Read more!

తిరుప్పావై ఇరవై ఒకటో రోజు పాశురం

 

 

 

తిరుప్పావై ఇరవై ఒకటో రోజు పాశురం

 

 

 

 

 

 



    ఏత్తకలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప     
    మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్
    ఆత్తప్పడ్తెత్తాన్ మగనే! యఱివుఱాయ్;
    ఊత్తముడైయాయ్ పెరియాయ్! ఉలగినిల్
    తోత్తయాయ్ నిన్ఱశుడరే. తుయిలెళాయ్;
    మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్
    ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
    పోత్తియామ్ వన్దోమ్ పుగళన్దు ఏలోరెమ్బావాయ్


భావం :- పాలను పిడుకుటకై పొదుగల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నియు పొంగి పొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఒ శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరా వయ్యా! అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రితపక్షపాతివై, సర్వులకును ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూలోకమునందు అవతరించిన ఉజ్జ్వల రత్న దీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై 'నీవే తప్ప ఇతః పరంబెరుగ'మని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కల్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళా శాసనము చేయ నిల్చినాము స్వామీ! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు.

   
అవతారిక :-

 

 

 

 



నీళాకృష్ణులను మేల్కొల్పిన గోపికలందరూ నీళాదేవిని స్వామి కరుణాకటాక్ష వీక్షణ రసఝరిలో ఆనందస్నానం చేయించమని ప్రార్ధించారుకద! మరి వారి ప్రార్ధనను విన్న ఆమె 'భోగ్యదశలో నేనును మీలో ఒకతెనే కదా! కావున మనమంతా కలిసి 'శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే! శ్రీమతే నారాయణాయనమః' అని స్వామిని వేడుకొందామన్నది. ఈనాటి మాలికలో నీళాదేవితో కూడిన ఆండాల్ తల్లి తమ సఖులందరితో కలిసి స్వామిని కృపజేయుడని ప్రార్ధిస్తున్నది. శ్రీకృష్ణుని మేల్కొలుపుతున్నది.
   
        (శహనరాగము - ఏకతాళము)

ప..    కడవల పాలిచ్చు గో సంపద గల నందపుత్ర!
    విడిచిరావొ? నిద్ర! ఇంక మేలుకో!

అ..ప..    పుడమిని నిను నమ్మువారి కాపాడ నవతరించిన
    వాడ! తేజోరూపుడా! నిద్ర మేలుకో!

చ..    ఎదుట నీకు నిలువలేక, బలహీనత శత్రువులు
    పదముల శరణన్న రీతి, నీదు వాకిటచే నిలిచి
    నీదు గుణ విశేషములను కీర్తించగ వచ్చినాము
    నీకు మంగళాశాసన మాచరింప వచ్చినాము
    కడవల పాలిచ్చు గోసంపద గల నందపుత్ర!
    విడిచిరావొ? నిద్ర! యింక మేలుకో!

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్