మానసిక వేదన

 

 

మానసిక వేదన

“మానసిక వేదన తగ్గడానికేమైనా టాబ్లెట్స్ ఉన్నాయా అంకుల్” మెడికల్ షాప్ అతడిని అడిగాడో కుర్రాడు.

“ఇవిగో బాబూ.. ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికలో మయమౌతుంది” బిళ్ళలిస్తూ అన్నాడు షాపతను.

“థాంక్స్” వెళ్తూ అన్నాడు కుర్రాడు.

“ఇంతకూ ఎవరికో చెప్పలేదు?” అన్నాడు షాపతను.

“మా నాన్నకే. ఇవాళ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాలి, వస్తా” వెళ్ళాడు కుర్రాడు.