ఆరడుగులు కూడా నీది కాదు
ఆరడుగులు కూడా నీది కాదు
నాది నాది యనుచు గర్వించి చెప్పేరు
తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు
ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు,
అదియును మీదని ఎవరు చెప్పారు?
బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలలోనిదీ అద్భుతమైన పద్యం. అప్పుడప్పుడూ మనం అనుకునే మాటలనే పద్యరూపంలో చెప్పారు బ్రహ్మంగారు. ‘ఇది నాది, అది నాది అని విర్రవీగుతూ ఉంటాం కదా! ఇంతకీ మనం తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చినట్లు? ఎంతటివాడికైనా పూడ్చేందుకు ఆరడుగుల నేల కావాలి కదా! చివరకి మనల్ని పూడ్చే ఆ ఆరడుగుల నేల మీద కూడా మనకి అధికారం ఉండదు’ అని హెచ్చరిస్తున్నారు.
..Nirjara