Rambhalaga Unnaanaani
Rambhalaga Unnaanaani
"అడుక్కునే వాడికి ఒక్క రూపాయో, రెండు రూపాయలో వేస్తారు గానీ, ఏకంగా
20 రూపాయలు వేశావేం?'' అని అరిచాడు భర్త గోవిందం.
"ఉట్టినే వేశాననుకున్నారా? వాడి మాటల్లో నిజాయితీ కన్పించింది'' అని
నెమ్మదిగా అంది కాంతం.
"ఏమిటో ఆ నిజాయితీ?'' వ్యంగ్యంగా అన్నాడు గోవిందం.
"అచ్చం రంభలా ఉన్నానన్నాడు. అది చాలదా?'' అని సిగ్గుపడుతూ చెప్పింది
కాంతం.
" ఆ..." అని నోరు తెరిచాడు గోవిందం.