Read more!

నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదా? భస్మధారణలోని అంతరార్థం ?

 

నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ

 

చేయకూడదా? భస్మధారణలోని అంతరార్థం ?

 

 

నంది దర్శనం

 

 

 

 


నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి. నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం.


"నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం!

మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’


అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపసవ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదక్షిణం చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణం ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలితం వస్తుంది.

భస్మధారణలోని అంతరార్థం:

 

 

 

 


ఎంతో నిగూఢత్వం నిండివున్న భస్మా న్ని మరే ఇతర దేవుడుగాక పరమశివుడే ధరించడంలో అంతరార్థం ఏమిటో, మరే ఇతర దైవాలు ఎందుక భస్మాన్ని ధరించరో, శంకరుడే ధరించడానకి గల కారణం ఏమిటో చెప్పే కథ ఒకటుంది. మహర్షి ఆశ్రమానికి సద్బ్రాహ్మణుడి వేషంలో తరలి వచ్చాడు పార్వతీశుడు. సాటి బ్రహ్మణుడిని చూడగానే ఘనంగా స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేసాడు మహర్షి. మర్యాదలన్నీ పొందిన తరువాత బ్రహ్మణ వేషధారియైన గంగేశుడు మహర్షిని ఉద్దేశించి ‘‘మహర్షి ! అతిథి సత్కారాలు సంపూర్ణంగా తెలిసిన నీకు విజయోస్తు ! నీవంటి జ్ఞానసంపన్నుడు, తపోధీరుడు సుఖదు:ఖాలకు అతీతుడైన ఉండాలి. సంతోషాలను ఆవేకావేశాలను అదుపులో ఉంచుకోవాలి. కానీ నువ్వు ఏ విషయాన్నో పదేపదే స్మరించుకుంటూ మహా సంబరపడుతున్నావు. నీ అంతటి అమిత తపోధీరుడిని సైతం మాయ చేసి ఇంతగా సంతోషపెట్టి ఉబ్బితబ్బిబ్బు చేస్తున్న సంగతి ఏమిటో నేను తెలుసుకోవచ్చునా?’’ అని అడిగాడు.

 

 

 

 


అంతవరకు తనలోనే దాచుకున్న సంతోషాన్ని పంచుకునేందుకు ఒకరు వచ్చినందుకు మహర్షి ఎంతగానో సంబరపడుతూ ‘‘ఓ సాధుపుంగవా! నా అమితానందానికి కారణం నువ్వు తెలుసుకుంటే ఎంతటి తప: స్సంపన్నుడైనా దైవాంశ సంఘటనలకు సంతోష పడడం సహజమేనని తెలుసుకుంటావు. నా చేతి వ్రేలు గాయపడినపుడు గాయం నుండి రక్తానికి బదులు, పరిమళభరిత ద్రావకం వెలువడుతోంది. అంటే నా తపస్సుకు పరంథాముడు అంగీకరించినట్లే కదా! ఇంతకంటే ఆనందకారకం ఏం కావాలి’’ అంటూ వివరించాడు.

 

 

 

 


పరమశివుడు మహర్షి అజ్ఞానానికి నవ్వుతూ ‘‘మహర్షీ ! నీ అ మాయకత్వానికి ఎంతో దిగులుగా ఉంది. ఈ శరీరం, సకల జీవరాశులు, సమస్త ప్రకృతి, ఈ అనంతవిశ్వమంతా ఏదో ఒక సమయంలో లయం కావలసినవే. అలా లయమైనపుడు సహజ ధర్మాలకు ఆధారమైన ఆకృతి కాలి మసి కావలసిందే. అలాంటి సంపూర్ణ లయత్వంలో సృష్టిలో మిగిలేది బూడిదే. శాశ్వతమైన బూడిదను పొందడమే అద్భుతమైనది. నా వ్రేలి నుండి అటువంటి శాశ్వతానందం నీవు చూడగలవు’’ అంటూ తన వ్రేలిని సున్నితంగా గాయపరచుకున్నాడు. ఆ వెంటనే స్వామి వ్రేలి నుండి బూడిద రాలసాగింది. వచ్చినది ఈశ్వరుడని గ్రహించి ‘స్వామీ ! నా అజ్ఞానం తెలియవచ్చింది. ఎంతో అద్భుతాన్ని నాకు చూపించి, నా అజ్ఞానం పొగొట్టిన నీవు ఎవరో నీ దివ్యరూపమేటో నాకు చూపి నన్ను ధన్యుడిని, పునీతుడిని గావించు’’ అని మహర్షి వేడుకున్నాడు. విశ్వనాథుడు తన అమిత మహోన్నత సుందర దివ్య నమ్మోహన రూపంతో దర్శనమిచ్చాడు.