సిల్లీ ఫెలో - 96

 

 

సిల్లీఫెలో - 96

- మల్లిక్

 

ట్రింగ్ ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్...

ఫోన్ మోతతో ఈ లోకంలోకి వచ్చాడు మినిస్టర్ మిన్నారావ్.

రిసీవర్ ఎత్తి హలో..." అన్నాడు.

"హలో .... మినిస్టర్ మిన్నారావ్ గారున్నారా? అడిగింది అవతలి కంఠం.

"నేనే మాట్లాడుతున్నా. ఎవరు?" అడిగాడు మిన్నారావ్.

"మేము ఉప్పుచేపలూ, ఎండు రొయ్యలషాపు పెడ్తున్నామండీ. దాన్ని మీతో ఓపెనింగ్

చేయించాలని అనుకుంటున్నాం. మీకిష్టమైతే ఇంటికొచ్చి వివరంగా మాట్లాడ్తాం" చెప్పింది

అవతలి గొంతు.

"ఓపెనింగ్స్ కి మనమెప్పుడూ రెడీనే! కానీ సిన్న కండీషన్"

"ఏంటండీ అదీ?"

"ఓపెనింగ్ సేసినందుకు గుర్తుగా నాకు బంగారు రొయ్య పెజెంటేషన్ ఇయ్యాల్!"

"ఓ... తపకుండా"

"మరో ఇసయం... ఆ ఓపెనింగ్స్ కారెక్రమం జరిగేసోట జనాన్ని బాగా సోదా సేయ్యాలా!"

ఓ తప్పకుండా సార్! బాంబులు, మారణాయుధాలు తెస్తారేమోననగానే మీ భయం?"

"కాదు... పాత న్యూస్ పేపర్లు తెస్తారని భయం! సభకి వచ్చిననోళ్ళ దగ్గర పాత న్యూస్

పేపర్లు ఉండకూడదు ఎవరి దగ్గరైనా పాత న్యూస్ పేపరుంటే ఆడిని ఆ శాయలకి కూడా

రానివ్వకండి"

"అదేంటి సార్?" అవతలి వ్యక్తి గొంతులో ఆశ్చర్యం.

"అదంతే... నా ఇసయంలో పాత న్యూస్ పేపర్లు బాంబులకంటే ప్రమాదం! మిగతా

ఇషయాలు పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఇక్కడి కొచ్చెయ్యండి" అని ఫోన్ పెట్టేశాడు

మిన్నారావ్.

ఇంతలో ప్యూన్ వచ్చాడు.

"అయ్యగారూ... తమరికోసమెవరో వచ్చారండీ" అన్నాడు.

"ఆడి దగ్గర పాత న్యూస్ పేపర్ ఏదైనా వుంటే నేను లేనని సెప్పి పంపించెయ్. న్యూస్ పేపర్

లాంటిది ఏదీ లేకపోతే లోపలికి పంపించు!" అన్నాడు మిన్నారావ్.

ప్యూన్ మిన్నారావ్ వంక అయోమయంగా చూశాడు.

"ఏటలా సూత్తావ్... బాగా సెకింగ్ సెయ్యి... నీవల్ల కాకపోతే మన గార్డ్ సేత సేయించు. పాత

న్యూస్ పేపర్ కనిపిస్తే లోపలికి రానియ్యకండి"

"అలాగేనండయ్యా!" బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడు ప్యూన్.

"అసలు ఇందాకట్నుండీ పాత న్యూస్ పపర్లంటున్నారు. ఆ గొడవవేంటండీ? అడిగింది

వెంకటలక్ష్మి.

"ఆయన్నీ రాజకీయాలు! రాజకీయాల్లో నీ బుర్రేట్టకని లచ్చసార్లు సెప్పాను! సెప్పానా

లేదా?" జుట్టు పీక్కుంటూ పెళ్ళాం మీద అరిచాడు మినిస్టర్ మిన్నారావ్.