సుభాషితం - (Subhashitam) ఆకలిగా ఉన్నవారికి...
సుభాషితం - (Subhashitam)
ఆకలిగా ఉన్నవారికి...
అర్థాతురాణాం న గురుర్న బంధుః
కామాతురాణాం న భయం న లజ్జా
విద్యాతురాణాం న సుఖం న నిద్రా
క్షుధాతురాణాం న రుచి ర్న పక్వం
ధనమే సర్వం అనుకునేవారికి బంధుమిత్రులు అక్కర్లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయినవారికి భయము, సిగ్గు ఉండవు. చదువుమీద అంతులేని శ్రద్ధ ఉన్నవారికి సుఖము, నిద్ర ఉండవు. బాగా ఆకలిగా ఉన్నవారికి పదార్ధం ఉడికిందా, లేదా, రుచిగా ఉందా లేదా అనే విషయాలు పట్టవు.