Read more!

Hiranyaksha, HiranyaKashipa

 

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు

Hiranyaksha, HiranyaKashipa

 

వైకుంఠంలోన విష్ణుమూర్తి సన్నిధి వద్ద ద్వారపాలకులైన జయజయులే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు.

‘మీరు మీ యజమాని అయిన విష్ణుమూర్తి సేవకు దూరం కండి!’ అని సనకననందనాదులను శపించిన తర్వాత, విష్ణుమూర్తి ‘ఏడు జన్మలు నా భక్తులుగా జన్మిస్తారా? లేక మూడు జన్మలు శత్రువులుగా పుడతారా?’ అని అడగడంతో “భక్తులైనప్పటికి ఏడు జన్మల కాలం మీకు దూరం కాలేమని, విరోధులుగా అయినా సరే మూడు జన్మల తర్వాత తిరిగి మీ సాన్నిధ్యానికి చేరుకుంటాము” అని కోరడంతో జయజయులు మూడు జన్మలు విరోధులుగా జన్మించారు.

ఆ విధంగా మెదటి జన్మే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అన్నదమ్ములు.

హిరణ్యాక్షుడు ఒకసారి గర్వంతో భూమిని చాపలా చుట్టడానికి ప్రయత్నించగా, భూదేవి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంది.

ఆ మొర విని విష్ణుమూర్తి వరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుని సంహరించి భూమిని కాపాడాడు.

సోదరుని మరణంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ నుంచి అనేక వరాలు పొందాడు.

పగలు కాని – రాత్రికాని, ఇంటిలోపల కాని – ఇంటి వెలుపల కాని, జీవం ఉన్న పదార్థం లేదా నిర్జీవ పదార్ధంతో, కాని, దేవదానవుల చేత, మనిషి చేత కాని – జంతువు చేత కాని చావు రాకుండా పొందిన వరం వాటిలో ఒకటి.

హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి విష్ణుమూర్తిపట్ల భక్తి కలిగినందువల్ల హిరణ్యకశిపుడు కుమారుని అనేక విధాలుగా శిక్షించాడు.

చివరకు భగవంతుడైన శ్రీహరి ఎక్కడ ఉన్నాడని కోపంగా అడిగాడు హిరణ్యకశిపుడు.

బదులుగా విశ్వమంతటా శ్రీహరి నిండి ఉన్నాడని చెప్పాడు ప్రహ్లాదుడు. ఒక స్తంభాన్ని చూపి ‘ఈ స్తంభంలో శ్రీహరిని చూపమని’ హిరణ్యకశ్యపుడు స్తంభాన్ని గదతో బద్దలు కొట్టగా, అందులో నుంచి గర్జిస్తూ వచ్చాడు సరసింహస్వామి. సంధ్యాసమయంలో ఇంటి గుమ్మంపై, గోళ్ళతో చీల్చి హిరణ్యకశిపుని సంహరించాడు. ఇదీ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ.