సిల్లీ ఫెలో - 82
సిల్లీఫెలో - 82
- మల్లిక్
"నీకు టింగణాలోయ్.. నాకు ట్రాన్స్ ఫర్ నీ సలహా వల్లే వచ్చింది" అన్నాడు ఏకాంబరం బుచ్చిబాబుతో.
"కానీ మీకు ట్రాన్స్ ఫర్ కావలసింది గుంటూరుకి కద్సార్?" అడిగాడు ఏకాంబరం బుచ్చిబాబుతో.
"నిజమే గానీ గుంటూరుకి నెలరోజుల క్రితమే ఓ కిల్లారి కిత్తిగాడిని పోస్ట్ చేశారు. అంత త్వరగా అతన్ని డిస్టర్బ్ చేస్తే బాగుండదు కదా అనీ నన్ను ఇక్కడికి వేశారు. పోనీ గుంటూరు ఇక్కడికి అరగంట దూరంలోనే ఉంది కదా! సంబరంగా అన్నాడు ఏకాంబరం.
అక్కడ.. బయట మోహన్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
ఏకాంబరం బుచ్చిబాబుతో త్వరగా పెళ్ళి చేసుకోమన్నాడు. బుచ్చిబాబు తనకి పెళ్ళయిందని చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు.
బాస్ అన్న మాటల్ని బట్టి అక్కడ హైదరాబాద్ ఆఫీసులో రిలీవ్ అయినప్పుడు బుచ్చిబాబుకి పెళ్ళి కాలేదు. కానీ రిలీవ్ అయిన వెంటనే విజయవాడకి బుచ్చిబాబు సీతతో సహా వచ్చాడు.
అంటే బుచ్చిబాబు సీతని రైల్లో పెళ్ళి చేసుకున్నాడా?
అది జరిగేపని కాదు.
అంటే సీత ఎవరు?
బుచ్చిబాబుకి కాబోయే భార్యా?
ప్రేయసా?
ఉంపుడుకత్తా?
ఎవరు?... ఎవరు?.... ఎవరు? ? ?