Read more!

సముద్రంలాగా ఉండాలి

 

 

సముద్రంలాగా ఉండాలి

 

 

ఇతః స్వపితి కేశవః కులమితస్తదీయ ద్విషా

మితశ్చ శరణార్థినాం శిఖరిణాం గణాః శేరతే ।

ఇతో-పి బడబానలః సహ సమస్త సంవర్తకై

రహో వితతమూర్జితం భర సహం చ సింధోర్వపుః ॥

మహాత్ములను సముద్రంతో పోల్చడం తరచూ వింటూ ఉంటాం. ఈ పద్యం చూస్తే అందులో నిజం లేకపోలేదనిపిస్తుంది. సముద్రంలో ఒక చోటేమో మహావిష్ణువు యోగనిద్రలో సేదతీరి ఉన్నాడట, మరో చోటేమో అతని శత్రువులైన రాక్షససమూహం తలదాచుకుని ఉంది. ఇంకో చోటేమో సముద్రుని రక్షణలో మైనకాది పర్వతాలు ఉన్నాయి. వేరొకచోట బడబాలనం చిమ్ముతోంది. ఇన్ని బరువులు మోస్తున్న సముద్రంలాగా మహాత్ములు కూడా ఎందరికో ఆధారభూతమై ఉన్నారు కదా!