Sankranti Festival Celebrations
ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి
Sankranti Festival Celebrations
సంక్రాంతి కేవలం మన రాష్ట్రంలోనే కాదు తెలుగువాళ్ళు ఎక్కడుంటే అక్కడ మకర సంక్రాంతి మహా ఘనంగా జరుగుతుంది. ప్రవాసాంధ్రులు తెలుగుతనాన్ని మర్చిపోకుండా వీలైనంతవరకూ పండుగ సంప్రదాయాలేవీ లోపించకుండా కళకళలాడేలా వైభవోపేతంగా జరుపుకోవడం మనకు తెలిసిందే. మరో సంగతి ఏమంటే మకరసంక్రాంతి తెలుగువారి పండుగ మాత్రమే కాదు. కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాలవాళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు.
తమిళులు నాలుగు రోజులపాటు సంక్రాంతి పండుగ వేడుక చేసుకుంటారు. మొదటిరోజును ''తై'' నాడు సూర్యుని, వానదేవుని ప్రార్థిస్తారు. రెండోరోజు ''పొంగల్'', మూడోరోజు ''మత్తు పొంగల్'', నాలుగోరోజు ''తిరువళ్ళువర్''. వీటిని మనం వరుసగా భోగి, పండుగ, కనుమ, ముక్కనుమ అంటాం.
బెంగాలీలకు సంక్రాంతి గొప్ప పండుగ. అత్యుత్సాహంతో వేడుక చేసుకుంటారు.
ఉత్తరప్రదేశ్ లో సంక్రాంతిని ''ఖిచ్రి'' అంటారు. గంగా, యమునా, సరస్వతి సంగమ తీరంలో నదీ స్నానం చేస్తారు. గంగా తీరంలో పెద్ద ఎత్తున భోగిమంటల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
పంజాబులో భోగి పండుగను ''లోహ్రి'' అని, సంక్రాంతిని ''మఘీ'' అని అంటారు. ఈ పండుగ మహోత్సవం సందర్భంగా భాంగ్రా నృత్యం చేస్తారు.
మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని ''సుకరాత్'' పేరుతో ఆనందంగా జరుపుకుంటారు.
మహారాష్ట్రలో సంక్రాంతి సందర్భంగా నువ్వులతో పిండివంటలు తయారుచేస్తారు.
makar sankranti all over india, Sankranti Celebrations in other states, Sankranti Festival Celebrations, makar sankranti in bengal, pongal in tamilnadu, sankranti festival celebrations, pongal festival in india, 3 days festival makar sankranti, bhogi panduga and kanuma