బాగుపడదామని ఉండదు!

 

 

బాగుపడదామని ఉండదు!

 

 

ఏడ ననర్హుఁడుండు నటకేఁగు ననర్హుఁడు నర్హుఁడున్నచోఁ

జూడగఁ నొల్లడెట్లన; నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం

గూడిన పుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే

సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీఁద భాస్కరా!

అర్హత లేనివాడు పోయిపోయి అలాంటివాడి దగ్గరకే చేరతాడు. అంతేకానీ బాగుపడదామనే తపనతో యోగ్యుడి దగ్గరకి చేరడు. అశుద్ధాన్ని ఇష్టపడే ఈగ వెళ్లి కురుపు మీదే వాలుతుంది కానీ కస్తూరి మీద వాలదు కదా!