ఉన్న బోర్డును ఉంచారు. ఈ మార్గసూచిని అనుసరించి తుంబురు తీర్ధాన్ని చేరవచ్చు. అయితే తేలిగ్గా మాత్రం కాదు. కొంచెం కష్టపడి వెళ్ళాల్సిందే.

 

మొక్కలు, చెట్ల సౌందర్యమే తప్ప తుంబురు తీర్ధ మార్గంలో ఒక్క జలపాతమూ కనిపించదు. దారిలో ఏ విష సర్పమో ఎదురు కావచ్చు. క్రూర మృగాలూ తారసపడవచ్చు.తీరా తీర్ధాన్ని చేరిన తర్వాత చాలా జాగ్రత్తగా కిందికి దిగాలి. పుణ్య స్నానం చేసి, అంతే జాగ్రత్తగా పైకి రావాలి.

 

Tumburu Theertham, Tumburu Theertham near by Papanasanam, Tirumala Devotional Place Tumburu Theertham, Tumburu Theertham and Sanagana Sanandhana Theertham.