Read more!

ప్రాణప్రతిష్టలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి?రామమందిరంలో విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?

 

ప్రాణప్రతిష్టలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి?రామమందిరంలో విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?

అయోధ్యాపురిలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన శుభసమయం జనవరి 22, 2024 మధ్యాహ్నం 12గంటల 29 నిమిషాల 8 సెకన్లకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కేవలం  84 సెకన్లలో మాత్రమే పూర్తవుతుందని ఆలయ ట్రస్టు పేర్కొంది. ఈ విశిష్ట కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సంప్రోక్షణ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి. దీని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాణప్రతిష్ట అంటే ఏమిటి?

ప్రాణ ప్రతిష్ట అనగా...జైనమతం, హిందూమతంలో ఒక ప్రసిద్ధఆచారం. ప్రాణప్రతిష్ట తర్వాతనే దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ప్రతిష్ట సమయంలో పూజారులు, వేదశ్లోకాలు మంత్రోఛ్చారణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు. ప్రాణ అనే పదానికి అర్థం ప్రాణశక్తి అని.. ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం.

ప్రాణప్రతిష్టకు ముందు ఏం చేస్తారు?

ఏ ఆలయంలో అయినా సరే ప్రాణప్రతిష్ట ఒక ముఖ్యమైన ఆచారం. ప్రాణ ప్రతిష్ట ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు, విగ్రహాలతో సమానమని భావిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా ఆ విగ్రహంలోకి విశేష శక్తులు చేరుతాయి. అప్పుడు దేవుడు, దేవతగా రూపాంతరం చెందుతారని శాస్త్రం చెబుతుంది. ఈ ప్రక్రియ తర్వాత భక్తులు దేవుళ్లను పూజిస్తారు.

ఇక ప్రాణప్రతిష్ట ప్రక్రియ ఎలా జరుగుతుందంటే...విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం ప్రాణప్రతిష్ట ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తర్వాత విగ్రహాన్ని పంచామ్రుతాలతో అభిషేకం నిర్వహించి పసుపు, గంథం రాస్తారు. మంత్రోచ్చారణలతో జీవం పోస్తారు. అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తారు.